డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-134

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజా దగ్గరగా వచ్చి తేజా చెయ్యి అందుకుని- ఇంటికి వెళ్లిపోబోతున్నావుట. చాలా సంతోషంగా వుండి వుంటావు.. అంది.
‘‘నిజం చెప్పాలంటే కొంచెం నెర్వస్‌గా వుంది. ఇన్నిరోజులు రుూ హాస్పిటల్‌లో మీ అందరి సహాయం తీసుకున్నాను. ఇంటికి వెళ్లి స్వంతంగా మానేజ్ చెయ్యగలనో లేదో అని భయంగా వుంది’’ అంది తేజా.
నర్స్ చాలా మామూలు చిరునవ్వు నవ్వింది. ‘‘నీ భావనలు చాలా సహజం. కొంచెం ఎక్కువగా హాస్పిటల్‌లో వుండి ఇంటికెడుతుంటే ఇలాంటి భయాలు సహజం’’.
‘‘నువ్వు భయపడాల్సింది లేదు. నువ్వు నిన్ను మేనేజ్ చేసుకోలేవనుకుంటే- హాస్పిటల్ అసలు డిస్‌ఛార్జి చేసేవారు కాదు’’ అంది ప్రోత్సాహపూర్వకంగా.
తేజా వౌనంగా విని వూరుకుంది.
మళ్లీ నర్సే అంది- ‘‘అసలు నువ్వు భయపడాల్సిన విషయం వేరే వుంది’’ అంది సీరియస్‌గా.
నేనూ వౌళి ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. తేజా చాలా నెర్వస్‌గా నర్సు మొహంలోకి చూచింది ఏమిటన్నట్లు?
‘‘ఇంటికి వెళ్లంగానే నీ మదర్-ఇన్-లా రెండుపూట్ల, రుచిగా పెట్టే భోజనం చేస్తూ కూచున్నావంటే నీ కాలు నయం అయ్యేలోగా నువ్వు నాలాగా అయిపోతావు, జాగ్రత్త’’ అంది సీరియస్‌నెస్‌తో.
పద్మ కిల కిలా నవ్వింది. నేను పద్మ ముఖంకి చూచాను. ఆ పిల్లతో పరిచయం అయ్యాక, ఆ అమ్మాయి ఇలా నవ్వడం మొదటిసారి. చాలా అందంగా అనిపించింది.
తేజా వంక చూచాను. మొహంలో ప్రసన్నత కనిపించింది. పెదిమల మీద కూడా చిరునవ్వు తొంగి చూచింది. వౌళి మొహంలో మాత్రం వాడి చిరునవ్వులో ఒక చిలిపితనం కనుపించింది.
‘‘ఏమిటి ఆలోచిస్తున్నావు’’ అడిగింది తేజ.
‘‘ఏం లేదు’’ నువ్వు నిజంగా అంత లావయిపోతే ఎలా ఉంటావా అని వూహిస్తున్నాను’’ అన్నాడు నవ్వుతూ.
తేజాకి కోపం వచ్చింది. వౌళి చేతిమీద ఒక్కటి వేసింది.
నువ్వు లావయిపోయినా బ్యూటిఫుల్‌గానే వుంటావు అన్నాడు ఇంకొంచెం ఉడికిస్తూ!
‘‘వౌళి..’’ అంది తేజా! అసహనంగా!
‘‘ఓ.కె.. ఓ.కె’’ అంటూ రెండు చేతులు ఎత్తేశాడు ఇంకేమి అననని.
నేనూ పద్మ చిరునవ్వుతో చూస్తూ వుండిపోయాం.వీళ్ల సంభాషణ వినిపించిందేమో, రఘురామ్ కూడా చిరునవ్వుతో మేమంతా వున్నచోటికి వచ్చాడు. మీటింగ్‌కి వచ్చిన డాక్టర్స్ అందరిని పంపించేసి సరాసరి తేజా ముందు నుంచుని చెయ్యి చాచాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి.
తేజా తన చెయ్యి రఘు చేతిలో వుంచింది. ఆ చేతిని తన రెండో చేత్తో మూసి, ‘‘ఇంటికి వెడుతున్నావని తెలిసింది. చాలా సంతోషం. నీకు గుడ్‌బై చెప్పడానికి, నేను ఈ దేశంలో వుండను. స్విట్జర్లాండ్ వెడుతున్నాను ఇవాళ రాత్రి, బెస్ట్ ఆఫ్ లక్’’ అన్నాడు.
‘‘్థంక్ యూ’’ అంది తేజా మాటలు తడుముకుంటూ.
‘‘నువ్వు చాలా బాగా మాట్లాడావు. డా.కృష్ణన్ నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో అర్థమయింది. నువ్వు మాట్లాడుతుంటే కళ్ళతో చూస్తున్నట్లు అనిపించింది. నువ్వు స్వయంగా అవన్నీ అనుభవించాల్సి వచ్చినందుకు మాత్రం చాలా బాధగా వుంది.
రఘు చూస్తూ నుంచుండిపోయాడు. తేజా చెయ్యి అతని చేతిలోనే వుండిపోయింది.
‘్థంక్‌యూ ఫర్ ఆల్ ద హెల్ప్’ అంది.
తల అడ్డంగా ఊగించాడు. తేజా చేతిని వదిలేశాడు.
‘దిస్ రుూజ్ మై డ్యూటీ. నా చాలా డ్యూటీస్‌ని నేను విస్మరించాను. నాకు థాంక్స్ చెప్పకు’’ అన్నాడు.
రఘు తిరిగి నాకు ఎదురుగా నిలుచున్నాడు. చాలా దగ్గరగా, తేజా చేతినిలాగానే నా చెయ్యి కూడా పట్టుకుంటాడా అని చాలా ఇబ్బందిగా అనిపించింది. కాని అతనలా చెయ్యలేదు. రెండు చేతులు జేబులో వుంచుకుని చూస్తూ ఉండిపోయాడు.
నేను అతని వంక చూచాను, అతని చూపుల్లోకి. ఎన్నో ఎన్నో ఏళ్ళ క్రితం ఎయిర్‌పోర్టులో చూచిన రఘు కనుపించాడు. నా చేతులు కూడా అప్పటిలాగానే తడితడిగా ఉన్నాయి. ‘టేక్ కేర్’ అన్నాడు క్లుప్తంగా.
‘్థంక్స్ ఎగైన్’ అన్నాను నేను.
వౌళి చెయ్యి చూచాడు. ఆ చేతిని అందుకుని, రెండో చెయ్యి చాచి, వౌళి భుజం నొక్కుతూ తల తాటించాడు. గుడ్‌బై చెప్తున్నట్లుగా వడివడిగా ముందుకు నడిచాడు.
వెళ్లిపోతున్న రఘురాంని చూస్తూ, పద్మ సరదాగా అంది తేజాతో.
తేజాగారు ఒక విషయం చెప్పనా, ‘‘అన్నయ్యగారు- ముసలాడయిపోతే అచ్చు రఘురాంగారిలానే వుంటారు’’ అంది నవ్వేస్తూ.
కాని ఆ మాటలకు ఎవ్వరూ నవ్వలేదు. తను కేవలం హాస్యంగా అనాలని అనుకున్న పద్మకి కొంచెం భయం వేసింది. అందరి ముఖాలలో వ్యక్తమవుతున్న సీరియస్‌నెస్ చూచి, మెల్లిగా నా చెవుల దగ్గరగా వచ్చి అంది. నేనేమయినా తప్పుగా మాట్లాడానా ఆంటీగారూ అంది గుసగుసగా.
‘‘లేదు. తప్పేమీ అనలేదు అందరు అలసిపోయారు, అంతే!’’ అన్నాను.
అతనివైపే చూస్తూ వుండిపోయాం అందరం. అతనికి భాస్కర్ ఎదురుగా వచ్చాడు. రఘురామ్‌ని చూడంగానే రెండు చేతులూ జోడించాడు. చటుక్కున రఘురాంకి వంగి నమస్కరించాడు.
రఘు కొంచెం ఆశ్చర్యంగా ఆగిపోయాడు.
‘‘హైస్కూల్‌లో వున్న రోజుల్లో మిమ్మల్ని గురించి పేపర్లో చదివాం సర్. రుూరోజు ఇక్కడ మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవగలగడం మా భాగ్యం సర్’’ అన్నాడు.
రఘు చిన్నగా నవ్వి, భాస్కర్ భుజం తట్టి ముందుకు వెళ్లిపోయాడు.
భాస్కర్ మా అందరి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. తేజా దగ్గరగా వచ్చి నమస్కరించాడు. వౌళి వంక చూస్తూ ‘ఆంటీగారిని, పద్మని నేను అపార్ట్‌మెంట్ దగ్గర దింపేస్తాను. మీరు మెల్లిగా, తరువాత రావచ్చు’ అన్నాడు.
నేను తలాడించాను. భాస్కర్ కార్లో ఇంటికి వెళ్ళేటప్పుడు అడిగాను. పద్మ వంక ఒకసారి చూచి ‘మీకు రమేష్ కుటుంబం బాగా తెలుసుకదా’ అన్నాను.
‘‘తెలుసండి. నేను రమేష్ చిన్న క్లాసునుండి స్నేహితులం’’ అన్నాడు.
‘‘పద్మం కొంచెం భయపడుతోంది ఇండియా వెళ్లటానికి, రమేష్ తమ్ముడిని గూర్చి. మీకు అతని గురించి ఏమైనా తెలుసా’’ అన్నాను. నాకెందుకో పద్మ భయాలు కేవలం అనుమానాలు అనిపించలేదు.
‘‘వాడా! వాడ్తు వెధవ. వాడెవరికైనా కొంచెం భయపడేవాడంటే ఒక్క రమేష్‌కే. ఇప్పుడు రమేష్ కూడా లేడు కదా, వాడి వ్యవహారాలు ఇంకా మితిమీరిపోయి వుంటాయి’’ అన్నాడు మామూలుగా.
పద్మ నా ముఖం వంక చూచింది.
కారు అపార్టుమెంట్ చేరింది. ఇద్దరం దిగాం. కారు తలుపు వేయబోతూ అన్నాను భాస్కర్‌తో.
‘‘పద్మని ఇంకా కొంతకాలం రుూ దేశంలో వుంచడానికి మార్గాలు ఏమైనా వున్నాయేమో చూడండి, ఏ కాలేజీలోనో చేర్చడం లాంటిది. ఇంకొంచెం లోకజ్ఞానం అలవర్చుకుంటుంది’’ అన్నాను.
భాస్కర్ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. తల వూగించాడు సాలోచనగా! -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి