డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-121

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యు ఆర్ ఎ లక్కీమాన్. యు ఆర్ సరౌండెడ్ విత్ త్రీ బ్యూటీఫుల్ ఉమెన్’’ అన్నాడు. వౌళి కూడా నవ్వాడు. మనసులో ఏమనిపించిందో మరి.
అడిగాడు వౌళి ఇంటికి వెళ్లే దోవలో.
‘‘రఘురామ్ ఎక్కడ కలిశాడు’’
‘‘విజిటర్స్ లేంజ్ విండోలోంచి చూస్తూ నుంచున్నాను. ఎవరినో విజిట్ చెయ్యడానికి వచ్చాడుట. ఎలివేటర్ ఎక్కబోతూ చూశాడు.
‘‘...’’
‘‘కాఫీ తాగడానికి ఇన్‌వైట్ చేశాడు’’ అన్నాను.
‘‘.....’’
ఎందుకో గిల్టీగా అనిపించింది అన్నాను.
ఆశ్చర్యంగా నా మొహం వంక చూచాడు. ‘‘గిల్టీగానా! ఎందుకూ కలిసి కాఫీ తాగినందుకా’’ అన్నాడు ఆశ్చర్యంగా.
కాదు అన్నట్లు తల ఊగించాను.. ఇంకొంచెం ఆశ్చర్యంగా చూశాడు.
‘‘అతనితో వెళ్లి కాఫీ తాగాలనిపించినందుకు’’ అన్నాను. ‘‘తేజా విషయంలో చాలా సహాయం చేశాడు. ఆ మాత్రం సభ్యత చూపాలి కదా! అందుకే’’ అన్నాను.
చెప్పేందుకు ఏమీ లేదనిపించిందేమో! వౌనంగా వూరుకున్నాడు. టాక్సీ యిల్లు చేరుతుంటే అన్నాడు.
‘‘ఇలాంటివాటి గురించి ఎక్కువగా ఆలోచించకు’’ అన్నాడు.
నేను ఆలోచించనక్కర్లేదు. వాటంతట అవే చుట్టుముట్టేస్తాయి. నాకు కోపం వచ్చేస్తోంది. నా మనసు ఇంత బలహీనమయినందుకు.
కళ్లముందు లేనివి, మనసులోంచి దూరం చెయ్యగలిగాను. కళ్లముందు కనిపించేటప్పటికి ఎక్కడో దాగివున్న భావాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఆ సంగతి నాకు తెలుసు. నా మనసు నే చెప్పిన మాటవినడంలేదు.
రాత్రి బాగా ఆలస్యమయింది. టీవీలో పాత సినిమా వస్తోంది. వౌళి, ఉష నిద్రపోతున్నారు..
నాకెందుకో లేచి మంచంమీద పడుకోవాలనిపించడంలేదు. టీవీ స్క్రీన్ మీద బొమ్మలు చూస్తూ వుండిపోయాను.
తలుపు మునివేళ్లతో కొట్టినట్లనిపించింది. ఉలిక్కిపడ్డాను. తల ఎత్తి గడియారం వంక చూచాను. దాదాపు 12.00 గంటలు అవుతుంది.
రుూ టైమ్‌లోనా? డోర్ వ్యూలోంచి చూచాను. ఆశ్చర్యంగా తలుపు తెరిచాను.
ఎదురుగా పద్మ.
కిందటివారం కంటే చిక్కిపోయింది. కళ్లు లోతుకు వెళ్లాయి. బోసి మెడ, బొట్టులేని నుదురు, చాలా బాధగా ఆ అమ్మాయి వంక చూచాను.
కళ్లతోనే రమ్మనమని సూచించి పక్కకు తప్పుకున్నాను.
‘‘అన్నయ్యగారు పడుకున్నారా’’ అంది రహస్యం అడిగినట్లే!
తల వూగించాను.
ఇంకా ముందుకు వస్తే ఆయనకు డిస్ట్రబ్ అవుతుందేమోనని.
‘‘డిస్ట్రబ్ ఏం లేదు. వాడి గదిలో వాడున్నాడు’’ అన్నాను.
‘‘నిద్ర పట్టలేదా!’’ నీతో వుండే అమ్మాయి రాలేదా?
లేదన్నట్లు తల ఊపింది. ఆ అమ్మాయికి ఇవాళ ఏదో పని వచ్చింది. రాలేకపోయింది.
ఇక్కడకు వస్తున్నట్లు నీ స్నేహితురాలికి చెప్పావా?
‘లేదన్నట్లు’ తల వూపింది.
‘‘క్రిందటిసారి ఎంత కంగారు పడ్డారో గుర్తుంది కదా! ఫోన్ చేసి చెప్పు. లేటయినా ఫరవాలేదు. వాళ్లు కంగారు పడతారు’’.
నా మాట తీసేయలేక ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఇంకా పడుకోలేదు. ఆఫీసు పని చేసుకుంటోంది.
‘‘్భజనం చేశావా?’’
తల ఊగించింది. అవునూ కాదూ అన్నట్లు. ‘‘పొద్దు ఉప్మా చేశాను. అదే తిన్నాను సాయంత్రం కూడా!’’ అంది.
ఆ రోజువండిన అన్నం వుండిపోయింది. లేచి ఓ ప్లేట్‌లో పెట్టాను. పైన పెరుగు వేసి టేబుల్ మీద పెట్టాను.
‘‘ఇప్పుడు వద్దండి. చాలా ఆలస్యమయింది’’ అని మొహమాటపడింది.
‘‘్ఫరవాలేదు రా!’’ అన్నాను.
వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. గ్లాసుతో నీళ్లు ఇవ్వబోయాను.
నోట్లో పెట్టుకోబోతున్న ఆ అమ్మాయి కళ్లల్లోంచి నీళ్లు బొట బొట రాలి బుగ్గలమీంచి జారిపోయాయి.
ఆ అమ్మాయికి వచ్చిన కష్టం సామాన్యమయినది కాదు. తల్లి గుండెల్లో తల పెట్టుకుని స్వాంతన పొందాల్సిన సమయం. ఇలా వంటరిగా, పరాయిచోట’’ నా మనసు బాధగా మూలిగింది.
‘‘మీ అమ్మా, నాన్నలను చూడాలని వుందా’’ అడిగాను.
మట్లాడకుండా కళ్లు తుడుచుకుంది. బలవంతాన తిన్నది.
లేచి వెళ్లి సోఫాలో కూర్చుంది. ఓ అయిదు నిమిషాలు కాంగానే ‘వస్తానండి’ అని లేవబోయింది.
ఆ అమ్మాయి వంక చూచాను. భయపడుతోంది. కాని తను ఇక్కడ ఉండటం సముచితం అని అనిపించడంలేదు.
ఫరవాలేదు. పడుకో. పొద్దునే్న వెళ్లిపోదుగాని అని సోఫామీద పక్క వేశాను.
సంకోచిస్తున్న ఆ అమ్మాయి భుజంమీద చేయి వేశాను. ఆ స్పర్శలో ఏం జరిగిందో వెంటనే నన్ను కౌగిలించుకుంది.
‘‘ఆంటీగారు నన్ను క్షమించండి. మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అంది ఏడుస్తూ’’.
ఆ అమ్మాయి కొంచెం ఉపశమనం పొందేవరకు వెయిట్ చేశాను.
‘‘నువ్వేం ఇబ్బంది కలిగించడంలేదు. ఏడవకు’’ అన్నాను.
‘‘అన్నయ్యగారు ఎన్నింటికి వెడతారో చెప్పండి, ఆ లోపల పైకి వెళ్లిపోతాను’’.
‘‘ఏం అవసరం లేదు. వాడికి రుూ గదిలో పనేం వుండదు పొద్దునే్న! మామూలుగా పడుకో’’ అన్నాను.
ఆ అమ్మాయికి నిద్ర రావడంలేదు. నాకు రావడంలేదు.
టీవీ చూస్తూ కూర్చున్నాం. మధ్యలో వున్నట్లుండి పదకోండో తారీఖుని చూపించడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి దిండులో ముఖం దాచుకుంది. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి