డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-120

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరిగి చూడలేనిది శిథిలమయిన ఆ మూడు వేలమంది తప్ప.
‘‘లేదు తేజా. ఎవ్వరి పాత్రను ఎవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు. నేను, అమ్మ, ఉష జీవితంలో నీ స్థానం ఎప్పుడూ ఇవ్వలేం. అది చాలా చిన్నపిల్ల కాబట్టి దానికి ఏమీ తెలియటంలేదు. కాని కొంచెం ఊహ తెలిసేటప్పటికి నీ ఉనికిని గ్రహిస్తుంది.
నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దానికోసం, అది పుట్టాకా, పుట్టకముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నావు. తినే ఆహారం, వ్యాయామం అన్నిట్లో. కాఫీ, టీ మానేశావు. నీకెంతో ఇష్టమైన వైన్ మానేశావు. ఉషకి మంచిది కాదేమోనని ఎనస్థీషియా కూడా వద్దన్నావు. రెండు రోజులు నరకయాతన అనుభవించావు. నిజం చెప్పు. ఇప్పటి నీ నెప్పులు అప్పటి వాటితో సమమేనా! ఉషకోసం అన్నీ భరించావు. ఇప్పుడు కూడా అదే చెయ్యాలి నువ్వు’’ అన్నాడు.
‘‘నా చిన్నప్పుడు నిజంగా మా అమ్మ నాకోసం ఎంత తాపత్రయపడేదో చెప్పలేను. మా తాతయ్య, మామయ్య నాకేదో లోటు జరిగిందని అనుకోకూడదని, ఎన్నో విధాలా ప్రయత్నం చేశారు.
కాని మా స్నేహితుల ఇళ్లకి వెళ్లొచ్చినపుడు నా మనసు చిన్నబోయేది. వాళ్లందరిలా నా జీవితంలో నాన్న లేడనిపించేది.
ప్రపంచానికంతకూ తెలిసిన తండ్రి నాకు తెలియదు. నేను అతనికి తెలియదు. అది నన్ను తరచు ముల్లులా గుచ్చుకుంటూనే వుంది. ఇవాళ నేనిలా మామూలుగా ఉన్నానంటే మా అమ్మే కారణం. ఆవిడ కుటుంబమే కారణం.
‘‘యిప్పుడు నీకు బాదర్ చేయడంలేదా, డా.రఘురామ్‌గారిని చూస్తే’’ అడిగింది తేజా!
‘‘నేను లేదు అంటే నువ్వు నమ్ముతావా?’’ అడిగాడు వౌళి.
వౌనం వహించింది తేజా.
‘‘నాకు సమస్య అనిపించిన అన్నిటికి మా అమ్మే పరిష్కారం చెప్తుంది. ఇప్పుడు కూడా అంతే! ఇప్పుడు నాకు నీ ఆరోగ్యమే ముఖ్యం. అది ఎవరివల్ల లభించినా సరే! సరే ఇతర విషయం నన్ను బాదర్ చెయ్యనీయను. యిప్పుడు అంతే’’ అన్నాడు వౌళి.
పక్కనే నుంచుని వున్న రఘురామ్ ఏమనుకుంటున్నాడో అనిపించింది ఒక్క క్షణం! కానీ అతని మొహం వంక కూడా చూడదల్చుకోలేదు నేను.
‘‘ఎలాంటి సమస్యలు ఉషకు రాకూడదు. దాన్ని మనిద్దరం పెంచాలి. దానికి ఏ లోటూ వుండకూడదు. ప్రపంచంలో దేన్నిగురించి నువ్వు ఆలోచించినక్కర్లేదు. ఒక్క ఉషకోసం- దాని భవిష్యత్తు కోసం నువ్వు బాగుపడాలి. మనసులో అదే ధ్యేయంగా పెట్టుకో’’. ధైర్యం చెప్తున్నాడు వౌళి.
‘‘ఒక్క ఉషకోసమేనా! నీకక్కర్లేదన్నమాట’’ తేజా! కొంచెం లైట్‌గా.
వౌళి కూడా ‘‘అక్కర్లేదు. నాకు నా అమ్మ వుంది. ఉషకి దాని అమ్మను ఇవ్వు. ఆ తరువాత ఏమయినా, టైమ్ మిగిలి వుంటే నేను తీసుకుంటాను’’ అన్నాడు నవ్వుతూ!
‘‘నీ ఆరోగ్యం బాగుపడంగానే నేను చెయ్యబోయే మొదటి పని ఏమిటో తెలుసా. మరో చోట ఉద్యోగం చూసుకోవడం. రుూ న్యూయార్క్ నుంచే వెళ్లిపోదాం. చేదు అనుభవాలకు దూరంగా’’ అన్నాడు.
‘‘చేదు అనుభవాలన్ని నా మనసులో వున్నాయి వౌళి. వూర్లే కాదు, నేనెక్కడికి వెళ్లినా అవి నాతోటే వస్తాయి’’ అంటూ నిట్టూరుస్తూ!
‘‘అరె ఉష నీకో బహుమతి పంపింది. ఇవ్వడమే మర్చిపోయాను’’ అన్నాడు వౌళి తేజాని హుషారుచేయాలని.
‘‘ఉషా?’’ ప్రశ్నార్థకంగా చూచింది తేజా!
‘‘యస్!’’ అంటూ పాకెట్‌లోంచి ఒక ఫొటో తీసి ఇచ్చాడు. నుంచుని, తేజా నుదుటిమీద మృదువుగా ముద్దుపెట్టుకున్నాడు.
‘‘ఉష నాకు ఇచ్చి దీన్ని అమ్మకు ఇవ్వమంది’’ అన్నాడు నవ్వుతూ.
ఆ ఫొటో ఏమిటో నాకు తెలుసు. నేనే తీశాను కూడా! వౌళి ఉషను ఎత్తుకుని, దాని పెదిమలను తన చెంపకు ఆనించుకున్నాడు. అచ్చంగా ఉష తండ్రికి ముద్దుపెడుతున్నట్లే వుంది. ఆ ఫొటోలో.
‘‘నీకు కూడా ఉషకో బహుమతి ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వు. తీసుకువెళ్లి దాని బుగ్గమీద పెట్టి అమ్మ పంపింది అని చెప్తాను’’ అన్నాడు చిరునవ్వుతో.
‘‘ఏమీ అక్కర్లేదు. నా బహుమతులు ఏవీ నీతో పంపను. నేనింటికి రాంగానే నేనే ఇచ్చుకుంటాను’’ అంది తేజా.
‘‘గుడ్. అదీ స్పిరిట్ అంటే. నీ బహుమతులు నాకేం వద్దులే! నీ బేబికే ఇచ్చుకో’’ అన్నాడు. వౌళి కంఠంలో సంతోషం తొంగి చూస్తోంది.
తలుపు దగ్గర చప్పుడు చేశాను. వౌళి ఎత్తి చూచాడు. మా ఇద్దరిని పక్కన పక్కన చూచిన వౌళి ముఖంలో ఏవో భావాలు పరిగెత్తాయి. అవి ఏమిటో నాకు అర్థం కాలేదు. వాటిని గురించి ఇప్పుడు ఆలోచించదలచుకోలేదు.
వౌళి వంక చూశాను. ఇక వెడదాం అన్నట్లు. వాడు లేచాడు. ‘‘పోనీ నువ్వుండు. నేను టాక్సీలో వెళ్లగలను. తేజా మీద చెయ్యి వేసి నొక్కుతూ! ఇంక వెళ్లాలి తేజా!’’ అన్నాను.
‘‘మీ ఆయన కోసం అన్నం వండాలి. నీ కూతురికి పాలు పట్టాలి. నీ స్నేహితురాలిని రిలీజ్ చెయ్యాలి’’ లిస్ట్ చదివాను చిరునవ్వుతో.
తేజా మొహంలో కూడా చిరునవ్వు తొంగిచూచింది.
‘‘మీకు నేను ఎలా థాంక్స్ చెప్పగలను’’ అంది. బదులు ఎలా తీర్చగలను.
‘‘నువ్వు అప్పుడే తీర్చేశావు’’ అన్నాను. అదెలా అన్నట్లు చూచింది.
‘‘నీ మొహంలో సంతోషం కనిపిస్తే చాలు’’ అన్నాను. నువ్వు సంతోషంగా వుంటే వౌళి సంతోషంగా ఉంటాడు. మీ ఇద్దరూ సంతోషంగా వుంటే నేను సంతోషంగా ఉంటాను. సంతోషం అంటువ్యాధి తెలుసా. దానికి ఎవరూ క్యూర్ కనిపెట్టలేరు’’ అన్నాను నవ్వుతూ.
రఘురామ్ కూడా నవ్వుతూ, తేజాని పలకరించాడు. వౌళికి షేక్‌హాండ్ ఇచ్చాడు.
‘‘హౌ రుూజ్ యువర్ బ్యూటిఫుల్ డాటర్?’’ అన్నాడు.
వౌళి బాగున్నట్లు తల వూగించాడు. తేజా కొత్త ఫొటోస్ చూపించింది.
రఘురామ్ దానివంక, తేజా వంక, నా వంక తరచి చూసి, తిరిగి ఫొటో ఇచ్చేస్తూ వౌళి వంక చూచి అన్నాడు.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి