డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఔను తల్లీ! మీరిద్దరూ రతీ మన్మథులులాగే ఉన్నారు!’’ అంది పూలమ్మి.
కనకాంబరాల చెండ్లు రెండు ఆమె మెడకు ఇరువైపులా వేలాడేలా ఆమె కొప్పులో తురిమాడు అతడు.
ఆ రంగు రంగుల పూల దండ ఆమె శరీరం వొంపు సొంపులకు, సొగసులకు, మృగలోచనాల మురిపాలకు విలక్షణమైన అందాలు అద్దుతూంటే ఆ సౌందర్య వైభవాన్ని కనురెప్ప వేయకుండా తిలకిస్తూ ఉండిపోయాడు అతడు.
‘‘ఏవండీ నన్ను అలా చూస్తూ ఉండిపోయారు?’’ అడిగింది ఆమె.
‘‘ఎందుకంటే నువ్వు రతీదేవిలా ఉన్నావు అనడం కంటే రతీదేవే నీలా ఉందనడం మేలు’’.
‘‘ఔను, తాను మెచ్చింది రంభ, మునిగింది గంగ అంటారు కదా!’’
‘‘అలాగే, నేను నిజమో, నువ్వు నిజమో తేలిపోతుందిలే’’ అన్నాడు అతడు.
అటుగా వస్తున్న ఓ పళ్ళమ్మే అమ్మి మోరిని చూసి ‘‘ఏమమ్మా, మీదే ఊరు? నిన్నుచూసి అప్సరసలు కూడా సిగ్గుపడతారులా ఉంది’’ అంది.
అజోడా ‘‘మాది మొహంజోదాడో’’ అన్నాడు.
‘‘ఔను, నేనక్కడవాళ్ళే అనుకున్నా’’ అంటూ ముందుకు వెళ్లిపోయింది.
అప్పుడు అజోడా ‘‘చూశావా, నేన్నది నిజమే అని ఒప్పుకుంటావా?’’.
మోరీ ఏం జవాబు చెప్పలేదు.
ఇద్దరూ అక్కడనుంచి బయలుదేరి భోజన శాలలో భోంచేసి బండిలో నోరాదోడోకు బయలుదేరారు.
వాళ్ళు తోడుగా గడిపిన ప్రతి లిప్త వాళ్ళ పొందును మరింత పరిపుష్టం చేస్తోంది. అతడు ఎత్తుకుని బండిలోకి ఎక్కిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగంతో అతడి మొహాన్ని గట్టిగా చుంబించింది. అజోడా నవ్వి ‘నాకు ఇవాళ ఇంద్రాసనం లభించినట్టే’ అన్నాడు.
ఇద్దరు మబ్బులో తేలుతూ ఆడుతూ పాడుతూ తిరుగు ప్రయాణం సాగించారు.
‘‘ఏవండోయ్, మీరు తొందరగా మీ వాళ్ళని ఒప్పించాలి’’ అంది ఆమె.
‘‘అంత తొందరగా ఉందా మహారాణికి?’’
‘‘మీరు ఏ మాయ చేశారో కానీ నాకు మీనుండి దూరంగా ఉండడం ఒక్క క్షణం ఇష్టం లేదు’’.
‘‘నువ్వు చేసిన మాయ ముందు నా మాయ ఏపాటిది, అమ్మారుూ! నాకు కనురెప్పపాటు నీ నుంచి వేరవాలని లేదు’’ అన్నాడు ఆమె వైపు చూస్తూ.
అతడు ఎదురుగా వ్తున్న గొర్రెల మందని గమనించలేదు. అవి మీదకు వస్తున్న ఎడ్ల బండిని చూసి అటు ఇటూ తప్పించుకుంటూ ఒకదానిపై మరోటి పడసాగాయి. అజోడా తేరుకుని బండిని ఆపేశాడు.
‘‘మీ ఇల్లు బంగారంగాను! మీ ప్రేమ మైకంలో గొర్రెలను కడతేర్చేసేవారు. జాగ్రత్తగా నడపండి. మీకు పుణ్యం ఉంటుంది’’ అంది ఆమె.
దారిలో ఎడ్ల విరామం కోసం ఒకచోట విశ్రమించి సూర్యాస్త సమయానికి వాళ్ళు నోరాదడోలో బయలుదేరిన స్తలానికి చేరుకున్నారు. జన సంచారం అప్పటికి బాగా పల్చబడింది. ఆమెను బండిమీంచి దింపుతూ అలా నిల్చుండిపోయాడు.
‘‘దింపండి బాబు! ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?’’ అంది ఆమె మొహమాటపడుతూ.
‘‘ఎవరైనా ఉంటేగా! ఇదిగో దిగు’’ అంటూ దించి ఆమెను వాటేసుకుని చుంబించాడు.
‘‘మోరీ! మొహంజదడోకి తిరుగుప్రయాణం మనం కలిసి చేద్దాం. నాతో రారాదా?’’
‘‘అలాగే దొరగారు! ఎప్పుడు బయలుదేరుతారు?’’
‘‘రేపు సూర్యోదయంతో బయలుదేరుదాం. నీకోసం ఎదురుచూస్తూంటా’’
‘‘జుంబా ఉంటాడా?’’
‘‘ఉండడు. వైద్యుడు వారం పది రోజుల తర్వాత అతడిని బయలుదేరమన్నాడు. అప్పటికి గాయం మానుతుందట’’.
‘‘మరి ఎలా వస్తాడు?’’
‘‘అద్దె బళ్ళు ఇక్కడనుంచి మొహంజోదడోకి వెళుతుంటాయి కదా. వాటిలో వచ్చేస్తాడు’’.
‘‘అలా అయితే ప్రయాణంలో మీ కొంటె చేష్టలనుంచి నాకు విరామం ఉండదన్నమాట’’ అంది బిగ్గరగా నవ్వుతూ.
‘‘మనం ఇక్కడకు బయలుదేరుతూండగా ఓ కొంటె పురుగు నన్ను ఇక్కడ.. అని అతడు తన బుగ్గ చూపి ఇక్కడ కుట్టిందే. ఆ కొంటె చేష్టను ఏమనాలి?’’
‘‘ఆ కొంటె చేష్టలు ఆ పురుగు మీ వద్దే నేర్చుకుని ఉండాలి’’.
‘‘పురుగు బాగానే నేర్చింది కదా! అదే నాకు కావాల్సింది. అది నన్ను కుడుతూండాలి. నేనూ దాన్ని కుడుతూండాలి’’ అని నవ్వాడు.
‘‘అలాగే వెళ్లివస్తాను దొరగారు. తమరు ఈ సాయంకాల కార్యక్రమానికి వేళకు రావాలి. నా కళ్ళు మీ కోసం ఎదురుచూస్తుంటాయి’’.
‘‘వేళకే వస్తాను మహారాణీ! నాపై మీరు ఏ చేతబడి చేశారో కాని నాకు మీరు లేందే పిచ్చెత్తినట్టుంటుంది’’ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు.
ఆమె చేయి విడిపించుకుని ‘‘ఎవరైనా చూస్తే బాగుండదు’’ అని కాస్త దూరం పోయి తిరిగి చూసి చేయి ఆడించి కనుమరుగయింది.
రాత్రి కార్యక్రమానికి హాజరయ్యాడు అజోడా. చుట్టుప్రక్కల గ్రామాలనుంచి వచ్చిన జన సందోహంతో సభాస్థలి కోలాహలంగా వుంది.
కార్యక్రమం నిన్న రాత్రి కంటే ఎక్కువ మనోహరంగా సాగింది. ప్రతి పాట, ప్రతి నృత్యానికి ప్రేక్షకులు చేసే ప్రశంసా సందడి దూరదూరం వరకు వినబడేది. మోరీ సంగీత నృత్య ప్రదర్శన జలపాతంలా ప్రవహించి ప్రేక్షకుల్ని రసానుభూతితో ముచ్చెత్తించింది.
ఆ రాత్రి కార్యక్రమం తర్వాత మోరీ, అజోడా సభాస్థలి నుంచి తోడు గానే బయలుదేరారు.
వాళ్ళ మార్గాలు వేరయే చోట అజోడా ‘‘మోరీ, మొహంజోదడోలో నీ కార్యక్రమం ఎప్పుడో చెప్పగలవా?’’
‘‘ప్రస్తుతానికి తెలియదు. ప్రతి పక్షంలో రెండుసార్లు ఉండవచ్చు. మీకు తెలియజేస్తా’’.
‘‘కానీ మొహంజోదడోలో మనం కలుసుకోవడం ఎలా అని ఆలోచించా, మోరీ. దానికి నాకో ఉపాయం తట్టింది. మా మిత్రుడు మాగీర్ అక్క లామా నృత్యగాన పాఠశాల నడుపుతోంది. దాంట్లో నువ్వు నృత్యగానం నేర్పుతావా?’’ - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు