డైలీ సీరియల్

దూతికా విజయం-98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకింద గొప్ప నాయకుడు దొరికినందుకు నా పూర్వజన్మల పూజాఫలమే కారణమై ఉండాలని ఆమె విశ్వాసం.
‘‘ఇంత త్వరగా వస్తావనుకోలేదు- అయినా విరహాన్ని భరించటం అంత తేలిక కాదని తెలుసనుకో!’’
‘‘పాపం! నేనేదో విరహ వేదనతో కుమిలిపోతున్నాననుకున్నారా? మరీ చీకట్లో ఒక్కతెను రావటం దేనికని, కొంచెం ముందుగా బయలుదేరినందుకు ననే్న దూషించండి. ఆలస్యంగా వస్తే అదో నింద, త్వరగా వచ్చినా నిందే- బాగుంది!.. ఆ విరహాలేంటో మీరు పడండి. నాకు అలాంటివేం లేదు!’’ అని మూతి మూడు వంకర్లు తిప్పింది సరస్వతి.
‘‘నా విరహం సంగతే నేను మాట్లాడేది. విరహ వేదనలో కాలిపోతున్నానని, కామదేవుడు కరుణించి పంపిన కామినీ భూతానివి నీవు! భూతానివైనా దేవకన్య రూపాన అవతరించావు.. అలంకరించుకునేందుకు కూడా వ్యవధి లేకపోయింది కాబోలు. కాళ్ళు ప్రియుని కోసం పరువులెత్తుతుంటే మనసుకు నిలకడడెక్కడలే!’’
‘‘ఈ అలంకరణలు చాలవన్నమాట?’’’
‘‘ఏదీ, శోభనపు పెళ్ళికూతురు ఇలాగేనా ఉండాల్సింది? మొగలి రేకులతో జడ వేసుకోవద్దూ?’’
‘‘గంగిరెద్దల్లే అలంకరించుకొని రాణివాసం నుంచి బయలుదేరితే చూసేవాళ్ళు అభిసారికనని అనుకోరూ? అయినా నాకు అంత తీరుబడీ లేదు, సేవికలూ లేరు!’’
‘‘కోపమెందుకే కోమలాంగీ! కాసిని పూలు తలలో తురమనా?’’ అని వీరభద్రుడు దోసెడు సంపెంగలు తీసుకొచ్చాడు.
సరస్వతి నవ్వుతూ ‘‘నా నెత్తిన పోస్తారా ఏం? వాటిని మాల కడితే జడలో ముడుచుకోవచ్చు!’’ అన్నది.
‘‘మాల కట్టేదా?’’
‘‘రాత్రి రవికె కుట్టారుగా! రాణివాసానికి జేరేలోగా సగానికి పైగా కుట్లు విడిపోయినవి. సూది దారం ఇవ్వండి.. నేనే మాలగా కడతాను.. అన్నట్లు ఈ సంపెంగలంటే మీకు ఎక్కువ ఇష్టమా?’’ అన్నదామె, ఆ చివరి ప్రశ్నతో తన ఊహ ఎంత సరైనదో తెలుసుకుందామని.
‘‘ఇదివరకు అంత ఎక్కువ ఇష్టం కాదు. కాని రాత్రి నీతో పరిచయమయ్యాక సంపెంగలంటే చెప్పలేంత ఇష్టమైంది!’’
తనకీ పూలు ఎంతో ఇష్టమని సూచనమాత్రంగా కూడా వీరభద్రునికి తెలిసే అవకాశం లేదు. మరి అతను ఎలా గ్రహించాడు? తన తోడి పరిచయానికీ, సంపెంగలకూ సంబంధమేమిటో సరస్వతికి బోధపడలేదు.
తను పురుషద్వేషి కనుకా, సంపెంగ మీద తుమ్మెద వాలదు కనుకా, పరోక్షంగా, వేరొక రూపాన తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూన్న కారణాన తనకు సంపెంగంటే ఎంతో ఇష్టం! ఇప్పుడు తుమ్మెద వాలటం మాత్రమే కాదు; మధువును గ్రోలుతూ, అంత మధువునూ తనకు అందించింది. పూర్వ కారణాలను ఈ అనుభవం రూపుమాపినా, చిరకాలంగా ఇష్టమైనదాన్ని ఒక్కసారిగా తుడిచివేయలేకా, సమ్మోహనంగా వున్న సంపెంగ వాసనలను మరువలేకా, ఆ ప్రీతిని తగ్గించుకోలేకపోయింది.
మరి ఈ వీరభద్రుడు చెప్పే కారణమేమిటో?
‘‘అంటే ఏమిటో విశదీకరించండి’’ అన్నదామె.
‘‘అంటేనా! నీ ముక్కు సరిగ్గా సంపెంగ పూవు ఆకారంలోనే వున్నదని నీకెప్పుడూ తోచలేదా?’’
‘‘అందుకని ఇన్ని ముక్కులు ఒకేసారి కోయించి తెచ్చారా? వీటన్నిటికీ జలుబు చేస్తే ఈ కొంపంతా చీమిడిమయమైపోతుందని మీకెప్పుడూ తోచలేదా? అని పగలబడి నవ్విందామె.
‘‘ఆ పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాంలే!’’ అని వీరభద్రుడు సావిట్లోకి వెళ్ళి సూదీ దారం తెచ్చి, ఆమెకు అందించాడు.
ఆమె సంగపెంగ పూలమాలను తయారుచేస్తూ ఉంటే వీరభద్రుడు నిశితంగా పరిశీలించి, ‘‘అమ్మ దొంగా! కుట్టుపని పట్టు తప్పిందని రాత్రి నా చేత రవికె కుట్టించుకుని, ఇప్పుడేమో నీ కౌశలాన్ని ప్రదర్శిస్తున్నావా?’’ అన్నాడు.
‘‘పూలు గుచ్చటం వేరూ- రవిక కుట్టడం వేరూను!’’
సరస్వతి మాలను తయారుచేసి వీరభద్రుని చేతికి ఇవ్వటానికి మారుగా, దాన్ని అతని మెడలో వేసింది.
వీరభద్రుడు పరవశుడైపోయి, మెడలోని పూలమాల తీసి సరస్వతి జడలో తురిమాడు. ఆ తరువాత గంధపు గినె్న తెచ్చి ఆమె కంఠానికీ, మెడకూ గంధం రాసాడు.
‘‘ఇదంతా ఎండుతే తప్ప రాదు!’’
‘‘తెల్లారే లోపల మన ఇద్దరి ప్రణయపు వేడికీ ఎండి తొడుగులు తొడులుగా ఊడివస్తుందిలే!’’ అని వీరభద్రుడు ధైర్యం చెప్పాడామెకు.
‘‘తాంబూలం సేవిస్తావా రాణీ?’’ అన్నాడతను.
‘‘్భజనానికి ముందే తాంబూలమా?’’ అని రాణి తన చేతికిచ్చిన బహుమతి విషయం గుర్తొచ్చి, బొడ్డులోనుంచి ఒక చిన్న మూట తీసి వీరభద్రునికి అందిస్తూ ‘‘నన్ను మాటిమాటికీ రాణి!’’ అనకండి. మా రాణి మీకు రుూ బహుమతి పంపింది. స్వీకరించండి!’’అన్నది.
‘‘ఇవ్వాళ కూడానా! మీ రాణికి నా మీద ఎంత అభిమానం!.. శ్రీకృష్ణార్పణం!’’ అని వీరభద్రుడు ఆ మూట అందుకొని, అందులోంచి ఒక సువర్ణ ముద్రిక తీసి సరస్వతి కొంగున కట్టబోయాడు.
‘‘ఇవాళ తమకా శ్రమ అవసరం లేదు. ఇక్కడికి బయలుదేరే ముందే రాణి నా కొంగున కట్టింది’’ అని సరస్వతి బొడ్డులోంచి కొంగు తీసి చూపింది.
‘‘అయితే రాణికి ఇదంతా చెప్పావన్నమాట?’’’
‘‘నేను చెప్పకుండానే ఆమె గ్రహించింది. అమాయకురాలైన ఆడపిల్లమీద అనవసరంగా చేయి చేసుకొని, ఆమె రవిక చింపినందుకు మిమ్ము కఠినంగా శిక్షిస్తానన్నది!’’’
‘‘అని నిన్ను పంపింది! సకలమర్యాదలతోనూ, శోభన మందిరానికి పంపుతూ, వరకట్నం కూడా సమర్పించుకొని, నిన్ను సరిగ్గా ఏలుకోమని ఆదేశించింది. ఔనా?’’
‘‘రాణి ఎంత దయామయురాలో కోపమొస్తే అంత కఠినురాలు. ఇంకోసారి ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే ఆమె మిమ్ము తప్పక శిక్షిస్తుంది. ఈసారికి క్షమించమని నేను కాళ్ళావేళ్ళా పడి బతిమాలుతే అతి కష్టంమీద మన్నించిందని గ్రహించండి!’’
ఈ వేడిలోనే రాణి సంగతి హెచ్చరిస్తే బాగుంటుందా అని సరస్వతి ఆలోచించసాగింది.
‘‘మీ రాణి గొడవ ఇప్పుడొద్దు’’ అని వీరభద్రుడు అనేప్పటికి, తన మనసులో మెదిలిన ఊహ ఇతనెలా గ్రహించడా అని సరస్వతి ఆశ్చర్యపడింది.
‘‘తెల్లవారు జాము ఆ కొలుపుకు ప్రత్యేకించబడింది!’’ అని వీరభద్రుడు హెచ్చరించాడు. ఆ ఆశనే సరస్వతి పదిలపరచుకున్నది.
కామోపశమనానంతరం విరామ కాలంలో వీరభద్రుడు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు తప్ప తన రాణి విషయాన్ని వీనులకు సోకనీయడని నిశ్చయంగా తెలిసివుండీ, ఇప్పుడే దాన్ని ప్రస్తావించి ఒక్కమాటలో తుడిచి పారేసే అవకాశాన్ని అతనికి ఇవ్వటం ఎంత మాత్రమూ ఉచితం కాదని ఖచ్చితంగా తెలిసిపోయిందామెకు. అతని ఇష్టప్రకారమే కానివ్వటం శ్రేయస్కరం కూడానూ.
‘‘పాపం! ఆకలేస్తోందేమో! భోజనం చేద్దామా?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘అప్పుడే వంట కూడా చేశారా?’’
‘‘చెయ్యొద్దూ మరి? మా ఆవిడకేమో రాణివాసంలో ఉద్యోగమాయె! ఉద్యోగస్తురాలు ఇంటికి వచ్చేప్పటికి నిరుద్యోగి భర్త వంటా, వార్పూ పూర్తిచేయకుంటే సంపాదనాపరురాలు అధికారాన్ని చెలాయించదూ?.. నా వంట రుచి చూద్దువుకాని రా.. ఒక్కటే లోపం. మీ మాంసాహారాలు ఇక్కడ దొరకవు. అయితే శాఖాహారాలు మాత్రమే తక్కువ రుచా? ఇక మాంసమంటావా నీకు ప్రియాతి ప్రియమైన నా మాంసమే ఖండించి నోటి కందించి తృప్తిపరుస్తానని హామీ ఇస్తున్నాను!’’ అని వీరభద్రుడు ఆమె చేయి పట్టుకొని, నిలవేసి నడుం చుట్టూ చేయి వేసి జాగ్రత్తగా వంటింటివైపు నడిపించుకొని వెళ్ళాడు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు