డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడుకుబోతుతనం పట్టలేక మోరీ అజోడాతో ‘‘అంత తొందరైతే మీరే కనండి’’ అంది. అది విని అవ్వ బిగ్గరగా నవ్వసాగింది. అజోడా కూడా నవ్వాడు.
‘‘అవ్వా, పరాచికాలకేం కానీ నువ్వు ఎప్పుడైనా మా ఊరు మొహంజోదడో వెళ్ళావా?’’ అని అడిగాడు.
‘‘వెళ్ళాను నాయనా. చాలా చక్కని పట్నం. వీధులంట చెత్తా చెదారం ఉండదు. మురుగునీరు కానరాదు. నేలలో కాలువల గుండా పారుతుంది. ప్రతి ఇంటిలో బావి, మురుగునీరు బైటకు పారించడానికి కాలువలు, చక్కటి ఇళ్లు. పట్టణం చూడముచ్చటగా వుంటుంది.’’
‘‘ఔనవ్వా! అంతా పూజారి పాలకుల చలవ. కొండమీద ఉత్సవం చూశావా?’’
అక్కడ జాతర చూశాను మనవడా. కొండమీద సరస్సు, స్నానాల వేడుక, అమ్మవారి ఊరేగింపు అన్నీ చూశా. కనుల పండువుగా ఉంటుంది’’ అని అమ్మవారికి దండం పెట్టింది.
వాళ్ళ సంభాషణలో మోరీ పాల్గొంటూ ‘‘అవ్వా నీకెంతమంది పిల్లలు, మనవలు?’’ అని అడిగింది.
అవ్వ తన కుటుంబం గురించి వివరంగా చెప్పింది.
పెద్దవాళ్ళను గౌరవించేవాళ్ళు, పట్టించుకోనివాళ్ళు ప్రతి కుటుంబంలో ఉంటారు కదా! అవ్వ తన బిడ్డలు, మనవలగురించి, తనను ఆదరించేవాళ్ళు, అలక్ష్యం చేసేవాళ్ళు ఎవరెవరో వివరంగా చెప్పుకొచ్చింది.
చివరకు ఆమె గమ్యం రాగానే బండి ఆపి అజోడా ఆమెను దింపి సాగనంపాడు. ఆమె వెళుతూ వెళుతూ పుట్టెడు దీవెనలను గుమ్మరించింది.
ఇంకా కొంత ముందుకు ప్రయాణం సాగించాక ఎడ్లకు తీరిక కల్పించడానికి ప్రయాణం నిలిపాడు. అక్కడ ఆహార అంగళ్ళు, నీళ్ళ సౌకర్యం ఉన్నాయి. ఎడ్లను విప్పి వాటికి నీళ్ళు పట్టాడు. ఓ అంగడినుంచి తెచ్చి ఎండు గడ్డి వేశాడు. బండి చక్రాలకు కందెన వేశాడు. ఇద్దరూ అల్పాహారం ఆరగించారు.
తర్వాత ఎడ్లను పూన్చి ప్రయాణం కొనసాగించారు ఇద్దరూ.
‘‘ఏదీ మోరీ, ఓ పాట అందుకో’’ అన్నాడు అజోడా ఎడ్లను అదిలిస్తూ. ఆమె విరహగీతం అందుకుని చాలా హృద్యంగా పాడింది.
‘‘అబ్బ ఏం పాడావు మోరీ! కళ్ళు చమర్చాయి సుమా! ఇంకా ఓ సరదా పాట పాడు’’ అన్నాడు అజోడా.
ఆమె ఓ ఉల్లాసమైన జానపద పాట పాడింది.
చివరకు వాళ్ళు సరస్వతీనదీ తీరానికి చేరారు. అక్కడ అజోడా బండ్లను కనిపెట్టే మనుషుల్లో ఒకడికి బండి, ఎడ్లను అప్పజెప్పి డబ్బు ఇచ్చాడు.
ఇద్దరూ పడవమీద నది పాయల మద్యనున్న ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ ఓ పూజారి వాళ్ళకు దర్శనం చేయించి ఓ పూజా సామగ్రి అమ్మే అంగడి వద్దకు తీసుకువెళ్లి మీ కోరికలెన్నో అన్ని గుడ్డ పీలికలు కొనండి. అజోడా రెండు పీలికలు కొన్నాడు.
పూజారి ఇరువురి చేత మర్రి చెట్టు ప్రదక్షిణం చేయించి మీ కోరికను తీర్చమని ప్రార్థన చేసి ఇద్దరూ ఓ పీలికను కొమ్మకు కట్టండి అన్నాడు. వాళ్ళు ‘‘మా వివాహం నిర్విఘ్నంగా జరిగేలా చూడు తల్లీ’’ అని ప్రార్థించి ఒక పీలికను కలిసి మర్రికొమ్మకు కట్టారు.
సంతానాన్ని కోరుతూ రెండో పీలిక అజోడా ఒక్కడే కడుతూంటే ‘‘అలా వీలు కాదు నాయనా.. ఇద్దరూ కలిసి కట్టాలి’’ అన్నాడు పూజారి. దాంతో మోరీ రెండో పీలిక కట్టడంలో అజోడాకి సహకరించింది. ‘‘చూశావా, నీకు తగిన శాస్తి అయిందిగా’’ అన్నట్టు ఆమె వైపు చూశాడు అజోడా. మోరీ మూతివిరుపుతో జవాబు చెప్పింది.
పూజారికి దక్షిణ ఇచ్చుకుని మర్రి చెట్టు, ఆలయం ప్రదక్షిణం చేసి ఒడ్డుకు వచ్చేశారు. నది ఒడ్డున ఇసుక తినె్నలపై మాట్లాడుకుంటూ నడిచారు. ఓ జన సంచారం లేని చోట కూర్చుని చేతిలో చేయి వేసుకుని ముచ్చటించుకుంటున్నారు.
‘‘ఏవండోయ్..’’ అంది మోరీ. ఈ మాట దానంతట అదే వచ్చేసింది మోరీ నోటినుంచి. ఆమె సిగ్గుపడ్డం చూసి అజోడా ‘‘్ఫర్వాలేదులే మోరీ, అమ్మవారు నీ నోట అలా పలికించింది అంటే మన కోరిక తీరబోతోందనేగా!’’
‘‘ఏదో పొరపాటున..’
‘‘ఈ పొరపాటు మళ్లా మళ్లా చేస్తూండు మోరీ!’’
‘‘పోండి. మీరు ఇందాక మనం రెండో పీలిక కట్టాక నన్ను ఎగతాళి చేస్తూ నవ్వారు కదూ!’’
‘‘అబ్బే, ఆ నవ్వు అర్థం ఎగతాళి కాదు. టకటక సంతానాలు కనాలని నీకు సైగ. మరి నువ్వు మూతి విరిచావు, అదో?’’
‘‘దానర్థం నేను కననంటే కనను అని’’ అంది ఆమె నవ్వి.
‘‘అది నీ చేతుల్లో వుంటేగా!’’ అన్నాడు అజోడా కన్నుగీటుతూ.
‘‘మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ పోండి, మీతో మాట్లాడను. మీరు మరీ కొంటైపోతున్నారు’’ అంది మోరీ.
తర్వాత ఆమె కొంటెగా అతడి బుగ్గపై చూపుడు వేలుతో సున్నితంగా కొట్టి ‘‘సమయం వచ్చినపుడు మీ పని పడతానులెండి’’ అంది.
అతడు ఆ సరాగ చేష్టకు ఉత్సాహవంతుడై ఆమె కపోలాన్ని చుంబించాడు. ఆమె చుట్టూ చూసి ‘‘ఎవరైనా చూస్తే నవ్విపోతారు’’ అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. ‘‘పాచిపళ్ళుబాగా తోముకురండి అని వాళ్ళకు సలహా ఇస్తా’’ అన్నాడు అతడు.
దాంతో ఆమె పకపకా నవ్వింది.
ఇంతలో ఓ అమ్మి బుట్టలో పూలు, పూలదండలతో వచ్చి ‘పూలెట్టుకో తల్లీ’ అంది.
అజోడా ‘ఏదీ ఆ దండ ఇయ్యి’ అన్నాడు. ఆ దండలో చామంతి, మల్లి మొగ్గ పూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ అమ్మి అడిగిన డబ్బులు కంటే ఎక్కువ ఇచ్చి కొన్నాడు.
దాంతో ఆమె ‘‘మీ కడుపు చల్లగా! చిలకా గోరింకల్లా కలకాలం కాపురం చేయాల. గంపెడు బిడ్డలు పుట్టాలి!’’ అని దీవించి అదనంగా రెండు కనకాంబరాల చెండు ఇచ్చింది. ఆ దండని అతడు మోరీ మెడలో వేశాడు.
‘‘నేనూ మీకు దండ వేస్తాను’’ అంది ఆమె. వెంటనే రెండో దండ కొన్నాడు అతడు. ఆమె దాన్ని అతడి మెడలో వేసి సోయగాలు పోతూ ‘‘మీరిప్పుడు అచ్చం మన్మథుడులా ఉన్నారు’’ అంది.

- ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు