డైలీ సీరియల్

విలువల లోగిలి-69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భలే చెప్పావురా! మీ అమ్మ ప్రేమలో అమృతాన్ని కలిపితే విశ్వ అమృతానే్న ప్రేమగా అందిస్తుంది. తన దగ్గిర నా గొప్పలు చెప్పకు’’.
‘‘అంత లేదులే అత్తయ్య!’’’
అందరినీ ప్రేమించగలగటం అనేది అందరూ చేయలేని పని. కొందరికి కొంత పరిధి వరకే పరిమితం. కానీ నువ్వు ఆ పరిధులకు అతీతంగా పయనించగలుగుతున్నావు. అదే నీ గొప్పతనం’’.
‘‘అదంతా మీకు నా మీద వున్న ప్రేమ అత్తయ్యా’’
నిష్కల్మషంగా ఒకరిలో మంచిని ఒకరు చెప్పుకునే అత్తా కోడళ్ళను చూస్తే ఎప్పటికప్పుడు కొత్తగానే, వింతగానే అనిపిస్తుంది.
ఆ మరుక్షణం తనెంతో అదృష్టవంతుడిని అని కూడా అనుకుంటాడు. మరి ఇంట్లో అత్తాకోడళ్ళ యుద్ధరంగం లేదు. అడకత్తెరలో పోకచెక్క వ్యవహారం అంతకన్నా లేదు. ఉన్నదంతా ప్రేమ ప్రపంచమే.
ఇలా అందరు ఆడవాళ్ళూ సఖ్యంగా ఉంటే సంసారాలు సజావుగా సాగిపోతాయిగా అనుకున్నాడు చందూ.
‘‘మగవాళ్ళు కూడా నీలా వ్యవహరించాలిగా’’ అంది వెనుకనుంచీ అంతరంగం.
వెనకటికి ఎవడో సందు ఇస్తే చాలు దూరిపోతారని సామెత ఉంది. అదే దీనికి బాగా వర్తిస్తుంది అనుకున్నాడు తన అంతరంగాన్ని తలుచుకొని.
ఏది ఏమైనా ఆ ఇల్లు ఓ స్వర్గం.
***
విశ్వ పుట్టినరోజు
ఏ భార్యకీ ఇంత మంచి బహుమానం మరే భర్త ఇవ్వడేమో!
అపురూపమైన కానుక.
సమాజానికి ఉపయోగపడే వేదిక.
అందరూ మెచ్చే వేడుక.
పదిమందీ ఆచరించాలని తాపత్రయపడే వాడుక.
అందుకే అందుకోవడానికి సిద్ధంగా ఉంది అతని సహచరిణి. ప్రారంభోత్సవం ఆ రోజే కావడంతో ‘అమృత హృదయ నిలయం’ ఆశగా ఎదురుచూస్తోంది, ఎప్పుడెప్పుడు అందరికీ ఆహ్వానం పలుకుతానా అన్నట్లు.
అనాధలు, వృద్ధులు, ప్రముఖులు, బంధువులతో ఆ ఆవరణ అంతా నిండిపోయింది.
ముఖ్యంగా డా.కోనేరు సత్యప్రసాద్ అక్కడికి రావటం విశ్వకు మరింత ఆనందాన్నిచ్చింది.
ఎప్పుడెప్పుడా అని అందరూ ఆ శుభతరుణం కోసం ఎదురుచూస్తున్నారు.
డాక్టరుగారిని పలకరించి చందూ దగ్గరకు వచ్చి సెక్యూరిటీ గార్డ్స్‌ని చూపించి ఇదేమిటని కళ్లతో ప్రశ్నించింది.
ఆ రోజు తనని చందూ ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు వెనుక గది లేదు. ఇపుడు వచ్చేసింది. అంత హడావుడిలోనూ ఏమిటది అన్నట్లు చూసింది.
‘‘ఏం చేస్తాం మేడమ్. ఆ రోజు అనన్యకి నువ్వు రాసిన ఉత్తరం చదివాక నా జాగ్రత్తలో నేనుండాలనుకున్నాను. ఎవరైనా మా విశ్వ మీదకు వస్తే నేనూరుకుంటానా? అందుకే అప్పటికప్పుడు ఇది కట్టించాను. ఎవరినైనా చెక్ చేస్తేకానీ లోపలికి పంపించరు. ఆ రూమ్‌లో వివరాలు, ఫోను నెంబర్లు చెబితేగానీ లోపలికి అడుగుపెట్టలేరు. వారు ఎవరిని కలవాలని వచ్చారో చెప్పాక అవతలివారు అంగీకరిస్తేనే లోపలికి. లేదా బయటికే.
‘‘చందూ’’ అని ఎవరో క్రొత్త వ్యక్తిని చూసినట్లు చూసింది విశ్వ. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా రోజూ ఏదో విషయంలో అతను క్రొత్తగా కనిపించడం ఎప్పటికీ కొత్తగానే ఉంటుందేమో అనుకుంది.
తర్వాత నన్ను తీరిగ్గా చూద్దువుగానీ’’ అని విశ్వతో అంటూనే ‘‘అమ్మా! రా!’’ అని అమృతను రిబ్బను కటింగ్‌కి పిలిచాడు.
కొడుకు, కోడలు ఒకప్రక్క, భర్త మరోప్రక్క నిలబడి ఉన్నారు.
‘‘కానీయమ్మా! ఇంకేమిటి ఆలస్యం? నీ చేతులతో ఈ విశ్వ ప్రపంచానికి ప్రారంభం కానీయ్’’అని సూర్య చంద్ర అనడంతో-
భర్త వంక చిరునవ్వుతో చూసింది.
అతని కనుసైగతో అంగీకారం తెలపటంతో ‘కత్తెర’ తీసుకుని గులాబీ రంగులో ఆకర్షణీయంగా వున్న రిబ్బన్‌ను రెండుగా విడదీసింది, కల్మషం ఎరుగని ఆ లోకంలోకి ఇదే మా ఆహ్వానమన్నట్లు.
తరువాత అందరూ విశ్వ సౌధాన్ని చేరారు.
ఆ భవనం సోయగానికి అందరి కళ్ళూ చెదిరిపోతున్నాయి.
ఎప్పుడెప్పుడు లోపలికి వెళదామా, బయటే ఇంత అందంగా ఉంటే లోపల ఇంకెంత అందంగా ఉంటుందో అని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
సూర్యచంద్రను తనివితీరా చూసుకుని అతని చేతిలోంచి ‘సిజర్స్’ అందుకుని నీలం రంగు రిబ్బన్‌ను కత్తిరించి ప్రారంభోత్సవం చేసింది విశ్వప్రియ.
లోపలికి వెళ్లిన విశ్వకు తను మరో లోకంలో వున్నట్లు అనిపించింది.
విశాలంగా వున్న గదులు, అబ్బురపరిచే పెయింటింగ్‌లు, ఆశ్చర్యపరిచే శిల్పాలు, గదికి మరింత అందాలను పెంచే ఫ్లవర్‌వాజ్‌లు, రకరకాల ఆకృతులలో బెడ్ బల్బ్‌లు, లైట్లు, ఫ్యాన్స్, సోఫాలు, దివాను, టీవీ.. ఇప్పటికిప్పుడు ఇక్కడకు వచ్చెయ్యచ్చు అన్నట్లు ఉంది అక్కడి వాతావరణం.
విశ్వా! ఇదంతా చూడాలంటే ఓ రెండు గంటలు పడుతుంది. పద! ఇంకా మనం చెయ్యాల్సినవి రెండు కార్యక్రమాలు మిగిలిపోయాయి అంటూ ఆమెను తన వెంట తీసుకువెళ్ళడు చందూ.
‘లోగిలి’ని నరేంద్రనాధ్ ప్రారంభిస్తే, సూర్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సూర్య చంద్ర ప్రారంభించటంతో ఆనాటి కార్యక్రమం ముగిసింది.
ఆ రోజు అన్ని టీవీల్లో, వార్తల్లో విశ్వ ‘విశ్వసౌధం’ గురించే.
ఎవరినోట విన్నా అదే మాట.
దినపత్రికలన్నీ ‘విశ్వ’ను ఆకాశానికెత్తేసాయి మరునాడు. అది మామూలు విషయమే. కానీ విశ్వసౌధాన్ని పారంభించినప్పుడు విశ్వకు ప్రక్కగా వున్న బామ్మ పెద్ద సంచలనాన్ని సృష్టించింది.
కాశీలో గంగలో మునిగిపోయి చనిపోయిందని నాలుగు మొసలి కన్నీళ్ళు కార్చేసి ఆ విషయాన్ని మరిచిపోయిన ఆ కొడుకులు ఆ ఫోటో చూసి అడుగుతున్న ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకున్నారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206