భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.కె.మృదుల, తాడేపల్లిగూడెం (ప.గో.జిల్లా)
ప్ర: స్వయంవరంగా నేను ఎన్నుకున్న వ్యక్తితో పెద్దల అంగీకారంతో నా వివాహం జరుగుతుందా?
సమా: మీ కుటుంబంలో మహిళాసభ్యులైన పెద్దవారినుండి గట్టి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిష్కరించుకోండి.
అబ్దుల్ రజాక్, కదిరి, అనంతపురం
ప్ర:- నాకు లాటరీ యోగం ఉందా? అప్పులు తీరేదెప్పుడు?
సమా:- లాటరీ డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు పెంచుకోకండి. ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా’అనే పాట గుర్తుకుతెచ్చుకొని అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేయండి.లాటరీ యోగం కనిపించటం లేదు-
కె.ఎస్.లక్ష్మి, కోవిలంపాడు
ప్ర: అనారోగ్య సమస్య ఆస్త్మా ఉంది. నాకు కందుకూరుకు (ప్రకాశం జిల్లా) బదిలీగా వెళ్ళాలని ఉంది- అవుతుందా?
సమా: మీరున్న దిశనుండి వాయవ్య దిశకు బదిలీ అయ్యే అవకాశం ఉంది- ‘‘ఆస్త్మా’’ఒక మంచి స్ర్తి డాక్టరు ద్వారా కుదిరే యోగం కనబడుతోంది-
కె.పి.త్రివేద, ఆర్.ఆర్.పేట, ఏలూరు
ప్ర:- నేను భవిష్యత్తులో ఏ ఉద్యోగంలో స్థిరపడగలను.
సమా: బోధనా సంబంధమైన రంగంలో కాని పత్రికా సంబంధమైన రంగంలో కాని, బాంకింగ్ సంబంధం కాని, దేవాలయ సంబంధమైన సంస్థల్లోకాని స్థిరపడే అవకాశం ఉంది- భవిష్యత్తు బాగానే ఉంటుంది.-
జి.వి.కుమారి (ఊరి పేరు లేదు) (ప.గో.)
ప్ర: దాంపత్య సమస్య-
సమా: ప్రతి మంగళవారం దుర్గాదేవికి, తొమ్మిది నిమ్మ పండ్లు కాని, కాయలు కాని ఎరుపుదారంతో దండగా కూర్చి ఎఱ్ఱగనే్నరు పూలతో అమ్మవారిని పూజించి, జిలేబీ నివేదన చేసి చిన్న పిల్లలకు, పెద్దలకు కూడా పంచి పెట్టండి. చిన్నపిల్లలు ప్రదానం. మీ సమస్య పరిష్కారమవుతుంది-
ఆలపాటి జనార్దనరావు, అచ్చంపేట
(గుంటూరు జిల్లా)
ప్ర: స్వగృహయోగం, సంతాన యోగం.
సమా: మీరు ప్రస్తుతం ఉన్న ఇంట్లో వాస్తుదోషం గోచరిస్తోంది- మంచి యింట్లోకి మారండి. ఆలస్యంగానైనా శుభం జరిగే అవకాశం ఉంది.
పి.సుజాత, జనగామ (వరంగల్)
ప్ర: నాకు మంచిరోజులు ఉన్నాయా? ఎప్పుడు? భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా: జీవితం అంటేనే చీకటి వెలుగుల సమ్మేళనం. ‘‘కాలం ఒక్కరీతి గడవబోదు’’అన్నది పెద్దలూ, అనుభవజ్ఞులూ చెప్పినమాట- కాల స్వరూపుడైన ఈశ్వర సేవ, మీ కులదైవం సేవాచేస్తూ ఉండండి. అన్నీ కుదురుకుంటాయి.
పి.అయ్యపురెడ్డి, వెంగళరావునగర్ (కావలి)
ప్ర: బంధువులూ, స్నేహితులూ చివరకు నా కుమార్తె కూడా నన్ను, నా భార్యనూ శత్రువులుగా చూస్తున్నారు. నేనూ ఎవరినీ నిందించను. ఎవరి డబ్బూ తీసుకోలేదు. అయినా ననె్నందుకిలా దూరంకొడుతున్నారో అర్థం కావడంలేదు-
సమా: ఈర్ష్య, అసూయలకు- కారణముండదు. అయితే అందరూ అంటున్నారు కనుక మీలో ఏదోఒక లోపం ఉండాలి- అడగనిదే సలహాలివ్వటం, ఎవరినీ ఏమీ యాచించక పోవటం, డబ్బు విషయంలో ఖచ్చిత తత్వాన్ని పాటించటం- ఇవి బంధువుల విషయంలోనూ, స్నేహితుల విషయంలోనూ వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. అందుకే ‘దాక్షిణ్యం స్వజనే’ అన్నారు. తనవారి విషయంలో అప్పుడప్పుడూ చిరుకానుకలు ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ అందరివద్దకు వెళ్తూ ఉండాలి. మడి కట్టుకుని ఇంట్లో కూర్చునే వారిని కూడా సంఘం తప్పుపడుతుంది.
వి.శ్రీనివాస్, బరంపురం (ఒడిస్సా)
ప్ర: నాకు ఉద్యోగ యోగం ఎలా ఉంది-
సమా:- స్థిరయోగం తక్కువ. రకరకాల ఉద్యోగాలుచేసే అవకాశం ఉంది. స్థిర చిత్తంతో ఒక మార్గాన్ని ఎంచుకోండి. భవిష్యత్తు బాగుంటుంది.
ఎమ్.రత్నం, కావలి (నెల్లూరు)
ప్ర:- మా పాపకు డాక్టర్ సీటు ఏవైపు వస్తుంది.
సమా: మీ పాప విషయంలో సంఖ్య మీపాపే చెప్పాలి. మీరు చెప్పిన సంఖ్య ప్రకారమైతే మీ సంతానానికి ఉత్తర దిశవైపు యోగం ఉంది- మీ సంతానంలో అది ఎవరైనా కావచ్చు!
వి.ఎస్.ఆర్, హైదరాబాద్ (వివరాలు లేవు)
ప్ర: నేను అనుకున్న అమ్మాయితో పెళ్ళి ఔతుందా? లేదా?
సమా: మీ పూర్తిపేరు చిరునామా లేనిదే సమాధానం చెప్పటం కుదరదు.

పేరు :
చిరునామా : ...................................................... ......................................................
.....................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
..............................................................
ప్రశ్న : .............................................................
........................................................
సంతకం : *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ