డైలీ సీరియల్

అన్వేషణ -38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సర్లే! ఇప్పుడా గోల ఎందుకుగ్గానీ... హిమజ గురించి ఆలోచించుకో..’’ అన్నాడు కొండబాబు బెంచీమీద బాగా వెనక్కివాలి కళ్లు మూసుకుంటూ.
***
బయటికి వెళ్లడానికి తయారై, ముందుగదిలో కూర్నుచ్నాడు అనిరుధ్. కొండబాబు అప్పుడే వచ్చాడు. అమ్మమ్మ ఇద్దరికీ టీ ఇచ్చింది.
‘‘మరో డాక్టర్‌ని చూద్దాం అన్నావ్?’’ అడిగాడు అనిరుధ్
‘‘అవును!.. అది మన డాక్టర్ కె.వి.రావు అయితేనే బెటర్ అనిపిస్తోందిరా.. ఆయన హెల్ప్ తీసుకుందాం.. ఆయన ద్వారా వేరే డాక్టర్‌ని కలుద్దాం..’’ చెప్పాడు కొండబాబు.
‘‘వద్దురా.. నాకో ఆలోచన వచ్చింది. సీతారామారావుగారి హెల్ప్ అడుగుదాం.. ఆయన అయితే మంచిది.. నా గురించి బాగా తెలుసున్న మనిషి.. నేనంటే అభిమానించే మనిషి.. ఆయనే బెటర్.. అసలు మొదటే ఆయన దగ్గరికి వెళ్లి ఉండాల్సింది.. పాస్ట్ ఈజ్ పాస్ట్.. ఇపుడు ఆయన సహాయం తీసుకుంటే మంచిదనిపిస్తోంది..’’ అనిరుద్ చెప్పాడు.
‘‘నువ్వన్నదీ నిజమేరా.. ఆయన ద్వారా వేరే ఎవరైనా డాక్టర్‌ని సంప్రదిద్దాం..’’ అన్నాడు కొండబాబు.
ఇద్దరూ బైక్‌మీద బయల్దేరారు. అపుడు ఉదయం పది గంటలు కావస్తూంది. వాళ్లు వెళ్లేసరికి సీతారామారావుగారు హాల్లో కూర్చుని ఇంగ్లీషు పేపరు చదువుతున్నారు. వీళ్లని చూడగానే సంతోషంగా ఆహ్వానించారు.
సిటీకి ఎప్పుడొచ్చిందీ, అమ్మమ్మ ఎలా ఉన్నదీ వగైరా వివరాలు అనిరుధ్‌ని అడిగారాయన. భార్యని పిలిచి కాఫీ తెమ్మన్నారు. ఆవిడ అనిరుధ్‌ని నవ్వుతూ పలుకరించి వెళ్లింది.
‘‘సర్!.. నేనో పనిమీద వచ్చాను సర్ జాబ్‌కి సెలవు పెట్టి.. ఆ పనిలో మీ సహాయం కావాలి సర్..’’ పది నిముషాలయ్యాక నెమ్మదిగా అన్నాడు అనిరుధ్.
‘‘నా సహాయమా.. వాట్ అనిరుధ్.. ఏమిటో చెప్పు.. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు..?’’ అన్నారాయన. అపుడు కొండబాబుకేసి చూశాడు అనిరుధ్ చెప్పరా అన్నట్లు.
‘‘సర్! అనిరుధ్ జీవితం గురించి మీకు బాగా తెలుసు.. ఇపుడు తన తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న తపనలో ఉన్నాడు సర్..’’ అని కొండబాబు, అనిరుధ్ చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పుకొచ్చాడు.
అంతా విన్న తర్వాత ఆయన కాస్సేపు వౌనంగా ఉండిపోయారు. అనిరుధ్‌ని చూసి జాలిపడ్డారు. బాధపడ్డారు. ఒక రకమైన గర్వంగానూ చూశారాయన.
‘‘ఎస్! వాట్ కెన్‌ఐ డూ ఫర్ యూ..’’ అన్నారు.
‘‘ఇంతకుముందు టెస్టు చేయించిన డాక్టర్ మీద మాకెందుకో అనుమానంగా ఉంది సర్ ఈ విషయం బయటపెట్టాడేమోనని.. ఇపుడు వేరే డాక్టర్ ద్వారా చేయిద్దాం అని సర్.’’ చెప్పాడు అనిరుధ్.
ఆయన తల పంకించి సెల్‌ఫోన్ అందుకుని ఎవరిదో నెంబర్ చూసి రింగ్ చేశారు. అవతల నుంచి హలో అనగానే, ‘‘ఏరా డాక్టర్.. బిజీనా?’’ అనడిగారు.
అవతలనుంచి వచ్చిన సమాధానం విని నవ్వుతూ- ‘‘సరే!.. సంపాదనపరుడువి కదా ఎప్పుడూ బిజీగానే ఉంటావులే.. సరేగానీ, నాకు డిఎన్‌ఎ టెస్టు ఒకటి చేయించి పెట్టాలి..’’ అన్నారు సీతారామారావుగారు. తర్వాత వివరాలు క్లుప్తంగా చెప్పారు. ఎవరు, ఎందుకు అని అడగవద్దు.. ఇద్దర్ని పంపిస్తున్నాను. వాళ్లు శాంపిల్స్ ఇస్తారు. ఆ టెస్టు చేయించి పెట్టమని, నీకు కావాల్సిన ఫీజు తీసుకోమని చెప్పారు. కాస్సేపు అవతల వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడి పెట్టేశాక అనిరుధ్‌తో చెప్పారు సీతారామారావుగారు- ‘‘డాక్టర్ శ్రీనివాస్ అని నాకు మంచి మిత్రుడు.. నాకంటే పదేళ్లు చిన్నవాడేలే.. వెళ్లండి.. మీకు కావాల్సిన టెస్టు చేయించి పెడతాడు.. సీక్రెట్‌గా..’’ అని ఏ ఆసుపత్రికి వెళ్లాలో వివరించారు.
ఆయనకు నమస్కారం పెట్టి ఇద్దరూ బయటికి వచ్చారు. డాక్టర్ సమస్య తీరడంతో ఇక నారాయణ బ్లడ్ శాంపిల్స్ సేకరించడమే ఇక్కడ చెయ్యాల్సిన పని. ఈ టెస్టులో ఏదీ తేలకపోతే అప్పుడు ఏం చెయ్యాలా అన్నది తర్వాత ఆలోచించాల్సిన సంగతి అనుకున్నాడు అనిరుధ్.
మర్నాడు ఉదయం పదకొండు గంటలు కావస్తూన్న సమయంలో అనిరుధ్, కొండబాబు బైక్‌మీద రాగిణి ఇంటికి వచ్చారు. ఆ రోజు ఆదివారం కావడతో ఆమె ఇంటివద్దనే ఉంటానన్నది. వచ్చేముందు ఫోన్ చేసి మరీ వచ్చారద్దిరూ.
మరీ అంత పోష్ కాకపోయినా డీసెంట్‌గా ఉండే ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ ఫస్ట్ఫుర్‌లో ఫ్లాట్ ఆమెది. కాలింగ్ బెల్ కొట్టగానే ఆమె తలుపు తీసింది. ఇద్దర్నీ నవ్వుతూ ఆహ్వానించింది. వాళ్లని కూర్చోమని చెప్పి మంచినీళ్లు ఇచ్చింది. వాళ్లకి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నది.
‘‘సైట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయండి. మీరు ఆలస్యం చేస్తే దొరకడం కష్టం. ఇది ఇప్పటిదాకా మేం వేసిన వెంచర్లలో చాలా మంచిది.. రోడ్డు ప్రక్కన జస్ట్ అర ఫర్లాంగు దూరంలోనే ఫ్లాట్స్.. ఆ రూట్లో బస్సుసౌకర్యం కూడా ఉంది. దగ్గర్లోనే ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మంచి కానె్వంటు ఉంది.. ఎయిర్‌పోర్టుకి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరం..’’ ఆమె చెప్పుకుపోతూ క్షణం ఆగింది వాళ్లు తన మాటలు వింటున్నారా లేదా అన్నట్లు.
‘‘మేం సైట్ కొనడానికి రాలేదండి..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘సైట్ కోసం కాదా?!’’
‘‘కాదండి...’’ కొండబాబు అన్నాడు.
‘‘మరి?!’’
‘‘ఒక ముఖ్యమైన విషయంలో మీ సహాయం కోసం వచ్చాం..’’ కొండబాబే అన్నాడు.
‘‘నా సహాయమా.. ఏ విషయంలో?!’’
‘ఒక కేసుకు సంబంధించి నారాయణగారి బ్లడ్ శాంపిల్స్ కావాలి.. దానికోసం వచ్చాం..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘నారాయణగారి బ్లడ్ శాంపిల్సా?.. నేను ఇవ్వడమేమిటి?.. నాకేం అర్థం కావడంలేదు.. మీరేం చెబుతున్నారో..’’ రాగిణి విసుగ్గా ముఖం పెట్టింది.
‘‘ప్లీజ్.. మీరు కంగారు పడకండి.. అంతా నేను వివరంగా చెబుతాను..’’ అంటూ కొండబాబు నాలుగు ముక్కల్లో ముప్ఫయ్యేళ్ల క్రిందట నలుగురు ఒక పిచ్చి మహిళపై జరిపిన అత్యాచారం గురించి, ఇపుడు అనిరుధ్ చేస్తున్న ప్రయత్నం గురించి చెప్పాడు.
అంతా విన్న తర్వాత రాగిణి ఆశ్చర్యపోయింది.. ఇలాంటి టెస్టులు కూడా ఉంటాయా అని అన్నది. అపుడు ఇటీవల పేపర్లలో వచ్చిన కొన్ని వార్తల గురించి అనిరుధ్ వివరించాడు.
కానీ, నారాయణ బ్లడ్ శాంపిల్ తనవల్ల కాదన్నది. ఇదంతా రిస్కుతో కూడిన వ్యవహారం అని, ఏ మాత్రం తెలిసినా నారాయణ ఏమైనా చేస్తాడని భయం వ్యక్తం చేసింది.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842