డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు..2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
కాని.. కాని.. తన కలలు వేరు.. ఆయన కోరికలు తన రంగుల కలలకు ఎంతో భిన్నంగా వున్నాయి. తండ్రిలా దుకాణంలో కూర్చుని ఇత్తడి సామాన్లను తూస్తూ జీవితాన్ని గడపాలని తనకు ఎంతమాత్రం లేదు. అసలు అదీ ఒక జీవితము! ఊహ కానే కాదు. జీవితంలో ఏదైనా విప్లవం అయినా తేవాలి. ఏదైనా మిషన్.. ఏదైనా కల... ఏదో ఒక ఉద్దేశ్యం.. ఆదర్శం ఉండాలి. అసలు జీవితానికి ఈ అలంకారాలన్నీ కావాలి. అప్పుడే జన్మధన్యం అవుతుంది.
తన తండ్రి, తన పెదనాన్న జీవితాలు ఈ వ్యాపారంలోనే గడిచిపోతున్నాయి. కాని తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆ ఇత్తడి గినె్నలు.. ఆ త్రాసులు.. ఆ దుకాణాలు.. ఆ గిరాకీలు.. తమ తండ్రి దుకాణంలో కూర్చుని ఇత్తడి గినె్నలు తూస్తూ ఉంటే చూసి తను ఎన్నోసార్లు ఆయన జీవితంలో ఏదో ఖాళీ ఉందని తను ఎన్నోసార్లు అనుకునేవాడు. అన్నీ ఉన్నాయి.. వడ్డించిన విస్తరి ఆయన జీవితం.. కాని ఏదో లోపం ఉంది. అది పరిమళం లేని జీవితం.. జీవితం ఉంది కాని స్పందన లేదు. కేవలం కీ ఇచ్చిన బొమ్మలా జీవించడం అదో జీవితము! స్పందన లేని జీవితం. సగం సగం జీవితం నుండి, సరిగమలు లేని జీవితం నుండి తనకు విముక్తి కలిగించేది సిపాయి జీవితమే. కేవలం మిలటరీ జీవితమే.. సైనిక్ అన్న శబ్దంలోనే సంగీతం వుంది. కావ్య జగత్తు ఉంది. అందుకే ఇంట్లోవాళ్లకి చెప్పకుండా, స్నేహితుల దగ్గర డబ్బులు అప్పు తీసుకుని తను ఫారమ్ నింపాడు.
ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. అలహాబాద్‌కి రమ్మనమని పిలిచారు. అంతే ఇంట్లో భూకంపం వచ్చింది.
అమ్మ అవాక్కయిపోయింది.
నాన్నగారు కళ్ళెర్ర చేశారు. చేతిలో భారతీయ సైన్యానికి సంబంధించిన ఉత్తరం కాదు.. చనిపోయి చల్లబడిన పాము చేతిలో ఉన్నట్లుగా పెద్దగా కేకలు వేశారు.
‘‘ఏమిట్రా! ఇదేం వేళాకోళంరా!’’ ఇంటర్వ్యూ లెటర్‌ని నాలుగువైపులా పరీక్షగా చూస్తూ నాన్న అన్నారు.
పద్ధెనిమిది సం.ల వయసులో ఉన్న యువకుడు, నూనూగు మీసాల నూతన వనడు తను. ఉరకలు వేసే వయస్సు. తనలో ఆత్మవిశ్వాసం.. గర్వం.. రాళ్ళను పిండికొట్టగల శక్తిగలవాడు. ధైర్యశాలి... ‘‘నాన్నగారూ! ఇది వేళాకోళం ఎంతమాత్రం కాదు. ఇది నా కల నాన్నగారూ! నాకల.. సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఆర్మీయే నా కల.
ఏమిటి? తండ్రికి భూమి గిరగిరా తిరుగుతున్నట్లుగా అనిపించింది. తను విన్నది పెద్ద కొడుకు సందీప్ అన్నమాటలేనా! ‘నేను నిర్ణయించుకున్నాను’ అని అంటున్నాడా? నిన్నటిదాకా అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు, బొందీ కూడా సరిగ్గా కట్టుకోవడం రానివాడు. ఇవాళ ‘నేను నిర్ణయం తీసుకున్నాను అని అంటున్నాడా!’ ఆయనకి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. చెవులు ఘడియలు పడుతున్నట్లుగా అనిపించింది. కమీజు గుండీలు పెట్టబోతూ ఆగిపోయాడు. ఆయాసం వచ్చింది. అయినా ఏదో విధంగా తనను తాను సంబాళించుకుని అన్నాడు- ‘‘ఎందుకు?’’
‘‘ఎందుకంటే దేశానికి నా అవసరం ఉంది. నాకు మిలటరీ అవసరం ఉంది. ఎందుకంటే నా కలలు ఆర్మీలలోనే ఊపిరి పీల్చుకుంటాయి. కేవలం సైనికుడిగా బతకాలనే నా ఉద్దేశ్యం. నేను ఒకవేళ మరేదైనా ఫీల్డుకి వెళితే నా కలలు చచ్చిపోతాయి. ఊపిరి ఆడక చచ్చిపోతాయి. నా కలలు పండేది మిలటరీలోనే’’
‘ఏమిటి?’ శేఖర్‌బాబు నిశే్చష్టులయ్యారు. అసలు ఇట్లా కూడా ఎవరైనా ఆలోచిస్తారా! దేశానికి వీడి అవసరం ఉందా! అంటే అమ్మ-నాన్నలకు అవసరం లేదా? వేలెడంత లేడు, వీడికి ఇంత ధైర్యమా! కొడుకు వైపు ఆయన ప్రేమగాచూసారు. ఇంతలో మైండ్ అసలు సంగతేమిటో ఇంకా బలంగా అడుగు అని సిగ్నల్ ఇచ్చింది.
‘ఏవిటిరా! నీకు మిలటరీ గురించి ఏం తెలుసునని? అసలు ఏ సైనికుడితోనైనా పరిచయం ఉందా! ఎంత కఠోరమైన జీవితం వాళ్ళది. ఒక మిలటరీ ఆఫీసర్‌కి ఎంత జీతం దొరుకుతుందో తెలుసా! నాకు తెలిసిన ఒక వ్యాపారి మేనల్లుడు ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో నీకు పరిచయం చేస్తాను. తనకు కూతురు పుడితే ఏడాదిన్నర వరకు అసలు తన పిల్లను చూడలేకపోయాడు. అసలు సెలవు దొరికితేగా.. పది సంవత్సరాలు మిలటరీలో పనిచేసినా వాళ్ళ నాన్న ఒక నెలలో సంపాదించే సంపాదనంత అయినా ప్రభుత్వం అతడికి ఇవ్వదు. నువ్వు ధనానికి విలువ ఇవ్వవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఈతిబాధలు పడలేదు. నీకు ఏ లోటు లేదు. అందుకే నీకు కష్టాలు కన్నీళ్ళు తెలియవు. మెతుకు మెతుకు కోసం ఎంత కష్టపడాలో నీకేం తెలుసు. మెతుకు పోతే బతుకు పోతుందన్న దృష్టితో మేం కష్టపడ్డాం. నీకు ఎటువంటి కష్టం లేదు. ఇప్పుడు మనం ఇంత సుఖంగా బతుకుతున్నాం.

- ఇంకా ఉంది

టి.సి.వసంత