డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అన్నయ్య!
సీమ ఒకటిన్నర నెల చైనాలో ఉండి భారతదేశానికివచ్చింది. ఆఫీసు వాళ్ళిచ్చిన ప్రాజెక్టు పనిమీద వెళ్లింది. రాగానే ఆమెను చూశాను. ఆమె ముఖంలో ఏ మాత్రం కళ లేకుండాపోయింది. మాటా మంతీ లేదు. ఎంతసేపు తన మంచంమీద పడుకుని ఫాన్ వంక చూస్తూ ఉండేది. ఏమయింది? నాకేం అర్థం కాలేదు. నాలో ఆందోళన ఎక్కువ అయింది. ఇరవై నాలుగు గంటలు పరుగుపెడుతూ ఒక్కొక్కసారి రోజులో ఫ్లైట్‌లో నాలుగు మహానగరాలను చూసే సీమ ఎందుకిట్లా ముభావంగా ఒకచోట పడి ఉంటోంది? ఏదైనా జరగకూడదని సంఘటన ఏమైనా జరిగిందా! నేను ఎన్నోసార్లు అడుగుదామని ప్రయత్నించాను. కాని ఆమె ముభావంగా ఉంది. ఏదో పోగొట్టుకున్నదానిలా నిరాశా నిస్పృహలతో-
మరునాడు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఫామిలీ డాక్టర్ వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళమన్నాడు. ఆమె సెరిబ్రెల్ ఎట్రోజీ రోగంతో బాధపడుతోందని చెప్పాడు. అంటే ఆమె మైండ్‌లో సెల్స్ డిజనరేట్ అవుతున్నాయి.
టెన్షన్‌వలన, ఈ ఉరుకులు పరుగులు, ఈ లైఫ్ స్టైల్, ఆధునిక సుఖాలు- వీటివలన యువతీ యువకులకు ఇటువంటి డిసీజ్ వస్తోందని డాక్టరు చెప్పాడు.
కాని అసలు మా ఇద్దరికి ఏ టెన్షన్ లేదు. మావి మంచి ఉద్యోగాలు.
‘ఈ అన్ నాచురల్ లైఫ్ స్టైల్ వలన, ముప్ఫై సంవత్సరాల వయస్సుకే ఈవిడకి మెనోపాజ్ వచ్చింది. ఇది ఆమెకు షాక్ కలిగించింది. అందుకే..’’ మళ్లీ డాక్టర్ అన్నాడు.
ఏం చెప్పను అన్నయ్యా! సీమ ప్రొఫైల్ చూడగానే నీవన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. ఇంతగా హైప్రొఫైల్ వున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని చెప్పావు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే, సమయం అంతా ఉరుకులు, పరుగులతో గడిపితే పిల్లలను పట్టించుకునే టైమ్ ఉండదు. ఏ నాథుడు పట్టించుకోకపోవడంవలన వాళ్లు చెడు మార్గాలు పడతారు. అన్నయ్య! పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. ఇక మాకు పిల్లలు పుట్టరు కనుక అమ్మ - నాన్నల ఆశలు నీపైనే ఉన్నాయి. అమ్మని నాయనమ్మని నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను అన్నయ్యా.
ఈమెయిల్ చదవగానే మనస్సు బరువెక్కింది. ప్రతిది ఈ ఇంట్లోనే జరగాలా? రెండో కోడలు ఎప్పుడు వస్తుందో! ఏమో! కాని ఆ కోడలి పట్ల ఎందుకిట్ల జరగాలి? మూడు పువ్వులు ఆరు కాయలుగా పండాల్సిన జీవితం.. తుదిలోనే ఎండిపోయింది. వసంతంతో నిండాల్సిన జీవితం శిశిరం అయిపోయిందా.. అయ్యో.. అయ్యో.. ఇందులో ఎవరిది అపరాధం? సీమ, సిద్ధార్థలకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాడు. లైఫ్ స్టైల్ మీద కాదు లైఫ్ మీద మనం దృష్టి నిలపాలి. ఇంతకుముందు తను ఒక ఆర్టికల్‌లో చదివాడు. ఈ కొత్త లైఫ్ స్టైల్ వలన యువకులు ఆ సమయంలో నపుంసకులు అయిపోతున్నారు. ఇదేనా కలియుగం? సమయానికి ముందే నదులు ఎండిపోతున్నాయి. చెరువులు లేకుండా పోతున్నాయి.
సందీప్‌కి రాత్రి అన్నం తినాలని అనిపించలేదు. బాస్‌ని రెండు రోజులు సెలవులు అడిగాడు. సిద్ధార్థని కలవడానికి ముంబయి బయలుదేరాడు.
***
అదే ఇల్లు.. అదే ముంబాయి.. అంతా అట్లాగే వుంది.
కాని అక్కడ ఇప్పుడు కలలు లేవు.
గాలి లేదు. ఎండ లేదు. చంద్రుడు లేడు.. ఆకాశం లేదు.
చెట్లమీద పక్షులు లేవు. గోడమీద బల్లులు లేవు.
సిద్ధార్థ సీమల జీవితాలలో పెను తుఫాను.
అంతటా ఉదాశీనత. ఎటువైపు చూసినా శూన్యం.
సందీప్ ఉత్సాహంగా ఏవేవో అందమైన ఆహ్లాదాన్ని ఇచ్చే కబుర్లు చెప్పకుందామనుకున్నాడు. కలలు, ఆశలు, ధైర్యం, విశ్వాసం.. అన్నీ అంతటా ఉన్నాయని అనుకున్నాడు. కాని.. కాని.. ఇప్పుడు ఇవన్నీ ఏ మూలన లేవు. అక్కడి వారి మనస్సులలో ఏ కోశాన లేవు. స్వప్నాలు వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి.
సందీప్ సీమతో మాట్లాడాలని అనుకున్నాడు. సహానుభూతి తెలపాలనుకున్నాడు. సీమపై ప్రేమ కురించి బాధపడవద్దని చెప్పాలనుకున్నాడు. కాని సంకోచం- పగలంతా మనస్సులో స్మృతుల పావురాలు ఎగురుతునే ఉన్నాయి. ఏదో విధంగా ఒక వారం గడిచిపోయింది. ఆ రోజు ఉదయం ఉదయంలా లేదు. సందీప్ తన నిద్ర - శాంతులను వాళ్లకిచ్చి అన్ని మంచిగానే జరుగుతాయి అంటూ యాంత్రికంగా ఆశీర్వాదాలు ఇచ్చి బయలుదేరాడు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత