డైలీ సీరియల్

బంగారుకల-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణదేవరాయలు బతికి ఉన్నపుడు విజయనగర సామ్రాజ్యం పేరు వింటేనే గజగజలాడే ఆదిల్షా దర్జాగా మంది మార్బలంతో, సైన్యంతో తరలివచ్చాడు. తిమ్మయ్య ఇచ్చిన అపూర్వ స్వాగతం అందుకున్నాడు. సభా మండపానికి ఆదిల్షాను తీసుకెళ్లాడు తిమ్మయ్య. విజయనగర సింహాసనం చూడగానే ఆదిల్షాకు కోరిక పెరిగింది.
‘‘నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాను. నీవు మునుపటిలాగా ముఖ్యమంత్రి ఆసనాన్ని ఆలకరించు’’ అన్నాడు.
ఆదిల్‌షా కోరికను తిమ్మయ్య తిరస్కరించలేడు. అలా చేస్తే అధోగతే! స్వయంగా అతడిని తీసుకువెళ్లి విజయనగర సింహాసనంపై కూర్చోబెట్టాడు తిమ్మయ్య.
చరిత్రలో అది మహాదుర్దినం. పౌరుష శౌర్య ప్రతాపాల తెలుగు బిడ్డలు, స్వంత దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన హిందూ రాజులు అధిష్ఠించిన సింహాసనం మీద, మూరురాయరగండ, ఆంధ్ర భోజుడధిష్టించిన సింహాసనంమీద ఒక ముసల్మాను కూర్చోవటం విజయనగర వినాశనానికి నాంది అయింది.
ఇక ప్రజలు వౌనం వహించలేకపోయారు. రామరాయలను సామ్రాజ్యాన్ని కాపాడమని ఆహ్వానించారు. ఈలోగా ఆదిల్‌షా ప్రతాపం, ప్రజలపై అణచివేత ఎక్కువైంది. తురక సేనలు ప్రజాజీవితాన్ని దుర్భరం చేశాయి. రామరాయలు సైన్యంతో కోట వెలుపల విడిది చేశాడు. ఆదిల్‌షా తోక ముడిచాడు. మూర్త్భీవించిన విజయనగర పౌరుషానికి తలొంచి దోచిన సంపదంతా తిరిగి ఇచ్చేశాడు.
తిమ్మయ్య శిరస్సు ఖండించి విజయనగరాన్ని పట్టుకున్న పిశాచాన్ని వదిలించాడు రామరాయలు. సదాశివరాయలను విడుదల చేసి చక్రవర్తిగా చేశాడు. పేరుకే సదాశివరాయలు రాజు. పెత్తనం మాత్రం మళ్లీ రామరాయలదే!
రామరాయలు పరిపాలనా యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో బంధించుకోవటానికి అవసరమైన భారీ మార్పులన్నీ చేశాడు. బహ్మనీ సుల్తానులతో విజయనగరం వారికి నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రామరాయలు రకరకాల వ్యూహాలతో విజయనగరానికి విశేష ధనాన్ని సంపాదించిపెట్టాడు. బహ్మనీలతో, పోర్చుగీసువారితో తెలివిగా ప్రవర్తించి కోల్పోయిన కోటలు తిరిగి సాధించాడు.
శ్రీకృష్ణదేవరాయ నిర్మితమైన భువన విజయంలో విజయదశమి రోజున కవి పండిత గోష్ఠి నిర్వహించాడు రామరాజు. ఆనాటి చర్చ ‘కవిత్వ విమర్శ’ అనే అంశంమీద కొనసాగుతున్నది.
రామరాయలు సభనుద్దేశించి ప్రశ్నించాడు.
‘కవిత్వానికి మూలం ఏది?’’ ఎవరూ బదులీయలేదు.
‘‘రామయామాత్యా! మీ అభిప్రాయం’’ అడిగాడు రామరాయలు.
‘‘్భవనాశక్తి’’
‘‘రాజనాథ డిండిమా! మీ ఆలోచన?’’
‘‘శ్రేష్ఠమైన ప్రసిద్ధమైన వస్తువు’’
రామరాయలకా జవాబు తృప్తినివ్వలేదు. అంతఃపుర కక్ష్యనుండి తిరుమలాంబ ‘వివేచనాశక్తి, లోకజ్ఞానం’ అన్నది.
అండుగుల వెంకయామాత్యుడు ‘్భగవత్కటాక్షం’ అన్నాడు.
రంగవరాజు ‘పాండిత్యం’ అన్నాడు.
అందరూ తలోరీతి చెప్పారు. రామరాయలు చివరకు భట్టునుద్దేశించాడు. భట్టు లేచాడు.
‘‘ప్రభూ! కవిత్వానికి మూలం ప్రతిభ! మిగిలనవన్నీ దాని పోషకాలు. ప్రతిభ లేనివాడు కవి కాలేడు. కళాకారుడు కూడా కాలేడు. గ్రంథాలు చదివితే పాండిత్యం, జ్ఞానం వస్తాయి. ప్రతిభ రాదు. అది పుట్టుకతో రావాలిసందే’’ అన్న భట్టు అభిప్రాయం మీద వాద ప్రతివాదాలు జరిగాయి. రామరాయలకు భట్టు అంటే గౌరవం హెచ్చు. భట్టు సంగీత సాహిత్య నిధి. వేదవేదాంగ తర్క మీమాంసాది సకల శాస్త్ర పారంగతుడు. సంస్కృతాంధ్ర సాహిత్య సర్వస్వాన్ని సామవేదాన్ని సంపూర్ణంగా అభ్యసించినవాడు.
కవులంతా తమ తమ కావ్యాల నుంచి కొన్ని ఘట్టాలు చదివి విన్పించారు. భట్టు తాను రచిస్తున్న కావ్యంలోని కొన్ని ఘట్టాలు వీణా మృదంగ తాళలయతో చదివాడు. నాటి సభలో తిమ్మోజు కొండోజు క్షౌరకళ ఉత్కృష్టత ప్రకటితమైంది. తనకు నిద్రాభంగం కాకుండా క్షౌరము చేసిన కొండోజీకి రామరాయలు మల్లాపురం ఆగ్రహాన్నిచ్చి గౌరవించాడు. కృష్ణరాయల కాలం నాటి రాజకళాపోషణను అంతా గుర్తుచేసుకున్నారు.
***
విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ఉన్నా పైకి మిత్రత్వం నటించే బీజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్‌షాకు పఠాన్ అనే అంగరక్షక దళాధిపతిని రామరాయలు ఏర్పాటు చేయటం పట్ల విముఖత్వం వహించి రాజగురువు హెచ్చరించారు. రామరాయలు వినలేదు. అంతిమంగా తనవల్ల సహాయం పొందిన బహ్మనీవారే తనకి ద్రోహం తలపెట్టటం రామరాయలను కలవరపరిచింది.
బహ్మనీ సుల్తానులంతా ఏకమై విజయనగరంపై దండెత్తారు. రామరాయలు మండిపడ్డాడు. సేనల్ని ఆయత్తపరిచాడు. తిరుమలరాయలు, వెంకటాద్రిని సరిహద్దుల కాపలాకు నియోగించాడు. శక్తివంతుడైన రామరాయలు కులదైవమయిన ఆదివరాహమూర్తిని పూజించాడు.
అప్పటికి తొంభై ఏళ్ళు పైబడ్డ వృద్ధుడు రామరాయలు. అంత వయస్సున్నట్లు కనిపించడు. ధృడమైన శరీరాకృతి, చైతన్యవంతమైన మేధస్సు, వ్యూహనిర్మాణంలో దిట్ట అయిన రామరాయలు అంతవరకు పరస్పర కలహ సమయాల్లో బహమనీ సుర్తానులకు సాయం చేసినా స్వమత కారణంగా ఏకమై వారంతా నేడీ యుద్ధం తనపైనే తల పెట్టటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.

- ఇంకా ఉంది

చిల్లర భవానీదేవి