డైలీ సీరియల్

బడబాగ్ని-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే ఆ వ్యక్తికి ఒక కాలు కొంచెం అవుడు అయి ఉండాలి.. లేదా ఒక పాదం కాస్త చిన్నది ఒకటి పెద్దది అయి ఉండాలి.. అంతేకాదు వర్షంలో సపోర్ట్‌కోసం అతను చేతి కర్ర వాడిన ఈ గుర్తు చూడండి.. ప్రతి అడుగు గుర్తుకీ కొంత దూరంగా ఒక కర్ర భూమిలో దిగబడిన గుర్తు.. దారి పొడుగునా..’’ గట్టిగా అరిచాడు ఎమోషనల్‌గా.
‘‘సో.. మనకి కొంతవరకూ క్లూ దొరికినట్లే.. పద ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దాం.. జాగ్రత్తగా చూడు ఏ చిన్న ఆధారం దొరికినా చెప్పు’’.. జేబులోంచి భూతద్దం తీసి నేలమీద చూస్తూ అన్నాడు భగవాన్.
అప్పటికే తన అభిప్రాయం ఎంత తప్పో అర్థమైన అనే్వష్.. కళ్లనే సెర్చ్‌లైట్స్‌లా చేసి అణువణువూ చూడడం మొదలుపెట్టాడు.. కొంచెం దూరంలో ఎండిన బురదతో, పిడచకట్టి వున్న ఒక వస్తువు కనబడింది.. ఎందుకైనా మంచిది అన్న ఉద్దేశ్యంతో దానిని తీసి కొంచెం కొంచెం మట్టి దులిపిన అనే్వష్‌కి అది ఒక ఉలెన్ స్వెట్టర్‌లా తోచింది.. వెంటనే దానిని తీసి పట్టుకున్నాడు.. బాగా దులిపిన అనే్వష్ తల తిరిగిపోయింది. ఏమో సందేహం వచ్చి గబగబా భుజానికున్న వాటర్ బాటిల్ తీసి కొద్దిగా నీటితో తడిపి చూసిన అతనికి మతి పోయింది.. అది, అది అజిత్ స్వెటర్.. రంగు తెలియకపోయినా దానిమీద ఉన్న జంట గులాబీ ఎంబోజ్ చేసి ‘ప్రేమతో ప్రియ’ అన్న అల్లిక.. అతను చేస్తున్న పనినే చూస్తున్న భగవాన్ నిశే్చష్టుడైపోవడాన్ని చూసి, గబగబా దగ్గరికి వచ్చి అడిగాడు..
‘‘ఏమైంది.. అది ఎవరిదో తెలుసా..’’
కళతప్పిన ముఖంతో.. అన్నాడు అనే్వష్.. ‘‘యిది.. యిది.. అజిత్‌ది.. కాని ఇక్కడికెలా...’’
‘‘సెల్ ఎలా వచ్చిందో.. ఇదీ అలాగే.. కాని ఒక్కటి మాత్రం నిజం. ఇదంతా కచ్చితంగా అజిత్‌కి బాగా దగ్గరవాళ్లో.. కావలసినవాళ్లు చేసినదే.. సందేహం లేదు. అయితే ఎవరా అజ్ఞాత శత్రువు అన్నది మనం వెంటనే తెలుసుకోవాలి.. ఇంతకీ ఎవరీ ప్రియ.. అతనికి పెళ్లి కుదిరింది అన్నావ్, ఆ అమ్మాయా లేక మరెవరైనానా..’’ గుచ్చి గుచ్చి చూస్తూ అడిగాడు.
‘‘ఆ అమ్మాయే.. క్రితం నెల అజిత్ పుట్టిన రోజుకి వచ్చినపుడు దీనిని తను స్వయంగా అల్లినదని చెప్పి గిఫ్ట్ యిచ్చింది.. మనం... మనం అజిత్‌ని రక్షించగలమా.. ఇంత ప్లాన్డ్‌గా చేసిన వారెవరో దొరుకుతారా..’’ కళ్ల నీళ్లుతిరుగుతుండగా చిన్నబోయిన ముఖంతో అడిగాడు.
‘‘అరె.. అంత వర్రీ అయితే ఎలా.. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చోట ఏదో ఒక తప్పటడుగు వేస్తాడు.. తప్పకుండా దొరికిపోతాడు.. అయితే కాస్త ఓపికతో.. సహనంగా పరిశోధించాలి...
ఆ మాటలతో భారంగా తయారైన మనసుకి కాస్త ఊరట కలిగినట్లయ్యింది.. నిజమే జరిగిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది.. బాధపడుతూ కూర్చోడం కన్నా ఎలాగైనా అసలు నేరస్థుడెవరో.. శోధించి పట్టుకుని అజిత్‌ని కాపాడాలి.. పోయిన అమర్‌ని తేలేకపోయినా ఉన్న అజిత్‌ని రక్షించుకోవాలి..
ఆలోచిస్తూ నడుస్తున్న అనే్వష్‌కి హత్యాస్థలం ఇంక సుమారు వంద గజాల దూరంలో ఉంది అనగా ఒక చెట్టుకు గుచ్చి ఉన్న సిరంజి, చెట్టు మొదట్లో పడేసి ఉన్న చిన్న డ్రగ్ బాటిల్ కంటబడ్డాయి.. వెంటనే తీయబోయిన అతని చెయ్యి పట్టి వెనక్కి గుంజాడు భగవాన్.. ఆ.. ఆ.. ఆ తొందరబాటే వద్దు.. అది కచ్చితంగా హంతకుడిదే కావచ్చు.. లేదా రహస్యంగా డ్రగ్స్ తీసుకునే వేరెవరిదైనా కావచ్చు.. దానిమీద వేలిముద్రలు దొరకచ్చు..’’ అంటూ జేబులోంచి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తీసి. ఆ రెండు వస్తువులని జాగ్రత్తగా పేపర్ నాప్కిన్ పట్టుకు కవర్‌లో జారవిడిచాడు.
ఆ కవర్ మళ్లీ భుజాన వున్న సేక్ బ్యాగ్‌లో పడేశాడు. ఆయన చేస్తున్న పనులను నిశితంగా గమనించసాగాడు అనే్వష్.. మళ్లీ నడక సాగించారు..
అమర్ శవం దొరికిన చోట.. తెల్లటి పెయింట్ వేసి ఉంది.. అతని శరీరం ఔట్‌లైన్.. అది చూడగానే దుఃఖం ఆపుకోలేక అలాగే కూలబడి రోదించసాగాడు అతను.. తనే తనే.. అమర్ చావుకి కారణం.. థ్రిల్ థ్రిల్ అనుకున్నాడే కాని అది అమర్ పాలిట మృత్యువు అవుతుందనుకోలేదు.. మోకాళ్లలో తలదించుకు పొగిలి పొగిలి ఏడుస్తున్న అతని భుజంపై ఊరడింపుగా చేయి వేసాడు లాయర్ భగవాన్. సుదీర్ఘమైన అతని సర్వీస్‌లో ఇలాంటివెన్నో చూసిన అనుభవం.. అంతవరకు తమతో ఆడి.. పాడిన ప్రియనేస్తం.. అలాంటి చావుకి గురి అయితే.. అందులోనూ తెలిసో తెలియకో తన మూలంగా అలా జరగడం తట్టుకోలేని విషయమే.. సరదాగా అనుకున్నది ఇలా రెండు నిండు ప్రాణాలమీదకు రావడం దురదృష్టకరం...
కొంచెం సేపటికి తెప్పరిల్లిన అనే్వష్.. తేరుకుని ఆ పరిసర ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు.. కొంతసేపు వెదికాకా ఇంక అక్కడ అనుమానించతగినవేమీ కనపడక వెనుదిరిగారిద్దరూ.
మర్నాడు కోర్డ్ ప్రొసీడింగ్స్ ఉన్నందున తాము సేకరించిన వస్తువులు పోలీస్ కస్టడీకి అందజేసి.. వాటిమీద ఉన్న వేలి ముద్రలూ.. అలాగే ఆ డ్రగ్ వివరాలు రేపు కోర్టులో అందచేయమని వెనుతిరిగారు.
కస్టడీలో ఉన్న అజిత్‌ని కలిసి జరిగింది తెలిపి.. తన చుట్టూ ఉన్న వారిలో ఎవరిపైన అయినా అనుమానం ఉందా? అని అడగాలని వచ్చిన వారికి అజిత్ సెల్ దగ్గర అతని తల్లి, తండ్రి ఎదురయ్యారు.
ఇద్దరూ లాయర్‌గారికి విష్ చేసి. తమ కొడుకుని ఎలాగైనా ఇందులోనుంచి బయట పడెయ్యమని కంటతడి పెట్టారు.. వాళ్లని ఊరడించి పంపిన తరువాత అనే్వష్ అడిగాడు...
‘‘నీకు తెలిసినవారికెవరికైనా కాళ్ల అవకరం కానీ... ఎగుడు దిగుడు కాళ్లు కానీ.. పాదాలలో పెద్ద చిన్న తేడాలు కానీ ఉన్నవాళ్లెవరైనా ఉన్నారా.. అలాగే డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైనా ఉన్నారా?’’
‘‘ఉహూ, నాకు తెలిసీ అలాంటివాళ్ళెవరూ లేరు.. ఏం ఎందుకలా అడిగావ్?’’ ఆశ్చర్యంగా అన్నాడు అజిత్.

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్