డైలీ సీరియల్

బడబాగ్ని-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత మేధావి అయినా, ఎంత కరుడుగట్టిన హంతకుడు అయినా తప్పకుండా ఎక్కడో అక్కడ తప్పడుగు వేస్తాడు, యిప్పటికే వేసాడు- ఎందుకంటే గత ఆరునెలలుగా అంతుచిక్కని హత్యలూ, అడవిలో అమర్ హత్య ఏ రకమైన ఆధారం దొరక్కపోయినా, అరుణ్ జోలికి ఇంద్రజిత్‌ని పంపి చేసిన పొరపాటు ఆ హంతకుడిని కొద్దిగా అయినా గెస్ చేసే అవకాశం ఇచ్చింది. సో.. తను నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా హంతకుడి జాడ దొరుకుతుంది.. తను రేపే విజయవాడ ఆ కాలేజీకి మళ్లీ వెడతాడు, కాలేజీలో ఆ బేచ్ తాలూకు మిగతా స్నేహితుల ఆచూకీ తీస్తాడు.. దానితో అసలు కథ వెలుగులోకి వస్తుంది.. అయితే వెళ్ళే ముందు ఒక్కసారి కమల్ కుటుంబాన్ని చూసి వెడతాను. అలా నిర్ణయించుకున్నాక రాహుల్‌కి మనసు ప్రశాంతంగా అనిపించింది.
మర్నాడు ఉదయం ఫ్లైట్‌కి హైదరాబాద్ చేరిన రాహుల్ ఒకసారి అజిత్‌ని కలిసి ‘‘ఉద్యోగ బాద్యతలు ఎలా ఉన్నాయి? నువ్వు అలవాటుపడ్డావా?’’ అని కుశల ప్రశ్నలు వేసి కమల్ ఇంటికి వెడుతున్నానని చెప్పాడు
‘‘రాహుల్, నిన్ను మనసారా అన్నయ్యా అని పిలవాలని ఉన్నా, యిప్పుడు సడెన్‌గా అలా పిలవాలంటే ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది.. నిజంగా నీకు నామీద ఏ కోపం లేకపోతే ఈ రోజుకి నా క్వార్టర్స్‌లో ఉండి రేపు వెళ్ళు.. ప్లీజ్.. రేపు ఎటూ నాకు ఆఫ్.. ప్లీజ్’’ అన్న అజిత్ మాటలకి కరిగిపోయాడు రాహుల్.
ఆ రాత్రి ఆ అన్నదమ్ములు మనసులు విప్పి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు..
రాహుల్ తన పరిశోధన మొత్తం అజిత్‌తో పంచుకున్నాడు. చివరగా కమల్ లాప్‌టాప్‌లో డైరీలో రాసుకున్న విషయాల ప్రస్తావన కూడా వచ్చింది.. అప్పుడు రాహుల్ వ్రాయడం సగంలో ఆపి ఏదో తాళం చెవి గుర్తు సంగతి చెప్పాడు.. అదేదో ఒకసారి చూపించమని అజిత్ అడిగినమీదట కమల్ లాప్‌టాప్ తీసి చూశాడు రాహుల్.
‘‘రాహుల్ యిక్కడ ఈ గుర్తు వెయ్యడంలో ఖచ్చితంగా ఏదో విషయం వుండే వుంటుంది.. ఆలోచిద్దాం’’ అన్న అజిత్ మాటలకి సాలోచనగా చూసేడు రాహుల్.
ఇద్దరూ ఆ గుర్తు చూస్తూ కూర్చున్నారు, కమల్ ఏదో రహస్యం చెప్పదలిచాడని మాత్రం అర్థమైంది. కానీ అదేమిటో, ఎక్కడ ఉందో మాత్రం అర్థమై చావలేదు వాళ్లకి. బాగా ఆలోచించిన మీదట అజిత్ అన్నాడు.. బహుశా ఏదో టాప్ సీక్రెట్ వేరే ఫైల్‌లో వేసి అది లాక్ చేసాడమో..
ఇప్పుడా ఫైల్ ఓపెన్ చెయ్యాలంటే దాని ‘పాస్‌వర్డ్’ తెలియాలి, అది ఏమై వుంటుంది. ఆలోచన మొదలైంది యిద్దరిలో.. రకరకాల ప్రయత్నాలు చేసారు.. సాధారణంగా ఏ దేముడి పేరో, భార్యా పిల్లల పేర్లో పెడతారు.. అన్నిరకాలుగా విసిగిపోయిన రాహుల్, అజిత్‌లు తాత్కాలికంగా ఆ పని విరమించుకుని భోజనం కానిచ్చి పడుకుండిపోయారు...
హఠాత్తుగా మెలకువ వచ్చిన రాహుల్ కమల్ వెళ్ళే ముందు కలసి మాట్లాడుకున్న విషయాలు నెమరువేసుకున్నాడు. ఎందుకో కమల్ అయితే నేను ఆపరేషన్ ‘సెర్చ్’ మొదలుపెడతాను అన్న మాట గుర్తు వచ్చి ఒక్క ఉదుటన లేచాడు.. కమల్ లాప్‌టాప్ తీసి ఆ ఫైల్ దగ్గర క్లిక్ చేస్తే ఓపెన్ అవడానికి పాస్‌వర్డ్ అడిగింది. అక్కడ ‘సెర్చ్’ అన్న పాస్‌వర్డ్ యిచ్చాడు.. వెంటనే ఫైల్ ఓపెన్ అయింది. అజిత్ కేసి చూసాడు.
మంచి నిద్రలో ఉన్నాడు, సరే లేపడం ఎందుకు? ముందు ఏం ఉందో నే చూస్తాను.. అనుకుని ఆ ఫైల్ ఓపెన్ చేసిన రాహుల్‌కి, మహేష్.. రాహుల్ ఆ రోజు తాజ్ గదిలో జరిగిన సంభాషణ మొత్తం, మహేష్ చెప్పిన కాలేజ్ పిక్నిక్, మల్లిక దుర్మరణం, రవీంద్ర.. ఆ గతం మొత్తం మహేష్ మాటలలో రికార్డ్ అయ్యింది. ఎప్పుడు లేచాడో అజిత్ కూడా రాహుల్ పక్కనే ఉన్నాడు.. అది మొత్తం విన్న ఆ ఇద్దరికీ హత్యలన్నీ ఎందుకు చేసారో మొత్తం వివరంగా అర్ధం అయింది.
మనం వెంటనే.. మన ట్రైనింగ్ సెంటర్‌లో అందరి పూర్తి పేర్లూ.. హత్యలు జరిగిన నాటి తేదీలతో మేచ్ అవుతూ ఎవరైనా సెలవులు పెట్టరా అన్న విషయం తెలుసుకోవాలి.. హత్యకు కారణం తెలిసింది కనుక మహేష్ చెప్పిన కథలో హతులంతా వున్నారు కనుక ఈ వరుస హత్యలకి కారణం నూటికి నూరుపాళ్ళూ అదే.. ఇక దొరకవలసింది హంతకుడు మాత్రమే.. అమర్, ఇంద్రజిత్.. మరణాలూ.. అరుణ్‌మీదా, అనే్వష్‌మీదా జరిగిన హత్యా ప్రయత్నాలూ.. మన ట్రైనింగ్ సెంటర్ వీటన్నింటికి మూలం అన్న అనుమానం కలిగిస్తోంది కనుక మనం మున్ముందర అక్కడ సందేహ నివృత్తి చేసుకోవడం మంచిది.. ఆ వివరాలు సంపాదించగలిగితే.. మనం వెంటనే.. మన ట్రైనింగ్ సెంటర్‌లో అందరి పూర్తి పేర్లూ.. హత్యలు జరిగిన నాటి తేదీలతో మేచ్ అవుతూ ఎవరైనా సెలవులు పెట్టారా అన్న విషయం తెలుసుకోవాలి అన్న రాహుల్ మాటలకి...
‘‘ఆల్రెడి.. అరుణ్‌కి.. ట్రైనర్స్‌లో ఎవరి సెలవులు.. హత్యలు జరిగిన తేదీలతో సరిపోయాయి అన్న వివరాలు కనుక్కునే పని అప్పగించడం జరిగింది.. ఎందుకంటే హత్యలన్నీ వేరే వేరే చోట్ల జరిగాయి.. కనక ఖచ్చితంగా సెలవు పెట్టకుండా .. వెళ్ళడం జరిగే పని కాదు.. అయితే.. పూర్తి పేర్లు అన్న ఆలోచన మాకు అప్పటికి రాలేదు.. కానీ అది పెద్ద పనేం కాదు కనుక్కోవడం, వెంటనే చెబుదాం అరుణ్‌కి..’’ అజిత్ అన్నాడు.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్