డైలీ సీరియల్

ష్...17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ భార్య సులోచన’’అన్నాడు అతను.
ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు సునందారావ్.. తన భార్య ప్రస్తావన వచ్చేసరికి.
‘‘కంగారు పడకండి.. ’’ అతను కొనసాగించాడు.
‘‘మేము ప్రద్యుమ్న దగ్గరికి వెళ్తే అక్కడ పోలీసులు, బందోబస్తు. వాళ్ళు ప్రద్యుమ్న పర్మిషన్ అడుగుతారు. మీరైతే సులోచనగారి భర్త కనుక వెళ్ళొచ్చు.. మీ భార్యకు ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం.. జస్ట్ ‘బొకే’ ఇచ్చి వస్తే చాలు.. తర్వాత నేను ప్రద్యుమ్నకు ఫోన్ చేస్తాను.. ఆలోచించుకోండి..’’ లేచాడు అతను.
వెంటనే సునందరావు ఆలోచించుకోవడానికి ఏమీ లేదు.. నేను బొకే ఇస్తాను. బొకే, క్యాష్ మొబైల్ రెడీ చేసుకోండి.. ఉత్సాహంగా చెప్పాడు.
అతను సునందరావుతో కరచాలనం చేసి.. ‘ఓకె’ రేపు కలుద్దాం అన్నాడు.
సునందారావు తన భార్య గురించి ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు.
సులోచనకు ఈ విషయం ఎలా చెప్పాలి? చెపితే సంతోషిస్తుందా?.. లేక ఒక్క రోజు ఆఫీసుకు సెలవు పెట్టకుండా వర్క్ చేస్తూ, ఆపైన ఎక్స్‌ట్రా వర్క్ చేస్తే జీతం పెరుగుతుందని అనుకునే ఈ మొగుడు వెధవ తన కోసం బాస్ దగ్గరికి వస్తాడని నమ్ముతుందా? తను చేసే ప్రతీ పనిని అనుమానించే భార్య ఒప్పుకుంటుందా? రావణాసురుడు రాముడుగా మారాడంటే నమ్ముతుందా... అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు. అతని అడుగులకంటే.. అతని ఆలోచనలే వేగంగా కదులుతున్నాయి.
సులోచన పెరట్లో సన్నజాజి తీగకు పూసిన విరజాజి పూలను కోసి, వాటిలో కొన్ని దేవుడి పూజకు దాచి, మిగిలిన పూలను మాలగా అల్లి తలలో తురుముకుంటూ భర్త గురించి ఆలోచించసాగింది. తోటలో పూలున్నా, పూలుకోసే ఆర్థిక స్వాతంత్య్రమున్నా.. ఏ ఆడపిల్ల అయినా తన భర్త తెచ్చే పూలమీదే ఆశ.. పూలు భార్యాభర్తల ప్రేమకు చిహ్నమనీ.. డబ్బులు, చీరలు, నగలు ఇంకేవి అడగని సాధారణ మధ్యతరగతి ఆడపిల్లకు మల్లేపూలే సిరులు.
‘సులూ’ పిలిచాడు సునందరావు.
‘సులూ’ మరోసారి పిలిచాడు గట్టిగా సోఫాలో కూచుంటూ.
సులోచన ఆలోచన్లోంచి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇది కలా, నిజమా.. తనను ‘సులూ’ అని పిలిచాడా లేక తన ఛెవులకు ఆయన ఏదోలా పిలిస్తే.. ఇంకోలా వినబడిందా.. అని ఆశ్చర్యపోతూ హాల్లోకి వచ్చింది.
సులోచనను చూడగానే సునందరావు ‘‘సులూ.. ఇలారా’’ అంటూ ఎంతో ప్రేమగా పిలిచాడు. సులోచన తనను ఒకసారి గిచ్చుకుని చూసుకుంది.
గుండెలో అట్టడుగు పొరల్లో దాగివున్న ప్రేమ.. అమృతంలా పెదవులపై పొంగి.. భర్త నుదుటిపై ముద్దుపెట్టుకుందామని అనిపించింది. కానీ.. తను ఇంకోరకంగా అనుకుంటాడేమోనని.. ఆ కోరికను బలవంతంగా నిగ్రహించుకుంది.
‘‘సులూ.. నువ్వు ఈమధ్య మళ్లీ బాస్‌ను కలిసావా? ఐ మీన్.. అదే హాస్పిటల్‌కు వెళ్ళి పలకరించావా’’ అడిగాడు సునందరావు.
‘‘ఎప్పుడూ లేనిది.. ఈ రోజు తన బాస్ గురించి అడుగుతున్నాడేమిటి? ఏమై ఉంటుంది? కొంపదీసి నామీద మర్డర్ ఎటంప్ట్ గాని ప్లాను చేసారా? లేక ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఫ్లాట్ కొనుక్కోడానికి నన్ను ఒప్పించాలని మాట్లాడుతున్నాడా?’’- ఇలా ఒకదాని వెంట ఒకటి యక్షప్రశ్నలు మెదడును తొలిచేస్తుంటే, కళ్ళప్పగించి భర్తను చూస్తుండిపోయింది.
‘‘ఏంటి.. సులూ ఇందాకటి నుంచి నేను మాట్లాడుతున్నాను.. ఒక్క మాట విన్నట్టు లేదు.. ఈ రోజు నేను లంచ్ బాక్స్ తినలేదు..’’
‘‘ఏమైంది.. రూపాయి బిళ్ళ జారిపోయిందా?’’ అని అడిగింది సులోచన.
‘‘కాదు.. మీ బాస్ గురించి ఫీలవుతున్నా. భార్య అంటే భర్తలో బెటరాఫ్.. నీ గురించి కనీసం.. పావు భాగం అయినా నాకు తెలియకుండా ఉంటుందా? మీ బాస్‌ను పలకరించలేదని.. నువ్వెంత ఫీలవుతున్నావో నాకు తెలుసు. మీ బాస్ వల్లే కదా మీకు జీతం వచ్చేది. మీ బాస్ ప్రద్యుమ్న దేవుడు. అటువంటి వ్యక్తిని నువ్వు, నీ భర్తగా నేను.. మీ బాస్‌ను ఇటువంటి పరిస్థితుల్లో పలకరించకపోతే .. మీ ఆఫీసులో స్ట్ఫా ఏమనుకుంటారు?’’ సులోచన మొగుడంటే ఎలా ఉండాలి? అందుకే మీ బాస్‌ను పలకరించి.. బొకే ఇచ్చివద్దాం’’ అన్నాడు సునందరావు.
‘‘బొకేనా?’’ అనుమానంగా చూసింది.
‘‘అవును బొకేనే.. వెళ్ళి ఇద్దాం..’’
పక్కలో బాంబ్ పెట్టినంత అదిరిపడింది సులోచన.. తన భర్తకేమైనా పాకిస్తాన్ దయ్యం పట్టిందా? కాశ్మీర్ బార్డర్‌లో ఉగ్రవాదులకై పెట్టిన బాంబ్.. తన పక్కన పేలినట్టు ఉలిక్కిపడింది. ఆశ్చర్యపోయింది.. అనుమానపడింది.
‘‘నాకొక క్వార్టర్ కొట్టాలని ఉంది’’ చెప్పాడు సునందరావు.
‘‘మందా, మంచినీళ్ళా’ అడిగింది సులోచన.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి)