డైలీ సీరియల్

అన్వేషణ -25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ హేమంత్ నలభయ్యేళ్లలోపువాడే. హుందాగా ఉన్నాడు. కడిగిన ముత్యంలా శుభ్రంగా ఉన్నాడు. ఘుమఘుమలాడుతున్నాడు.
‘‘మీలో పేషెంట్?.. ’’ ఫైలు ఏదీ లేకపోవడంతో అడిగాడు డాక్టర్ హేమంత్.
‘‘ట్రీట్‌మెంట్ కోసం కాదు సార్..’’ అంటూ అనిరుధ్ తనకి తాను పరిచయం చేసుకున్నాడు. కొండబాబుని పరిచయం చేశాడు.
‘‘సో.. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ..’’ అడిగాడు డాక్టర్ హేమంత్.
‘‘సర్ ఓ పావుగంట టైము తీసుకుంటాం.. మీకు అభ్యంతరం లేదా.. ఇబ్బంది అనుకుంటే మళ్లీ మీరు ఏ టైములో అంటే ఆ టైములో వచ్చి కలుస్తాం సర్...’’ అన్నాడు అనిరుధ్.
క్షణం ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టాడు డాక్టర్ హేమంత్. నర్స్ రాగానే అడిగాడు, ఇంకా పేషెంట్స్ ఉన్నారా అని. ఒకళ్లిద్దరున్నారని చెప్పిందామె.
‘‘సో.. ప్లీజ్ వెయిట్.. వాళ్లని చూసి పంపించేసిన తర్వాత మీతో మాట్లాడతాను..’’ చెప్పాడు డాక్టర్ హేమంత్.
‘‘ఓకె సర్..’’ అని చెప్పి ఇద్దరూ బయటికి వచ్చేశారు. మళ్లీ దాదాపు ఒక గంట కూర్చున్నాక వీళ్లని పిలిచాడు డాక్టర్ హేమంత్.
‘‘చెప్పండి.. మీ ప్రోబ్లమ్ ఏమిటి?’’ అనిరుధ్, కొండబాబు తన ఎదురుగా కుర్చీలో కూర్చున్నాక అడిగాడు హేమంత్.
ఎలా మొదలుపెట్టాలో తెలీక ఓ పది సెకన్లు వౌనంగా ఉన్నాక నోరు విప్పాడు అనిరుధ్- ‘‘మాకో డిఎన్‌ఎ టెస్టు చేయించిపెట్టాలి సర్..’’
‘‘డిఎన్‌ఏ?!.. ఎవరిది?’’’ హేమంత్ అడిగాడు కుతూహలంగా.
‘‘అతడు సిటీలో ప్రముఖుడు డాక్టర్‌గారూ.. అదీ సీక్రెట్‌గా.. ఎవరికీ తెలియకుండా చేయించాలి సర్..’’ చెప్పాడు కొండబాబు.
‘‘అది నేరం అని మీకు తెలుసా?.. అతని పర్మిషన్ లేకుండా ఇలాంటి టెస్టు చేయించకూడదు కదా.. డూ యూ నో ఇట్?.. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?’’
‘‘ఇందుకుగాను మీకు ఎంత కావాలన్నా ఇస్తాం.. ప్లీజ్..’’ కొండబాబు అన్నాడు.
‘‘అసలు ఎందుకు సీక్రెట్‌గా చేయించాలనుకుంటున్నారు? వాట్స్‌ద ప్రాబ్లమ్?.. డిఎన్‌ఎ టెస్టుతో పనేంటి?’’ హేమంత్ అడిగాడు నిశితంగా వాళ్లనే చూస్తూ.
‘‘సర్! ఇందుకు సంబంధించి ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ మీకు చెప్పాలి సర్.. మీకు అభ్యంతరం లేకపోతే..’’
‘‘పెయిన్‌పుల్ ఇన్సిడెంట్..?!.. చెప్పండి.. ఏమిటది?’’
కొండబాబు క్లుప్తంగా అనిరుధ్ తల్లి గురించి చెప్పాడు నాలుగు ముక్కల్లో. అది విన్నాక డాక్టర్ హేమంత్ కొద్ది క్షణాలు వౌనంగా ఉండిపోయాడు. టేబుల్‌మీదున్న మంచి నీళ్ల గ్లాస్‌మీద మూత తీసి నాలుగు గుక్కలు తాగాడు.
‘‘ఆమెకు పుట్టినవాడే ఇతడు సర్.. ఇప్పుడు తనకి తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న చిన్న కోరికే ఈ డిఎన్‌ఎ టెస్టు డాక్టర్‌గారూ..’’ కొండబాబు పూర్తిచేశాడు.
అనిరుధ్‌ని తేరిపార చూశాడు డాక్టర్ హేమంత్. అతడికి వింతగా అనిపించింది. ఇదొక ఆశ్చర్యకరమైన కేసుగానూ నిపించింది. అలా పుట్టిన కుర్రాడు ఇపుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్! అదీ ఆశ్చర్యంగానే ఉందతడికి. ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయా అనుకున్నాడు.
ఇందులో అద్భుతం ఏముంది? ఆ రాస్కెల్స్‌లో ఎవడో ఒకడు ఇతడి తండ్రి అవడం ఖాయం అనుకున్నాడు మళ్లీ.
‘‘ఈ సంగతి మీకెప్పుడు తెలిసింది?’’ అనిరుధ్‌ని అడిగాడు. అలా అడుగుతున్నప్పుడు ఎందుకో తెలీదు డాక్టర్ హేమంత్ కంఠం వణికినట్లనిపించింది తనకే.
‘‘ఈమధ్యనే డాక్టర్‌గారూ..’’ నెమ్మదిగా అన్నాడు అనిరుధ్.
‘‘అప్పట్నుంచీ వాడు చాలా బాధపడుతున్నాడు సర్. మీరు ఈ విషయంలో హెల్ప్ చెయ్యాలి.. మీ ఫీజు ఎంతయినా సరే ఇస్తాం...’’ కొండబాబు చెప్పాడు.
‘‘ఆ ప్రముఖుడెవరో ఇప్పుడయినా చెబుతారా?’’ హేమంత్ అడిగాడు.
‘‘కార్పొరేటర్ రహీంపాషా సర్..’’ కొండబాబే చెప్పాడు చెప్పక తప్పదన్నట్లు.
ఆశ్చర్యంగా ముందుకు వంగాడు రివాల్వింగ్ ఛైర్‌లోంచి హేమంత్. ‘‘రహీం పాషా?...’’ ఈజిట్ ట్రూ.. రహీంపాషా?!?’’ అనడిగాడు.
‘‘అవునండి.. మీరన్న ఆ రాస్కెల్స్‌లో ఒకడు అతడే..’’ కొండబాబు చెప్పాడు గంభీరంగా.
చాలాసేపు మాట్లాడకుండా వౌనంగా కూర్చుండిపోయాడు హేమంత్. ఇంక పేషెంట్లు ఎవరూ లేరని నర్స్ రెండోసారి వచ్చి చెప్పి వెళ్లింది. ఎందుకంటే డాక్టర్ హేమంత్ మరో హాస్పిటల్‌కి విజిటింగ్ డాక్టర్‌గా వెళ్లాలి.
‘‘ప్లీజ్ సర్.. హెల్ప్ చెయ్యండి..’’ కొండబాబు అన్నాడు అభ్యర్థనగా.
‘‘ష్యూర్! చేస్తాను.. బ్లడ్ శాంపిల్స్‌గానీ, చివర గుజ్జుతో వున్న వెంట్రుకలుగానీ, ఇయర్‌బడ్స్‌తో గట్టిగా శరీరంమీద రాసి కానీ తీసుకురండి.. అవి ఎలా తీసుకురావాలో చెబుతాను..’’ హేమంత్ అన్నాడు.
‘‘్థంక్యూసర్.. మీ ఫీజు ఎంతో చెప్పండి డాక్టర్‌గారూ..’’ అనిరుధ్ అడిగాడు.
‘‘మీరు ఏంతిద్దామనుకుంటున్నారు?’’
‘‘ఏమీ అనుకోలేదు సర్.. ఎందుకంటే మాకు ఎంతివ్వాలో తెలీదు..’’
‘‘్ఫర్వాలేదు చెప్పండి..’’
‘‘ఒక లక్ష?!..’’ నెమ్మదిగా అన్నాడు కొండబాబు తక్కువ చెబుతున్నానేమో అన్నట్లు. డాక్టర్ హేమంత్ వెంటనే ఏమీ మాట్లాడలేదు. దాంతో తక్కువ చెప్పానేమో అనుకున్నాడు కొండబాబు.
‘టూలాక్స్ సర్..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘మొదట చెప్పిన అవౌంట్ చాలు.. ఓకె.. నేను చెప్పినవి తీసుకురండి.. ఇక్కడ కాదు, వేరే చోటుకి పంపాలి. కొంత టైము పడుతుంది..’’
‘‘అలాగే సర్... అడ్వాన్స్‌గా..’’ కొండబాబు సగంలో ఆపాడు.
‘‘అవసరంలేదు.. శాంపిల్స్‌తోబాటు ఇద్దరుగాని..’’
‘‘ఓకె డాక్టర్‌గారూ..’’ అని ఇద్దరూ విష్ చేసి బయటకి వచ్చేశారు.
***
సాయంత్రం ఐదు గంటలు కావస్తూంది. ఇప్పుడే వస్తాం అమ్మమ్మా అని చెప్పి కొండబాబుతో పావుగంట క్రితమే వెళ్లాడు అనిరుధ్. మిత్రుడు కొండబాబు లేకుండా అనిరుధ్ బయటికి వెళ్లడు. ఎక్కడికెళ్లినా సరే అతడు కూడా ఉండాల్సిందే. మిత్రుడు అనిరుధ్ సిటీకి వచ్చాడంటే కొండబాబు తన పనులన్నీ ఆ రెండు మూడు రోజులూ మానుకుంటాడు.
అతడికి సిటీలో ఒక బియ్యం దుకాణం ఉంది. ఐదెకరాలు పొలం ఉంది. పొలం సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ బియ్యం షాపు నడుపుతున్నాడు. ఉద్యోగం కోసం అతడు ప్రయత్నిస్తున్న సమయంలో అనిరుధ్ సలహా ఇచ్చాడు. మీ నాన్న రైస్ షాప్ నువ్వే రన్ చేసుకోవచ్చు కదరా అని. అప్పటికి కొండబాబు తండ్రి కూడా పెద్దవాడటంవల్ల్ల, ఆస్త్మా కారణంగా బాగా నీరసించిపోయాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842