డైలీ సీరియల్

ఒయాసిస్‌ 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా కుదరదండీ.. ఒకసారి మాటిచ్చాక మాట మీద నిలబడాలి..’’ అన్నది దీప్తి.
‘‘మాట లేదు.. గీటా లేదు..’’
‘‘మీ బోణీ మంచిదని.. అన్నట్లు రెండు రోజులు మీరు వేరే పనులు పెట్టుకోకండి.. రేపు మనం తిరుపతి వెళ్తున్నాం..’’ అన్నది దీప్తి.
‘‘అదేంటి ఇంత సడెన్‌గా.. ఇక్కడ స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి..’’ అన్నాడు రణధీర్.
‘‘అదేనండి.. మన స్టోరీ కొంచెం దేవుడికి కూడా చెప్పిరావాలి గదా..’’
‘‘దేవుడికీ మనకీ ఈమధ్య టరమ్స్ బాలేవు.. నేను ఏదో మొక్కుకున్నాను. అదేం కాలేదు.’’ అన్నాడు రణధీర్.
‘‘ఊరికే మొక్కుకుంటే పనులు అయిపోతాయాండీ.. ఆయన దగ్గరకెళ్లి పర్సనల్‌గా చెప్పుకుంటే, ఇట్టే అయిపోతుంది.. రేపు మనం వెళ్తున్నాం.. రెండు రోజులు ఇక్కడి పనులు పోస్ట్‌పోన్ చేసుకోండి..’’ అన్నది దీప్తి.
‘‘హీరోయిన్ మాటినకపోతే, రేపు ప్రాబ్లమ్ కదా.. అలాగే వస్తాను..’’ అన్నాడు రణధీర్.
‘‘ఆ మాత్రం బిగింపు ఉండాలి.. హీరోయిన్ అంటే..’’
‘‘అన్నట్లు మీ ప్రొప్రయిటర్‌కి చెప్పావా? రెండు రోజులు నాతో తిరుగుతున్నావని..’’’ అన్నాడు రణధీర్.
‘‘ఆయనే తిరగమన్నారు.. మీరంటే ఆయనకు ఎంతో ఇది ఏర్పడిందండీ బాబూ..’’
‘‘అసలు మీరిద్దరూ హోమాలు పూజలూ చేశారు. పార్ట్‌నర్స్ కల్సి వెళ్తే బావుంటుంది గదా..’’ అన్నాడు రణధీర్.
‘‘బానే వుంటుంది గానీ, ఆయనకు తీరిక ఎక్కడండి? ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నాకు.. మీకు చెప్పొచ్చో చెప్పకూడదో..’’ అని ఆగిపోయింది.
‘‘మనమధ్య దాపరికాలు ఉండకూడదు..’’
‘‘నిజమే గానీ, ఇది ఆయన పర్సనల్ విషయం.. చెప్పాలో చెప్పకూడదో, ఎంతవరకూ చెప్పాలో, ఎంతవరకూ చెప్పకూడదో..’’
‘‘నామీద అంత నమ్మకం లేకపోతే, చెప్పొద్దు.. నేను రేపు రావట్లేదు.. నాకు సిట్టింగ్స్ ఉన్నాయి..’’ అన్నాడు రణధీర్.
‘‘రండి.. రండి.. కొండెక్కాక అప్పుడు చెబుతాను..’’ అన్నది దీప్తి.
రణధీర్‌కి అనుమానం వచ్చింది.
‘‘నిన్న రాజశేఖర్ దీప్తిని పక్కన కూర్చోబెట్టుకుని పార్ట్‌నర్ అంటూ దానితో కల్సి పూజలు చేశాడు. అంటే దీప్తిని తన గ్రిప్‌లో తీసుకున్నాడు. తన మనిషిని చేసుకున్నాడు. అలాంటివాడు దేవుడి దగ్గరకు వెళ్ళాలనుకుంటే తనతో తీసుకెళ్ళేవాడు.. కానీ నాతో పంపిస్తున్నాడు?.. ఎందుకిలా చేస్తున్నాడు?.. ఒకవేళ నేను సినిమా ప్రొడ్యూసర్ని కాదనీ, చక్రపాణి అసలు పేరు కాదనీ, నేను ఇన్స్‌పెక్టర్ రణధీర్‌నని పసిగట్టి, నాకు దీన్ని ఎరగా వేస్తున్నాడా? ఏమో.. వాడు కాలాంతకుడు..’’ అనుకున్నాడు.
మర్నాడు ఫ్లయిట్‌లో దీప్తి రణధీర్ పక్కన కూర్చంది. చాలా హుషారుగా వుంది.
‘‘నేను ఇదే మొదటిసారి విమానం ఎక్కటం.. చాలా థ్రిల్లింగ్‌గా వుంది..’’ అన్నది దీప్తి.
‘‘ఇప్పుడు నవ్వొక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌వి.. నీకు ప్రొప్రయిటర్ చాలా క్లోజ్.. ఇకనుంచీ నువ్వు నేలమీద నడవ్వు.. గాల్లో ఎగురుతుంటావు..’’ అన్నాడు రణధీర్.
‘‘మీకో విషయం చెబుతానన్నాను గదా..చెప్పనా?’’’
‘‘చెప్పాలనిపిస్తే చెప్పు..’’
‘‘వచ్చేవారం నేను దుబాయ్ వెళ్తున్నాను.. ఎప్పుడూ విమానం ఎక్కలేదు గదా.. అందుకని అప్పుడు కంగారు పడకుండా ఉండటం కోసం ఇది ట్రయల్ ట్రిప్..’’ అన్నది దీప్తి.
‘‘దుబాయ్‌లో ఏంటి పని?’’
‘‘చూసి రావటానికి.. బిజినెస్ ట్రిప్.. రెండు రోజులే అక్కడ ఉండేది..’’
‘‘దుబాయ్‌లో తూర్పు ఎటో, పడమర ఎటో తెలియదు. ఇక్కడే ఇంకా బిజినెస్ మొదలెట్టలేదు.. అక్కడేం బిజినెస్ చేస్తావ్?’’ అని అడిగాడు.
‘‘అంటే అక్కడి కంపెనీలతో టైఅప్.. దిగిన దగ్గరనుంచీ అక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు..’’ అన్నది దీప్తి.
‘‘ఇంక నీ దశ తిరిగిందిలే..’’ అన్నాడు రణధీర్.
సీటు బెల్టు పెట్టుకోవడం ఎలాగో పెట్టి చూపించాడు.
టేకాప్ అయిన తర్వాత దీప్తి విండోలో నుంచి కిందకు చూస్తూ కూర్చుంది. ఆ కాసేపు డొమెస్టిక్ ఫ్లైట్స్‌కీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కి తేడా ఏమిటో వివరించాడు.
రేణిగుంటలో దిగి టాక్సీలో తిరుమల చేరుకున్నారు.
రూంలో దిగి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు రణధీర్ అడిగాడు. ‘‘నాతో ఇక్కడికి రావాలని నీకు ఎందుకు అనిపించింది..?’’
‘‘ఎందుకో చెప్పలేను.. ఆయనతో రావాలనిపించలేదు..’’ అన్నది దీప్తి.
‘‘ఏం? ఆయన నీకు అంత మంచి స్థాయిని కల్పించాడు..’’’
‘‘్భగవంతుడు నామీద చాలా పెద్ద భారం పెడుతున్నాడు. ఆ భారాన్ని మోయగల శక్తి నాకు ఉందో లేదో తెలియటంలేదు.’’
‘‘్భగవంతుడు నిజంగా నీమీద భారం పెడితే, ఆ భారాన్ని మోస్తున్నప్పుడు, నీ కింద తన రెండు చేతులూ పెట్టి, నీ భారాన్నంతా ఆయనే మోస్తాడు..’’ అన్నాడు రణధీర్.
దీప్తి ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. ఒక క్షణం ఆగి అన్నది.. ‘‘నిజంగా నా భారాన్ని ఆయన మోస్తాడంటారా? భగవంతుడు నాకు అంత గొప్ప సాయం చేస్తాడా?’’
‘‘ఆయన స్వయంగా వచ్చి ఏ మనిషికీ సాయం చేయడు. మరో మనిషి ద్వారా సాయం చేయిస్తాడు..’’ అన్నాడు రణధీర్.
‘‘అంటే మీ ద్వారా దేవుడు నాకు సాయం చేయబోతున్నాడన్నమాట..’’
‘‘అసలు నీకొచ్చిన కష్టమేంటి? ఆయనొచ్చి సాయం చేయాలని కోరుకోవటం ఏమిటి?.. ఏమిటిదంతా..’’ అని అడిగాడు రణధీర్.

- ఇంకా ఉంది

శ్రీధర