డైలీ సీరియల్

బడబాగ్ని-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమాశించి ఇదంతా చేస్తున్నారు? రాహుల్ కనక అయితే అతని కోపం.. పగ ఒక్క అజిత్‌మీదనే ఉండాలి. అమర్, అరుణ్, నేను.. మేమేం చేశాం.. మరి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు చేయిస్తున్నారు?
విధిలేని స్థితిలో ఇదంతా చేసి.. ఎటూ దొరికిపోతానని.. చట్టం చేతిలోనైనా.. వాళ్ళ చేతిలోనైనా తనకి చావు తప్పదని తనకి తనే మరణశిక్ష విధించుకున్నాడా.. అసలు తమ ట్రైనింగ్ సెంటర్‌లోనే మిస్టరీ ఏదైనా ఉందా..’’ తన ఆలోచనల్లో తానుండగా.. ప్రెస్.. మీడియా. పోలీస్ అంతా వచ్చేశారు అక్కడికి..
కమల్ ఇంద్రజిత్ మరణ వాగ్మూలాన్ని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు...పోలీసులు వచ్చాక ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి అతడి బాడీ పోస్టుమార్టం కోసం డాక్టర్స్‌కి అప్పగించారు.. హెవీడోస్‌లో తీసుకున్న విషంవలనే అతను మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.. అరుణ్ స్థితి కొంచెం మెరుగుపడింది.. ఐసియు నుంచి స్పెషల్ రూంకి రెండు రోజులలో మారుస్తామని చెప్పారు డాక్టర్స్.
ఇంద్రజిత్ డెడ్‌బాడీని పోలీసు దర్యాప్తు పూర్తవ్వగానే మార్చురీకి తరలించారు. అతని తల్లిదండ్రులకి కబురు పెట్టారు. అరుణ్ కొంచెం కోలుకున్నాడు అతనిని ఐసియు నుంచి స్పెషల్ రూంకి మార్చి అబ్జర్వేషన్లో పెట్టి తరువాత డిస్చార్జ్ చేస్తామని చెప్పారు. అతనికి తోడుగా అనే్వష్ ఉన్నాడు.. ఇంద్రజిత్ మీద పోలీస్ కేసు ఫైల్ అయి కేసు కోర్టులో నడుస్తోంది.
జరిగినవన్నీ సినిమా రీల్‌లా అనే్వష్ బుర్రలో తిరుగుతున్నాయి.. ఏమిటిదంతా? తమకి తెలియకుండానే తాము ఏదో కుట్రలో యిరుక్కున్నామా.. అమర్‌ని అలా చంపేసారు, అరుణ్‌కి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.. తనకి కమల్ పుణ్యమా అని ఎంత గండం తప్పింది.. లేకపోతే తను ఆ లారీ క్రింద పడి నామరూపాలు లేకుండా పోయేవాడు... కంప్లైంట్ యిచ్చారు కానీ ఏం లాభం, లారీ ఊరి పొలిమేరల్లో దొరికింది, డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు... ఆలోచనల్లో వున్న అనే్వష్‌కి.. ‘‘దాహం.. దాహం..’’ అన్న అరుణ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు.
అరుణ్‌ని లేవదీసి మెల్లిగా కొంచెం నీళ్లు తాగించాడు.. ‘‘ఏరా.. యిప్పుడెలా ఉంది.. ఓకేనా..’’. అవునురా అసలారోజు ఏం జరిగింది. అందరూ ఒకే ఫుడ్ తిన్నప్పుడు నీకు మాత్రమే ఇలా ఎందుకు జరిగింది.? అడిగాడు అనే్వష్ అరుణ్‌ని.
‘‘లంచ్‌కి డైనింగ్ హాల్‌కి వచ్చే ముందు ఇంద్రజిత్ మన రూంలోకి వచ్చాడు.. వాళ్ళ ఊరునుంచి తనకు ‘రసమలై’ స్వీట్ పంపారనీ, మనం ఈ గొడవలో ఉన్నామని పెట్టలేదనీ, ఇంక రెండే మిగిలాయి, నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, తింటావని తెచ్చా. బయట అయితే అందరూ ఉంటారనీ, నీకోసం ఇక్కడికి తెచ్చా.. తినమని ఇచ్చాడు.. నీకు తెలుసుగా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని.. సరే అని తిని.. యిద్దరం డైనింగ్ హాల్‌కి వచ్చాం.. నువ్వు ఒకటి తీసుకో అంటే తను చాలా తిన్నాననీ, నన్ను తినమని అన్నాడు.. బహుశా వాటిలో కలిపి ఉంటారు విషం. పాపం ఇంద్రజిత్ అతనిని ఎవరు అలా బలవంతం చేసారో, ఎందుకు చేసారో కానీ భయపడి బంగారంలాంటి జీవితం అంతం చేసుకున్నాడు..’’ బాధగా అన్నాడు అరుణ్.
‘‘అరుణ్.. నువ్వు చాలా గ్రేట్‌రా.. నిన్ను చంపబోనవాడిమీద కూడా జాలి చూపించి, వాడు చనిపోయినందుకు బాధపడుతున్నావ్.. అయినా ఇంద్రజిత్ ఏ విషయంలో వాళ్లకి చిక్కి ఉంటాడంటావ్..’’ అరుణ్ కోసం ఫ్రూట్ జ్యూస్ తీస్తూ అన్నాడు అనే్వష్.
‘‘ఏమో.. నాకు తెలిసీ వాడు కాస్త అమ్మాయిల విషయంలో ఓవర్ అవుతాడు కానీ.. మరీ అంత బ్లాక్‌మెయిల్ చేసి ఇలాంటి దారుణాలు చేయించేటంత నేరం ఏం చేసాడో..’’ అలసటగా అన్నాడు.. అదేం విషమో కానీ అరుణ్ జవసత్వాలు లాగేసింది.. మనిషి బాగా నీరసపడిపోయాడు.. డాక్టర్స్ అయితే అసలు బ్రతకడమే మిరాకిల్ అన్నారు.
‘‘పోనీలే.. యింత ఈ జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకో.. ఈ కమల్ వస్తానన్నాడు ఇంకా రాలేదు..’’ ఆ రోజు పేపర్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.
అయిపోయింది అనుకున్న హత్య కేసు మళ్లీ సరికొత్త మలుపు తిరిగింది. యిప్పుడు ఎవరిని అనుమానించాలి.. ఎవరిని ప్రోసిక్యూట్ చెయ్యాలి.. రాహుల్ రుూ హత్య చేశాడు అని నమ్మి అన్ని సాక్ష్యాధారాలు సేకరించాం. ఇక నిరూపించి అతనినే దోషిగా నిర్థారించడమే తరువాయి అనుకుంటూండగా.. యిటు ఇంద్రజిత్ తనే యివన్నీ చేశానని, అయితే వేరే ఎవరో తనని బ్లాక్‌మెయిల్ చేసి ఇవన్నీ చేయించారని.. అయితే అది ఎవరో.. ఎందుకో మాత్రం తనకూ తెలియదనీ.. ఈ విచిత్ర పరిస్థితిలో.. అరుణ్‌మీద హత్యాప్రయత్నం విఫలమవడంతో, ఎటూ తను దొరికిపోవడం ఖాయం అన్న విషయం అర్థమై తనకు తాను ఆత్మహత్య చేసుకుని ఇంద్రజిత్ మరణించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
అనే్వష్‌కి ఎటూ పాలుపోని పరిస్థితి, ఇంద్రజిత్ వాగ్మూలంతో అజిత్ నిరపరాధిగా బయటపడ్డా అసలు ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో, తమని అంతం చెయ్యాల్సినంత అవసరం, కక్ష ఎవరికి ఉన్నాయో తెలియక క్షణక్షణం ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో, ఎందులో ఇరుక్కుంటారో తెలియక దినదినగండంగా ఎలా బ్రతకాలి.. కనుక ఇదేదో కనిపెట్టాలి.. కనిపెట్టి తీరాలి.. ఆలోచిస్తూనే లాయర్ ఇల్లు చేరాడు.
‘‘నమస్తే లాయర్‌గారు...’’
‘‘నమస్తే.. నమస్తే. ఏమిటి మన కేసు కొత్త మలుపు తిరిగిందట.. ఈవేళ పేపర్లో వార్తా చూసా.. యిప్పుడే అనుకుంటున్నా నీకు ఫోన్ చేద్దామని.. ఇదంతా మీ కోట్రైనీ ఎవరో ఇంద్రజిత్ అనేవాడు చేశాడుట..

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్