డైలీ సీరియల్

బడబాగ్ని-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతావాళ్ళు అంతా యమా సీరియస్‌గా ఏవో క్లాసెస్ అటెండ్ అవడం వరకే తప్ప, ఎవరితోనూ పెద్దగా కలవరు.. అక్కడ వున్న ఏడాదిలో ఎవరి ప్రవర్తనా అనుమానాస్పదంగా లేదు.. మరి యిప్పుడు ఎవరిని అనుమానించాలో.. అసలు తమ అనుమానం నిజమేనా లేక ఉత్త అనుమానమేనా? కానీ అలా కాకపోతే అమర్ అలా ఎందుకు రాస్తాడు?
ఏమిటో, ఎవరికైనా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాక టెన్షన్స్, ప్రమాదాలూ వస్తాయి. తమకేమిటో ఇంకా అడుగుపెట్టకముందే మొదలయ్యాయి.. చ్ఛా.. ఇలా ఆలోచిస్తున్నానేమిటి? ఖచ్చితంగా దీనినో సవాలుగా తీసుకు పరిష్కరించాలి. అమర్, కమల్.. ఇంద్రజిత్ చావులకి కారణమైన వాడి అంతు చూసినపుడే తమ జీవితాలకీ.. ఈ ఉద్యోగాలకీ సార్థకత..’’ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాడు అనే్వష్.
***
ఇక్కడ రాహుల్ అర్ధరాత్రివేళ దొంగలా డెహ్రాడూన్ సిటీ సమీపంలో తను తీసుకున్న గదికి తిరిగి వచ్చేడు.. అలసటగా తన బేగ్, కమల్ బేగ్ ఒక పక్కన పడేసి కొంచెం ఫ్రెష్ అయి వాలిపోయాడు. అలసిపోయినా నిద్ర దరిచేరడంలేదు.. ఒకటే ఆలోచన.. ఈ కేస్ ఎలా సాల్వ్ అవుతుంది.. ఏ కోణంలో చూసినా దీన్ని నిరూపించి ఫలానా వాడే యివి చేశాడు అనే ఖచ్చితమైన ఆధారాలు ఎలా సంపాదించాలి... ఎలా.. ఎలా.. ఎలా.. అరగంటసేపు అటూ యిటూ దొర్లినా లాభం లేకపోయింది. యిక నిద్ర పట్టదు.. లేచి కూర్చున్నాడు.. కమల్ ఖచ్చితంగా ఎక్కడో దాచే ఉంటాడు.. చూద్దాం.. ఏ పుట్టలో ఏ పాము ఉందో అనుకుంటూ లేచి లైట్ వేసి, కొంచెం మంచినీళ్ళు తాగి కమల్ బేగ్ తీశాడు..
కమల్ బ్యాగ్‌లోంచి వస్తువులు తీస్తుంటే ఏడుపు ఆపుకోలేకపోయాడు.. ఏమిటో తన జాతకం, చిన్నతనం నుంచీ ఎవరి ప్రేమాదరణలకు నోచుకోని తనను ప్రాణంలా ప్రేమించి, తన ఒంటరితనాన్ని పొగొట్టి స్వంత మనిషిలా ప్రేమించి ఆదరించాడు కమల్. ఇది ఏనాటి అనుబంధమో.. యిపుడు వాడూ తనకు దూరం అయ్యాడు.. తల్లి మారుమనువు, మారుటి తండ్రి నిరాదరణా.. ఇంటిలో వుండలేక, హాస్టల్లో ఇమడలేక నిరాశగా, నిస్తేజంగా ఉన్న తన బ్రతుకులోకి వరంలా ప్రవేశించాడు.. తను మొదటిసారి కమల్‌ని ఇంటర్‌లో చేరిన మొదట్లో తన రూంమేట్‌గా కలసిన మొదటిరోజు గుర్తువచ్చింది.. పెద్ద పెద్ద కళ్ళతో, పాలుగారే బుగ్గలతో అచ్చం ఆడపిల్లలా ఉండే కమల్‌ని మొదట తను ఏ మాత్రం పట్టించుకోలేదు.. తమ ఊరిలో చదువు అంత బాగుండదని సిటీలో చేర్చి హాస్టల్లో వేశారతనిని. బెంగ బెంగగా ఎప్పుడూ దిగులుగా ఉండే అతనిని తను అస్సలు పట్టించుకోలేదు.. ఒక రోజు రాత్రి ముడుచుకు ఏడుస్తూ పడుకున్నవాడిని చూసి జాలేసి, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగిన తనని వాడు అమాంతం పట్టుకుని, తను యిల్లు విడచి అమ్మా.. నాన్నల్ని విడచి ఎప్పుడూ ఉండలేదనీ.. యిక్కడ ఉండలేకపోతున్నానని ఏడిచాడు.. తనకు వింతగా అనిపించింది.. మరి అలాంటి అనుభూతులు తనకు లేవుగా.. అలా మొదలైన తమ స్నేహం వయసుతో బాటు పెరిగి, విడదీయరానిదిగా మారింది.. తను ఎప్పుడూ సెలవలకి తమ యింటికి కాక కమల్ యింటికే వెళ్ళేవాడు.. వాడి తల్లి, తండ్రులనే తనూ తల్లిదండ్రులుగా భావించి ప్రేమించేవాడు.. యిప్పుడు యిలా, తను ఈ కేస్ గొడవలో పడి వాళ్ళ సంగతే మరచిపోయాడు.. కమల్ మరణం తనకే ఇంత బాధగా వుంటే పాపం రుూ వయసులో వాళ్ళు ఎలా తట్టుకుంటారు.. తను సాధ్యమైనంత త్వరగా ఈ కేస్ సంగతి చూసి, తన అనుమానాలూ, తన పరిశోధన వివరాలూ, తనకి దొరికిన ఆధారాలూ అన్నీ పోలీసులకి అప్పచెప్పి, కమల్ ఇంటికి వెళ్ళాలి.. ఆ తల్లిదండ్రులను ఓదార్చి జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళకి కమల్ లేని లోటు తీర్చాలి.
ఆలోచనల్లోంచి తేరుకుంటూ కమల్ లాప్‌టాప్ తీశాడు, కమల్ తన క్రైం రిపోర్ట్స్ అన్నీ డేట్స్‌వారీగా ప్రతి చిన్న విషయం అందులో ఫైల్ చేసేవాడన్న విషయం గుర్తువచ్చి.. అది ఆన్ చేశాడు.
కమల్ తాజ్ హోటల్‌లో దిగిన రోజునుండీ అతని డైరీ కోసం లాప్‌టాప్‌లో వెదికాడు.. తను విజయవాడ వెళ్లి రోహిత్ కుటుంబాన్ని కలసిన సంగతీ, అతను చదివిన కాలేజీకి వెళ్లి అతని స్నేహితుల గురించి ఆరా తీసిన సంగతీ, రోహిత్‌కి మహేష్ చాలా క్లోజ్‌ఫ్రెండ్ అని తెలిసి, అతని ఫోన్ నెంబర్ సంపాదించి అతనిని కాంటాక్ట్ చేసి అతనిని తన హోటల్ రూంకి రమ్మన్న సంగతి వరకూ ఉన్నాయ్.
అక్కడితో ఆగిన ఆ డైరీలో తరువాత ఒక తాళం చెవి బొమ్మ వేసి ఉంది.. అంతవరకూ చదివిన రాహుల్‌కి అక్కడ కీ గుర్తుతో ఆగిపోవడం ఏమిటో అర్థం కాలేదు. ఇదేమిటీ ఇక్కడితో ఆపేశాడు.. తరువాత రాసే అవకాశం లేకుండానే చనిపోయాడా.. కథ మళ్లీ మొదటికి వచ్చిందా? తను మళ్లీ ఆ కాలేజ్ నుంచి శోధన మొదలుపెట్టాలా, నిరాశగా లాప్‌టాప్ మూసేశాడు.
రెండు రోజులు గడిచేయ్.. రాహుల్ మళ్లీ శోధన మొదలుపెట్టడానికి మానసికంగా సంసిద్ధుడవుతున్నాడు.. ఏది ఏమైనా ఇది యిలా వదిలెయ్యకూడదు.. ఎవరో ఏమిటో తెలియనివారి హత్యలకే చలించిపోయిన తను తన ప్రాణానికి ప్రాణం అయిన కమల్, ఏ పాపం ఎరుగని, ఇంకా జీవితంలోకి అడుగైనా పెట్టని అమర్‌ల హత్యలకి ప్రతీకారం తీర్చుకోవాలి.
-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్