డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటిలో ఆహార ధాన్యాలు నిల్వ చేసినట్లు ఉన్నాయి. గదిలో ఓ మూల నీళ్ళకుండ, నీళ్ళు తాగే పాత్రలు ఉన్నాయి. ఆ పక్కనే ఓ కొయ్య బల్ల మీద పళ్ళు, మిఠాయిలు, ఇసుకలో వేయించిన ధాన్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ మాగీర్ తనకూ, మోరీకి ఏర్పాటుచేశాడు కాబోలు. మాళిగ కప్పులో రంధ్రాల గుండా గాలి వెలుతురు వస్తున్నాయి. మాళిగ ద్వారానికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లమీంచే మాగీర్, తనూ మాళిగలోకి వచ్చారు.
ఇంతలో తాళం తీస్తున్న అలికిడి. అడుగుల ధ్వని వినిపించాయి. కొన్ని క్షణాల్లో మాగీర్, వెనుక మోరీ మెట్లు దిగుతూ కనబడ్డారు.
మాగీర్ ‘‘ఇదిగో మిత్రమా, నీకు కాబోయే భార్య మోరీ. మీరిద్దరూ మాట్లాడుకోండి, నే వెళతా. నేను పైన నడవలో ఉంటాను. మీరెంత సేపైనా మాట్లాడుకోండి. నడవలో నువ్వు కనబడితే మిమ్మల్ని రహస్యంగా బైటకు పంపే ఏర్పాటుచేస్తాను’’ అన్నాడు.
ఇంటి యజమాని మాగీర్ మెట్లెక్కి తలుపు వేయగానే అజోడా మోరీలు ఆలింగన బంధితులయారు. వేరయి సంభాషణ మొదలెట్టారు.
‘‘నృత్యగాన పాఠశాలలో శిక్షకురాలిగా చేరావా?’’ అడిగాడు అతను.
‘‘ఇవాళే చేరాను. మీరెలా ఉన్నారు?’’’
‘‘బానే ఉన్నా. మీ నాన్న నన్ను కలుసుకుని ఒక విశేషం చెప్పాడు. మన తైల కర్మాగారంలో పనిచేసే కుర్రాడు బంకోతో నీ పెళ్లి కుదిర్చాడట. నీకు తెలిసే ఉంటుంది’’.
‘‘అదే చెబుదాం అనుకుంటున్నా. పెళ్లి ఖర్చులు పెద్దయ్యగారే భరించి ఈ పెళ్లి చేస్తారట. కుర్రాడికి పెద్ద పదవి ఇచ్చి జీతం పెంచుతారట. అంతేకాక పెళ్లి తర్వాత మీ భవంతిలో నేను మునపటిలా పనిచేయవచ్చుట’’.
‘‘నువ్వేమన్నావు?’’
అంత గంభీరమైన పరిస్థితిలో కూడా ఆమెకు వెటకారమాడాలని అనిపించింది.
‘‘మీరు ఒప్పుకోమంటే ఒప్పుకుంటా’’’.
‘‘నేను చెప్పాలా ఏమిటి? నువ్వే ఒప్పుకోవచ్చుగా’’ అన్నాడు అజోడా వ్యంగ్యంగా.
‘‘క్షమించండి. మీతో కాకపోతే ఎవరితో హాస్యమాడుతా? నేను ఆలోచించి చెప్తానన్నా. ఇప్పుడు నేను చేసుకోనని చెప్తే మా వాళ్ళు నాపై ఒత్తిడి తెచ్చి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఏ మాటా చెప్పకపోతే ఈలోగా మనం ఏదైనా మార్గం ఆలోచించుకోవచ్చు’’.
‘‘ఔను, అది నిజం. నీ సమ్మతి లేందే మీ వాళ్ళు నీ పెళ్లి బంకోతో చేయలేరు’’.
ప్రేమికులు చాలాసేపు ముచ్చటించుకున్నారు. చివరకు మాగీర్ ఇంటిలో సాయంకాలం కలుసుకుంటూ వుండడానికి నిర్ణయించుకుని వెళ్లిపోయారు.
ఆ మర్నాడు సాయంకాలం మాగీర్ ఇంటిలో మోరీని కలుసుకున్నాడు అజోడా.
‘‘ఎలా ఉంది పాఠశాల ఉద్యోగం?’’ అడిగాడు అతడు.
‘‘చాలా బాగుందండి. నన్నంతా గౌరవంగా చూస్తున్నారు. నాకింత జనాదరణ ఉందని తెలియదు’’.
‘‘ఇప్పుడైనా తెలిసిందిగా. అది సరే కానీ ముందు నీకు ఈ కానుక’’’ అంటూ ఓ పూసల హారం ఇచ్చాడు ప్రియుడు తన ప్రేయసికి.
‘‘ఇదేమంత ప్రియం కాదులే. నువ్వే కొనుక్కున్నావని మీ వాళ్ళకు చెప్పవచ్చు. నీ సౌందర్యంతో కలిసి మరిన్ని వనె్నలు చిందిస్తుందని కొన్నా’’.
‘‘ఇది చాలా బాగుందండోయ్! మరి నా మెడలో వేయండి’’ అంది గోముగా. అతడు హారం ఆమె మెడలో వేసి ‘‘ఈ హారం నీ మెళ్ళో చేరి ఎంత గర్విస్తుందో!’’ అన్నాడు.
‘‘నాకు దీనికంటే అందమైనదీ, ప్రియమైనదీ తమరి కరహారం’’ అంది ఆమె సిగ్గు మిళితమైన సొగసులతో, దరహాసాలతో.
‘‘అలాగా!’’ అంటూ అతడు ఆమెను తన బాహువుల్లో ఇముడ్చుకున్నాడు. ఆమె కూడా తన బాహుబంధంతో అతణ్ణి హత్తుకుంది.
అతడు చేసిన ఓ కొంటె చేష్టకి ఆమె ‘‘ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటారో అని నా బెంగ’ అంది నవ్వుతూ.
‘‘పోనీ నీకు నచ్చకపోతే పెళ్ళాయ్యాక ఆమడదూరం ఉంటా’’ అన్నాడు.
‘‘మరి పెళ్ళెందుకు?’’
‘‘దూరంగా ఉండి ఆ అవ్వ దీవించినట్టు కడుపునిండా పిల్లలు కనడానికి’’.
దాంతో ఇద్దరూ విరగబడి నవ్వసాగారు.
‘‘ఎన్నాళ్ళండి మనం ఇలా చాటుగా మరొకళ్ళ ఇంటిలో కలుసుకోవడం?’’ అని అడిగింది దిగులుగా.
‘‘మోరీ నీకో విషయం చెప్పాలి. నేను అమ్మా నాన్నలతో నిన్ను పెళ్లాడి వేరే కాపురం పెడుతున్నానని ఖరాఖండీగా చెప్పదలిచా’’
‘‘వాళ్ళేమంటారో?’’
‘‘వాళ్ళు ఒప్పుకుంటే సరేసరి. లేకపోతే మనం ఎక్కడికో వెళ్లి పెళ్లి చేసుకుందాం’’.
‘‘మనం ఉభయ తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. నన్ను బంకోకి బలవంతంగా కట్టపెట్టలేరు కదా!
‘‘ఔను. మన సమాజం అది అనుమతించదు’’
అందువలన మనం కొద్ది రోజులు వేచి చూడవచ్చు.
‘‘అలాగే చూద్దాం’’
‘‘ఏవండీ..’’
‘‘ఆహా, ఈ పిలుపులో ఎంత ఆత్మీయత, ఎంత మధురమైన ప్రేమ, ఎంత గౌరవభావం ఉంది! మళ్లీ అను..’’
‘‘ఏవండీ...’’
‘‘ఒకప్పుడు పెళ్లి తర్వాతే అలా పిలుస్తానన్నావు. మరి పెళ్లికి ముందెలా పిలుస్తున్నావు?’’
‘‘ఎందుకంటే మన పెళ్లి ఖాయం అనే నమ్మకం కలిగింది నాకు’’.
‘‘శభాష్! నా ప్రాణేశ్వరి, నా జీవిత భాగస్వామిని, నా చంద్రముఖీ, కమలాక్షీ..’
‘‘చాల్లెండి, ఆ సంబోధనలు. నామీద మీ ప్రేమ అపారమైనదని ఒప్పుకన్నా. ఇంక నే వెళ్లాలి. దీపాలు పెట్టే వేళయి చాలా సేపయింది. మా అమ్మ నాకోసం ఇంటిలో ఎదురుచ్తూంటారు.
‘‘మోరీ, ఇంద ఈ డబ్బు. నీకిష్టమన వస్తువులు కొనుక్కో’’ అని చేతిలో చిన్న సంచీ పెట్టాడు.
‘‘బాగుంది, నాకు ఏ డబ్బు అవసరం లేదు. కావలిస్తే అడుగుతాలెండి. సొంత డబ్బు ఉంది లెండి’’. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు