డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు మానేస్తే మానేయండి కానీ ననె్నందుకు మీరు బరిలోంచి బైటకు లాగుతున్నారు’’ అంది మాజా. నవ్వుల పువ్వులు కురిసాయి.
‘‘నృత్యం మాత్రం కుర్రాడిలా చేశారు అయ్యగారు’’ అంది మోరి. ఘొల్లున నవ్వులు మారుమోగాయి.
‘‘ఈ దినం అందరికంటే బాగా నర్తించిన వాళ్ళెవరో నేను చెప్పేదా?’’ అంది గోదా.
‘‘వేరే చెప్పేదేమిటమ్మా? మోరీ ఉంటే మరెవరైనా గెలుస్తారా?’’ అంది మాజా.
‘‘నిజమే అమ్మ. ఆమె ఆడవాళ్ళలో గెలిచినట్టు. ఇక మగాళ్ళలో గెలిచింది ఎవరు?’’ అడిగింది గోదా.
‘‘మగాళ్ళు ఆడవాళ్ళని కలిపి చూసినా గెలిచింది చిన్నయ్యగారే’’ అంది మోరీ.
అజోడా గోదావైపు చూసి ‘‘ అక్కా మోరీ ముందు నేనే కాదు, ఈ ఊళ్ళో ఎవరైనా నిలబడగలవరని నేను అనుకోను’’ అన్నాడు.
‘‘మగాళ్ళలో మాత్రం అజోడాదే మొదటి స్థానం’’ అంది గోదా.
‘‘ఏదో వందలమంది నాకు పోటీగా ఉన్నట్లు చెప్తున్నావు, అక్కా. నాన్నగారు, బావనే కదా నాకు పోటీదారు?’’ అన్నాడు.
‘‘ప్రశ్న పోటీదార్లు ఎంతమందో అని కాదు, నువ్వు బాగా నాట్యం చేశావన్నమాట. అంతా ఒప్పుకుంటారు’’ అంది గోదా.
‘‘తల్లీ నిన్ను లెక్కలో వేసుకోవడం లేదు. మృదంగం వాయిస్తూ ఎంత చక్కగా చిందులు వేశావు?’’ అన్నాడు అజోడా.
‘‘నాన్నగరు, మన సమాజంలో ఆ పాటి నర్తించనివాడు ఉండడు కదా! నేను చిన్నప్పటినంచి నర్తిస్తున్నా. ఏ వేడుక వచ్చినా, ఏ పండుగ వచ్చినా నాట్యం చేయడం తప్పనిసరి కదా! అత్తారింట్లో కూడా మేమంతా తరచు నాట్యం చేస్తుంటాం’’ అంది గోదా.
‘‘తాతా, అమ్మతో నేను కూడా నాట్యం చేస్తూంటా’’ అంది మనవరాలు.
‘‘అందుకే నువ్వు గొప్పగా నాట్యం చేస్తావు తల్లి’’అని మనవరాలిని ముద్దుపెట్టుకున్నాడు హనోడా.
***
ఆ మర్నాడు గోదా అజోడాని అతడి గదిలో కలిసింది. ఆమె మొహం చిన్నబోయి ఉంది. అజోడ ఆమెను చూసి ‘‘ఎమక్కా ఎలా ఉన్నావు?’’ అని అడిగాడు. అతడి మనసు కూడా ఏదో అనిష్టం జరిగిందని అంటోంది.
‘‘ఏ చెప్పేదిరా, తమ్ముడూ. నేనూ, మీ బావ ఎంత నచ్చచెప్పినా మోరీని చేసుకోవడానికి ఇద్దరు ఇష్టపడడంలేదు. నాన్నగారైతే మరీ పట్టుదలగా ఉన్నారు. ప్రధాన పూజారిగారి సంబంధం చేసుకుంటే మన కుటుంబం ప్రతిష్ఠ ప లుకుబడిలోనూ చుట్టుప్రక్కల బాగా వృద్ధి చెందుతుంది. దానివలన ఆయనకు రాజకీయాల్లో ఇంకా గౌరవమైన స్థానం దొరకడమే కదా, నీకు కూడా రాజకీయంగా క్రమేణా ఉన్నత స్థానం దొరకవచ్చునట’’.
‘‘ఐతే నాకు ఒకటే మార్గం మిగిలింది’’ అన్నాడు విషాదంగా.
‘‘అదీ చెప్పి చూశాను. మీరు అంతలా పట్టుబడితే వాడు పెళ్లాడి వేరే కాపురం పెట్టవచ్చునని చెప్పా. దానికి అలా చేసి బంగారం లాంటి భవిష్యత్తుని బుగ్గిపాలు చేసుకోవద్దని నన్ను నీకు నచ్చచెప్పమన్నారు’’.
‘‘ఇప్పుడు ననే్నం చేయమన్నావు అక్కా?’’
‘‘నీలో మోరీ పట్ల పెల్లుబుకుతున్న ప్రేమ శాశ్వతమైనదనీ, ఏ పరిస్థితతిలోనూ ఆమె లేందే నువ్వు సుఖంగా జీవించలేవని నేను గ్రహించనురా. నా సలహా ఒకటే- ఆమెను పెళ్లాడి నీ జీవితం నువ్వు జీవించు. నువ్వు యోగ్యుడి. మీ ఇద్దరి పొట్టలకి సరిపోయేటంత నువ్వు తప్పక ఆర్జించుకోగలవు’’.
‘‘్ధన్యవాదాలు అక్కా! నీ సలహా నకు కొండంత బలం ఇచ్చింది’’.
‘‘నాకు తెలుసురా, నేను అమ్మా నాన్నల మాటని ప ఆటించమని చెప్పినా నువ్వు పాటించవని. నీ ప్రేమ సముద్రం కంటే లోతైనది, ఆకాశం కంటే ఎతె్తైనదీ అని నేను గ్రహించనురా.
***
ఓరోజు ప్రధాన పూజారిగారు కొండమీది భవనంలో నగర ప్రముఖుల సమావేశం ఏర్పాటుచేశారు. దానికి మొహంజోదడో నగరంలో ప్రముఖ పౌరుల్నీ, వార్తకులు, కార్మికులు, రైతులు, వాహన చోదకులు మొదలగు సంఘాల ప్రతినిధుల్ని ఆహ్వానించారు. ఏదో చాలా ముఖ్య విషయంపై చర్చించడానికి ఆ సమావేశం ఏర్పాటుచేస్తున్నారని వినికిడి.
పట్టణంపై ఇదివరకేపడమట నుం కొన్ని అనాగరిక జాతులావారు దాడి చేసి ఆక్రమించారనే కబురు అందింది. వాళ్ళు ఆక్రమించిన స్థలాల్లో నగర పాలిక నియమాలను, నిబంధనలను తుంగలో తొక్కి గృహ నిర్మాణాలు జరుగుతున్నయని వార్తలు వస్తున్నాయి. అంతకంటే దారుణం ఏమిటంటే వాళ్ళు వీధి మధ్యలో కమ్మరి కొలిములను ఏర్పాటుచేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
మొహంజోదడో ఊరి పరిపాలనకి కార్మికులు, రక్షణకి రక్షక భటులు ఉన్నారు. కానీ భద్రతకి సైనిక సిబ్బంది లేదు. పైవారు దాడి చేస్తే వారిని అడ్డుపడి ఆపడానికి, జనాన్ని రక్షించడానికి శిక్షణ పొందిన సైనికులు లేరు. నగర రక్షక భటులే ఆ బాధ్యత తీసుకొని పోరాడాలి. వర్తకుల ప్రతినిధుల నాయకుడిగా హనోడా సమావేశంలో ఉన్నాడు.
ప్రధాన పూజారి సమావేశానికి సంబంధించి స్వాగతం పలికి ఇలా అన్నారు. మిత్రులారా! ఈనాటివరకు ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది. శాంతి, సౌహార్ద్రం అనే పునాదులమీద మన ఈ సువిశాల నాగరికత దినదినాభివృద్ధి చెందుతూ వచ్చే తర తరాలకి ఆదర్శంగా నిలవబోతోంది.
వేల సంవత్సరాల క్రితం మెసటోమియా నాగరికతలతో పోటీ పడే ఇటువంటి సర్వతోముఖ అభ్యున్నతిని సాధించిన నాగరికత మా భూభాగంలో విలసిల్లిందని దాని భవిష్యత్తులో ఈ గడ్డమీద జన్మించిన మన తర్వాతి సంతతివారు గర్వంతో చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. -- ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు