డైలీ సీరియల్

వ్యూహం-68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమైన విషయమైతేనే స్కంద ఫోన్ చేస్తాడు.
లేచి కూర్చుని కాల్ రిసీవ్ చేసుకున్నాడు.
‘‘మీరు అప్రూవర్‌గా మారి విలువైన రికార్డులు, సమాచారం అందించేకే అరిఫ్ ముఠా ఆగడాల మీద మాకో అవగాహన వచ్చింది. అన్ని కుంభకోణాలు ఛేదించగలిగాం! అరిఫ్ అరెస్టు అయ్యాడు. అతని అనుచరులను ఒక్కడిని కూడా వదిలిపెట్టకుంకడా అరెస్టు చేయగలిగాం. బలమైన సాక్ష్యాధారాలతో కేసులు పెట్టగలిగాం. వాళ్ళు జైల్లో నుంచి బయటపడే అవకాశమే లేదు. మరో ముఖ్యమైన విషయం తెలుసా మీకు?’’ అడిగాడు స్కంద.
‘‘ఏమిటది?’’ ఆత్రగా అడిగాడు.
‘‘మీ స్నేహితుడు డాక్టర్ అరవింద్‌ను అరిఫ్ హత్య చేశాడు. అతనే హత్య చేసినట్లు మాకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చెప్పాడు. అరవింద్‌గారి అంత్యక్రియలు ధవళేశ్వరం దగ్గర గోదావరి ఒడ్డున రేపు జరుపబోతున్నాం. వీలుంటే ఫ్లయిట్‌లో వచ్చి మీ మిత్రుడికి ఆఖరి వీడ్కోలు చెప్పండి!
ఆ మాటలు వింటూంటే కాశికి దుఃఖం ఆగలేదు.
భోరున ఏడ్చేశాడు.
రెండు నిముషాల తరువాత తేరుకున్నాడు.
‘‘వాడు ఎన్ని అవకతవక పనులు చేసిన నన్ను మాత్రం వదల్లేదు. ఎప్పుడూ నన్ను వెంటబెట్టుకుని తిరుగుతూ వుండేవాడు. ననె్నప్పుడూ ‘వేస్ట్‌ఫెలో.. వేస్ట్‌ఫెలో’ అంటూ నా మొహంలోకి చూసేవాడు. నేను బాధపడటం వాడికి ఆనందం కల్గించేది.. ఆర్థికంగా నాకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. నాకు ఆ రోజుల్లోనే స్కోడా కారు కొనిపెట్టాడు వాడి బ్యాంక్ లావాదేవీలు నా ద్వారానే జరిగేవి! ఒక్కరోజు నేను కన్పించకపోతే కంగారుపడిపోయేవాడు. గొప్ప మేధావి! సర్జరీలో దిట్ట! కాకపోతే అతని తెలివితేటలన్నీ దుర్వినియోగం అయ్యాయి!’’ అన్నాడు కన్నీళ్ళని తుడుచుకుంటూ.
‘‘మీరు వచ్చెయ్యండి.. అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం! అరవింద్‌గారికి శాస్త్రోక్తంగా కర్మకాండలన్నీ నేనే చేస్తున్నాను’’ అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు స్కంద.
‘డాక్టర్ అరవింద్‌కు స్కంద కర్మకాండలు చెయ్యడం ఏమిటి? బంధువులు ఎవరూ లేకపోతే ప్రాణ స్నేహితుడి తను వున్నాడు.. కర్మకాండలు తను చెయ్యాలి!’’
ధవళేశ్వరం వెళ్ళేక ఆ విషయం స్కంతో మాట్లాడదామనుకున్నాడు కాశి.
***
గోదావరి వడ్డున అరవింద్ శవానికి దహన సంస్కారం జరుగుతుంటే కొంచెం దూరంలో కూర్చున్న అరయ్యేళ్ళ స్ర్తిని గుర్తుపట్టి దగ్గరకు వెళ్ళాడు కాశి.
ఆమెకు నమస్కరించాడు.
‘‘నేను గుర్తున్నానా?’’ అడిగాడు కాశి.
‘‘అరవింద్ స్నేహితుడివి.. నీ పేరు కాశి.. నిన్ను గుర్తుపట్టకపోవడం ఏమిటి? నువ్వు మీ ఆవిడ మా ఇంటికివచ్చిపోతూ వుండేవారు.. మీ ఆవిడ బాగున్నారా?’’ అంది మానస.
‘‘నన్నొదిలి ఆవిడ కూడా దూరంగా వెళ్లిపోయింది. ఈమధ్య కలిశాం! నాతోపాటు ఇక్కడకు వచ్చింది.. జ్వరం తగిలి రాజమండ్రి హోటల్లోనే వుండిపోయింది’’ అన్నాడతను.
‘‘స్కంద నా కొడుకు’’ అందామె.
స్కంద ఎందుకు అరవింద్‌కు అంతిమ సంస్కారం చేస్తున్నాడో ఇపుడు అర్థం అయ్యింది కాశికి.
సూర్యాస్తమయం కాకముందే అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
***
రాజమండ్రిలో స్కంద, మానస బస చేస్తున్న హోటల్‌కు వెళ్ళాడు కాశి.
‘‘బ్యాంకులో అరవింద్‌గారి పేరిట వున్న డబ్బు యాభ కోట్ల వరకు నేను డ్రా చేసి నా ఎకౌంట్‌లోకి ట్రన్సఫర్‌చేశాను. ఆ డబ్బు మీకు చెందాల్సి వుంది.. మీ ఎకౌంట్ నెంబర్ చెబితే మీకు ట్రాన్సఫర్ చేసేస్తాను’’ అన్నాడు మానసతో
తల్లి కాశికి ఏం సమాధానం ఇస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూశాడు స్కంద.
‘‘అరవిందగారినుంచి విడాకులు తీసుకున్నాను. ఆయన డబ్బు, ఆస్తిమీద నాకేం హక్కులేదు చట్టపరంగా ఒకవేళ హక్కు వున్నా ఆయన డబ్బు పైసా కూడా నేను ఆశించను. ఆయనకు డబ్బుమీద వున్న మమకారం మా వివాహ బంధం తెగిపోవడానికి కారణం అయ్యింది.. మాకొద్దు ఆయన సంపాదన.. ఆ డబ్బు మీదే! మీకు ఇష్టమైన పద్ధతుల్లో ఖర్చుపెట్టుకోండి’’ అంది మానస.
తల్లి వైపు మెసి కళ్ళతో చూశాడు స్కంద.
‘‘నేను, రోషిని దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగాం. తిరిగి తిరిగి అలిసిపోయాం! అనాథ శరణాలయాలు స్థాపించి వాటిని నిర్వహిస్తూ ఓ చోట స్థిమితంగా, ప్రశాంతగా కాలం గడుపుతాం! మేము నిర్వహించే ఓపిక తగ్గిపోతే మా దగ్గర వున్న డబ్బుతో ఓ ట్రస్ట్ ఏర్పాటుచేసి ట్రస్టీ మెంబర్ల ద్వారా అనాథ శరణాలయాలు సమర్థవంతంగా నడిపేటట్లు వారికి అపగిస్తాం!’’ అన్నాడు కాశి.
‘‘గుడ్ సమారిటన్ హాస్పిటల్ కూడా మా పేరు మీదే వుంది’’ అన్నాడు స్కంద.
ఆ హాస్పిటల్ ప్రభుత్వానికే అప్పజెప్పుతాను. కొంత డబ్బు కూడా హాస్పిటల్ పేరు మీద డిపాజిట్ చేసి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందేటట్లు చూస్తాను. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా జరిగే ఏర్పాట్లు చేస్తాను.. ఆ విషయం మీ సహకారం కావాలి!’’ అన్నాడు కాశి.
‘‘అప్పుడు నిజంగా గుడ్ సమారిటన్ హాస్పిటల్ పేదల పాలిటి పెన్నిధి అవుతుంది. గుడ్ సమారిటన్ అంటే పేదలను ఆదుకునేవాడు, ఆపదలో వున్నవాళ్ళను రక్షిచేవాడు.. మంచిపనులు చేసేవారికి ప్రభుత్వ సహకారం తప్పకుండా లభిస్తుంది అన్నాడు స్కంద.
‘‘మీరు లోహితను పెళ్లి చేసుకోబోతున్నారట గదా! మంచి శుభవార్త! ఆ అమ్మాయి నిజంగా గోల్డ్.. హాస్పిటల్‌కు ఆ అమ్మాయి వచ్చేక నాలో పాజిటివ్‌గా ఆలోచించడం మొదలైంది. మీతో పరిచయం అయ్యేక కొండంత ధైర్యం వచ్చింది అరిఫ్, అరవింద్‌లను ఎదిరించడానికి. రియల్లీ సర్.. యు హేవ్ డన్ ఎక్స్‌లెంట్ జాబ్!’’ అన్నాడు కాశి.
‘‘మావాడిని పొగడకండి.. పొగిడితే ఎదుగుదల ఆగిపోతుంది.. నా అంతటి వాడు లేడనే గర్వం వస్తోంది’ అంది మానస.
ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ