డైలీ సీరియల్

బడబాగ్ని-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూడు మిస్టర్.. డాక్టర్ల దగ్గరా లాయర్ల దగ్గరా ఏ విషయం దాచకూడదు.. అది ఎంత చిన్న విషయమైనా.. ఎలాంటి విషయమైనా.. చెప్పు.. ఏదీ దాచకుండా చెబితేనే నేనేమైనా చేయగలిగేది..’’ అసహనంగా అన్నాడు భగవాన్...
‘‘వాడికి పెళ్లి నిశ్చయమైపోయింది.. వాళ్ల చుట్టాలమ్మాయే.. చిన్నప్పుడే అనుకున్న సంబంధం.. ఒకసారి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేడు కూడా...’’
‘‘ఐ సీ.. అయితే బహుశా ఆ పరంగా ఎటువంటి సమస్యా వుండే అవకాశం లేనట్లే..’’
‘‘.. అన్నట్లు.. మీ బెట్.. అదే మీరు అలా అర్ధరాత్రి బయలుదేరి వెళ్లిన విషయం ఇంకా ఎవరికైనా తెలుసా?...’’
‘‘తెలుసా అంటే... ఏమో సర్.. మేం ఆ రోజు రాత్రి డైనింగ్ హాల్లో అప్పటికప్పుడు అనుకున్నాం. మరి ఎవరైనా విన్నారేమో మేం చూడలేదు, అయినా విన్నా, దానిని అవకాశంగా తీసుకుని మర్డర్ చేసేటంత శత్రువులు.. మాకెవరూ లేరు సర్..’’
‘‘అవునూ, అంతా నువ్వే మాట్లాడుతున్నావ్, మీ ఫ్రెండ్ ఇతని పేరేమిటి? ఇతను ఏమీ మాట్లాడటం లేదేం?’’
‘‘ఇతను అరుణ్ సార్, మా నలుగురిలో ఎక్కువ వాగేది, అల్లరి చేసేది, నేను.. అజిత్ మాత్రమే. అరుణ్, అమర్ అసలు ఎక్కువగా మాట్లాడరు, అల్లరి అసలే చెయ్యరు. మావల్లనే అసలు ఇంత అనర్థం జరిగింది..’’ బాధగా అన్నాడు అనే్వష్.
‘‘ప్లీజ్.. అలా అనకురా.. మేం ఎక్కువ మాట్లాడకపోయినా.. మీ మాటల్ని... మిమ్మల్ని బాగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.. నాకూ.. అమర్‌కీ కూడా మీరంటే ప్రాణం..’’ తనూ బాధపడుతూ అన్నాడు అరుణ్.
‘‘ఏది ఏమైనా.. మీకు తెలియకుండానే మీ వెనుక కుట్ర జరిగిపోయింది.. జరిగినదానికి బాధపడుతూ కూర్చోడంకన్నా జరగాల్సింది చూడడం.. ఇంకొక అనర్థం జరగకుండా అజిత్‌ని కాపాడటం ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని.. సో అన్ని రకాలుగా ఆలోచించి.. పరిశోధించి అసలు హంతకుడెవరో తెలుసుకోవాలి.. మీకెవరిమీదైనా అనుమానం వస్తే నాకు వెంటనే చెప్పండి.. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం.. రేపు ఉదయం సరిగ్గా తొమ్మిదింటికల్లా రండి.. యిక మీరు వెళ్లిరండి.. ‘‘కుర్చీలో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ చెప్పాడు భగవాన్.
‘‘నమస్తే.. వస్తాం సార్.. మా వాడి ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయ్.. వాడిని ఎలా రక్షిస్తారో..’’ ఇద్దరూ ఒక్కసారే అన్నారు.
‘‘నమస్తే.. అంతా మంచే జరుగుతుంది.. వెళ్లి రండి’’ ఇంకో ఫైల్‌లో తలదూర్చేసాడాయన.
***
ఉదయం సరిగ్గా తొమ్మిదింటికల్లా బైక్‌తో లాయర్ భగవాన్ ఇంటిముందు ఉన్నాడు అనే్వష్.
‘‘గుడ్ మాణింగ్ సర్’’ విష్ చేశాడు అనే్వష్.
‘‘వెరీ గుడ్ మాణింగ్ యంగ్ మాన్’’ తిరిగి విష్ చేశాడు.. అప్పటికే అతనికోసం ఎదురుచూస్తున్న భగవాన్.
‘‘సర్.. కారు అయితే అడవి దారిలో వెళ్ళడం కష్టం, అందుకే బైక్ తెచ్చాను’’ అపాలజీగా అన్నాడు అనే్వష్.
‘‘యూ ఆర్ రైట్.. అసలు నేనే నీకు చెప్పాలనుకున్నా. ఎనివే.. యిక బయలుదేరుదామా..’’
‘‘సరే.. రండి..’’
అనే్వష్ బైక్ స్టార్ట్ చేశాడు.. అడవిలోకి ప్రవేశించే వరకూ ఏం మాట్లాడకుండా కూర్చున్న భగవాన్.. ఆ అడవి దారిలో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మంచి ఎక్స్‌పర్ట్‌లా బైక్ నడుపుతున్న అతనిని చూసి ఆశ్చర్యంగా అన్నాడు.
***
‘‘అదేమిటి.. ఇదేదో హైవే అన్నంత ధీమాగా.. అది కూడా బాగా తెలిసిన దారిలా అలా నడిపేస్తున్నారు? మీరు తరచూ వస్తుంటారా ఈ దారిలో?’’
‘‘నో సర్.. నాకు ఎంత కొత్త చోటైనా ఒక్కసారి చూస్తే అలా గుర్తుండిపోతుంది, పైగా నేను బైక్ రేసెస్ ఎక్స్‌పర్ట్‌ని.’’
‘‘ఓహ్ నైస్.. నాకయితే మా ఆఫీస్ నుంచి ఇంటిదారే మర్చిపోతుంటాను, ఒక్కొక్కసారి ఆలోచనలో పడి...’’ నవ్వుతూ అన్నాడాయన.
అలా కొంచెం దూరం వెళ్లాక.. అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర బైక్ ఆపాడు.. ‘‘ఇదే సర్.. అమర్ తాడు కట్టి గుర్తుగా బయలుదేరిన చెట్టు.. అసలు ఆ వెధవ తాడు కట్టకపోతే ఈ ప్రమాదమే జరిగి ఉండేది కాదేమో’’ బాధగా నుదురు రాసుకుంటూ అన్నాడు.
‘‘నో.. ఇది ప్రమాదం కాదు, ముమ్మాటికీ హత్యే..’’ సాలోచనగా చుట్టూ చూస్తూ అన్నాడు.
ఆ చెట్టు నుంచి.. ఆ తాడు వెళ్లిన మార్గం అంతా మార్క్ చేసి ఉంచారు...
బైక్ ఓ పక్కగా పార్క్ చేసి ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ.. చుట్టూ చూస్తూ ఆ గుర్తులననుసరించి వెళ్లసాగారు.. భగవాన్ తన డేగళ్ళతో ఆ పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిదానంగా నడవసాగాడు కోటు జేబులో చేతులుంచుకుని..
‘‘ఏమిటి ఈయన.. ఇలా టైం పాస్ చేస్తున్నాడు.. అప్పుడే సుమారు వారం రోజులవుతుంటే యిక యిక్కడేం క్లూ దొరుకుతుంది? అనవసర కాలయాపన’’ మనసులో అనుకుంటూ దిక్కులు చూస్తూ వెడుతున్న అనే్వష్‌ని చెయ్యి పట్టి ఆపేడు భగవాన్.
‘‘అటుచూడు.. ఆ మార్క్‌కి కుడివైపు కొంత దూరంగా, ఏవో షూస్ గుర్తులు.. ఆ రోజు వర్షం బాగా పడింది కదూ.. అందుకే ఆ బురదలో పడిన గుర్తులు ఎండిపోయి... కొంచెం కొంచెంగా ఇంకా కనబడటంలేదూ? అవి.. ఈ తాడు వెంబడే వున్న అడుగుజాడలకి కాస్త వెనకగా. అంటే అమర్‌ని ఎవరో మొదటినుండి ఫాలో చేశారన్నమాట.. గాలికి దుమ్ము ధూళితో చెదిరిపోయినా బురదలో గుర్తులు గట్టిగా ఎండిపోవడం వలన పూర్తిగా చెరిగిపోలేదు.. కమ్ వీటిని దగ్గరగా చూద్దాం.. జాగ్రత్త వాటిని తొక్కేయకు.. తమాషాగా ఉందే.. ఈ గుర్తులు రెండూ రెండు వేర్వేరు డిజైన్స్‌లో ఉన్నట్లున్నాయి, చూడు!..’’ ఎగ్జైటింగ్‌గా అన్నాడు భగవాన్.
ఇద్దరూ ఆ అడుగులకి అడుగు దూరంలో కూర్చుని జాగ్రత్తగా పరిశీలించసాగారు.
‘‘నిజమే సర్.. ఈ షూస్ సోల్ డిజైన్ తేడాగా ఉండటమే కాదు.. జాగ్రత్తగా చూడండి, కుడి కాలు అడుగు కొంచెం చిన్నదిగా ఉంది..

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్