భక్తి కథలు

శాంతమూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమతి శతకకారుడు బద్దెన ‘‘తన శాంతమె తనకు రక్ష’’ అని అన్నారు. వాగ్గేయకారుడు, నాదబ్రహ్మ అయిన త్యాగరాజు తన కీర్తనలో ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అనిఅన్నారు. వీరిద్దరే కాదు ఏ మహానుభావుడైనా శాంతితో ఉండాలని అంటారు. శాంతి లేకపోతే దినచర్యలు కూడా చేయలేము. సర్వ సుఖాలకు మూలాధారం శాంతగుణమే అని పెద్దలు చెబుతారు. శాంతగుణం కలిగి ఉండాలంటే సముద్రమంత సహనం, ఉదారగుణం ప్రతివారిలో శాంతి ఒనగూడుతుంది.
శాంత గుణానికి ఉదాహరణగా ధర్మరాజును చెబుతారు. ధర్మరాజును కౌరవ సభకు ఆహ్వానించి అతనిని మాయాజూదంలో ఓడించి దుర్యోధనాదులు దురాగతాలు చేశారు. భీమార్జునులు సహించలేక అక్కడికక్కడే ఎదిరించి అడ్డుకోవడానికి ఉద్యుక్తులయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. శాంత స్వభావుడైన ధర్మరాజు అది గమనించి తన సోదరులను వారించి శాంతపరచాడు. లేకుంటే కురుసభ రణరంగంగా మారి ఉండేది. పర్యవసానం మరో విధంగా ఉండేది. ధర్మరాజు యొక్క శాంతగుణమే పాండవులకు రక్షణగా నిలిచింది.
విరాటుని కొలువులో ఉత్తరుడు విజయం సాధించి వచ్చాడని విరాట మహారాజు చెబుతుంటే ధర్మరాజు కంకుభట్టుగా ఉంటూ బృహన్నలను మెచ్చుకుంటాడు. ఎన్ని చెప్పినా కూడా ధర్మరాజు బృహన్నలే మెచ్చుకోవడం విరాట మహారాజు సహించలేకపోతాడు. తన చేతిలో ఉన్న పాచికలను తీసుకొని మొహం మీద విసిరికొట్తాడు. అవి వెళ్లి ధర్మరాజు నుదుటికి తగులుతాయ. రక్తం కారుతుంది. అపుడు అక్కడే ఉన్న ద్రౌపది సైరంధ్రిగా ఉన్నా వచ్చి ధర్మరాజు రక్తం నేల మీద చిందకుండా కాపాడుతుంది. ఆమె చీర చెంగును అడ్డుపెడుతుంది. ఎందుకిలా చేస్తున్నావు అంటే ధర్మరాజు రక్తం కారితే అక్కడ క్షామం వస్తుంది అని చెబుతుంది.
ఎందుకిలా అనేసరికి ఉత్తరుడు వస్తాడు. జరిగిన ఘోరం తెలుపుతాడు. విరాట మహారాజు తాను ఎంత తెలివి తక్కువగా ఆలోచించాడో తెలుసుకొంటాడు. తన తప్పును మన్నించమని కోరుకుంటాడు. ధర్మరాజు శాంత స్వభావుడు కనుక విరాట మహారాజును క్షమిస్తాడు. అన్న మాట వినే తమ్ముళ్లు కనుక వారు విరాట మహారాజును క్షమించడమే కాదు ఆయన కోరికలను కూడా మన్నిస్తారు.
శాంతంగా ఉన్నాడు కనుకనే ధర్మరాజు విజయలక్ష్మిని వరించాడు. మనమూ శాంతంతో ఉంటే చాలు విజయలక్ష్మి వస్తుంది. కాకపోతే పని పట్ల మంచి అవగాహన లేనప్పుడు ఏర్పడే అవాంతరాలు ఎదుర్కోలేక అవస్థ పాలు అవుతారు. అపుడు శాంతం నశించి అశాంతి ఏర్పడి తాను తన ఎదురుగా ఉన్నవారు కూడా అసౌఖ్యానికి గురవుతారు.

- హనుమాయమ్మ