డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తననుగూర్చి తానే తెలుసుకోలేని అధోగతిలో ఉన్నపుడు, క్లియోపాత్రా తన స్థితిని తనకు అర్థం చేస్తోంది. అందుకనే తనమీద తాను జాలిపడుతున్నాడు!
‘‘ప్రభూ! మీరెంత మనోవేదనకు గురై ఉంటారో ఇపుడే తెలుసుకుంటున్నాను. తన పట్ల నేను ఎంత అపచారం చేశానో కూడా అర్థమైంది. మీ నీడలో బతకవలసినదాన్ని. నన్ను క్షమించండి.. మీ విశాల హృదయంలో నాకు తావు కల్పించండి. ఈ జన్మకు నేను కోరదగిన వరమంటూ మరేమీ ఉండదు’’.
ఈ మాట్లాడేది ఈజిప్టు మహారాణి క్లియోపాత్రాయేనా అనిపించిందతనికి. తనమీద ఈమెకు ఇంత అనురాగం, సానుభూతి, గౌరవం వుంటుందని ఇదివరకెన్నడూ అనుకోలేదు. మాటల అర్థానికి తోడుగా ఆమె కంఠస్వరంలో ధ్వనించే దైన్యానికి అతను కరిగిపొయ్యాడు.
క్లియోపాత్రా మనసు తెలసుకోలేక వారాల తరబడి తానీ బందిఖానాలో మగ్గిపొయ్యాడు. ఇపుడు తలుచుకుంటే, తనకు తాను చేసుకున్న అన్యాయం కన్న, తననే నమ్ముకొన్న తన పత్ని క్లియోపాత్రా పట్ల జరిపిన అత్యాచారానికి మరింత దుఃఖపడ్డాడు. అప్రయత్నంగా అతని కన్నులనుంచి నీరు కారనారంభించింది.
క్లియోపాత్రా అతని కన్నుల్ని తుడుస్తూ ‘‘ఏమిటిది? మీరు జీవితంలో ఇంత అధైర్యపడిపోతారనుకోలేదు. ఆడదాన్ని, నేను పిరికిపడటం సహజం. నన్ను ఊరడించవలసిన మీరు కన్నులు తడి చేసుకోవటమేమిటి? స్వామీ! ఈ ప్రపంచమే అంత! బైటి ప్రపంచంలో ఏదో ఉన్నదని భ్రమపడతాం. కాని, మన ప్రపంచాన్ని మనం సృష్టించుకున్నట్లయితే ఈ బాధలుండవు కదా!’’ అన్నది.
తాను కూడా ఇన్నాళ్ళూ నలుమూలలా అనే్వషిస్తున్నాడు- మనశ్శాంతి దొరుకుతుందేమోనని! వేదాంత గ్రంథాలు చదివినంతసేపే, ఈ ప్రపంచమంతా మిథ్య అనే వాదాన్ని ఒప్పుకోవటం జరుగుతోంది. ఆ పుస్తకాలను మూయగానే తిరిగి దైనందిన సమస్యలన్నీ తన చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి, వాటినొక క్రమంలోకి సర్దుకొని, భేదించలేక సతమతవౌతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్లియోపాత్రా తన బాధలన్నిటికీ ప్రక్రియలు కనిపెట్టినట్లే మాట్లడుతోంది.
‘‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత జీవితం గడిచిపోయిందోననీ, ఎంతకాలం వృథా చేశానేమోనని అనిపిస్తుంది. అతి స్వల్ప విషయాల కోసం మనం వెధవ పట్టుదలతో మూర్ఖంగా ఎంతెంత దూరం వెళ్లి, ఎన్ని దివ్యానుభవాలను వదులుకున్నామో ఆలోచిస్తే, ఎంత బాధ కలుగుతుంది..
అలా ఆలోచిస్తూ కూర్చోవటం కన్నా, ఇక మిగిలిన కొద్దికాలాన్నన్నా అనుభవించటం ఉత్తమ మార్గమని తోచక తప్పదు. గడిచిపోయిన నిన్నటి రోజును గూర్చి విచారం దేనికి? తెల్లవారుతే కాని రాని రేపటిని గూర్చిన చింత ఎందుకు? అందుబాటులో వున్న ఈనాటిని మనం ఏం చేస్తున్నాం? చివరకు జీవితసారమంతా ఇంతకన్నా ఇంకేమున్నది?’’
క్లియోపాత్రా ఎంతెంత లోతులకు వెళ్లి ఆలోచించి, ఈ కొత్త సిద్ధాంతాలను కనిపెట్టగలిగిందోననిపించిందతనికి. ఆమె మాట్లాడే ప్రతి మాటలోనూ నిగూఢ సత్యం తప్ప, మరేమీ ఉండేందుకు వీల్లేనట్లే తోచింది. అధఃపాతాళానికి కుంగిపోయిన నేను కేవలం మాటలతోనే భూమట్టానికి లాగిందీమె.
జీవితమంటే తాను రుూమధ్య కొత్తగా ఏర్పరచుకున్న దృక్పథాలు ఆమె పలుకుల పదునుకు పటాపంచలైనవి. వాటి స్థానే తనకు ప్రత్యేకమైన దృష్టంతా పోయి, క్లియోపాత్రా కన్నుల ద్వారానే ప్రపంచాన్ని చూసి, అర్థం చేసుకోగలుగుతున్నాడు! ఈ కొత్త చూపులో ఎంత వెలుగు, ఎంత ధైర్యం, ఎంత ఆనందం ఉన్నవో! ఇక ఈమెతోడి అనుభవాలతో తాను ఆకాశపుటంచులక్కూడా ఎగరగలదు!
ఈ అందాల రాశిని, విజ్ఞాన ఖనిని తానిదవరకెన్నడూ చూడలేదు! ఎన్నో జన్మల అనుభవమున్నదానివలె మాట్లాడుతూంటే, ఏంటనీ తత్తరపడ్డాడు. తాను బాగా చదువుకున్నవాడిననే గర్వం ఉండేది; క్లియోపాత్రా చిన్నతనంలో మాత్రమే విద్యాభ్యాసం చేసింది. కాని ఆమె గ్రంథ పఠనం పట్ల ఆసక్తి చూపగా తానెన్నడూ గమనించలేదు.
అలాంటిది తనకు దొరకని అనేక సత్యాలను, ఈమె లోకమనే పుస్తకంలో చదివి, విప్పి పారేసి, సారాన్ని మాత్రమే అందించగల రాజహంసవలె కన్పట్టింది. ఈమె ఎవరో కాదు- తన భార్య అనే మాట జ్ఞాపకం రాగానే, తనకన్న అదృష్టవంతుడు ఈ భూభాగంమీద ఎలా ఉండగలడో అంతుపట్టలేతనికి.
నీరసంగా పడుకున్నవాడల్లా క్రమంగా లేచి కూర్చునేవరకూ వచ్చాడు. కొత్త జీవశక్తులెన్నో శరీరంలో సంచలనాన్ని కలిగిస్తూన్నవి. విద్యుత్ ప్రవాహంతో అతను ఊగిపోతున్నాడు. లోకమంటే తనేం చూశాడు? ఇప్పుడీమె వర్ణిస్తూంటే, వివరిస్తూంటే ‘ఇదే కదా ప్రపంచం’ అనుకుంటున్నాడు.
‘‘స్వామీ! ఏమిటలా పిచ్చిగా చూస్తారు? నేను మీ భార్యను. క్లియోపాత్రాను. మిమ్ము సుఖపెట్టి, నేను సుఖపడదామనే సదుద్దేశ్యంతో మీ దగ్గరికి వచ్చాను. వెనుకటి విషయాలేవీ ఇపుడు నా మనసులో లేవు. నన్ను నేను దహించుకొని, పునర్జన్మను పొందాను. నన్ను స్వీకరించమని ప్రార్థిస్తున్నాను!’’ అన్నదామె.
ఏంటనీ ఇక ఆగలేకపొయ్యాడు. ఇందాకట్నుంచీ మాట్లాడదామని విశ్వప్రయత్నం చేశాడు. కాని ఈమె ముందు మాట్లాడేది ఏమీ లేదని తెలుసుకుంటున్నాడు. తను వ్ఢ్యౌంలో పడి కొట్టుకొనిపోకుండా ఈమె అడ్డుపడి రక్షించింది.
‘‘రాణీ!’’ అని పెద్ద కేక వేశాడతను. పరవశుడై సంస్కారాన్ని కూడా మరిచిపోయి, రాజభవనాల్లో వినరాని కంఠస్వరాన్ని ఉపయోగించాడు.
ఆమె నవ్వింది. ఆ నవ్వులో వెనె్నల వెలుగూ, చల్లదనమూ వెదజల్లింది.
‘‘ప్రియా!’’ అన్నాడు ఏంటనీ గొప్ప రహస్యం మాట్లాడుతూన్నంత తక్కువ స్థాయిలో. ‘‘నన్ను క్షమించు! నీ మనసు తెలుసుకోలేకపోయాను. మన ప్రపంచాన్ని పాడుచేసిన దుష్టశక్తుల్ని దూర తీరాలకు తరిమివేస్తున్నాను. నా రాణీ! నీవు లేనట్లయితే, నేను ఎక్కడుండేవాణ్ణి?... ఎలా జీవించి ఉండేవాణ్ణి?... ఇపుడా సంగతులెందుకు?’’ మాటలు తడబడుతున్నవి. ఆమెను గాఢంగా కావలించుకున్నాడు. క్షీర నీర న్యాయంగా ఆమె అతనిలో కరిగిపోయింది.
‘‘రాణీ! మనిద్దరం ఇలాగే ఏక కౌగిలిలో చనిపోతే?’’ అన్నాడు ఏంటనీ.
‘‘అంతకన్నా అదృష్టం మరేమీ ఉండగలదు ప్రభూ! జీవితం మనిద్దర్నీ కలిపి, ఏక వ్యక్తిత్వంతో పోత పోసింది. మృత్యువు కరుణించి ఏక శరీరులుగానే తనలో లీనం చేసుకుంటే, ఆచంద్ర తారార్కం మన ప్రణయగాథ జీవిస్తుంది; దాంతోపాటు మన ఆత్మలు కూడా జీవిస్తవి గదా!’’
‘‘ఇక ఆ రాత్రి వారు ఎనె్నన్ని కొత్త విషయాలు మాట్లాడారో, జీవితాన్ని గూర్చిన కొత్త సిద్ధాంతాలను కనుగొన్నారో, లేక ఎంత పిచ్చిగా వాగారో, వాటి అర్థాలూ, తాత్పర్యాలేమిటో వ్రాయటం ఈ కథకు అప్రస్తుతం అవుతుంది కనుక, వొదిలేస్తున్నాము.
***
మధువుకు తోడుగా, క్లియోపాత్రా అనురాగ సుధ కూడా కలిపిన తరువాత, జీవితమే పూలబాటయిందతనికి. తనకు సుఖసౌఖ్యాలు ఎక్కడున్నవో ఆ జీవితమే కావాలని కోరుకోవటం మానవ సహజం. ఏంటనీ రాజకీయాలనే మరిచిపొయ్యేందుకు ప్రయత్నించాడు. ప్రణయమొక ఘోర తపస్సనే భావనలో వున్నట్లే ప్రవర్తిస్తున్నాడు.
రోజులు గడుస్తున్నవి. క్లియోపాత్రా ఒక పక్క ఏంటనీ సమక్షంలో వుంటూ, తన జీవిత పరమావధి కూడా ప్రణయారాధనేని అతన్ని నమ్మిస్తూ, రెండోవైపున సైన్యాలను సమీకరిస్తోంది. తన దేశంలోగాక, ఇతర దేశాలు- ఆర్మీనియా, మెడియా, సిరియా, సైప్రస్- మొదలైన భూఖండాలలో కూడా సైనికులను జేర్పిస్తూ, వారికి తగిన శిక్షణలను ఇప్పిస్తోంది.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు