భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.వెంకటేష్, డోన్ (కర్నూలు జిల్లా)
ప్ర: నా వివాహం ఎప్పుడు?
సమా: గతంలో కొన్ని సంబంధాలు కుదిరి తప్పిపోయినట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఏప్రిల్, మేలో పెళ్లి కుదిరే అవకాశం వుంది. తూర్పు నుండి వచ్చే సంబంధం అయి వుంటుంది. తల్లి తరఫు బాంధవ్యం ఉండే అవకాశం వుంది. నిర్విఘ్నంగా జరగడానికి దుర్గ, వినాయకులను మంగళ,గురువారాలలో పూజించండి.
రాగతి సంధ్యాదేవి, కందకుర్తి
(వరంగల్ జిల్లా)
ప్ర: మీరు చెప్పిన ప్రకారం నాకు యూనిఫాం వేసుకునే ప్రభుత్వ శాఖ అంటే పోలీస్ శాఖ ఉద్యోగితో వివాహమైంది. మీరు చెప్పిన అక్షరం కూడా పూర్తిగా సరిపోయింది. మాకు సంతాన భాగ్యం గురించి వివరించండి.
సమా: మీ జాతకంలో సంతాన స్థానం బాగానే వుంది. కానీ, ఈ విషయంలో మీవారి జాతకం కూడా పరిశీలించనిదే ఏమీ చెప్పలేను. మీకు అంతా శుభమే జరుగుతుంది.
క్రొవ్విడి లక్ష్మీ నరసింహం,
సజ్జాపురం (ప.గో.)
ప్ర: మా అబ్బాయికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉందా?
సమా: మీ అబ్బాయికి ఇంచుమించు మీ వంశ సంబంధంలోనే నాగ దోషచ్ఛాయలు కనబడుతున్నవి. నాగపూజ ప్రతి మంగళవారం వ్రతంగా పెట్టుకోండి. వీలైతే నాగప్రతిష్ఠ కూడా చేయటం మంచిది.
వెలుగంటి లక్ష్మణ దత్తాత్రేయ,
రాంనగర్ (హైదరాబాద్)
ప్ర: నా జీవితమంతా రుణగ్రస్తంగానే ఉంటోంది. అప్పు చేయనిదే జీవితం గడవటం లేదు. నాకు ఈ సమస్యల నుంచి ఎప్పుడు?
సమా: రుణవిమోచన అంగారకవ్రతం పదకొండు మంగళవారాలు చేయండి. సమర్థులైన పురోహితుల సహాయం తీసుకోండి. తప్పక మార్పు వస్తుంది. వీలైతే ప్రతి మంగళవారం ఎరుపురంగు గోవుకు కంది పొట్టు దాణా పెట్టండి.
మానుగఱ్ఱ వెంకట సత్యసుబ్రహ్మణ్యం,
దుప్పలపల్లి (అనపర్తి)
ప్ర: మాకు సంతాన యోగం వుందా?
సమా: సంతానం విషయంలో భార్యాభర్తల ఇద్దరి జాతకాలను విధిగా పరిశీలించాల్సి ఉంటుంది. మీరు చెప్పిన సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే మాత్రం నాగదోషచ్ఛాయలు కనబడుతున్నవి.
పి.వెంకటలక్ష్మి, హైదరాబాద్
ప్ర: నా జీవితాంతం కష్టాలేనా? ఇవి ఎప్పుడు తీరతాయి.
సమా: దైవం పట్ల విశ్వాసాన్ని పెంచుకోండి. ఏదైనా ఒక మంత్రోపదేశం సద్గురువు నుండి పొందండి. కష్టాల గురించి ఆలోచించకుండా ప్రయత్నం వైపు దృష్టి పెట్టండి. ‘చీకటిని తిట్టుకోవటం కంటే చిరుదీపాన్ని వెలిగించుకో’ అన్న కవి వాక్యాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ ఉండండి.
బి.ప్రసాదరావు, బరంపురం (ఒడిశా)
ప్ర: దాంపత్య సమస్యలు తీరేది ఎలా?
సమా: ఆలుమగల మధ్య పరస్పర అవగాహన, శాంతి, సహనాలు అలవరచుకోవడాన్ని ఒక శిక్షణగా భావించండి. శిక్షగా అనుకోవద్దు. భాషా సంబంధమైన ఇబ్బంది లేకపోతే ‘సౌందర్య లహరి’ (ఆదిశంకరుల వారిది) తాత్పర్యంతో చదవండి. మీకు దాంపత్య ప్రాధాన్యం తెలిసి వస్తుంది.
వి.పద్మ, రుస్తుంబాద్ (మచిలీపట్నం)
ప్ర: మా అమ్మాయికి వివాహం ఎప్పుడు? స్వయంవరమా? సాంప్రదాయికమా?
సమా: స్వయంవర సూచనలే కనబడుతున్నాయి. ఆ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కూడా వుంది. ప్రయత్నిస్తే పరిస్థితిలో మార్పు రావచ్చు.
కన్హయ్యలాల్ బల్దావా,
బేగంబజార్, హైదరాబాద్
ప్ర: నేను అనేక వ్యాపారాలు చేశాను. ఏదీ అంతగా లాభించలేదు. నాకు ఏది జమాయిస్తది (కుదురుతుంది)
సమా: ఔషధ రంగంలో కానీ, దినుసుల రంగంలో కానీ ఏజెన్సీ వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం కుదరకపోవచ్చు.
సయ్యద్ బురహానుద్దీన్,
గుత్తి (అనంతపురం జిల్లా)
ప్ర: మీరు యవన జాతకం ఉందన్నారు. ఎక్కడ లభిస్తుంది?
సమా: ప్రాచీన గ్రంథాలయాలలో కానీ , వృద్ధులైన ముస్లిం పండితుల వద్ద కానీ దొరికే అవకాశం ఉంది. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

పేరు :
చిరునామా : ...................................................... ......................................................
.....................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
..............................................................
ప్రశ్న : .............................................................
........................................................
సంతకం :

కూపన్ల ద్వారా మాత్రమే ప్రశ్నలు పంపాలి.
పోస్ట్‌కార్డ్‌లపై, కవర్ల ద్వారా పంపిన
ప్రశ్నలు పరిశీలించబడవు.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ