డైలీ సీరియల్

ష్‌...-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్మయి, ప్రియంవద... హాస్పిటల్ రూమ్ బయట అసహనంగా ఉన్నారు.
లోపల ఏం జరుగుతుందో తెలియదు, కులకర్ణి ఎక్కడున్నాడో తెలియదు.
ప్రియంవదకన్నా ఎక్కువగా టెన్స్‌గా వున్నది కిరణ్మయే.
ప్రియంవద చెప్పిన మాటలు రీకలెక్ట్ చేసుకుంటూ.. కులకర్ణి హాస్పిటల్‌లో లేకపోవడం.. ప్రద్యుమ్న మీద హత్యా ప్రయత్నం.. ఈ లింక్ ఎక్కడో కన్‌ఫ్యూజన్ గుర్తుచేస్తుంది.
ఒక్క క్షణం ప్రియంవదను చూసింది. ఏదో చెప్పబోయేంతలో... రూమ్ తలుపులు తెరుచుకున్నాయి.. ఎదురుగా కులకర్ణి.
ఆశ్చర్యాన్ని మించి అనుమానం అయినా తన ఫీలింగ్స్‌ను బయటికి కనిపించనీయకుండా చిన్నగా నవ్వి విష్ చేసింది కిరణ్మయి.
ప్రియంవద అతని వైపు చూసి ‘తనకెలా ఉంది?.. ఇపుడు నేవెళ్లి చూడచ్చా’’అడిగింది.
‘‘ఒక అరగంట తర్వాత మీరు వెళ్ళి చూడచ్చు.. కానీ ఎక్కువగా మాట్లాడద్దు’’ అని చెప్పాడు కులకర్ణి.
ఈలోగా ఇన్స్‌పెక్టర్ పృధ్వీ అక్కడికి వచ్చి.. కులకర్ణికి సెల్యూట్ చేసి పక్కన నిలబడ్డాడు.
కులకర్ణి ముందుకు నడిచి.. పృధ్వీని తనతో రమ్మనట్టు సైగచేశాడు. సరిగ్గా అదే సమయంలో, హాస్పిటల్ రిసెప్షన్‌లో ఓ చిన్న పాప ఉంది.
ఆ పాప తల్లిదండ్రులు డాక్టర్ కోసం వెయిట్‌చేస్తుంటే.. ఆ పాప ఆడుకోవడానికి తనకు ఏమైనా ఆట వస్తువులు దొరుకుతాయమోనని చూస్తోంది.
అపుడే ఆ పాప దృష్టి ఓ బుల్లి రిమోట్ కారుమీద పడింది.
వెంటనే ఆ పాప.. ఆ కారు వెంట వెళ్లింది. రిమోట్‌తో ఆపరేట్ చేయబడుతున్న.. ఆ కారు అటూ ఇటూ పరుగెడుతోంది. ఆ పాప దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
‘‘పాపా.. నీకు కారుకావాలా’’ అన్న గొంతు విని వెనక్కు తిరిగింది.
ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు అక్కడవున్నాడు. అతని చేతిలో రిమోట్ వుంది.
ఆ పాప ఆశగా.. ఆ రిమోట్ వంక చూస్తూ కావాలన్నట్టు తలాడించింది.
‘గుడ్‌గర్ల్.. గుడ్ గర్ల్’ అయితే నాతోరా అంటూ ఆ పాపను ఎత్తుకుని ఫస్ట్ఫో్లర్‌కు తీసుకెళ్లాడు.
‘‘ఇక్కడ పొడవాటి కారిడార్ వుంది. నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు నువ్వు. ఈ కారు తీసుకెళ్లి నువ్వక్కడ పెడతావంట. అదిగో అక్కడ దూరంగా వున్న స్పెషల్ వార్డ్ వున్న ఓ గది చూపిస్తూ.. ఆ కారుకన్నా స్పీడుగా నువ్వు పరుగెత్తుకు రావాలి. నేను రిమోట్ ఆన్ చేస్తాను.
నువ్వు ముందు పరుగెత్తుకొస్తే ఈ రిమోట్ కారు నీకే.. ఇంకా బోలెడు చాక్లెట్లు నీకే’’చెప్పాడు ఆ వృద్ధుడు.

పాప హుషారుగా ఆ కారును తన చేతిలోనికి తీసుకుని..
బుల్లి బుల్లి అడుగులతో ఆ స్పెషల్ వార్డ్ దగ్గరికి వెళ్లింది.
ఆ వృద్ధుడి వైపు చూస్తూ ఇక్కడే పెట్టాలా అంటూ అతని వైపు చూసింది.
అతను బొటనవేలు చూపిస్తూ అక్కడే అంటూ సైగ చేశాడు.
***
‘‘వైష్ణవి ఎక్కడ?’’ అడిగాడు అతను భార్య వంక చూసి.
‘‘ఇప్పటివరకు ఇక్కడే ఆడుకుంటుంది’’ చెప్పింది ఆమె.
‘నీకసలు బుద్ధుందా’’ అసలే తనకు హెల్త్ బాగాలేదు అంటూ భార్యను కోప్పడి కూతురికోసం వెతకసాగాడు.
క్షణాల్లో రిసెప్షన్‌లో కలకలం. ఆ ఇద్దరూ తమ కూతురికోసం వెతుకుతున్నారు.
అయిదేళ్ల పాపకు హార్ట్ ప్రాబ్లమ్.. ఆ పాపకోసమే వాళ్లు ఈ హాస్పిటల్‌కు వచ్చారు.
ఇద్దరూ ఏడుస్తూనే వెతుకుతున్నారు. స్ట్ఫాంతా వచ్చారు.
అక్కడ జరుగుతున్న హడావుడి చూసి బయటికి వెళ్ళబోతున్న కులకర్ణి వెనక్కు వచ్చాడు. ఏమైందని అడిగాడు.
‘‘్భర్యాభర్తలిద్దరూ పాప కనపడలేదని కింద కూలబడి ఏడుస్తున్నారు.
సెక్యూరిటీ అలెర్ట్ అయింది.
కులకర్ణి దృష్టి హఠాత్తుగా హాస్పిటల్ రిసెప్షన్‌లో వున్న తీగమీద పడింది. హాస్పిటల్‌లో చాలా చోట్ల సిసి కెమెరాలున్నాయి.
అతని దృష్టి టీవీలో కనిపించే దృశ్యం మీద పడింది. ఫస్ట్ఫో్లర్‌లో ఆ చిన్న పాప ప్రియంవద, కిరణ్మయితో మాట్లాడుతోంది. మధ్య మధ్యలో ఎదురుగా వున్న వ్యక్తివైపు చూస్తోంది.
కాని ఆ వ్యక్తి సీసి కెమెరాలో కనబడటంలేదు. ఎందుకంటే సిసి కెమెరా ఆ పాపవైపు వుంది.
కులకర్ణి వెంటనే డామిట్ అంటూ మెరుపు వేగంతో పరుగెత్తాడు.
కౌంట్‌డౌన్ త్రీ.. టూ... ఒన్... స్పిట్ సెకండ్స్..
మరోక్షణంలో ఆ అపరిచిత వృద్ధుని చేతిలోని రిమోట్‌లోని ఎరుపు రంగు బటన్ ప్రెస్ కావడానికి సిద్ధంగా ఉంది.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482