డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
చరిత్రలోని ఏవేవో కన్నీటిగాథలు తన మనస్సుని తొలిచివేస్తున్నాయి. మానవ నాగరికత పుస్తకంలోని ఆ నల్లటి పుట. తమ భావితరం తమలాగా బానిసలుగా బతకవద్దన్న ఉద్దేశ్యంతో తరతరాల నుండి బానిసలుగా బతకుతున్న నీగ్రో తల్లులు స్వయంగా కొత్తగా పుట్టిన, ముక్కుపచ్చలారని తమ బిడ్డలను చంపేసేవారు. కాలం మారింది కాని మానవుడి దుర్భర జీవితం, వాడి కర్మ ఇంకా ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉన్నాయి. మారుతున్న కాలంతోపాటు మనిషిలో మానవత్వం పెరగాలి. వాడు మనిషిగా బతకాలి.. కాని .. కాని ఆ ఆర్తనాదాలు.. హాహారాలు.. ఏడుపులు.. పెడబొబ్బలు.. సభ్య సమాజం తలవంచుకునేలా జరుగుతున్న మారణహోమం..
ఆలోచనా తరంగాలలో మునిగిపోయిన సందీప్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. జమీల్ అమీ గొణుక్కుంటోంది. ఏదో మాట్లాడుతోంది. ఆవిడ కాశ్మీరీ భాషలో తన వ్యథను వ్యక్తం చేస్తోంది. గుండెలను చీల్చుకుంటూ మాటలు వెలువడ్డాయి. ‘‘ఉహూ.. నా కొడుకు చావలేదు. వాడిని నేనే చంపించాను. వాడు తన తల్లిని కలుసుకోవడానికి వచ్చాడు.. నా ఒడిలో నిద్రపోవడానికి వచ్చాడు. అమ్మ చేతి వంట తినడానికి వచ్చాడు. కాని కాని నేను... మళ్లీ ఒకసారి ఆమె పిచ్చిదానిలా అరవడం మొదలుపెట్టింది. చాలాసేపటికి ఆమె ఈ లోకంలోకి వచ్చింది.
తన అంతరంగంలో తనను నిలువనీయకుండా చేసే అలజడి, యుగ యుగాలనుండి సంచితమైన దుఃఖం పెల్లుబుకుతోంది. తను ఆర్మీ వాళ్లతో కాశ్మీరంలో శాంతి నెలకొల్పాలంటే జమీల్ లాంటి జిహాదీలు ఉండకూడదు అని ఎన్నోసార్లు అన్నాడు. అసలు మా ఇద్దరి అస్తిత్వం ఉందా అన్న ప్రశ్న మా ఇద్దరి ఎదురుగుండా ఉంది.
మరోమాట చెప్పాలి. ఈ భయంకరమైన సమయంలో జరిగిన నాటకాన్ని ఎప్పుడైనా గుర్తుచేసుకుంటే సంపూర్ణంగా గుర్తుచేసుకుంటాను. దివ్యలాంటి ఎందరో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, హింస, క్రూరకృత్యాలు కన్నీళ్లను కూడా గుర్తుచేసుకుంటాను.
దివ్య మేజర్ మహేష్ భట్ భార్య. అప్పుడే కొత్తగా పెళ్లైంది. ఇరవై రోజుల క్రితం వచ్చినపుడు ఝాలమ్ నదిలా గలగలా పారుతూ తూగుతూ తుళ్లుతూ కిల కిలా నవ్వుతూ వుండేది. కాని ఆ రోజు భయపడి బాధపడి నిర్జీవంగా తయారయింది. వాడిపోయిన ముఖం, ఉబ్బిన కళ్లు. ఆమెని వెంటనే పుట్టింటికి పంపాల్సి వచ్చింది. కనీసం ఒక్కరోజైనా భర్తతో పాటు ఉండగల అవకాశం ఉండి ఉంటే ఆమెకీ దుర్భర పరిస్థితి ఏర్పడేది కాదు. కాని మేజర్ మహేష్ ఏం చేయగలుగుతాడు? కొత్తగా పెళ్లైంది. రంగుల కలలు, 24 గంటలు డ్యూటీ. సి.వో ప్రతీ మూడో రోజు మహేష్‌ను ఏదో ఒక ఆపరేషన్ కోసం పంపించేవాడు. ఇంతలో ఆ లోయలో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయి. రాళ్ళు రువ్వడం, పెద్ద పెద్దగా అరవడం, రోడ్లన్నీ జామ్ చేయడం, బాంబుల వర్షం కురిపించడం జరుగుతూనే ఉన్నాయి. పైఆఫీసర్ల ఒత్తిడివలన తన వ్యక్తిగతమైన ఏ పనిని చేయలేకపోతున్నాడు. దివ్య మాటిమాటికి ఫోన్లు చేస్తూనే వుంది. రండి.. పది నిమిషాల కోసం రండి. నా మనస్సేమీ బాగాలేదు రండి.. మేజర్ సి.వోతో మాట్లాడు. కాని సి.ఓ అసలు ఒక్క మాట అయినా వింటేగా! ఒక రోజు ఆమె రిస్క్ తీసుకుని మేజర్ కంపెనీ ఆఫీసుకి వచ్చింది. కాని సి.వో భర్తతో కలవనీయలేదు. ఆపరేషన్‌కి పంపించాడు. చివరికి నిరాశ చెందిన మేజర్ ఈ బాస్టర్డ్ సి.వోని షూట్ చేస్తానని, మిమ్మలందిరినీ పిచ్చివాళ్లుగా చేస్తున్నాడు అని అంటూ ఆర్.ఆర్. చీఫ్‌కి ఫోన్ చేశాడు. చీఫ్ వెంటనే ఆఫీసర్‌ని సంభాళించుకోమని కర్నల్ ఆర్యకి ఫోన్ చేశాడు. పరిస్థితులకారణంగా కర్నల్ భూషణ్ కాంప్‌ని నాన్ ఫామిలీ స్టేషన్‌గా డిక్లేర్ చేశాడు. అంటే భర్తలను కలుసుకోవడానికి అంతో ఇంతో అవకాశం ఇప్పుడు ఏ మాత్రం లేదు.
ఆర్మీ మిత్రులు మళ్లీ మళ్లీ నల్లకళ్లజోఢును పెట్టుకో అని అంటున్నారు.
భావుకత గల వ్యక్తికి జీవితం ప్రతీచోట ఆటుపోట్లకి గురవుతూనే వుంటుంది. అది ప్రశ్నలమయం. అసలు జీవించాలా! వద్దా!
జీవితం, మనిషి ఈ రెండింటి అనే్వషణలో తను ఆర్మీలో చేరాడు. మనిషికే ప్రాముఖ్యత ఇచ్చే ఆ జీవితం.. కాని ఇప్పుడు తనలోని మానవత్వాన్ని మంటకలుపుకోవాల్సి వచ్చింది.
అసలు ప్రశ్న ఏమిటంటే ఈ వినాశనానికి కారణం అయినవారికి కఠినశిక్ష పడుతుందా? రాజ్యం ఆడే ఈ ఆట అసలు ఎవరికి అర్థం అవుతుంది. మస్‌జిద్ రాజనీతి ఎవరికి అర్థం అవుతుంది? కాశ్మీరుల దుఃఖాన్ని వ్యాపారంగా మార్చి అంచెలంచెలుగా ఎదుగుతున్నవాళ్ల అసలు సత్యం బయటపడేదెప్పటికి? దారి తప్పుతున్న కాశ్మీరీ ఫియాదీన్ ఎప్పుడైనా అసలు సత్యాన్ని తెలుసుకోగలుగుతారా? ఈనాడు ప్రజలు రక్తపాతం జరిపేందుకు సిద్ధపడుతున్నారు కాని అసలు సత్యాన్ని తెలుసుకోవడంలేదు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత