డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-119

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరి పెంచుతున్నదెవరూ!’’ అంది తేజా! నావంక చూస్తూ!
‘‘బాగానే చూడాలని ప్రయత్నిస్తున్నాను. నీ అంత బాగా కాకపోయినా’’ అన్నాను.
‘‘ఇంకా నయం. మీలాగా నేనెప్పటికీ చూడలేను’’ అంది మెల్లిగా.
వౌళి తేజా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ‘‘అన్ని మామూలు అవుతాయి. మాటర్ ఆఫ్ టైమ్ హావ్ పేషెన్స్’’ అన్నాడు.
కళ్లెత్తి వౌళి మొహంలోకి చూసింది, రీ అస్యూరెన్స్ కోసం అన్నట్లు. వౌళి తల ఊగించాడు మెల్లిగా నన్ను నమ్ము అన్నట్లు.
కాసేపు వాళ్లు వంటరిగా వుండటం ముఖ్యం అనిపించింది. లేచి విజిటర్స్ లౌంజ్‌వైపు వచ్చాను.
అక్కడ చాలామంది వున్నారు. శనివారం మూలంగా చాలామందికి వాళ్ల బంధువులను, స్నేహితులను చూచుకోవడానికి సమయం దొరికి వుంటుంది. ఒకళ్లిద్దరు పేషెంట్స్ అక్కడే కూచుని తమవాళ్లతో మాట్లాడుకుంటున్నారు. కొద్దిమంది తమను చూడటానికి వచ్చినవాళ్ళతో కారిడార్స్‌లో మెల్లిగా నడుస్తున్నారు.
నాకు కూచునేందుకు జాగాలేదు. అక్కడ వాళ్లందరితో ఎందుకులే అనిపించి విండోలోంచి కింద కోర్టు యార్డ్‌లోకి చూస్తూ నుంచున్నాను.
ఎదురుగా వున్న పేషెంట్ గదిలోంచి బయటకు వచ్చి ఎలివేటర్ దగ్గరగా వెళ్లబోతూ కిటికీ దగ్గర నన్ను చూచి, నా వైపుగా వచ్చాడు రఘురామ్. అతన్ని అక్కడ చూడటం కొంచెం ఆశ్చర్యమనిపించింది.
అతని వంక చూడంగానే, తల వూపి విష్ చేశాడు.
ఎప్పుడూలాగా సూట్, టై, వేసుకుని లేడు. మామూలుగా గోల్ఫ్ షర్ట్‌తో వున్నాడు. చాలా ఇన్‌నార్మల్‌గా. కాని ఏదో తేడా కనిపించింది.
‘‘ఎలా వుంది తేజా!’’
‘‘్ఫరవాలేదు’’
కొద్ది క్షణాలు వౌనాన్ని అనుసరించాయి.
‘‘నిన్ను ఒక కప్ కాఫీకి ఆహ్వానించవచ్చా!’’ అన్నాడు ఇంగ్లీషులో.
క్షణకాలం తటపటాయించి అంగీకార సూచకంగా తల ఊగించాను.
ఇద్దరం కాఫీ షాప్ వైపు నడిచాం.
ఖాళీగా వున్న కుర్చీ చూపిస్తూ, తను కౌంటర్ వైపు వెళ్లాడు.
రెండు చేతులతో కాఫీ పట్టుకుని ఒకటి నా ముందు పెట్టి, రెండవది తను తాగుతూ కూర్చున్నాడు.
అతని దృష్టి నామీద వుంటుందని నాకు తెలుసు. అందుకే తల ఎత్తి చూడాలనిపించలేదు.
రుూ హాస్పిటల్‌లో ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడూ వంటరిగా కలవలేదు. కలవాలనిపించలేదు కూడా! ఇప్పుడు కూడా నాకా కోరిక లేదు. కాని సహాయమందుకున్న సభ్యత అడ్డువచ్చింది.
‘‘ఇనే్నళ్ల తరువాత నిన్ను రుూ హాస్పిటల్‌లో చూస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అన్నాడు.
‘‘అసలు ఎక్కడో అక్కడ చూస్తాననుకున్నాడన్నమాట అనుకున్నాను మనసులో. ఆ మాట పైకి అనలేదు. నాకు మాటలు ఎటో వెళ్లడం ఇష్టం లేదు.
‘‘మీరు శనివారాలు కూడా పనిచేస్తారా!’’ అని అడిగాను.
‘‘చేస్తూనే వుంటాను. 7 రోజులు. కాని ఇవాళ పనికోసం రాలేదు. నా లాబ్ అసిస్టెంట్ కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్రాజెడీలో దెబ్బలు తగిలాయి. అతను కూడా ఇంకా హాస్పిటల్‌లోనే వున్నాడు. చూడటానికి వచ్చాను’’.
‘‘లాబ్‌లో పనిచేసేవాడికి, అక్కడేం పని అన్నట్లుగా చూశాను’’.
‘‘వాడి గర్ల్‌ఫ్రెండ్‌ని ఆఫీసులో దింపడానికి వెళ్లాడుట. రెండవ టవరు కూలిపోయేటప్పుడు అక్కడ వున్నాడు. ఆ టవర్ నుండి విసిరివేయబడ్డ రాళ్లు తగిలాయి. అదృష్టవంతుడు. కళ్లు పోవాల్సింది..’’ అన్నాడు.
‘‘నా జన్మలో ఇలాంటి సంఘటన కళ్లతో చూస్తాననుకోలేదు. నా వ్యక్తిగత జీవితానికి ముడిపడుతుందనుకోలేదు’’ అన్నాను.
‘‘అనుకోనివి సంఘటనలు చాలా చూసి వుంటావు నీ జీవితంలో’’ అన్నాడు, మాటలు వెదుక్కుంటూ.
సమాధానం ఇవ్వకుండా లేచి నుంచున్నాను. నాకు మాట్లాడాలని లేదు. అతనికి మాటలు దొరకడంలేదు. ఇక వెళ్లడం మంచిదనిపించింది.
రెండు కాఫీ కప్పులు పారేసి తిరిగి వచ్చాడు.
నాతోపాటు బయటకు వచ్చాడు. ‘‘నువ్వు చాలా రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నావు ఇవాళ’’ అన్నాడు.
‘‘తేజా గురించేనా!’’ అడిగాడు మళ్లీ.
తల ఊగించాను. ‘‘బయటకు కనిపించేదంతా నిజం కాదు. మనసులో చాలా మదనపడుతోంది. అదే నా వర్రీ!’’ అన్నాను.
‘‘చాలా దారుణమయిన దృశ్యాలు ప్రత్యక్షంగా చూసింది. దెబ్బతిన్నది. తను పనిచేసే ఆఫీసు, స్ట్ఫా అందరూ దగ్ధమయిపోయారు. తనతోపాటు మెట్లు దిగుతున్నవాళ్లు చచ్చిపోయారు. వాళ్లతో కొన్ని గంటలు శవాల మధ్యనే గడిపింది. ఇవన్నీ సామాన్యమైన విషయాలు కాదు మనిషి జీర్ణించుకోవడానికి. అందులో చాలా చిన్న వయస్సు కదా టైమ్ పడుతుంది వాటిని అధిగమించడానికి’’ అన్నాడు.
వౌనంగా విని వూరుకున్నాను. అందరితో అదే నేను చెప్తున్నాను. ధైర్యం కలిగిస్తున్నాను. కాని నాకు మరొకరి దగ్గరనుండి రీ అస్యూరెన్స్ అవసరం అయిందేమో!
డోంట్ వర్రీ. షి విల్ గెట్ బెటర్. ఆ అమ్మాయికి చాలా ఫ్యామిలీ సపోర్టు ఉంది. మీ అందరి సమక్షంలో కోలుకుంటుంది. వౌళి చాలా డివోటెడ్ మాన్. హి విల్ హెల్ప్ హర్ అన్నాడు.
క్షణం అతని మొహంలోకి చూచి దృష్టి మరల్చుకున్నాను. వౌళిని ప్రశంసిస్తున్నాడు. కాని అతని నోటంబడి వస్తూన్న పొగడ్త వింటే సంతోషం కలిగించలేదు. ఎందుకో చేదుగా వినిపించింది.
కాఫీ షాపునుండి అతను వెళ్లిపోతాడేమోనని ఎదురుచూచాను. వెళ్లిపోతే బాగుండునని కూడా తలిచాను. కాని నాతోపాటు తేజా రూమ్ వైపు నడిచాడు.
రూమ్ దగ్గరగావచ్చేటప్పటికి లోపలనుంచి వౌళి గొంతు వినిపిస్తోంది. తలుపు దగ్గర ఆగిపోయాము.
‘‘జీవితంలో ఏది కోల్పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చు తేజా! ప్రాణం తప్ప. కొద్ది సంవత్సరాలలో మళ్లీ ట్విన్ టవర్స్ పైకి లేచినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి