డైలీ సీరియల్

ష్‌...-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సులూ.. నేను చెప్పేది నిజం.. రేపు మనం మీ బాస్‌ను చూడటానికి వెళుతున్నాం. ఇందులో ఆశ్చర్యపోవటానికి , అనుమానపడటానికి ఏమీ లేదు. రేపు నువ్వే చూస్తావుగా’’ చెప్పాడు.. సునందరావు ఆనందపు తాలూకు అనుభవాన్ని ఎదురుచూస్తూ.
***
ఆ రోజు చాలా హుషారుగా నిద్రలేచాడు సునందరావ్..
సాధారణంగా జీతాలు వచ్చే రోజులోనే అతనిలో ఇలాంటి ఉత్సాహం ఉంటుంది. ఈ రోజు తన లైఫ్ టర్న్ అవుతుంది. మొబైల్ ఫోన్ వస్తుంది.. డబ్బు వస్తుంది.
‘‘దేవుడా ఇలాంటి కేసులు నాలుగైదు వచ్చేలా చూడు. కేసుకు ఒకటి చొప్పున నీకు కొబ్బరికాయ కొడతాను. నెలలో కనీసం ఆరు తగ్గకుండా ఇలాంటి కేసులు వస్తే ‘‘గుండు కొట్టించుకుంటాను’’ మనసులోనే మొక్కేసుకున్నాడు.
భర్త హుషారును గమనిస్తుంటే ఆమెకు సంతోషంగానూ, కాసింత భయంగానూ, ఇంకాసింత అనుమానంగానూ వుంది.
రాత్రి చాలా రోజుల తర్వాత తన దగ్గరికి వచ్చాడు. చిత్రంగా మనీ సేవింగ్స్ గురించి, డబ్బును ఎలా డబుల్ చేయాలో అన్న విషయం గురించి పలవరించాడు.
అయినా అదేమీ పట్టించుకోలేదు. తన బాస్‌ను పరామర్శించడానికి వస్తున్నాడు. అది చాలు. ఇప్పటికే హాస్పిటల్‌లో అంతా కుటుంబాలతో సహా వచ్చి పలకరించారు. హమ్మయ్యా అనుకుంది.
సునందరావ్ బయటకు వెళ్ళాడు. వీధి చివర వున్న ఓ ఇరానీ హోటల్‌కు వచ్చాడు సునందరావు.
నిన్నటి అపరిచిత వ్యక్తి అక్కడికి వస్తానన్నాడు.. రెండు నిమిషాల తర్వాత వచ్చాడు. అతని చేతిలో బొకే వుంది. నీట్‌గా డెకరేట్ చేసి వుంది. ఆ బొకే వంక కాసింత అనుమానంగా చూశాడు.
‘‘మొత్తం పరీక్షించుకోవచ్చు’’ అతను చెప్పి నవ్వాడు.
ఓసారి బొకేను కిందినుంచి మీదివరకూ చూసి తృప్తిగా నిట్టూర్చి అతని వంక చూశాడు.
అతను చిన్నగా నవ్వి, జేబులోనుంచి ఓ కవర్ తీసి సునందరావ్‌కు ఇచ్చాడు. ఓసారి ఆ కవర్ బరువు చూసుకున్నాడు. కొద్దిగా ఓపెన్ చేసి అందులో ఉన్న కొత్త వెయ్యి రూపాయల నోట్లను తృప్తిగా చూసుకుని.. ‘ఇంకా’ అన్నట్టు చూశాడు.
అతను మరో జేబులోనుంచి మొబైల్ ఫోన్ కొత్త పీస్ ఇచ్చి చెప్పాడు.
‘‘ఇదిగో ఇందులో నీ సిమ్ వేసుకో.. నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలిగా.. అదేకాక నీ ఫోన్‌తో ప్రాబ్లం.. దాన్ని తీసుకువెళ్లి టాంక్‌బండ్‌లో వేసెయ్.. ఈరోజునుంచి కొత్త మొబైల్.. కొత్త జీవితం..’’ నవ్వి చెప్పాడు.
మొబైల్‌లో తన పాత సెల్‌లో వున్న సిమ్ వేసి ఇంటికి ఫోన్ చేయబోయాడు.
‘‘వద్దొద్దు.. ఫస్ట్‌కాల్ నేనే చేయాలి.. అదీ కండీషన్’’ అన్నాడు అపరిచిత వ్యక్తి.
‘‘ఓ.కె... అయితే నేను బొకే ఇవ్వగానే మీకు మిస్డ్‌కాల్ చేస్తాను.. నాకు మీరు ఫోను చెయ్యండి.. వీలైతే కాంప్లిమెంట్‌గా ఓ వంద రూపాయల రీఛార్జ్ చేయించండి అన్నాడు సునందరావు.
అతను నవ్వి అలాగే అన్నట్టు తలూపాడు.
మృత్యువును క్యారీ చేస్తున్నట్లుగా ఆ క్షణం సునందరావుకు తెలియదు.
***
ఆ రోజు పొద్దునే్న షాంపుతో తలారా స్నానం చేశాడు.
దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత కొబ్బరికాయ కొట్టాడు.
‘‘వారం రోజులపాటు చట్నీ చేయమంటాడు కాబోలు అనుకుంది సులోచన’’.
‘‘పచ్చికొబ్బరి బెల్లంతో కలిపి తింటే ఐరన్... నీకు మంచి రక్తం పెడుతుంది. సాయంత్ర వచ్చేటప్పుడు గుర్తుచేస్తే బెల్లం తెచ్చుకుందాం అన్నాడు సునందరావ్.
వెంటనే తన నోటికి లాక్ చేసింది.
***
శర్మిష్ఠి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు నెమ్మదిగా చీకటికి అలవాటుపడుతున్నాయి. తను ఎన్ని రోజులుగా ఇక్కడ బందీగా వుంది. మధ్యమధ్య తనకు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు. బలవంతంగా తినిపిస్తున్నారు. తప్పదు.. తను ఇక్కడినుంచి తప్పించుకోవాలన్నా తినాలి. తనకు శక్తికావాలి. ఇంతకీ తనను బంధించింది ఎవరు? ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. తన దగ్గర వున్న సెల్‌ఫోన్ తీసుకున్నారు. తనకు తను ఎక్కడ వున్నదీ తెలియదు. గదిలో వెంటిలేషన్ కూడా లేదు. కట్లు బలంగా కట్టబడి ఉన్నాయి.
ఆమె చేతులకు గాయాలు అయ్యాయి.
మెల్లిగా కనుచివరలనుంచి చుట్టూ గమనించింది. కాలికి ఏదో వస్తువు తగిలింది. కిందికి తల వంచి చూసింది. చిన్న గాజుముక్క.. మెల్లిగా తన కాలును ముందుకు జరిపింది. యుద్ధంలో చిన్న కర్రముక్క దొరికినా ఆయుధంగా మార్చుకోవాలన్నది సిబిఐలో మొదట తెలుసుకున్న లెసన్. ఆ గాజుముక్క ఆమె కాలి వేళ్ళ మధ్యకు వచ్చింది. చిన్న బాధ.. ఆ గాజు ముక్క వేలిని కోసేస్తుంది.. తప్పదు. ఆ కాళ్ళకు వున్న బంధనాలు తెగిపోవాలంటే.. ఆ మాత్రం పెయిన్ అనుభవించవలసిందే.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482