నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అనఘుఁడు వంశకరుండై
పెనుపున నీ సుతుఁడు వాజపేయంబులు నూ
ఱొరనరించు నని సరస్వతి
వినిచె మునులు వినఁగ నాకు వినువీధిదెసన్

భావం: పుణ్యాత్ముడైన నీ కుమారుడు వంశకర్తయై పూనికతో నూరు వాజపేయ యాగాలను చేస్తాడని ఆకాశవీధీలో సరస్వతి (ఆకాశవాణి) మునులందరూ వినేటట్లుగా నాతో చెప్పింది. దుష్యంతుడు శకుంతలను తనకు తెలియదని చెబుతుంటే ఆమె దాన్ని విని ఎంతో వ్యధ చెందింది. తరువాత తనను ఏవిధంగా పెళ్లి చేసుకొని దుష్యంతుడు తనను పుత్రవతిని చేశాడో చెబుతూ పుత్రుడంటే ఎంతటి గొప్పవాడో తెలియచేసింది. అంతేకాక తన పుత్రుడు పెరిగి పెద్దవాడు అయ్యాక ఎన్నో యాగాలు కూడా చేస్తాడని ఆకాశవాణితో తనతో చెప్పినట్లుగా చెబుతుంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము