డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మా ఈసారి నీ పుట్టిన రోజుకు చాలా ప్రత్యేకమైన బహుమానం ఇవ్వదల్చుకున్నాం’’ అన్నాడు.
‘‘ఇప్పటివరకు ఇచ్చినవి చాలదా?’’ అన్నాను.
‘‘లేదు, లేదు నీకిది యిదివరకు ఎప్పుడు ఇవ్వలేదు’’ అన్నాడు.
‘‘ఏమిటిది?’’ అన్నాను, ఏమయివుంటుందా అని ఆలోచిస్తూ-
‘‘కాని ఒక్కటే చిక్కు అన్నాడు, ఏమిటో చెప్పకుండా’’. నువ్వు ఇక్కడకు వచ్చి తీసుకోవాలి అన్నాడు.
ఇదేదో కొత్త ఎత్తు నన్ను అమెరికా రప్పించడానికి అనుకున్నాను.
వౌళి, తేజా వీలయినప్పుడల్లా వచ్చి రెండు వారాలు నాతో గడిపి వెడుతూనే ఉంటారు. అందుకే వాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా నేను ఉత్సాహం చూపించడంలేదు, మీరు వస్తున్నారుగా అంటూ.
ప్రతిసారి ఏదో సాకు చెప్తూనే ఉన్నాను.
అమెరికా నాలాంటివాళ్లకు కాదు. ఇక్కడ యిలా పనిచేయడానికి అలవాటయ్యాక అక్కడ నాకు తోచదు. వాళ్ళిద్దరూ ఆఫీసుకు వెడతారు. ఇంట్లో నాకు తోచదు. అదే అంటూ వాయిదా వేస్తున్నాను ఇన్నాళ్లూ.
అందులో ఈ కొత్త కాలేజీ నిర్వహణలో చాలా బిజీ అయిపోయాను, పోయిన కొద్ది ఏళ్లుగా. ఇక అమెరికా వెళ్ళే ప్రసక్తే రానివ్వలేదు.
‘‘అమ్మో! ఏమిటా గిఫ్ట్, నేను వస్తేనే కాని కనిపించనిది’’ అన్నాను.
సావిత్రి వాళ్లదగ్గరకు వచ్చినట్లుంది. వెనుకనుంచి బిగ్గరగా ‘‘వదినగారు మనిద్దరికి ప్రమోషన్ వస్తోంది. గ్రాండ్ మదర్స్ అయిపోతున్నాం అంది పెద్దగా’’ ఉత్సాహం ఆపుకోలేక.
క్షణం నా చెవులను నేను నమ్మలేకపోయాను. ‘‘ఏమిటి వౌళి, మీ అత్తగారు అంటున్నది?’’ అన్నాను. విన్నది సరిగ్గా విన్నానో లేదో అని.
‘‘అవునమ్మా తేజా రుూజ్ ఎక్స్‌పెక్టింగ్’’ అన్నాడు. నా మనసులో చిత్రమైన అనుభూతి కలిగింది. అది కేవలం సంతోషం కాదు, ఆనందం కాదు అదో అనుభూతి, ప్రత్యేకమైన అనుభూతి. కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కలిగే అనుభూతి. తమ పిల్లలు పెరిగి పెద్దవారై మరో తరానికి నాంది పలుకుతుంటే కలిగే నవోదయం లాంటిది.
సావిత్రి ఫోన్ తీసుకుంది. ‘హ్యాపీ బర్త్‌డే’ అంది.
‘‘ఏమిటీ న్యూయార్క్ వచ్చారు. మీ అమ్మాయిని మిస్ అయ్యారా!’’ అన్నాను నవ్వుతూ.
‘‘విన్నారుగా మీ కోడలు ఒంట్లో బాగోలేదు. మీ కోడల్ని జాగ్రత్తగా చూడండి అని అప్పగించారుగా. అందుకే వచ్చాను’’ అంది నవ్వుతూ!
‘‘ఎప్పుడో పెళ్లినాటి మాట ఇంకా గుర్తుందన్నమాట’’ అన్నాను.
‘‘ఆ ఆ! ఇప్పుడే అవసరం వచ్చింది. మళ్లీ గుర్తుచేసుకోవడానికి’’.
‘‘చాలా సంతోషం సావిత్రి’’ అన్నాను.
‘‘ఊరికే సంతోషించడం కాదు. మళ్లీ అమెరికా ప్రయాణానికి రెడీ అవండి, మీకు వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. రుూసారి తప్పించుకోవడం కుదరదు’’ అంది.
‘‘తప్పకుండా వస్తాను. నా పుట్టినరోజు బహుమతి అన్నారుగా. వచ్చి తీసేసుకుంటాను’’ అన్నాను నవ్వుతూ.
మరి కాసేపు తేజాతో, వౌళితో మాట్లాడి ఫోన్ పెట్టేశాను.
క్షణం సేపు చేతిలో వున్న ఫోన్ వంకే చేస్తూ వుండిపోయాను. సావిత్రి మామూలుగా అంది ‘వంశోద్ధారకుడు’ అని!
పదే పదే అనుకున్నాను. ఎందుకో మనసు చిత్రంగా స్పందించింది.
ఏ వంశానికి చెందింది? అన్న ప్రశ్న ఉదయించింది. మేధావి అయిన గొప్ప సైంటిస్ట్ వంశానికా? పాత సంప్రదాయాలను, దేశ సంస్కృతిని వదలలేని నా వంశానికా! చూడాలి!
చాలాసేపు అలా ఆలోచిస్తూనే గడిపాను. ఫోన్ చేసి రుూ వార్త అందరికీ చెప్పాను. ప్రతి ఒక్కరి మనసులోనూ ఆనందం చోటుచేసుకుంది.
చాలా ఏళ్ళ తరువాత మళ్లీ విమానం ఎక్కాను. అయితే రుూసారి తెలియని ప్రదేశాన్ని గురించి ఊహించుకుంటూ వెళ్ళలేదు. గతించిన గతాన్ని స్మరించుకుంటూ వెళ్లలేదు.
తెలిసినవన్నీ పునఃశ్చరణ చేసుకుంటూ ప్రయాణం చేశాను. రాబోయే ఆనందాలను తలచుకుంటూ వెళ్ళాను. అందుకే ప్రయాణం చాలా త్వరగా అయిపోయినట్లు అనిపించింది. నాతో తెచ్చిన నవల సగం కూడా తరగలేదు.
ప్రయాణంలో చాలా మార్పులు కనిపించాయి. విమానాలు పెద్దవిగా అనిపించాయ. ఎయిర్‌పోర్ట్స్ కూడా మారాయి అనిపించింది. కాని అప్పటికి, ఇప్పటికీ ఏ మార్పు రాని విమానంలో ఫుడ్ వాసన మాత్రమే.
ఎయిర్‌పోర్టులో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తేజా ఎప్పటికంటే అందంగా కనిపించింది. కొంచెం లావు అయింది. కడుపుతో వున్నట్లు స్ఫుటంగా కనిపిస్తోంది. మొహంలో సంతోషం ఆరోగ్యాన్ని సూచిస్తోంది.
పక్కన వౌళి మాత్రం ఎప్పటిలాగానే వున్నాడు. అన్యాయం కదా! ప్రపంచం ఎన్నో విధాలుగా పురోభివృద్ధి చెందినా, ప్రకృతి నిర్ణయాలు మాత్రం మారవు. భగవంతుడు ఖచ్చితంగా మగవాడే అయి వుంటాడు. అందుకే తన స్థానానికి ఏ మార్పులేకుండా చేసుకున్నాడు. నవ్వుకున్నాను.
తేజాని చూడంగానే నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. మామ్మ నన్ను చూచినంతగా తేజాని నేను చూసుకోవాలి అనుకున్నాను. వౌళి ఎంత జలసీ అయిపోతాడో అనుకున్నాను. నా ఆలోచనకు నాకే నవ్వు వచ్చింది.
‘‘ఏంటమ్మా, అంత నవ్వుకుంటూ వస్తున్నావు’’ అన్నాడు వౌళి.
‘‘ఏం లేదు’’ అని తల ఆడించి, తేజా వైపు తిరిగి ‘‘ఎలా వున్నావు, ఆరోగ్యం బాగుందా’’ అని అడిగాను.
‘‘ఎంత అన్యాయం’’ అన్నాడు. నేను పలకరిస్తూనే ఉన్నాను. నాకు సమాధానం చెప్పకుండానే తేజా ఆరోగ్యం గురించి అడుగుతున్నావు అన్నాడు నిష్ఠూరంగా.
‘‘సంతోషంతో నాలుగు పౌన్లు పెరిగిన నిన్ను ఏం అడుగుతాను చెప్పు’’ అన్నాను నవ్వుతూ.
‘‘గివప్ వౌళి, ఇక నువ్వు కాదు నెంబర్ వన్, ఆవిడ గ్రాండ్ చైల్డ్’’ అంది తేజా.
‘‘ఓ.కె. విత్ మీ’’ అని నవ్వుతూ కారు తీసుకురావడానికి వెళ్లాడు.
‘‘నేను తేజా మామూలు యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నాం.
పోయిన ఏడాదిలో మూర్తిగారింట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళ అమ్మాయి ఒక అమెరికన్ కుర్రాడిని పెళ్లి చేసుకుంది. అది మూర్తిగారిని, సావిత్రిని చాలా బాధపెట్టింది. వాళ్ళిద్దరికి రెండు జాతులమధ్య పెళ్లి మీద అభ్యంతరం కంటే రుూరోజుల్లో యిలాంటి పెళ్ళిళ్ళు ఎంత నిలుస్తాయో అన్న భయం ఎక్కువ.
పిల్లలు యిష్టపడ్డాక చేయగలిగేది ఏమీలేదని తెలిశాక, యిద్దరూ అంగీకరించారు. ఆ పిల్ల కూడా యిప్పుడే కడుపుతో వుంది.
సావిత్రికి ఒక్కసారిగా రెండు బాధ్యతలు మీద పడ్డాయి. నేను వస్తున్నానని తెలియగానే ఆవిడ మనస్సులో పెద్ద బరువు తగ్గినట్లయింది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి