డైలీ సీరియల్

దూతికా విజయం-97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యంగా సంపెంగి వాసనలంటే నిజంగా మత్తుతో తూలిపోతున్నట్లుంటుంది తనకు. బహుశా తన నాయకునిక్కూడా అవి ఎంతో ఇష్టమవటంవల్లనే వాటిని అత్యధికంగా ఇక్కడ సమకూర్చి ఉండాలి.
ఆ సంపెంగలన్నిటినీ మాలగా గుచ్చి జడలో తురుముకుందామనుకుందామె. మరి ఊదీ, దారమెక్కడ? రాత్రి వీరభద్రుడు ఆ పాడు గూడు చీకటి గుహలోంచి దారపు ఉండ తీసి తన రవికె కుట్టిన సంగతి ఆమెకు గుర్తుకొచ్చింది.
అయితే ఇప్పుడా గూడంతా ఖాళీగానే వున్నది. ఈ గదిలో జరిగిన ముఖ్యమై నమార్పులోల ముఖ్యమైనది రాజబాటలో అడ్డుగావుండే పెద్ద మురికి గుంటలోని మురికి తోడవసిన విధంగా ఆ గూడు స్వరూపానికి మాత్రమే అక్కడ వున్నది. సూదీ దారమూ మరెక్కడో అతను దాచి ఉంటాడు. అతనొస్తేనే కాని పుష్పమాల తయారుచేసకోవటం కుదరదు. ఐనా అతని వస్తువుల్ని అతని అనుమతి లేకుండా తాను వాడుకుంటే ఏమనుకుంటాడో?
మధ్యాహ్నం తీని తలపుల మాధుర్యంతోనూ, సుఖ స్వప్నాలతోనూ హాయిగా నిద్రబట్టి, బడలికంతా తగ్గి, తగినంత విశ్రాంతి పొంది ప్రశాంతతను వెదజల్లే ముఖాన్ని దర్పణంలో చూసుకొని గర్వపడిందామె.
ఐతే తెల్లవారేలోగా రుూ తాజాతనమంతా కోల్పోయి, ఎంతో నలగిపోయి, వాడిన పూవువలె వీరభద్రుని బలాఢ్యమైన చేతుల్లో తాను రూపొందవలసి ఉంటుందనీ తెలుసు. ఐతేనేం తిరిగి మర్నాటి రాత్రికి తాజాగా తయారయ్యే సౌకర్యాన్ని విధి నిర్ణయించే వున్నది! అందుకని విచారపడవలసిన పనేలేదు!
ఎంతసేపు తనకీ ఏకాంతవాసం? చూసేందుకు మన్మథ క్రీడారంగంగా కనిపించే ఈ సుందర దృశ్యం, ఇప్పుడామె ప్రాణానికి కారాగారమల్లే తోచింది. ఆత్రుత వెన్నాడుతూండగా, ఇంట్లోకి జొరబడి బహుశా వంటింట్లో చేతులు కాల్చుకుంటున్న వీరభద్రునికి సహాయపడవలసిన తన స్ర్తిత్వాన్ని ప్రదర్శించాలనే తొందరపాటు ఆమెను కలవరపెట్టసాగింది.
లేచి లోనికి వెళ్దామా అని నిర్ణయించుకుంటున్న సమయంలోనే వీరభద్రుడు పెద్ద మరచెంబుతోసహా గదిలోకి ప్రవేశించి, పక్కమీద సరస్వతి కూర్చొని ఉండటం గమనించి ‘‘వచ్చావా రాణీ! ఎంతసేపైంది?’’ అన్నాడు, మరచెంబును గూట్లో సర్దుతూ.
‘‘ఇంతకుముందే’’ అన్నదామె తొట్రుపడనట్లు నటిస్తూ, లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తూ.
‘‘కూర్చో రాణీ!.. అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావా చిలుకా! రాత్రి పగిలిన అద్దం ముక్క ఇస్తే నసిగావుగా! అందుకని నిలువుటద్దటమే తెచ్చాను. తెచ్చి నీ పిచ్చివేషాలూ, కామకళా ప్రదర్శనలూ, చిలిపితనాలూ, గడుసుదనాలూ, అంగసౌష్టవం, రతి చాతుర్యం, రసికతా ప్రదర్శనా ఒకటేమిటి అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా అమర్చాను. బాగుందా?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘ఆ! తెలివికి సంతోషించాంలెండి. కామోద్రేకాలు కృత్రిమంగా పెంచుకునేందుకు మీ కోసం ఆ అద్దాన్ని అమర్చుకొని, నా కోసమే అంతా చేశానని నన్ను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే నేనంత అమాయకురాలినని అనుకున్న మీ తెలివికి జోహారులు!’’ అన్నది సరస్వతి.
‘‘నువ్వు అమాయకురాలివి కాదని గత రాత్రే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను రాణీ! నీవు జాణవు కాదు నెరజాణవు! నాబోటి మొండివాడికి సరైన జంటవు!’’
తనకో రాణి ఉండగా, తనను ఈ వీరభద్రుడు తనను రాణిగా చేసుకున్నాడు. రాణి శబ్ద ప్రయోగం అధికంగా జరుగుతుండటంవల్ల ఈ రాత్రి వ్యవహారాన్ని ఒక వైపునకు లాగి, పరిష్కరించే అవకాశాల వెంటనే విశ్వాసం సరస్వతిలో ప్రబలింది.
వీరభద్రుడు పూలమాలలున్న పళ్ళెంలో చేయి పెట్టి, అడుగున వున్న తావళాన్ని వెలికిలాగాడు. తనకేదో ఆభరణమో, మెడలోకి బంగారు గొలుసో అయి వుండచ్చని సరస్వతి అంచనా వేసుకున్నది. అతని అనురాగానికి సంతోషపడింది కూడా.
అతను ఆమెను సమీపించి ఆమె ముఖం అద్దం వైపు ఉండేట్లుగా తిప్పాడు. మళ్లీ రవికె చింపే ప్రయత్నం చేస్తున్నాడేమో ఈ అల్లరి పిల్లవాడు అనుకున్నది సరస్వతి.
అంతలో ఆమె కళ్ళముందు పురివిప్పిన నెమలి పింఛమల్లే కంఠాభరణం విచ్చుకొని అల్లల్లాడింది. బంగారు ముత్యాలవలె గుళ్ళు గుళ్ళల్లే వున్న తావళంలో మధ్యగా మంగళసూత్రం! వీరభద్రుడు దాన్ని ఆమె మెడలో వేసి వెనుక వైపున మూడు ముళ్లు వేశాడు.
ఆమె గాభరాగా ‘‘ఏమిటీ సరసం! ఎవరైనా చూస్తే ఇంకా ఏమైనా ఉన్నదా?’’ అని వారింపజూసి విఫలయైంది.
‘‘చూస్తే వివాహిత, పరదార అని తొలగిపోతారులే! నా భార్య మెడలో మాంగల్యం కట్టవలసిన నా బాధ్యత తీరింది. నిన్ను భార్యగా బహిరంగంగా కూడా చెప్పుకునేందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని తెలియజెపుతున్నాను. కనుక నీ కోరికా రుూడేరింది!’’ అన్నాడు వీరభద్రుడు చేతులు దులుపుకుంటూ.
‘‘బాగానే వుంది- వరస! జీవితాంతం వరకూ కన్యగా ఉండి తీరవలసిన నా కన్యాత్వాన్ని భంగపరచటం చాలక, మెడలో ఈ పలుపొకటా? ఏదో రహస్యంగా వున్నదాన్ని బహిరంగ పరచుకొని అవమానపడమంటారా!’’’
‘‘దానికి నిష్ఠూరపడవలసిన పనేమిటి రాణీ! మనిద్దరిదీ ఆదర్శ దాంపత్యం. ఆ విషయం చెప్పుకునేందుకు సిగ్గుపడాలా ఏం?’’
‘‘మాంసం తింటున్నామని ఎముకలు మెడలో కట్టుకున్నట్లున్నది!’’
‘‘ఛా.. ఛా. ఏం ఉపమానం అది! నీ సంస్కారమంతా ఏమైంది!’’ అని వీరభద్రుడు నొచ్చుకున్నాడు.
త్వరపడి నోరు జారినందుకు సరస్వతి సిగ్గుపడింది.
‘‘క్షమించండి.. పొరపాటైంది!’’ అన్నదామె తల వొంచుకుని.
వీరభద్రుడు ఆమెను పొదివి పట్టుకొని ‘‘్ఫర్వాలేదులే రాణీ! శుభ సమయాల్లో నీచపు ఉపమానాలు ప్రయోగించకు...’’ అని ఆమె చెక్కిళ్ళమీద ముద్దులవర్షం కురిపించి, ‘‘ఇప్పుడు గుచ్చుకుంటోందా?’’ అన్నాడు.
శుభ్రంగా క్షురకర్మ జరిపాక కూడా గడ్డమూ, మీసాలూ గుచ్చుకోవని ఆమెకు రుూ ప్రయోగంలో తెలిసినా ‘‘వాడిగా, వేడిగా ఉండే మీ చుంబనాలు గుచ్చుకోవు కాబోలు!’’ అన్నది.
‘‘అది తప్పదులే..’’ అని వీరభద్రుడు ఘనంగా కట్టించి ఉంచిన రెండు పూల మాలలన్నీ తెచ్చి, ఒకటి ఆమె చేతికిచ్చి, రెండోది తను పట్టుకొని ‘వధూవరులు ఒకరినొకరు పుష్పమాలల్ని వేసుకోవాలి!’ అని ఆమె మెడలో వేశాడు. ఆమె సిగ్గుపడుతూనే పుష్పమాలతో అతని కంఠాన్ని అలంకరించింది. ఇద్దరూ ఒకసారి అద్దంలో చూసుకొని నవ్వుకోవటంతో, వారి ఛాయలు కూడా వారిని అనుసరించినవి.
మృదువుగా ఆమెను మంచంమీద కూర్చోబెట్టి, తాను ఆమె పక్కనే కూర్చుంటూ ‘‘ఎలా వున్నదీ శోభన మందిరం!’’ అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
‘‘బాగాలేదా? మీ రాణివాసంలోని శోభ రాదనుకో. ఐనా మనకు ఉన్నంతలోనే ఇముడ్చుకోవాలి కదా! నీకు నచ్చలేదా?’’
‘‘నచ్చింది లెండి!’’అన్నదామె నసుగుతూ.
తనకన్న తాజాగానూ, సుగంధాలను వెదజల్లుతున్న మన్మథుడు వసంతుడిలో లీనమైన విధంగానూ వీరభద్రుడు కళకళలాడుతుండటం సరస్వతికి పరమానందాన్ని ఇచ్చింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు