డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడు వద్దనట్లు తల వూపాడు. ‘‘నైబర్స్‌గాని, గార్డుగాని చూస్తే వెంటనే పోలీసులని పిలుస్తారు. రుూ అమ్మాయిని తీసుకువెళ్లి కష్టడీలో వుంచుతారు. చూడబోతే ఏం తెలిసినట్లుగా లేదు’’ అన్నాడు.
మరో పదినిముషాలు గడిచాయి. ఆ అమ్మాయి ఏడుపు చాలా నిగ్రహించుకుంది.
‘‘నువ్వెళ్లి పడుకో. నేను కాసేపట్లో వస్తాను’’ అన్నాను వౌళితో.
వాడు నా వంక చూచాడు. ‘‘్ఫరవాలేదు. రేపు పొద్దునే్న వెళ్లాలి కదా!’’ అన్నాడు.
వాడు సందేహిస్తూ వుండిపోయాడు. ఫరవాలేదు వెళ్లు అన్నాను.
ఆ అమ్మాయి ఎదురుగా కూచున్నాను. ఆ అమ్మాయిని ఒకటిరెండుసార్లు క్రింద లాండ్రి రూమ్‌లో చూచాను. కాని పరిచయం లేదు. తెలుగువాళ్లే ననుకున్నాను. కొంతసేపు వౌనంగా గడిచిపోయింది.
‘‘నీ పేరేమిటి?’’ అడిగాను.
తల ఎత్తకుండానే ‘పద్మ’ అంది.
‘‘లే, లేచి తాళాలు తీసుకో’’ అన్నాను.
మారు మాట్లాడకుండా నుంచుంది. చీర అంతా నలిగిపోయి వుంది. మొహం పూర్తిగా వాడిపోయింది. రోజంతా భోజనం చేసినట్లు కూడా లేదు.
ఆ అమ్మాయి చేతిలోంచి తాళాలు తీసుకున్నాను. ఇద్దరం బయటకు రాంగానే తాళం వేశాను. ఎలివేటర్‌లో మా అపార్టుమెంటుకు వచ్చాం. కూచోమనంగానే వౌనంగా కూర్చుంది.
గ్లాసుతో వేడిచేసిన పాలు తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాను. కళ్ళెత్తి బేలగా చూసింది. ప్రపంచంలో వున్న దైన్యత అంతా ఆ అమ్మాయి కళ్లల్లోనే వుందనిపించింది.
‘తాగు’ అన్నాను. గ్లాసు అందుకుంది. నేను లోపలకువెళ్లి ఒక దిండు దుప్పటి తెచ్చి సోఫా మీద వేశాను.
ఖాళీ అయిన గ్లాసు అందుకని పడుకో అన్నాను.
దిండుమీద ముడుచుకు పడుకుంది. రెండు చేతులు చెంప కింద వుంచుకుని మరో దుప్పటిపైన కప్పి నా గదిలోకి వచ్చాను.
చప్పుడు విని వౌళి లేచి వచ్చాడు. వాడికి నిద్రపట్టినట్లు లేదు. ఏమయిందన్నట్లు చూచాడు.
తల వూగించాను. ఏమీ తెలియదన్నట్లు. ముందు గదిలో సోఫాలో పడుకుంది అన్నాను. ఆశ్చర్యంగా చూచాడు. ఆ ఇంట్లో ఎవరూ వున్నట్లు లేదు అన్నాను.
ఆ రాత్రి పడుకున్నాం. వళ్ళు తెలియకుండా నిద్రపోయింది ఆ అమ్మాయి ఒక్కతే! ఎన్ని రోజులు అయిందో పడుకుని.
నాకు నిద్ర పట్టలేదు. ఈ పిల్ల ఎవరో తెలియదు. ఆ అమ్మాయి సమస్య ఏమిటో తెలియదు. అర్థరాత్రి ఒక్కతే తలుపు తీసుకు వెళ్లిపోదు కదా! అనిపించింది. భయం వేసింది.
మధ్య మధ్య లేచి చూస్తూనే ఉన్నాను. వళ్ళు తెలియకుండా నిద్రపోతున్న ఆ అమ్మాయిని చూస్తే జాలి అనిపించింది.
ఎవరికి నిద్రపట్టినా, పట్టకపోయినా ఉష మాత్రం టంచనుగా 6 గంటలకు పాలకు లేచింది. వౌళి సీసా పట్టి నా పక్కన పడుకోపెట్టి తను రెడీ అయి వెళ్లిపోయాడు.
మెల్లిగా తొమ్మిది గంటలు అవుతుంటే ఆ అమ్మాయి లేచింది. ఆ లోపలా నా స్నానం, ఉష స్నానం అన్ని ముగించుకున్నాం.
మమ్మల్ని చూడంగానే సోఫాలోంచి చటుక్కున లేచి రెండు చేతులు జోడించింది. ‘‘మీకు చాలా శ్రమ కలిగించాను’’ అంది మెల్లిగా.
‘‘పద నీ అపార్టుమెంట్‌కు వెడదాం. స్నానం అదీ చేద్దువుగానీ’’ అన్నాను.
ఎందుకో సందేహంగా ఆగిపోయింది. ‘‘బిల్డింగ్‌వాళ్లు ఏమయినా అంటారేమో! ఫ్యాన్ విరిగిపోయింది’’ అంది భయంగా!
మనసులోనే అనుకున్నాను. జరగబోయిన ఘోరం ఆగింది, ఫ్యాన్ ఒక లెక్క అనుకున్నాను.
ఇద్దరం పైకి వెళ్ళేసరికి, అపార్టుమెంటు ముందు అయిదారుగురు ఆందోళనగా నుంచుని ఉన్నారు. అందరి మొహాలలోను భయం ఆందోళన తొంగి చూస్తున్నాయి.
ఎలివేటర్‌లోంచి బయటకు వచ్చి నడిచి వస్తున్న పద్మని చూడంగానే అక్కడున్నవారిలో ఆడపిల్లలు గబగబా వచ్చి కావలించుకున్నారు. ఒక అమ్మాయి అయితే ఏడ్చేసింది.
ఎంత భయపడిపోయానో తెలుసా. పొద్దుటినుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశానో, ఇక వుండబట్టలేక ఇక్కడికి వచ్చేశాం.
‘‘ఎంత బాదినా తలుపు తియ్యడంలేదు. ఏం చేయాలో తెలియక భాస్కర్‌గారికి ఫోన్ చేశాం. ఆయన తను వచ్చేవరకు మా అందరినీ ఇక్కడే వుండమన్నారు’’.
పద్మ ఏమీ సమాధానం ఇవ్వలేదు. మెల్లిగా అపార్టుమెంటు తాళం తీసి తలుపు తెరిచింది. ఆ లోపల వున్న సన్నివేశం చూసి అందరూ తెల్లమొహం వేశారు. భయం భయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
అందరూ లోపలకు వెళ్లంగానే నేను క్రిందకు వచ్చాను.
అయినా మనసు పైన ఏం జరిగిందో అని ఆలోచిస్తూనే ఉంది.
ఇంతలో ఫోను గణగణమోగింది.
వౌళి ‘‘ఏం జరిగింది?’’’ అన్నాడు.
‘‘ఆ అమ్మాయి లేచింది. పైకి వెళ్లాం. ఆ అమ్మాయి స్నేహితులు అంతా వచ్చారు. నేను క్రిందకు వచ్చేశాను. అక్కడ విన్నదేమిటంటే, రుూ అమ్మాయి భర్త- టవర్స్‌ని గుద్దేసిన విమానంలో ప్రయాణం చేస్తున్నాడు’’ అన్నాను.
‘‘ఓ మై గాడ్’’ అన్నాడు ఆపుకోలేక. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. ‘‘ఎవరో వచ్చారు వౌళి’’ మళ్లీ చేస్తాను అని ఫోన్ పెట్టేశాను.
తలుపు తెరిచేసరికి ఎదురుగా ఓ అపరిచితుడు నిలబడి ఉన్నాడు. ఎవరో ఆఫీసర్‌లా వున్నాడు.
‘‘నన్ను చూడంగానే రెండు చేతులు జోడించాడు’’.
‘‘ఐ యామ్ భాస్కర్’’
పై అమ్మాయి తాలూకు అనుకున్నాను. ‘‘రండి’’ అని లోపలకు ఆహ్వానించాను.
‘‘్థంక్యూ వెరీమచ్ నిన్నటి సహాయానికి’’ అన్నాడు.
‘‘మరొకరయి వుంటే రుూపాటికి పోలీసులతో పెద్ద గొడవ అయిపోయి ఉండేది. మీరు, మీ అబ్బాయి కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుని నిర్వహించారు’’. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి