డైలీ సీరియల్

వ్యూహం-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేషగిరి పక్కింటి వాళ్ళకు నాలుగు లారీలు వున్నాయి. ముంబై, హైదరాబాద్ మధ్య సరుకులు రవాణా జరుగుతూ వుండేది. ఒక లారీ పూర్తిగా శేషగిరి కంట్రోల్‌లో వుండేది. అతనే డ్రైవర్. మరో డ్రైవర్ ఆ బండి అంటుకోవడానికి వీల్లేదు. శేషగిరి కుటుంబం మీద వున్న అభిమానంతో ఆ లారీని పూర్తిగా శేషగిరి ఆధీనంలో వుంచేశాడు లారీ ఓనరు. సరుకు రవాణా మీద వచ్చే బాడుగలు క్రమం తప్పకుండా లారీ ఓనర్‌కు ఇచ్చేసేవాడు.
నెలకు ఆరు వేల జీతం. డ్యూటీ ఎక్కినప్పుడల్లా బేటా వచ్చేది. ప్రయాణంలో ఎవరన్నా పాసింజెర్స్‌ను ఎక్కించుకుంటే వచ్చే డబ్బులు డ్రైవర్‌వే. క్లీనరుకు పదో పరకో ఇచ్చేవాడు. అంతకుమించి శేషగిరికి పెద్దగా ఆదాయం లేదు.
కానీ శేషగిరి విలాసంగా ఖర్చుపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించేది లారీ ఓనర్‌కు. నెలకు పాతివేలు అవలీలగా ఖర్చుపెట్టేవాడు. క్లబ్బులకు వెళ్లి పేకాట ఆడేవాడు. ఖరీదైన బ్రాందీ, విస్కీ తాగేవాడు.
విచ్చలవిడిగా ఖర్చుపెట్టడానికి శేషగిరికి డబ్బు ఎక్కడనుంచి వస్తుంది. సరుకు రవాణా చేసే కంపెనీల దగ్గరకు వెళ్లి వాళ్ళు ఇచ్చే డబ్బు, శేషగిరి తనకు ఇస్తున్న పైకం లెక్క చూసేవాడు. అంతా కరెక్టుగానే వుండేది.
పోలీసు అధికార్లకు ఫోన్లు వచ్చేవి. శేషగిరి నడుపుతున్న ఫలానా లారీల్లో పూనా నుంచి తిరిగి వచ్చేటప్పుడు కేజీ కొకైన్ పొట్లాలు హైదరాబాద్‌కు రవాణా అవుతున్నాయని, మార్గమధ్యంలో చాలాసార్లు ఆ లారీ ఆపి చెక్ చేసేవాళ్ళు. కేజీ కొకైన్ అంటే కోటి రూపాయలకు పైనే వుంటుంది ధర.
ఎంత ప్రయత్నించినా ఎవరికి చిక్కకుండా కొకైన్ సరఫరా జరిగిపోయేది పూనా నుంచి హైదరాబాద్‌కు.
కొత్తగా డ్యూటీలో చేరిన ఎస్‌ఐ కొకైన్ రవాణాను అరికట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. నాలుగైదుసార్లు శేషగిరి నడిపే లారీని రోడ్డు పక్కన చెక్ చెయ్యడం కాకుండా లారీని పోలీసు స్టేషన్‌కు మళ్లించి లారీలో సరుకులన్నీ దింపించేవాడు. అన్ని బ్యాగులు విప్పదీసి క్షుణ్ణంగా తనిఖీ చేయించాడు. ఏంత ప్రయత్నించినా లారీ అంతా వెతికినా కొకైన్ ప్యాకెట్లు దొరకలేదు.
‘ఇదేదో మిస్టరీగా వుందే!’ అనుకున్నాడు.
శేషగిరికి మాఫియా గ్యాంగులనుంచి ప్యాకెట్లు అందుతూనే వున్నాయి. మత్తుమందు సక్రమంగా సరఫరా చేసినపుడల్లా పదివేలు, పాతికవేలు కవర్‌లలో అతనికి అందేవి. జల్సాగా తిరుగుతూ వుండేవాడు.
అన్నపూర్ణక్కూడా ఆశ్చర్యంగానే వుంది. అతనికి వచ్చే కొద్దిపాటి జీతం ఇంటి అవసరాలకు కోసం తనకే ఇచ్చేస్తున్నాడు. మరి సరదాలకు ఖర్చుపెట్టడానికి భర్తకు వేలకు వేలు ఎక్కడనుంచి వస్తున్నాయి?
బాగా తాగినపుడు మాదకద్రవ్యాల ప్యాకెట్లు పూనా నుంచి తెచ్చి హైదరాబాద్‌లోని డ్రగ్స్ అమ్మే ముఖాలకు ఇస్తున్నట్లు చుట్టూ వున్న వాళ్ళందరికీ అదేదో గొప్ప విషయంలా చెప్పేవాడు. ‘నన్ను పట్టుకోవడం పోలీసుల తరం కాదు’ అనే వాడు. కానిస్టేబుల్ ఆ వార్త ఎస్పీకి చేరవేశాడు. అది ఛాలెంజ్‌గా తీసుకుని రంగంలోకి దిగాడు. మఫ్టీ డ్రెస్‌లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ని వెంట బెట్టుకుని కారులో శేషగిరి లారీని ఫాలో అయ్యారు.
పూనాలో బయల్దేరిన లారీ ప్రతి వంద కిలోమీటర్లకి పెట్రోల్ బంక్‌ల దగ్గర ఆగిపోతూ వుంది, డీజిల్ టాంక్‌లో ఆయిల్ నింపుకోవడానికి. ఆ లారీ 12 టైర్లు వున్న లారీ. డీజిల్ ట్యాంక్ పెద్దదే. మూడొందల లీటర్ల డీజిల్ ట్యాంక్‌లో నింపుకోవచ్చు. మరి శేషగిరి ఫుల్‌గా ఎందుకు నింపుకోవడంలేదు. బంకుల్లో డీజిల్ సరఫరా బాగానే వుంది. ‘ఔట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు ఎక్కడా లేవు.
‘డీజిల్ ట్యాంక్‌లో ఆయిల్ ఫుల్‌గా ఎందుకు నింపుకోవడంలేదు’ అనుమాన వచ్చింది.
తన ఏరియాలోకి లారీ రాగానే ఆపు చేయించాడు. డీజిల్ ట్యాంక్ చెక్ చేయించాడు. ఆ ట్యాంక్‌లో రెండు అరలు వున్నాయి. ఓ అరలో డీజిల్, మరో అరలో డ్రగ్స్ ప్యాకెట్లు వున్నాయి.
శేషగిరి తెలివితేటలకు ఆశ్చర్యపడిపోయాడు. అతని నేర్పరితనానికి భుజం తట్టి, నేరానికి అరచేతులకు బేడీలువేసి జైల్లో తోశేసారు.
లారీ ఓనర్ లబోదిబోమన్నాడు. అతనిమీద కూడా కేసు పెట్టారు.
మాదకద్రవ్యాల సరఫరాకు తన లారీని వాడుకున్నందుకు శేషగిరిని తిట్టుకున్నాడు.
బెయిల్‌మీద శేషగిరి బయటకు వచ్చినా తన లారీ షెడ్‌లోకి అతన్ని అడుగుపెట్టనివ్వలేదు లారీ ఓనరు. అతనే కాదు చుట్టుప్రక్కల ఏ లారీ ఓనరు శేషగిరిని లారీ డ్రైవర్‌గా పెట్టుకోవడానికి ఇష్టపడలేదు.
లారీఓనర్ తిలక్‌మీద కోపం వచ్చింది శేషగిరికి.
తిలక్ కూతురి పెళ్ళి. బంగారం, బట్టలు కొనడానికి బ్యాంక్‌లో డబ్బు డ్రాచేసి బీరువాలో పెట్టుకున్నాడాయన. అది గమనించాడు. తిలక్ బీరువా తాళాలు ఎక్కడ పెడతాడో శేషగిరికి తెలుసు.
తిలక్‌మీద కక్ష తీర్చుకోవాలి.
అర్థరాత్రి లేచి గోడ దూకి తిలక్ ఇంటి వెనుక వైపునకు చేరుకున్నాడు. డ్రైనేజీ పైపులు పట్టుకుని పైకి ఎగబ్రాకాడు. మేడమీదకు చేరుకున్నాడు. బాల్కనీ వైపు ఓ కిటికీ వుంది. ఆ కిటికీ స్క్రూలు విప్పి కిటికీ గ్రిల్ తీసి మెల్లగా శబ్దం రాకుండా ఓ ప్రక్కన పెట్టి గదిలోకి దూరేడు.
మేడమీద గదినే తిలక్ తన వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ వుంటాడు. మేడ ముందువైపునుండి మెట్లు వున్నాయి ఆ గదిలోకి. రాత్రి పూట ఆ గదిలోనే పడుకుంటాడు. డబ్బు కూడా ఆ గదిలో వున్న బీరువాలోనే ఉంచుతాడు. అతని భార్యకు కీళ్ళనొప్పులు. మేడమీద గదికి రాదు. ఇద్దరు కొడుకులు, పెళ్లికాబోతున్న కూతురు కింద భాగంలో వున్న గదుల్లోనే పడుకుంటారు.
రాత్రి పూట నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటాడు తిలక్. మాత్రలు వేసుకోకపోతే నిద్ర రాదు. ఆ సంగతి శేషగిరికి తెలుసు.
గదిలో ఓ మూల పాత పరువు వుంటుంది. ఆ పరుపు మడతల్లో బీరువా తాళాలు వుంచుతాడు తిలక్. ఆ పాత పరువులోకి చెయ్యి దూర్చి ఓ రోజు తాళాలు తియ్యడం శేషగిరి చూశాడు.
గదంతా చీకటి. బెడ్‌లైట్ వుంటే తిలక్‌కు నిద్రపట్టదు.
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పాత పరుపు దగ్గరకు వెళ్లి తాళాల కోసం వెతికాడు. తాళాలు దొరికేయి.
- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876