డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్
ప్రారంభం
***

చినారు వృక్షాలు కాశ్మీర్‌కి నిత్య వసంతాన్నిస్తాయి. అసలు ఇవి ఎప్పటికి వాడిపోవు.. ఎండిపోవు.. కాని.. కాని.. భూతల స్వర్గం అయిన కాశ్మీరులో నిత్యం శోభించే ఈ చినార్ వృక్షాలు ఎండిపోతున్నాయి. కారణం? కాశ్మీరు సౌందర్యం ఒక్క భారతీయులనే కాదు సమస్త ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కాని.. ఈనాడు.. ఒకనాటి ఉద్యానవనం, భూతల స్వర్గం, మరుభూమిగా మారిపోతోంది.
కలలు- ఆకాశం ఎత్తున
‘‘నా జీవితం భారత రాష్టప్రతి పేరున అంకితం. నేను భారతదేశానికి, భారతీయ కాన్సిట్యూషన్‌కి అంకితం. దానికోసమే బతుకుతాను.. దానికోసమే చస్తాను.. నాకోసం నేను చేయవలసినదంతా చివరికి ఆలోచిస్తాను’’.
ఆ రోజు అతడు డెహరాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్‌లో చివరన స్నేహితులమధ్య క్యాప్ ఎత్తి దింపుతూ ఈ శపథం చేశాడు.
నిజంగా అతడు ఎంత పవిత్రంగా ఈ జీవితాన్ని స్వీకరించాడు. సైన్యంలో ఎంతో భక్తిశ్రద్ధలతో చేరాడు. ఒ్యజూజళూ ని ఘౄ ఇ్యశ, ఒ్యజూజళూ జ ఒ్ద్ఘ జూజళ ఆ రోజుల్లో అతడు ఇదే నినాదం చేసేవాడు. లోపల శక్తిని పెంచుకోవడానికి ఎంతగానో లీనం అయి ఈ మాటలు అనేవాడు.
ఏకాంతంలో తనలో తను మునిగిపోయినవేళ.. సుఖ దుఃఖాలు.. స్వప్నాలు.. దుస్వప్నాలు.. సన్మానాలు.. అవమానాలు- అన్నీ అన్నీ ఒక గారడీలాగా.. కాని ఇప్పుడు ఏదో జానపద కథలా అనిపిస్తోంది. గగురుపొడిచేలా.. అద్భుతం.. నమ్మలేని ఆ జీవితం.
అతడి పెదిమలపై చిరునవ్వు. అతడిలో ఆలోచనా తరంగాలు లేస్తున్నాయి. ఆ కాలం.. అద్భుతమైనది.. ఆ రోజుల్లో నాన్నగారికి చేతినిండా పనే పని.. కాని తనకు ఇరవై నాల్గుగంటలు ఖాళీయే.. ఖాళీ.. కలలే.. కలలు.. తనమీద తనకి ఎంత నమ్మకం.. అంతేకాదు ప్రపంచంపైనా తనకెంతో నమ్మకం.. ఉఫ్.. ఇండియన్ ఆర్మీలో చేరి తను ఇంటిల్లిపాదిని భయపెట్టాడు.. ఏడిపించాడు.
కారణం..
కలలతో ఆటలాడుకునే రోజులు అవి.. ఒక ప్రకటన.. ఒకే ఒక ప్రకటన.. అంతే చూస్తూ చూస్తూ ఉంటే మొత్తం తారుమారయింది.
ఈ ప్రకటనను తను టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొదటి పేజీలో చూశాడు. నిజంగా ఎంత అద్భుతమైన ఉదయం అది.. తను శక్తితో, స్ఫూర్తితో కలపండుతోందన్న ఆశతో చదివాడు.. నేషన్ నీడ్స్ యూ.. యువకులు ఆర్మీలో జాయిన్ కావాలి అని కూడా అందులో వుంది. రైఫిల్స్ పట్టుకున్న ఇద్దరు సైనికులు... ఆ చిత్రం చూసేసరికి తను ఆఘమేఘాలమీద తేలాడు. రంగుల కలలలో తేలియాడాడు. సైనికుడు అంటే అతడి దృష్టిలో ఒక పెద్ద హీరో.. నేషన్ నీడ్స్ యూ.. దేశానికి తన ఆవశ్యకత ఉంది. నలువైపులా ఈ మాటలు ప్రతిధ్వనించాయి.
ఒకవైపు పద్దెనిమిది సంవత్సరాల వయసు. కలలలో తేలియాడే వయస్సు.. మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకటన. తను దేనికోసం అనే్వషిస్తున్నాడో అది అతడికి దొరికింది అని అనిపించింది. ఒక రహస్యమయిన లోకం పిలుస్తోంది.. రా.. రా.. నా దగ్గరికి రా...
నిజానికి ఆ క్షణాలకు ఎంత శక్తి ఉండేది. అసలు ఆ మంత్రాన్ని (తన కల, తన సంకల్పం) ఎవరు చంపలేకపోయారు. కుటుంబం మొత్తం ఏమీ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు తను ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. తను ఒక సైనికుడు కావాలి. తను ఎన్నో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాశాడు. ఇక ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు వస్తాయి..
ఈ ప్రకటన చదివాడు తను. నిజంగా ఎంతో మంచి జరిగింది.
తన తండ్రి వ్యాపారి.. తను మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి డిగ్రీ పొంది సొంత ఫ్యాక్టరీ తెరవాలని, లేకపోతే ఈవినింగ్ కాలేజీలో చేరి చదువుకుంటూ తన వ్యాపారానికి చేదోడు... వాదోడుగా ఉంటూ మూడు పువ్వులు ఆరు కాయలుగా చేయాలి.. ఆయన కోరిక.

- ఇంకా ఉంది

టి.సి.వసంత