డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంక ప్రేమంటావా.. ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు.! అతనిమీద నాకున్న ఇష్టాన్ని ప్రేమనుకోవడమే నేను చేసిన పొరపాటేమో...’’
లక్ష్మి మాట్లాడలేదు. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం కలుగచేసుకుని తనకి తోచిందేదో మాట్లాడేసి తర్వాత వారి భావాలు తెలిసాక నాలుక కరచుకోవడం కన్నా వౌనంగా వుండడం మంచిదని ఆమె అభిప్రాయం. అయితే, ప్రస్తుతం అదికాదు ఆమె ఆలోచిస్తున్నది.
‘‘నాలుగు నెలల క్రితం వరుణ్‌కోసం ఎదురుచూస్తూ తనకి బస్‌స్టాప్‌లో దొరికిపోయి కంగారుపడిన హరితకీ, ఇప్పటి హరితకీ ఎంత తేడా?! నిలువునా దహించివేస్తున్న ఈ సందేహాలూ, ఇన్ని ఆలోచనలూ అప్పుడు లేవామెకి.. కొలిమిలో ఎర్రగా కాలిన తరువాతే బంగారానికి వనె్న వచ్చి ప్రకాశించేది..’’ అనుకుంది లక్ష్మి.
బయటికి వచ్చేసాక కూడా రోడ్డుమీద నడుస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ. తనూ వరుణ్ కూడా ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. వరుణ్ కూడా తన కష్టాలని విని తనని ఓదార్చేవాడు.. తన మూడ్ మార్చడానికి ప్రయత్నించేవాడు. కానీ అతడితో మాట్లాడడానికీ లక్ష్మితో మాట్లాడడానికీ తేడా వుంది.
కలకీ, వాస్తవానికీ ఉన్నంత తేడా.. అతను తనకి సమస్యనుంచి పారిపోవడం నేర్పేవాడు.. సమస్యని వాయిదా వెయ్యడం నేర్పేవాడు.. కానీ లక్ష్మి సమస్యకి ఎదురునిలిచి పోరాడమని చెప్తోంది! అదే తేడా!
‘తనకి వరుణ్‌కన్నా, భరణికన్నా ముందుగా లక్ష్మి పరిచయం అయివుంటే ఎంత బాగుండేది?’ అనుకుంది హరిత బాధగా.
***
‘‘పులి మనల్ని భయపెడుతుంది, కానీ అది మనం దానికి భయపడినంతవరకే. మనం దానికి ఎదురుతిరిగితే అది మనకన్నా భయపడుతుంది. సమస్య కూడా అంతే. భరణి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి లక్ష్మి చెప్పిన ఈ చిన్న సూత్రం నాకు ఉపయోగపడింది. వరుణ్, భరణి, లక్ష్మి.. ఈ ముగ్గురూ జీవితాన్ని గురించిన ‘నిజాన్ని’ తెలుసుకునే మూడు స్థాయిలని దాటడానికి నాకు సహకరించారు’’ అంటూ తన కథ చెప్పడం ముగించింది హరిత.
ఆమె చెప్పిందంతా విన్నాక పాణి ఏమీ మాట్లాడకుండా కాసేపు హరితవంకే పరిశీలిస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తరువాత నెమ్మదిగా అడిగాడు ‘‘ప్రస్తుతం భరణితో మీ రిలేషన్ ఏమిటి?’’
‘‘నేను వరుణ్‌కి దూరమయ్యాక వదలకుండా కొన్నాళ్ళు నా వెంటే తిరిగాడు. అందరికీ తను నా బోయ్‌ఫ్రెండ్‌నని ప్రచారం చేసేవాడు. అతడి గురించి బాగా తెలుసు కనుక లక్ష్మి ఇచ్చిన సలహా మేరకి నేను అతడిని సమర్థించలేదు. వ్యతిరేకించలేదు. కొన్నాళ్లు అలాగే గడిచాయి. అతడితో స్నేహంగా ఉంటూనే అతడ్ని ఎంతలో వుంచాలో అంతలో ఉంచేదాన్ని. నన్ను ఏ రకంగానూ మభ్యపెట్టడం సాధ్యంకాదని క్రమంగా అర్థమై, అతడు సమయం వృధా చేసుకోవడం ఇష్టంలేక తర్వాత నాకు దూరమయ్యడు. ప్రస్తుతం మా ఇద్దరిమధ్యనా ఎలాంటి స్నేహమూ లేదు’’.
‘‘వరుణ్?’’
‘‘వరుణ్ పిరికివాడే కానీ చెడ్డవాడు కాదు. నేనూ, లక్ష్మి కలిసి వరుణ్‌కి కౌన్సిలింగ్ చేసాను. భరణి గురించిన నిజాన్ని చెప్పాము. ఇపుడు వరుణ్ నాకు స్నేహితుడే. అయితే బోయ్‌ఫ్రెండ్ మాత్రం కాదు’’ నవ్వింది హరిత.
‘‘్భరణి మరణంమీద మీకెవరిమీదైనా అనుమానం వుందా? మీకు తెలిసి అతడికి ఇంకెవరైనా శతృవులు వున్నారా?’’
‘‘తెలియదు. అతడి బెడద నాకు వదిలిపోయాక నేను ఎప్పుడూ అతడి గురించి ఆలోచించలేదు. తెలుసుకోలేదు’’ చెప్పింది హరిత.
‘‘నాకోసం సమయం వెచ్చించినందుకు థాంక్స్. ముందు ముందు మరేమైనా సమాచారం కావాలంటే మిమ్మల్ని కలుస్తాను. ఆలస్యమైంది. మిమ్మల్ని కార్లో ఇంటి దగ్గర దింపమంటారా?’’ అడిగాడు పాణి ఆమె వంక కృతజ్ఞతగా చూస్తూ.
‘‘వద్దండీ, థాంక్స్’’ అంటూ లేచింది హరిత. పాణి కాఫీ బిల్లు చెల్లించాక అతడి ‘బై’ చెప్పి బస్టాప్ వైపు నడుస్తూ వెళ్లిపోయింది. ఆమె కనుమరుగయ్యేవరకూ చూసి తిరిగి మళ్లీ ఆ కాఫీ షాప్‌కి వచ్చాడు పాణి. అతడు తిరిగి వచ్చేసరికి అప్పటిదాకా వాళ్ళ వెనుక టేబిల్ దగ్గర కూర్చుని వాళ్ళ మాటలు వింటున్న ఎస్సై రవీంద్ర నవ్వుతూ వచ్చి పాణికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అతడితోపాటూ వచ్చిన క్లూస్ టీమ్ టేబిల్‌మీద, కాఫీ కప్పులమీద ఉన్న హరిత వేలిముద్రలని సేకరించడం, క్రింద నేలమీద రాలిపడిన తల వెంట్రుకల వంటి చిన్న చిన్న ఆధారాలను సేకరించి భద్రపరచడం వంటి పనులని చకచకా చేసుకుని పోతున్నారు. వాళ్ళు చేస్తున్న పనిని గమనించి సంతృప్తిగా తల పంకిస్తూ ‘్థంక్స్’ అన్నాడు పాణి రవీంద్రతో.
‘‘ఆమెకి భరణితో ఏ సంబంధమూ లేదంటోంది కదా? ఇప్పుడిదంతా ఎందుకు?’’ నవ్వుతూ అడిగాడు రవీంద్ర పాణిని.
పాణి చిన్నగా నవ్వాడు ‘‘అనుమానం ప్రశ్నకి దారితీస్తుంది. ప్రశ్నల వల్ల నిజం బయటికి వస్తుంది. అందుకే పరిశోధనలోప్రథమ సూత్రం చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా ప్రతిదాన్నీ అనుమానించడం’’ అన్నాడు.
దాదాపు పది నిమిషాల తరువాత క్లూస్ టీమ్ తమ పని పూర్తయిందని చెప్పాక, ఆ కాఫీ షాప్ యజమానికి థాంక్స్ చెప్పి జీప్ ఎక్కి బయలుదేరాడు పాణి, రవంద్ర..
***
టీవీలో వస్తున్న సినిమాని అంజలి ఆసక్తిగా చూస్తోంది. ఏదో హరర్ సినిమా. డ్రాకులా స్మశానంలో విలన్‌ని పరిగెత్తిస్తూ వెంటపడుతోంది.
పెళ్ళయ్యాక మొదటి రాత్రి అందరి మగాళ్ళలాగే అంజలిని రొటీన్‌గా ‘‘నీ హాబీలేమిటి?’’ అని అడిగాడు పాణి.
ఆమె ‘‘సినిమాలు చూడడం’’ అని చెప్పింది.
‘‘ఎలాంటి సినిమాలు చూడడం నీకిష్టం?’’ అని తను మరో రొటీన్ ప్రశ్న వేశాడు టీవీలో ఇంటర్వ్యూ చేసే యాంకర్లా.
‘‘హర్రర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. డ్రాక్యులా సినిమాలు చూడడం మరీ ఇష్టం’’ అందామె తడుముకోకుండా. ఆ సమాధానానికి జడుసుకున్నాడు పాణి. పాలుగారుతున్న బుగ్గలతో అందంగా కనిపిస్తున్న ఆమె వంక ఒకసారి అనుమానంగా చూసాడు. అతడికి అప్పటికి హారర్ సినిమాలు చూసే అలవాటు లేదు కనుక సరిపోయింది కాని లేకపోతే చాలా అనుమానాలు వచ్చి ఉండేవి. ఆమెమీద చెయ్యి వెయ్యడానికే భయమేసేది. అప్పుడు మాత్రం అసలు తను ఆ సమయంలో ఆమె అలవాట్ల గురించి ఎందుకు ప్రస్తావించాడా అని తనని తానే తిట్టుకుని మాట మార్చాడు.
కాపురానికొచ్చిన కొత్తలో ఒక్కర్తే కూర్చుని అర్థరాత్రుల వరకూ డ్రాకులా సినిమాలు చూసే ఆమెని చూస్తే భయం వేసేది. క్రమంగా అలవాటు పడిపోయాడు.
నిరాసక్తంగా అంజలి చూస్తున్న సినిమాని చూస్తున్న పాణి తన ఫోన్ రింగవడం గమనించాడు. అతడు ఫోన్ ఎత్తేసరికి అంజలి టీవీ సౌండ్ మ్యూట్ చేసింది. అవతల నుంచి రవీంద్ర మాట్లాడుతున్నాడు, ‘‘హలో పాణీ- మీకొక గుడ్ న్యూస్’’అన్నాడు.
‘‘ఏమిటీ? భుజంగరావుగారు పరిశోధన ఆపేయమన్నారా? మేము అరకు లోయ వెళ్ళిపోవచ్చా?’’ ఆశగా అన్నాడు పాణి పక్కనే వున్న భార్య అంజలి వంక చూస్త్త్తూత.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ