డైలీ సీరియల్

అన్వేషణ -37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరి నారాయణకీ, రాగిణికీ మధ్య వున్న సంబంధం ఎలాంటిదో అన్న డౌటొచ్చింది నాకు. వాళ్లిద్దరిమధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ కనుక ఉంటే మన పని ఈజీ అవుతుంది.. లేకపోతే సాధ్యం కాదు.. ఇప్పుడు డ్రైవర్ మాటలతో నాకర్థమయ్యింది వాళ్లిద్దరిమధ్యా కాంటాక్ట్ ఉంది. అది మనకి ఉపయోగపడుతుందని.. ఇపుడు మనం నిస్సందేహంగా ప్రొసీడ్ అవ్వొచ్చు..’’ కొండబాబు వివరించాడు.
‘‘్థ్యంక్స్‌రా కొండలూ.. నాకా ఆలోచనే రాలేదు..’’ నిజాయితీగా చెప్పాడు అనిరుధ్.
‘‘దీనికి థ్యాంక్స్ ఏమిటిరా!.. నువ్వు నా ఫ్రెండువి.. చాలా చాలా కావాల్సిన వాడివి.. నీకిలాంటివి పెద్దగా తెలీవు.. ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే పెరిగావు.. నేను అలాక్కాదు.. అందుకే నీకన్నా కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నాను..’’ అన్నాడు కొండబాబు.
‘‘ఇంతకీ రాగిణి ఇంటికి ఎప్పుడు వెళదాం?’’ అనిరుద్ అడిగాడు.
‘‘సాయంత్రాలు ఆమె ఇంటికి వచ్చేసరికి చాలా లేటవుతుంది.. అయినా రాత్రిపూట వెళ్లడం అంత సరైన టైము కాదు.. ఆమె లవర్‌బాయ్ వచ్చే సమయం కదా!.. రేపు ఉదయం వెళదాం.. అదే బెస్టు టైము..’’ చెప్పాడు కొండబాబు.
అనిరుధ్ బైక్ స్టాండు తీసి ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. కొండబాబు వెనుక ఎక్కి కూర్చున్నాడు.
‘‘సరే ఇప్పుడెక్కడికి వెళదాం?’’ అడిగాడు అనిరుధ్.
‘‘ఒరే! మనం మళ్లీ డాక్టర్ హేమంత్ హెల్ప్ తీసుకోవాలి కదా! వెళ్లి అడుగుదామా?’’ కొండబాబు అన్నాడు.
‘‘అడగాలిగా.. మరో కేండిడేట్ మనకి దొరికాడుగా మరి..!’’ అనిరుధ్ అన్నాడు.
‘‘వాడు మళ్లీ లక్ష అంటాడు..’
‘‘అడగనీ.. తప్పదు.. బడ్జెట్ గురించి పట్టించుకోవద్దు..’’
‘‘కానీ! మళ్లీ వాడి దగ్గరికే వెళదామా అని..’’
‘‘ఏం ఎందుకు నీ డౌటు?..’’ అనిరుధ్ అడిగాడు.
‘‘నీకు చెప్పడం మరిచాను... నిన్న మార్కెట్‌కు వెళితే అక్కడ డాక్టర్ హేమంత్ ఆసుపత్రిలో కాంపౌండర్ కనిపించాడు. నాకు పెద్ద పరిచయం లేదు గానీ.. ఏదో ముఖ పరిచయం ఉంది.. అతడే పలుకరించాడు అక్కడ.. వీరు హేమంత్ ఆసుపత్రికి వచ్చారు కదా! అనడిగాడు.. అవునన్నాను.. మీరు ఏదో టెస్టుకి ఇచ్చినట్లున్నారు.. అనీ అడిగాడు.. అవునని చెప్పాను.. ఆ విషయం ఆయన ఎవరికో ఫోన్‌లో చెబుతుంటే విన్నానులెండి.. అని చెప్పాడు నవ్వుతూ.. నాకేం అర్థం కాలేదు అతడి ధోరణి. అతడిని పిలిచి వివరంగా అడుగుదామనుకున్నాను కానీ అప్పటికే వెళ్లిపోయాడు. నాకెందుకో డౌట్‌గా ఉందిరా.. డాక్టర్ హేమంత్ ఆ విషయం రహీంపాషాకి గానీ చెప్పాడేమోనని?!.. కొండబాబు చెప్పాడు.
‘‘చెప్పాడంటావా.. ఒకవేళ చెబితే.. రహీం మనల్ని ఏదైనా చేసేవాడు.. కామ్‌గా ఊరుకుంటాడని నేననుకోవడంలేదు..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘అదీ నిజమే!.. అయితే డిఎన్‌ఎ మ్యాచ్ కాకపోవడంవల్ల వాడింకేం పట్టించుకోపోయి ఉండవచ్చు కదా!’’ కొండబాబు అన్నాడు.
‘‘అఫ్‌కోర్స్.. నువ్వనేదీ కరెక్టే..!’’
‘‘ఇప్పుడు మళ్లీ మనం ఆ డాక్టర్ దగ్గరికే వెళితే.. వాడు మన విషయం లీక్ చెయ్యడన్న గ్యారంటీ ఏమీ లేదు.. నారాయణకి చెబితే మనం చిక్కుల్లో పడతాం..’’
కొండబాబు అన్నమాట సమంజసంగా అనిపించింది అనిరుధ్‌కి. ఇక్కడ ఎవరికి ఎవరెవరితో సంబంధాలున్నాయో, అవసరాలున్నాయో ఎవరికీ తెలీదు. డబ్బుకోసం ఏ గడ్డయినా కరిచే మనుషులున్న సమాజం ఇది.
‘‘ఎందుకైనా మంచి వేరే డాక్టర్‌ని సంప్రదిద్దాం..’’ నిశ్చయంగా అన్నట్లు చెప్పాడు కొండబాబు.
‘‘సరే! వేరే డాక్టర్ ఎవరున్నారు?..’’
‘‘ముందు డాక్టర్‌ని చూడాలి... ఆ తర్వాతే రాగిణి దగ్గరకి వెళ్లాలి..’’
‘‘అలాగే.. ఇపుడు మనం ఎక్కడికి వెళదాం?’’ బైక్ స్లో చేస్తూ అడిగాడు అనిరుధ్.
‘‘పోనీ.. ఏదైనా చాట్ తిందామా?’’ కొండబాబు సమాధానం చెప్పేలోగానే అడిగాడు అనిరుధ్.
‘‘నాకూ తినాలనే ఉందిగానీ.. ఇక్కడ మీ హైదరాబాద్‌లా ఎక్కడపడితే అక్కడ చాట్‌లు దొరకవు.. మంచి పకోడీ తిందాం పద..’’ అని ఎలా వెళ్లాలో అనిరుధ్‌కి చెప్పాడు కొండబాబు.
పున్నమి రెస్టారెంట్‌లో పకోడీలు తిని టీ తాగి బయటికి వచ్చారు. కృష్ణానది ఒడ్డున చెట్లనీడన సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు. కృష్ణానది అలలమీదనుంచి చల్లటి గాలి వీస్తోంది. అలా బెంచీలమీద అక్కడక్కడా, కొన్నిచోట్ల జంటలు కూర్చున్నారు. సాయంవేళ కావడంతో చెట్లమీదకు చేరిన రకరకాల పక్షులు గోలగోలగా అరుస్తున్నాయి. రివ్వున వీస్తున్న గాలితో అవి లయబద్ధంగా అరుస్తున్నట్లుంది వాతావరణం.
తానూ, హిమజ శిల్పారామంలోనూ, సిటీ శివార్లలనూ సాయంత్రాలు గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి అనిరుధ్‌కి. బెంచీమీద వెనక్కి వాలి, మిత్రుడు కొండబాబుకి ఆ విషయాలు సరదాగా చెప్పాడు అనిరుధ్.
ఆమెను తాను చూడకపోయినా, మిత్రుడు అనిరుధ్ చెబుతున్న దాన్ని బట్టి ఆమెను అంచనా వేశాడు కొండబాబు. అతడికి ఆమె సరైన జోడీయే అనిపించింది కొండబాబుకి.
‘‘ఒరే అనిరుధ్! సాయిరమ్యని వద్దని మీ అమ్మమ్మకి చెప్పేశావ్ కదా.. మీ మామయ్యకు కోపం రాదు మరి?’’ అనడిగాడు కొండబాబు.
‘‘వస్తుందిరా.. మామయ్యకి ఎలా ఉన్నా అత్తమ్మకి మాత్రం పీకలదాకా కోపం వచ్చేస్తుంది. పిలిచి పిల్లనిస్తానంటే కాదన్నాడు ఆ కులం తక్కువోడు.. అని నోటికొచ్చినట్లు అంటుంది. నన్నూ అమ్మమ్మనీ కలిపి తిడుతుంది..’’ చాలా మామూలుగా చెప్పాడు అనిరుధ్.
కొండబాబు తలూపాడు అవున్నట్లు. భూదేవి గురించి అతడికి తెలియంది కాదు. ఆ మాటకొస్తే చాలామందికే తెలుసు ఆమె గురించి- ఊరికే నోరు పారేసుకుంటుందని!
‘‘అనుకోనీరా.. ఇన్నాళ్లూ ఆళ్లు అనుకోలేదేట్రా నీ గురించి.. ఇపుడు కొత్తగా అనుకునేది ఏం లేదు.. కాకపోతే పైకి చెప్పకపోయినా అమ్మమ్మ లోపల్లోపల బాధపడుతుందేమో మరి.. నాకలా అనిపిస్తోందిరా..’’ అన్నాడు కొండబాబు.
‘‘నాకూ అలానే అనిపిస్తోంది.. ఒకవేళ అదే అయితే అమ్మమ్మకి నచ్చచెబుతాను..’’
‘‘అవును నచ్చచెప్పాలిరా.. పాపం నీ గురించి చాలా కష్టాలు పడిందిరా..’’
‘‘గడిచిపోయిన రోజులు తలచుకుంటే ఒక్కోసారి నాకూ ఏడుపూ వస్తుంది.. ఒక విధంగా గర్వంగానూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకూ పనికిరాని ఓ పిచ్చిదాని కొడుకు ఈనాడు ఈ స్థితిలో ఉన్నాడంటే.. గర్వంగానే అనిపిస్తుందిరా.. కానీ ఆ గర్వంకన్నా ఎప్పుడూ నన్ను నా గతమే వెంటాడుతూంటుంది.. గతాన్ని మర్చిపోకూడదు కూడా..’
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842