డైలీ సీరియల్

విలువల లోగిలి-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా తనూ ఇలాగే చేయాలనుకుంది. కాకపోతే పిల్లలను విడిచి ఉండలేక వాళ్ళను కూడా తీసుకువెళ్దామనుకుంది. అక్క చెప్పినదీ బాగానే ఉంది. అమ్మవాళ్ళకి, చెల్లివాళ్ళకి కూడా ఈ విషయం చెప్పాలి. లేదంటే వాళ్ళను అక్కడికి పంపేసి తను జల్సా చేస్తాడు. ఊరు వెళుతున్నామనో, ఇంట్లో ఉండటం లేదనో, కుదరదనో ఏదో చెప్పించాలి.
అపుడు పిల్లలను పెంచడం అంటే ఏమిటో తెలిసివస్తుంది. కాకపోతే కాకపోతే మధ్యలో పిల్లలు బలిఅవుతారు. అయినా శాశ్వత పరిష్కారం కోసం ఈ మాత్రం కష్టం పడటంలో తప్పులేదు. పిల్లలకు కూడా తన ప్లాను చెబితే నాటకం మరింత రక్తికడుతుంది. వాళ్ళకీ తండ్రిలో మార్పురావాలని, తమని ప్రేమగా చూడాలని ఉంటుందిగా.
నాలుగు రోజులకి సరిపడా బట్టలు సర్దుకుంది. కావాలంటే ఉతికి ఆరేసుకోవచ్చు అనుకుని బయలుదేరింది అనన్య. పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్లని అనన్య.
***
కాస్త అలసటగా ఉంది. అరగంట నిద్రపోతాను అని చందూకి చెప్పి వెళ్లింది విశ్వ.
‘అలాగే’ ఆమెకు చెప్పాడు కానీ మనసు మాత్రం మనిషికి మించిన భారం వేసుకుంటోంది విశ్వ. జాగ్రత్తగా చూసుకో చందూ అని అది తనని పదే పదే హెచ్చరిస్తోంది.
రోజురోజుకి ఇవి పెరిగేవే కానీ తరివేవి కావు. ఎంప్లాయర్స్‌ని ఎక్కువ చేసి తన పని భారాన్ని వీలైనంత తగ్గించాలి. అంతకంటే మార్గం లేదు.
ఎందరు వున్నా తను చూసుకోవాల్సినవి తనే చూసుకోవాలిగా. ఇంతలో ఫోను రింగయింది.
విశ్వ నిద్ర పాడవుతుందని మొదటి రింగుకే ఎత్తేశాడు.
‘‘హలో!’’ సూర్యచంద్ర స్పీకింగ్ అన్నాడు.
‘‘విశ్వ మేడమ్‌గారితో మాట్లాడాలని మేము నూజివీడునుంచి చేస్తున్నాం’’
‘‘తను నిద్రపోతోంది. కాసేపాగాక చేయండి’’ అని చెబుతూ ఉండగానే విశ్వ వచ్చింది.
అతను అవతలనుంచీ ఏదో చెప్పబోయే లోపలే విశ్వ మేడమ్ వచ్చారు, ఇస్తున్నాను.. మాట్లాడండి అని అందించాడు సెల్.
ఎవరు అన్నట్లుచూసింది విశ్వ.
ఎవరో నూజివీడు నుంచీ అట.
‘‘హలో! విశ్వను మాట్లాడుతున్నాను.. చెప్పండి’’ అంది.
‘‘నమస్తే మేడమ్! లోగిలి బ్రాంచ్ మా ఊరిలో కూడా పెడదామనుకుంటున్నాం. నా పేరు ‘్ధర్మానంద్’. లోగిలి గొప్పతనం ఆంధ్రదేశమంతా ప్రాకిపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. విలువలకు పెద్దపీఠం ‘లోగిలి’ అన్ని ఊర్లలో ఉండి మా ఊర్లో లేకపోవడం నాకు నచ్చలేదు. అందుకే నేనే ఆ పని చెయ్యాలని నిశ్చయించుకున్నాను. మీరు అనుమతి ఇస్తే’’ అన్నాడాయన.
‘‘మీ సంకల్పానికి మా ధన్యవాదాలు. తొందరలోనే నా అనుమతిని తెలియజేస్తాను’’ అంది విశ్వ.
‘‘ఉంటానండీ’’
సెల్ ఆఫ్ చేసాక చందూ వంక చూస్తూ ‘‘్ధర్మానంద్ గారట, మన లోగిలి బ్రాంచ్ అక్కడ పెడతానంటున్నారు, మన స్టూడెంట్ ‘శర్వాణి’వాళ్ళది ఆ ఊరే గదా! అతనెలాంటివారో ఎంక్వైరీ చేద్దామా?
‘‘అవసరం లేదు విశ్వా! ఆయన ఆ ఊరిలోకే పెద్ద గాంధేయవాదిగా గుర్తింపు పొందాడు. అంతకంటే మనకు కావలసింది ఇంకేముంటుంది?’’
మన లోగిలి అప్రతిష్ట రాకూడదని మన భావాలు, మన పద్ధతులు పాటించగలవారయితేనే ఒప్పుకుంటున్నాంగా. అందుకే తరువాత చెబుతానన్నాను.
‘‘ఇప్పుడేమయింది? రేపు ఒప్పుకుంటున్నానని చెప్పు’’ అన్నాడు చందూ దాన్ని తేలికగా తీసుకుంటూ.
‘‘పాపం పెద్దాయన. మంచాయన. వెంటనే చెప్పి ఉంటే బాగుండేది’’ అని కాసేపు బాధపడింది.
ఇంచుమించుగా ఇపుడు ప్రతి ఊరిలోనూ ఓ లోగిలి ఏర్పడింది. ఆ స్కూలు బాగోగులు ఆ ఊరి వారే చూసుకుంటున్నారు. ఖర్చు మాత్రం తమది. ఉచితంగా పిల్లలందరికీ మంచి విద్య దశదిశలా వ్యాపిస్తోందంటే తమకీ ఆనందమేగా. మళ్లీ అప్పటి రామరాజ్యంలా శాంతి రాజ్యం ఏలుబడిలోనికి రావాలన్నదే తన ప్రగాఢ వాంఛ.
నిన్న ఏదో పత్రికలో ఒక డాక్టరు అచ్చం తన లాంటి భావాలతోనే పాటుపడుతున్నారని, హీల్ పారడైజ్ పేరుతో అనాథలకు స్కూళ్ళూ, హాస్టళ్ళను నిర్వహిస్తున్నారని, ముప్ఫై ఎకరాల ప్రాంగణంలో విద్యా ప్రాంగణం నిర్మించి ప్రాణం పోశారని, ఆయనే ‘డాక్టర్ కోనేరు సత్యప్రసాద్’ అని వ్రాశారు. చాలా సంతోషమేసింది.
ఇందాక తెలియనప్పుడు తనలా అనుకుంది. ఇప్పుడు ఆయన గురించి తెలిసాక ఆయనలా నేనూ అనుకుంది.
ఎవరు ఎవరిలా అన్నది కాదు ముఖ్యం. సమాజానికి ఏం కావాలో అది అందించగలగడమే కావాల్సింది. ఎవరు చేశారన్నది ఇక్కడ అప్రస్తుతం.
ఆయన్ని కూడా తమ ప్రారంభోత్సవానికి తప్పక ఆహ్వానించాలి. అలాంటి పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ తనకి ఉండాలి అనుకుంది. వెంటనే ఆయన నెంబరు సేకరించి తప్పక వస్తానని ఆయనతో మాట ఇప్పించుకుంది.
అలాగే ‘్ధర్మానంద్’కి ఫోన్ చేసి లోగిలి ఏర్పాటుకి సిద్ధం చేసుకోమంది.
‘‘చందూ! లోగిలి ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ నలుదిశలా వ్యాపిస్తుంటే నీకేమనిపిస్తోందో గానీ నాకు మాత్రం మనసు పులకరించి పోతోంది’’ అంది అతని ప్రక్కనే కూర్చుంటూ.
‘‘మనం వేసిన బుల్లి మొక్క మహావృక్షమై ఎందరికో నీడనిస్తోందంటే సంతోషమే కదా!’’
‘‘అవును’’ అంది తృప్తిగా.
‘‘అమ్మగారి పుట్టిన రోజు రేపే’’
మన అమృత హృదయ నిలయం ప్రారంభోత్సవం కూడా.
‘‘ఏమిటి చందూ! నా పేరు వినిపిస్తోంది’’ అంటూ వచ్చింది అమృత.
‘‘మా అమ్మ తన ప్రేమలో అమృతాన్ని కలిపిచ్చిందని నీ కోడలుకు చెబుతున్నానమ్మా’’ అన్నాడు హాస్యంగా.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206