డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపయామాత్యులు లేచి అన్నారు.
‘‘ప్రభూ! సదస్యులా! ప్రభువుల సమీపాన ప్రత్యేక ఆసనంపై సూర్యసదృశులై ప్రకాశిస్తున్న మహామనీషి, మహాకవి తిక్కన సోమయాజివర్యులు. వీరిదివరకు నిర్వచనోత్తర రామాయణం రచించారు. యజ్ఞమాచరించి సోమయాజులైనారు.
రెండు శతాబ్దాలకు పూర్వం రాజమహేంద్రవరము నేలిన రాజరాజనరేంద్రుని కొలువులో విద్యామంత్రిగా ఉన్న నన్నయభట్టారకుల వారితో వ్యాస మహాభారతం తెలుగుసేత ఆరంభించబడినది. నన్నయ భట్టారకులవారు మూడు పర్వాలు రచించి దివంగతులైనారు. కాగా భారతాంధ్రీకరణ ఆగిపోయింది.
ఇంత కాలంగా నన్నయ సదృశులు ప్రభవించలేదు. ఇప్పుడు మన తిక్కన సోమయాజి మహాకవులు దానిని పునఃప్రారంభించినారు. విరాటపర్వంతో ఆరంభించినారు. విరాటోద్యోగపర్వాలు ప్రసిద్ధిగాంచి కడు రమ్యమైనవి. రాజకీయ కారణంగా వారు మన ఏకశిలానగరం వచ్చి మన ఆతిధ్యం స్వీకరించి మనలను ధన్యులను చేశారు. విరాటపర్వం వినిపించమని వినయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాము.
36
తిక్కన సోమయాజి ప్రభువులకూ, అమాత్యులకు సభాసదులకు అభివాదం చేసి హరిహరనాథ స్తుతి చేసి ప్రారంభించారు.
శ్రీయన గౌరు నాఁ బరగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయతమూర్తియై హరిహరంబగు రూపముదాల్చి విష్ణు రూ
పాయనమశ్చివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్పెద నిష్టసిద్ధికిన్‌॥
ప్రభూ! ఆశీఃపురస్సరంగా గాని, నమస్క్రియా రూపకంగా కాని వస్తు నిర్దేశకంగా కాని ప్రస్తావన ఉండుట సంప్రదాయం. ఆ యొరవడి పెట్టిన వాడు నన్నయ భట్టారకుడు. ఆయన ఆశీఃపురస్సరంగా వ్రాశారు. నేను నమ స్క్రియారూపంగా వ్రాశాను. ఆయన రాజరాజ నరేంద్రుడికి భారతాన్ని అంకితమిచ్చాడు. అందుకు ఆశీస్సు నెన్నుకున్నారు. నేను హరిహర రూపాన్ని కృతి భర్తగా ఎన్నుకున్నాను. అందుకే నమస్క్రియా రూపకంగా వ్రాయటం జరిగింది. నేను హరిహర అభేద తత్వాన్ని నమ్మిన వాడిని.
శా॥ విద్వత్సం స్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞానసం
పద్విఖ్యాతుడు సంయమిప్రకరసంభావ్యానుభావుండు, గృ
ష్ణ ద్వైపాయను డర్థిలోక హితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యంబైన యామ్నాయమున్‌॥
భారత సంహితను ‘జయ’మను పేర రచించిన కృష్ణద్వైపాయనుడు హరిని స్మరిస్తాడు.
ఉ॥ ఆదరణీయ సారవివిధార్థగతి స్ఫురణంబు గల్గియ
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెను పొందియుండ నం
దాది దొడంగి మూడు కృతులాంధ్ర కవిత్వ విశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముడు నమ్మయభట్టు దక్షతన్‌॥
ఆదికవి నన్నయ భట్టారకునకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన మూడు పర్వాలు వ్రాసి పదిహేను పర్వాలు విడవటంవల్ల దాన్ని రచించే భాగ్యం నాకు కలిగింది.ఆ అవకాశం కలిగించిన ఋషి ఆయన.
ఉ॥ వైదిక మార్గనిష్ఠ మగు వర్తనముం దగ నిర్వహించుచు
నే్భదము లేని భక్తి మది నిర్మలవృత్తిగ జేయు చుండ మ
త్పాదనిరంతర స్మరణ తత్పరభావముకల్మినాత్మ స
మ్మోదము బొంద గావ్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడున్
ప్రభూ! వైదిక మార్గవర్తనం, శివకేశవ అభేదం, కావ్య రసాస్వాదనం, బ్రహ్మానంద స్థితి పొందాలన్నదే నా అభిమతం, నిరంతర భగవన్నామ స్మరణ ముక్తిదాయకం.
వ.మహాభారతంబు సమస్త దురితాపహరంబును, నభిమత శుభావహంబును గావున నొక్క మహాఫలంబుగోరి జనమేజయుండు కృష్ణద్వైపాయన మహాముని కారుణ్యంబు వడసి తదీయ ప్రియశిష్యుండై వైశంపాయను వలస వినిన కథయగుటం జేసి తత్ప్రకారంబు నడిపెద, నది యెట్లనినరంబరమపవిత్రులగు పాండుపుత్ర చరిత్రం బుపాఖ్యాన ససితంబుగా విని జనమేజయుండు వైశంపాయను నకిట్లనియ.
ప్రభూ! అక్కడక్కడా చదువుతాను వినండి.
తిక్కన పద్యాలు అనర్గళంగా చదవడం ప్రారంభించారు. ఆ పద్యాల పరిమళాన్ని ఆసాద్విస్తూ సభఅంతా నిశ్శబ్ధంగా ఉంది. అక్కడ భారతం జరుగుతున్నదా అన్నట్టు తిక్కన పద్యాలను చదువుతూనే ఉన్నారు.
మధ్యలో
‘‘మహాకవీ! ఈ పద్యం అడుపులి గాండ్రించినట్లున్నది కదా!’’ అన్నారు గణపతిదేవులు.
‘‘ఔను ప్రభూ! మీరు చక్కగా అన్నారు. ఆ పద్యం కూడా శార్దూలమే. మహాకవులు ప్రాసస్థానంలో ‘రేఫ’ వాడారు. అది అగ్ని బీజం ద్రౌపదికి కలిగిన కోపానికి ఆమె నేత్రాలు అగ్ని గోళాలై ఆమె నోటి వెంట వచ్చే మాటలు అగ్ని కణాలైనవి. ఆమె ఒక అగ్నిపర్వతంలా అగ్ని జ్వాలలు వెదజల్లింది. తిక్కన మహాకవి ప్రతిభకు ఈ ప ద్యం మచ్చుతునక. మహాకవీ! ఆ పద్యాన్ని మీ నోట మరోమారు వినగోరుచున్నాము, మన్నించండి’’ అన్నారు గణపయామాత్యులు.
‘‘మహాకవీ! మా కోరికా అదే’’ అన్నారు ప్రభువులు.
మళ్లీ చదివిన పద్యమే చదివారు.
సభ అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయంది.
‘‘చాలా సంతోషము’’ తిక్కనామాత్యులు ఆ పద్యాన్ని మళ్లీ చదివారు. అందరూ మళ్లీ కరతాళ ధ్వనులు చేశారు.
అప్పుడు తిక్కన మహాకవి అన్నారు.
‘‘ప్రభూ! నా భారత రచనలో యిది ఒక రత్నం లాంటి పద్యమని నేనే అప్పుడప్పుడూ చదువుకుని మురిసిపోతుంటానుర. ఈనాడు మీ అందరినీ అలరించటం నా పూర్వజన్మ సుకృతం.
అలా సాగిపోతున్నది భారత రచన.
గణపయామాత్యులు తిక్కన సోమయాజి సలహాలతో సూచనలతో జనరంజకమైన పాలన సాగిస్తున్నారు. ప్రజలంతా రామరాజ్యంలో ఉన్నట్టు అనుభూతి పొందు తున్నారు. పైరులన్నీ ముక్కారు పంటలతో అలరారుతున్నాయ. ఫ్రకృతి కాలానుగుణంగా మార్పులు చెందుతూ ప్రజలకు అనువుగా ఉంది. ప్రకృతిని అనుసరిస్తూ ప్రజలు కూడా తమ దైనందిన కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.

-సమాప్తం

-అయ్యదేవర పురుషోత్తమరావు