డైలీ సీరియల్

విలువల లోగిలి-67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాగుంది అన్నట్లు వాడి కళ్ళు మెరిసాయి దాని అర్థం తెలియకపోయినా. ఎందుకంటే ఈ రోజునుంచీ తనని అరేయ్! ఒరేయ్! అనరు. అందరిలా తననీ పేరు పెట్టి పిలుస్తారు. అంతేకాక తను చదువుకోవచ్చు కూడా! అదీ వాడి ఆనందం.
అలా ఇద్దరుగా వెళ్లినవారు మరో ఇద్దరిని వెంటబెట్టుకుని తీసువచ్చారు.
***
విశ్వ ఒంటరిగా ఉంటే తల్లి జ్ఞాపకాలతో ఎక్కువ బాధపడుతోందని గ్రహించిన ఆ కుటుంబం వెంటనే అమృత హృదయ నిలయాన్ని ప్రారంభించి విశ్వకు చేతినిండా పని కల్పించాలనుకుంది.
లోగిలిలో పిల్లలు తమ పరీక్షలు పూర్తిచేసుకుని సెలవులకు ఇంటికి వెళ్లిపోయారు. ఇక కొత్త సెక్షన్ అక్కడే ప్రారంభమవ్వాలి. కాబట్టి పేపరు ప్రకటన ఇవ్వాలనుకున్నారు.
‘‘లోగిలి ఆహ్వానం’’
చదువుమీద ఆసక్తి వుండి, చదువుకోలేని బీదవారికి, చదువుకి ఖర్చుపెట్టలేనివారని మా ‘లోగిలి’ ఆహ్వానిస్తోంది. ఉచితభోజనం, ఉచిత వసతి, ఉచిత విద్య మేం అందిస్తాం.
ఎవరూ లేని అనాథలకూ, ఆదరణ కరువైన వృద్ధులకు, నిరాదరణకు గురవుతున్న తోటివారికి మా ‘విశ్వసౌధం’ ఆహ్వానం పలుకుతోంది.
నిరుపేదలందరూ ఆహ్వానితులే. 3-5-14న ప్రారంభం
ఇట్లు
విశ్వప్రియ
అని అడ్రసు ఇస్తూ అన్ని పేపర్లలోనూ ప్రకటనలిచ్చి విశ్వ ఫోన్ నెంబరును సంప్రదింపులకు ఇచ్చారు.
అదేరోజు విశ్వ పుట్టినరోజుకూడా. ఆ రోజే ప్రారంభిస్తే తనకి మరింత సంతోషాన్నిచ్చిన వాళ్ళమవుతామని అనుకున్నారు అమృత, నరేంద్రనాథ్‌లు.
***
పేపరు ప్రకటన ఇచ్చిన మరునాడే విశ్వ పేరున ఒక కవరు వచ్చింది. ఏమిటా అని తెరిచి చూస్తే.
అక్కా!
నమస్తే! పేపర్లో లోగిలి ప్రకటన చూసి నేనెంతో సంతోషించాను. ఎందుకో తెలుసా! బయటకు వెళ్లి ఉద్యోగం చేసేంత చదువుకోలేదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ఆయన నన్ను పనిమనిషి కంటే హీనంగా చూస్తాడు. పుట్టింటికి పంపటానికి కూడా డబ్బు లెక్కపెడతారు. ఇన్నాళ్ళూ బయటకు వస్తే అండ, దండగా నిలబడేవాళ్ళు లేరని ఈ ఇంట్లో మనసు చంపుకుని జీవనాన్ని సాగిస్తున్నాను. బయటకు వెళితే మొగుడు వదిలేసిన ఆవిడని ముద్రవేస్తారు. అందరి మగవాళ్ళ చూపులు వెకిలిగానే. బజార్లోకి వెళ్లి అలా వందమంది బారినపడేకన్నా ఇంట్లో ఉన్న ఈ ఒక్క రాక్షసుని బాధలు భరించటమే మంచిదని ఇన్నాళ్ళూ భరించా. నువ్వు అంగీకరిస్తే పిల్లలతో సహా వచ్చేస్తాను. ఇంటిపని చేసే ఆడవాళ్ళంటే ఈ లోకంలో మగవాళ్ళకి చాలా లోకువ. అదేపని ఒక్కరోజు చేసుకోవాలన్నా వాళ్లవల్ల కాదు. కానీ తోటి స్ర్తి కష్టాన్ని గుర్తించరు. భార్యగా గౌరవించరు. ఈ గౌరవం దక్కేదాకా నాకు సంసారంవద్దు. ఈ విషయం ఇంట్లో చెప్పి మరీ వస్తాను. ఆ పనేదో నీ దగ్గరే చేసుకుంటాను.
ఇప్పుడయినా నా భర్త బుద్ధితెచ్చుకుంటాడో, ఇదే కారణం చూపించి మరొకరిని చేసుకుంటాడో అతనిష్టం. నేను వద్దనుకున్నాక అతను ఏమయితే నాకేం?
మాలాంటివాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నిన్ను ఏమని కొనియాడాలి. నువ్వు రమ్మంటే వచ్చేస్తాను- చెల్లి- అనన్య.
‘‘చందూ! చూసావా ఈ ఉత్తరం? నేననుకున్నట్లే జరుగుతోంది. ఇలా తోటి ఆడవాళ్లకి రక్షణగా నిలబడితే ఎన్నో సంసారాలు బాగుపడతాయి. మగవాళ్ళూ బుద్ధితెచ్చుకుంటారు. అంటూ ఆ ఉత్తరాన్ని చదివి వినిపించింది’’’.
‘‘విశ్వా! విశ్వసౌధాన్ని నీ కప్పగించేస్తున్నాను. నీకెలా కావాలంటే అలాదాన్ని ఉపయోగించుకో. దానిమీద నీకు పూర్తి అధికారం ఉంది. అది నీ పేరన రిజిస్ట్రేషన్ చెయ్యడం కూడా అయిపోయింది. ఇపుడు నీ ఇంట్లో మేమంతా ఉంటామన్నమాట’’.
‘‘చందూ! నీ ఏమిటి? నా ఏమిటి? అంతా మనదే! అలా ఎప్పుడూ మాట్లాడకు’’.
‘‘మరి నీ ఆఫీసుమాటేమిటి? మనం అక్కడకు వెళ్లిపోతే? రోజూ అక్కడికి వెళ్లటం కష్టం కదా!
‘‘నువ్వేమంటావా అని చెప్పలేదు. మన ఆఫీసు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అక్కడికే మార్చేస్తున్నాను. దేవిగారికి దగ్గరగా ఉండాలిగా. అక్కడికి వెళ్ళాక భోజనం అన్నా నాతో చేస్తావా? లేకపోతే అదికూడా వాళ్ళతోనేనా?
‘‘వేళాకోళమా? నీ ఇష్టం. నువ్వెలాగంటే అలానే. నువ్వు కాదనేది నెప్పుడూ చెయ్యను’’.
‘‘తెలుసులేమ్మా! సరదాగా ఆట పట్టించాను.. అంతే!’’
వెంటనే అనన్యకు ఉత్తరం రాసింది విశ్వ.
***
ప్రియమైన అనన్యకు,
ప్రేమతో అక్క వ్రాయునది. నీ ఉత్తరం చదివాను. నేనో సలహా చెప్పనా? పిల్లలకు ఎలాగూ సెలవులు కాబట్టి అక్కడ ఉంచి నువ్వొచ్చేసేయ్. అప్పుడు మీవారికి ఇంకాస్త తొందరగా బుద్ధివస్తుంది. నీలాంటివాళ్లకు నా ఇల్లు పుట్టిల్లులా ఆశ్రయమివ్వాలి కానీ సంసారాలను విడదీసేదిగా ఉండకూడదు అని నా అభిప్రాయం. మీ ఆయనలో మార్పు వచ్చి నిన్ను గౌరవిస్తే అతనితో కాపురం నీకిష్టమేగా. ఆ రోజు రావాలి. దానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
నువ్వు చెప్పాల్సింది ధైర్యంగా మీ ఆయనకి చెప్పేసి ఇక్కడకురా. ఈ అడ్రసుకూడా ఇవ్వు. ఇక్కడకు వస్తే నేనే మాట్లాడతాను. సరేనా. ఎక్కడికీ పోలేదులే అన్నంతవరకే మగవాడి అహంకారం. కాదని ఎదురుతిరిగితే పులి పిల్లి అవ్వాల్సిందే!
చూద్దాం! ఏమి జరుగుతుందో?
నువ్వెప్పుడు వస్తున్నావో చెబుతావుగా..
ప్రేమతో అక్క విశ్వప్రియ! చేతిలో ఉత్తరాన్ని ఆనందంగా ముద్దుపెట్టుకుంది అనన్య.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206