డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదేమిటి? ‘‘నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోవడానికి భయం దేనికి?’’
కొద్దిసేపు మాట్లాడకుండా వుండిపోయింది. చివరకు అంది ‘‘ఒకసారి నేను అక్కడికి వెళ్లిపోయాక, నా ప్రమేయం ఏమీ వుండదు. నేను ఎక్కడుండాలో, ఏం చెయ్యలో అంతా మా అత్తగారి కుటుంబం నిర్ణయిస్తుంది. రుూ డబ్బు వ్యవహారాలన్నీ వాళ్లే చూస్తానంటారు. నాకు అసలు ఏమీ తెలియదు. ఇంత పెద్ద డబ్బు నాతో వస్తే, దాన్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు’’.
‘‘ఇక్కడ కూడా, నేనేం చేసేదాన్ని కాదు. అంతా రమేష్‌గారు చూసుకునేవారు. కేవలం ఆయన డబ్బిస్తే, దానితో ఇంట్లోకి కావలసినవి కొనుక్కోవడం తప్ప నాకేమీ తెలియదు. అది కూడా, అతను పక్కన వున్నప్పుడే’’ అంది.
జాలిగా చూశాను. ‘‘కొత్తదేశం. కొత్తగా పెళ్లి అయింది. మొగుడితో చెట్టాపట్టాలేసుకు తిరగడం తప్ప మరో అనుభవం లేదు’’ నిట్టూర్చాను.
మన దేశంలో ఆడపిల్లకు ఓ ఇరవై ఏళ్లు దాటేటప్పటికి పెళ్లి అనుకుంటారు. కాని వాళ్లకు లోకజ్ఞానం ఎంత వుందా అని మాత్రం చూడరు అనుకున్నాను. ‘‘నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒకసారి ఇండియా వెళ్లాక, మీ నాన్నగారు వాళ్లు నీ బాగోగులు చూస్తారు. వాళ్ళు డబ్బు వ్యవహారాలు కూడా చూచిపెడతారు’ అన్నాను.
‘‘మా నాన్నగారు అసలు ఇంత డబ్బు కనివినీ ఎరుగరు. మా మామగారి కుటుంబం అంతా ముందుకు వస్తుంది. అందులో నాకు మా మరిదిని గురించే భయం. నాకే కాదు అతన్ని చూస్తే మా మామగారికే భయం’’ అంది.
ఏం మాట్లాడాలో తెలియక వూరుకున్నాను. తనతో తెచ్చిన ఒక ఉత్తరం నా చేతికి ఇచ్చి చదవమంది.
ఆ ఉత్తరం ఆ అమ్మాయి మరిది రాశాడుట. కాని ఆ ఉత్తరం ఆరంభమే నాకు కొంచెం చిరాకు అనిపించింది.
‘వదిన’ అని సంబోధించలేదు. అన్నగారుపోయిన విచారం కనబరచలేదు. సరాసరి కేవలం రుూ విధ్వంసంలో బాధితులకు అందించే నష్టపరిహారం దాని గురించి రాసి వుంది. అది రాబట్టుకోకుండా ఇండియా రావద్దని రాశాడు. పద్మా నీలాంటివాళ్లకు గవర్నమెంటు చాలా డబ్బు ఇస్తారు. ఏదీ వదులుకోకు. అన్నీ డిమాండ్ చేసి తెచ్చుకో. అది చేతికి రాకుండా ఇండియాకు రాకు. ఒకసారి నీ చేతికి వచ్చాక, నేను అన్నీ మానేజ్ చేసి పెడతాను. రుూ తీరులో వుంది ఉత్తరం.
ఉత్తరం మడిచి పద్మ చేతికి ఇచ్చాను. ‘‘కంగారు పడకు. ఎవరు, బలవంతంగా ఏమీ చెయ్యలేరు. నువ్వు అన్నీ ఆలోచించుకుని చేద్దువుగాని’’ అన్నాను.
నా మాటలు ఆ అమ్మాయికి పెద్దగా ధైర్యం కలిగించలేదు.
‘‘మీకు తెలియదు ఆంటీగారు, అతను డబ్బుకోసం ఏపనైనా చేయగలడు. గవర్నమెంటు రానివ్వరు కాబట్టి కాని, లేకపోతే అమెరికాయే వచ్చేసేవాడు. ఇక్కడనుండి ఎంత డబ్బు వస్తుందో ఏం కేటాయిస్తున్నారో అన్ని విచారిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతనే ఫోన్ చేసి నాకు ఎంత డబ్బు రావచ్చో అది ఎలా చేపట్టాలో అన్ని మొదలుపెట్టాడు.
‘‘చివరకు నేనే అన్నాను. వాటి గురించి నాకు తెలియదు. అన్నీ భాస్కర్‌గారు చూస్తున్నారని’’.
ఆ మాట అతనికి మరీ కోపం తెప్పించింది. ఆ భాస్కర్‌గాడిని నేను నమ్మను. వాడి మూలంగానే అన్నయ్య చచ్చిపోయాడు’’ అన్నాడు.
‘‘్భస్కర్‌గారి మూలంగానే మీ అన్నయ్య అమెరికావచ్చి అంత మంచి ఉద్యోగం చేశారు’’ అన్నాను.
‘‘నువ్వు ఎవరినీ నమ్మకు పద్మా! ఒకసారి ఇక్కడకు వచ్చేస్తే, నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను’’ అన్నాడు.
‘‘నాకు ఏమిటో చాలా కంపరం అనిపించింది. కోట్ల రూపాయలతో ఇండియా వెడితే! నేను బతికి వుండకపోయినా ఆశ్చర్యం లేదు’’ అంది దిగులుగా. రుూ డబ్బు వాళ్లకు కూడా చెందడంలో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ నా జీవితం నిర్బంధం అయిపోతుందేమోనని భయంగా వుంది’’.
నేను వౌనంగా వుండిపోయాను. ఇలాంటి సమస్యకు నాలాంటివాళ్లు పరిష్కారం చూపగలిగేది కాదు. వెంటనే ఏం సమాధానం చెప్పాలో కూడా తోచలేదు. కొంతసేపు గడిచాక అన్నాను.
వూరికే కంగారుపడకు, భాస్కర్‌గారితో కూడా మాట్లాడుదాం. ఆయనేమంటారో కనుక్కుందాం. ఆయన ఒకర్ని మోసం చేసే వ్యక్తిలా నాకు అనిపించలేదు అన్నాను.
ఆ పూట అంతా చాలా సాలోచనగా వుండిపోయింది.
ఆ అమ్మాయి ఆలోచన మళ్లించాలని ‘‘మళ్లీ కాలేజీలో చేరి చదువుకో!’’ అన్నాను.
‘‘ఇప్పుడు నేను చదవలేను’’ ఆంటీగారు!
ఆ రోజు ఉదయం న్యూస్‌పేపర్‌లో చూశాను. ఒక 75 సంవత్సరాలు దాటిన స్ర్తి, హైస్కూలు పూర్తిచేసిందని. ఫొటో వేశారు. అది ఆవిడ చిరకాల కోరికట. చిన్నప్పుడు హైస్కూలు నుంచి డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు పెద్దవాళ్ల స్కూల్లో చేరి పూర్తిచేసింది. అమెరికాలో హైస్కూలుకు కూడా పెద్ద గ్రాడ్యుయేషన్ వేడుక చేస్తారు. గ్రాడ్యుయేషన్ కోటు, టోపీ అన్నీ వుంటాయి.
వాటన్నింటినీ వేసుకున్న ఫొటో పేపర్లో వేశారు. ఆ పేపరు తీసుకువచ్చి పద్మకు చూపించాను. 75 ఏళ్ళు దాటిన ఆవిడ చదువుకోగలిగినపుడు 25 లేని నువ్వెందుకు చదువుకోలేవు. తప్పకుండా చదువుకోగలవు’’ అన్నాను.
నవ్వి వూరుకుంది సాలోచనగా!
అదే ఫొటో పొద్దున కాఫీ తాగుతూ వౌళికి చూపించాను.
‘‘ఏమి జరిగినా మీ అమెరికాకే చెల్లుతుంది. చూడు ఇంత వయస్సులో ఎంత ఉత్సాహంగా వుందో రుూవిడ’’ అన్నాను.
వౌళి కూడా నవ్వుతూ, అవునమ్మా, ఆవిడ డెబ్భై ఏళ్ళు దాటాక హైస్కూలు పూర్తిచేస్తే- నువ్వు 50 దాటాక పిహెచ్‌డి ఎందుకు చెయ్యకూడదు. గో ఫర్ ఇట్ అన్నాడు నవ్వుతూ!
‘‘ఇంకా నయం. ఇప్పుడేం చదువు. రిటైర్ అవ్వాల్సిన వయసులో. ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా సీటు అడిగితే తిడతారు కూడా. ఇదేం పోయేకాలం. చిన్నవాళ్లకి పోటీగా వస్తున్నావు’’ అని నవ్వాను.
‘‘ఇక్కడ చదువుకో. ఎవ్వరూ తిట్టరు. మిచిగన్‌లో ఒకాయన, పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక, పిహెచ్‌డి చేసి ప్రొఫెసర్‌గా పనిచేస్తూ మెడికల్ కాలేజీలో చేరాడు. కార్డియాలజిస్ట్ కూడా అయ్యాడు అన్నాడు వౌళి.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి