డైలీ సీరియల్

అన్వేషణ -15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరూ బైక్‌మీద బయల్దేరారు. ఇద్దరి మనస్సులలో తలా తోకాలేని ప్రశ్నలు, అస్పష్టంగా సమాధానాలు, ఆందోళనలు గజిబిజిగా ఉన్నాయి.
‘‘డిన్నర్ చేసి వెళదాం’’ అన్నాడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, నిదానంగా బైక్ పోనిస్తూ.
‘‘అన్నం మిగిలితే పొద్దునే్న మా పిన్ని పులిహోర చెయ్యనా అంటుంది..’’ అంటూ కిసుక్కున నవ్వింది హిమజ.
‘‘్ఫర్వాలేదు. మార్నింగ్ పులిహోర టిఫిన్ చేసెయ్..’’
‘‘నీ సహచర్యం మొదలయ్యాక ఈమద్య అలాగే చేస్తున్నాను బాబూ.. సడెన్‌గా డిన్నర్ అంటావ్ మరి..’’
‘‘ఓ మాట చెప్పనా.. మామూలుగా నాకు ఇది తినాలనిగానీ, ఇది కావాలనిగానీ చిన్నప్పటినంచీ.. అంటే కొద్దికొద్దిగా ఊహ తెలిసినదగ్గర్నుంచీ ఉండేది కాదు.. అందుకు నేను పెరిగిన వావరణం కావచ్చు.. కాస్త బాగా ఊహ తెలిశాక అమ్మమ్మని ఇబ్బంది పెట్టాలేమో అన్న ఫీలింగ్ కావచ్చు.. ఇక నేనుగా సంపాదించుకుంటున్నపుడు ఒకళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్‌తో ఇలా హోటళ్లకి రావడం అలవాటయ్యింది.. వాళ్లు అప్పుడప్పుడు సరదాగా లిక్కర్ తీసుకునేవాళ్లు.. నాకు ఆ అలవాటు మాత్రం కాలేదు...’’
‘‘రాముడు మంచి బాలుడు కదా!..’’ అంటూ అతడి భుజంమీద సున్నితంగా తట్టింది.
‘‘అందుకే నాకు ఈ సీత దొరికింది..’’
‘‘ఆ సీతకి వనవాసం అన్నట్లు.. నాకు కొంతకాలం ఎడబాటు పెట్టావ్.. అవునా..?’’
‘‘సారీ హిమా!.. ఇది ఊహించని పరిస్థితి...’’ చిన్నగా అన్నాడు.
‘‘్ఫర్వాలేదు అనిర్!.. సంతోషంగా వెయిట్ చేస్తాను.. నువ్వు తొందరలోనే నీ పనిని సాధిస్తావ్.. డోంట్ వర్రీ..’’
‘‘ఓ రెస్టారెంట్ దగ్గర బైక్‌ని ఆపాడు అనిరుధ్. తను కాదంటే అతడు కూడా తినడం మానేస్తాడేమోనని కాదనలేక అతడిని అనుసరించిందామె.
***
ఐదొందల గజాల స్థలంలో అధునాతనంగా కట్టిన డూప్లెక్స్ భవంతి అది. ఆ ఇంట్లో అన్నీ బ్రాండెడ్ వస్తువులే ఉంటాయి. హాల్లోకి ప్రవేశించగానే ఎదురుగా టూ బై ఫోర్ అడుగుల సైజులో మక్కా మసీదు ఫొటో కనువిందు చేస్తుంది. ఆ ఫొటో ప్రేము చుట్టూ విద్యుత్ బిల్బులు రంగులు మార్చుకుంటూ వెలుగుతుంటాయి.
హాలుకి మరోప్రక్కగా మూడు మతాలను సూచిస్తున్నట్లు ఓ ఫొటో ఉంటుంది. దానికే విద్యుత్ బల్బులూ లేవు. ఇంకా హాలులో గోడలకి మోడరన్ పెయింటింగ్ చిత్ర పటాలు అక్కడక్కడా ఉన్నాయి. వాటి గురించి నిజానికి ఆ ఇంట్లో వాళ్ళకేం తెలీదు. కానీ తమలాంటి పెద్దవాళ్లు ఇళ్ళల్లో పెట్టుకున్నారు కాబట్టి తామూ అలా పెట్టుకోవాలని డబ్బుకు వెనుకాడకుండా కొనుక్కొచ్చి తగిలించారు.
హాలు మధ్యగా ఖరీదైన సోఫాసెట్టు, దానిమధ్యలో పెద్ద గులాబీ పువ్వు పరచినట్లు కనిపించే టీపాయ్ ఉన్నాయి. గోడకి ఐదారు కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీల ఎదురుగా ఉన్న మరో చిన్న టీపాయ్‌మీద ఆ రోజు వార్తాపత్రికలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. హాలుకి మరోవైపు మక్కా మసీదు బొమ్మ వున్న పెద్ద వాల్‌క్లాక్ ఉంది. అది గంటలు కొట్టినపుడు తమాషా అయిన సంగీతం వినిపిస్తుంది.
హాలు మధ్యలో సోఫా సెట్టు క్రింద అందమైన తివాచీ పరచి ఉంది. నేలంతా చక్కని పాలరాతితో ఆకర్షణీయంగా ఉంది. హాలులోంచి వెళ్ళే గదులకీ అందమైన కర్టెన్లున్నాయి. హాలులోకి రాగానే రూమ్ ఫ్రెష్‌నర్ పెర్‌ఫ్యూమ్ గుభాళిస్తూంటుంది.
మామూలుగా ఆ హాలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని రహీం పాషా ఇంట్లో ఉన్నపుడు మాత్రం అతడి అనుచరులు, అతడికోసం వచ్చినవాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఒక్కోసారి హాలు నిండిపోతుంది. కుర్చీలు ఖాళీ లేకపోతే బయట నిల్చుంటారు జనం.
ఆ ఇంటి యజమాని అంటే... రహీంపాషా ఆ సిటీ కార్పొరేటర్. మొదటిసారి మంచి మెజారిటీతో ఎన్నికయ్యాడు. రెండోసారి బొటాబొటీ మెజారిటీతో ఎన్నికయ్యాడు. అయితే అధికార పక్షం కార్పొరేటర్ కనుక హోదాకీ, హడావిడికీ తక్కువలేదు.
సిటీలో గొప్పగొప్ప వాళ్లందరికీ ఏవేవో చరిత్రలున్నట్లు రహీంపాషాకి చరిత్ర ఉంది. చరిత్ర అంటే అతడు ఆ స్థాయికి రావడానికి వెనుకగల కథ అన్నమాట!
అతడు ఆ స్థాయికి రావడానికి చాలాకష్టపడ్డాడు. ఇక్కడ కష్టం అన్న మాటని సిసలైన కళ్లతో చూసి అంచనావేయకూడదు. అతడికి ఏ దారి బాగుంటే ఆ దారిలో వెళ్లాడు. ఒకటి రెండు సందర్భాల్లో అతడికి చేయూతనిచ్చిన వాళ్ల చేతులు నరకవలసి వస్తే వెనుకాముందూ చూడలేదు... నరికేశాడు. న్యాయం, ధర్మం అన్నది అతడి నిఘంటువులో లేదు.
ఇప్పుడు అతడు భవంతి కట్టుకున్న ఐదొందల గజాల స్థలం కూడా అలా సంపాదించుకున్నదే. ఆనాడు అతడు అలా ప్రవర్తించకపోతే అంత మంచి సెంటర్‌లో అలాంటి స్థలం అతడికి ఏమాత్రం దొరికేది కాదుమరి!
చిన్న లిటిగేషన్‌లో ఇరుక్కున్న ఇద్దరు అన్నదమ్ముల స్థలం అది. దాని పంచాయితీకోసం ఇద్దరికీ తెలిసి ఉన్న ఒకతను రహీంపాషా దగ్గరికి తీసుకొస్తే పిల్లితగువూ పిల్లితగువూ కోతి తీర్చిందన్న సామెతగా ఇద్దర్నీ బెదిరించి, తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరిలో ఒకడిని యాక్సిడెంటులో చంపించేసి ఆ స్థలం ఆక్రమించేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తి రహీం ప్రత్యర్థిదగ్గరికి వెళ్లిపోతే బ్రతికి ఉండేవాడేమో గాని స్థలం మాత్రం వాళ్లకి దక్కేదికాదు.
ఇలా బలహీనుల స్థలాలు, ఇళ్లు, రాజకీయాలను అడ్డంపెట్టుకున్న రహీంలాంటి దాదాలు నాయకుల చేతుల్లో వెళ్లిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ సిటీలో... బహుశా అనేకచోట్ల! దీనికి ఏ పోలీసు రక్షణగా రాడు. ఏ చట్టమూ ఆదుకోదు. ఎందుకంటే చట్టం, పోలీసులు వాళ్ల చుట్టాలే కనుక!
మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు రహీంపాషా రాజకీయాలలో మచ్చలేని నేత. రెండోసారి పోటీ చేస్తున్నప్పుడు చాలా మచ్చలు బయటికి వచ్చాయి. అందుకే ఓడిపోతాడనుకున్నవాడు గ్రుడ్డిలోమెల్లగా బొటాబొటీ ఓట్లతో గెలిచాననిపించుకున్నాడు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడే వీలైనంత కూడబెట్టేశాడు.
అతడికి ఇద్దరు సంతానం. పెద్దవాడు అహ్మద్‌పాషా ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు. నిజానికి అది రెండేళ్లక్రిందటే అయిపోవాల్సి ఉంది. కానీ, చదివి అర్జంటుగా ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు గనక నిదానంగా చదువుతున్నాడు.
అతడు స్టూడెంట్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేశాడు. ఎలా ప్రవర్తించినా, ఏం చేసిన తాను కార్పొరేటర్ రహీంపాషా అబ్బాయి కనుక తనకి అడ్డూఆపూ ఉండదని భరోసాగా మరీ ప్రవర్తించాడు.
అతడూ, అతడి మిత్రబృందం కలసి ఓ అమ్మయిని పాడుచేసినా అది వెలుగులోకి రాలేదు. కరెన్సీనోట్లు ఆ అకృత్యాన్ని కమ్మేశాయి. పేదరికం వాళ్ల నోళ్లు నొక్కేసింది. అలాగే సెల్‌ఫోన్లలో అమ్మాయిల అశ్లీల ఫొటోలు తీసి సరదాలు చేసుకున్నా అవీ వెలుగులోకి రాలేదు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా పట్టించుకునే నాధుడులేడు. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842