డైలీ సీరియల్

అన్వేషణ -42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లగాలి రివ్వున వీస్తోంది. పక్షులు ఇంకా గూళ్లకి చేరుకునే సమయం కాదు కాబట్టి ప్రశాంతంగా ఉంది వాతావరణం. చెట్ల నీడల్లోంచి ఎండ నేలమీద పడుతూ అక్కడక్కడ తెల్లటి పువ్వులు పరచినట్లుంది. వీళ్లకి కాస్త దూరంగా కాలేజీలు ఎగ్గొట్టి వచ్చిన జంటలు కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. అలాగే ఏకాంతం కోసం వచ్చిన జంటలూ ఉన్నాయి.
‘‘సరేరా! వీడూ మనకి మ్యాచ్ కాలేదు... ఇపుడు మిగిలిన ఇద్దరి గురించీ పట్టించుకోవాలి.. అసలు వాళ్ళెక్కడున్నదీ మనకి తెలీదు..’’ అనిరుధ్ అన్నాడు వౌనాన్ని భంగపరుస్తూ.
‘‘్థమస్ అన్నవాడు వైజాగ్‌లో ఉన్నట్లు గురుమూర్తి చెప్పాడు మనకి.. కనకారావు ఎక్కడున్నదీ తెలీదన్నాడు.. ఆ ఇద్దరిలో ఒకడిని పట్టుకుంటే రెండోవాడు దొరుకుతాడనిపిస్తోంది నాకు..’’ కొండబాబు అన్నాడు.
అవునన్నట్లు తలూపాడు అనిరుధ్. ఎలాగైనా వాళ్లని పట్టుకోవాలి. పట్టుకు తీరాలి అన్న కృతనిశ్చయంతో ఉన్నాడు అనిరుధ్. అందుకు కొండబాబు సహాయం తీసుకోవాలనీ అనుకుంటున్నాడు. తనతోపాటు కొండబాబునీ వైజాగ్ తీసికెళ్లాలని అనుకున్నాడు.
‘వైజాగ్‌లో థామస్ ఫోన్ నెంబరయినా దొరికితే బాగుండును.. అదెలాగో అర్థం కావడంలేదు..’’ సాలోచనగా అన్నాడు అనిరుధ్.
‘‘నాకో ఐడియా వచ్చిందిరా..’’ కొండబాబు అన్నాడు.
‘‘ఏమిటది?’’
‘‘్థమస్ నెంబరు కచ్చితంగా నారాయణ దగ్గర కానీ, రహీం దగ్గర కానీ ఉంటుంది. రహీం దగ్గర సంపాదించడం కన్నా నారాయణ దగ్గర ఆ నెంబరు సంపాదించడం తేలిక అనిపిస్తోంది నాకు.. అందుకు మళ్లీ రాగిణిని మనం ఉపయోగించుకుందాం..’’ చెప్పాడు.
‘‘అవును.. రాగిణినే... నారాయణ సెల్‌లో థామస్ అన్న నెంబరు చూసి చెప్పమని అడుగుదాం.. అందుకు మళ్లీ ఆమెకు ఫీజు చెల్లించాలి..’’
‘‘తప్పదుగా.. ఇద్దాం.. మనకి ఫోన్ నెంబర్ కావాలి.. అది దొరికితే అడ్రస్ పట్టుకోవచ్చు..’’
‘‘సరే ఈ సాయంత్రమే వెళ్లి అడుగుదాం..’’ కొండబాబు చెప్పాడు. టైము చూసుకున్నాడు అనిరుధ్ సాయంత్రం ఐదు గంటలు కావస్తూంది.
‘‘ఆమె ఇంటికి వచ్చేసరికి ఆరున్నరా ఏడు గంటలు అవుతుందిట.. మనం ఆ టైములో వెళ్లాలి..’’
సరే అన్నట్లు తలూపాడు అనిరుధ్. ఏదో పిచ్చాపాటీ మాట్లాడుతూ అక్కడే కూర్చున్నారు చాలాసేపు. తాము చదువుకున్న రోజులు గుర్తుచేసుకున్నారు. అలా మాట్లాడుకుంటుంటే వాళ్లకి టైము తెలియలేదు. సెల్‌ఫోన్‌లో ఏదో మెసేజ్ వస్తే అనిరుధ్ చూససరికి టైము ఏడు గంటలు కావస్తూంది. ఆ మాట చెప్పేసరికి కొండబాబు లేచాడు.
వాళ్లు రాగిణి ఇంటికి వచ్చేసరికి అరగంట పట్టింది. కాలింగ్ బెల్ కొట్టిన కాస్సేపటికి రాగిణి వచ్చి తలుపు తీసింది. వీళ్లని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కొంత తత్తరపడి మళ్లీ ఏం పనిమీద వచ్చారో అన్నట్లు చూసింది.
‘‘చిన్న పని పడింది మీతో...’’ అన్నాడు కొండబాబు.
‘‘ఇంక నావల్ల కాదు.. ఏమైనా అయితే కొంపలు ములుగుతాయి..’’ అన్నదామె కొంచెం విసుగ్గా.
‘‘్ఛ! ఛ! అలాంటిదేమీ కాదు.. చాలా సింపుల్.. నారాయణ సెల్‌ఫోన్‌లో ఒక నెంబరు కావాలి.. ప్లీజ్.. చూసి చెప్పండి.. మీరు చాలా సహాయం చేసినవారవుతారు..’’ అన్నాడు అనిరుధ్.
‘‘్ఫన్ నెంబరా?!... లోపలికి రండి..’’
వాళ్లు లోపలికివచ్చి కూర్చోబోతుండగా అన్నది. ‘‘తొందరగా చెప్పండి.. ఆయనొచ్చే టైమయ్యింది..’’ అని. అక్కడ టీపాయ్‌మీద వున్న కాగితం తీసుకుని అనిరుధ్ గబగబా రాశాడు థామస్ అన్న పేరు.
‘‘ఈ పేరుమీద నారాయణ సెల్‌లో నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పండి చాలు.. మీకు ఎంత కావాలో ఇస్తాను..’’ అన్నాడు.
ఆమె ఆ కాగితం తీసుకుని చూసింది: ‘్థమస్..!’ అని చదివింది.
‘‘అవును మేడమ్.. ఆ పేరుమీద ఫోన్ నెంబరు ఉంటే కావాలి... చాలా అవసరం..’’ అన్నాడు కొండబాము.
‘‘అలాగే చూసి చెబుతాను.. మరి?!..’’ అని సగంలో ఆగింది.
‘‘చెప్పండి మీకేం కావాలి..?’’ కొండబాబే అడిగాడు.
‘‘మీ ఇష్టం..’’’ అన్నది ఏం చెప్పాలో తోచక.
‘‘సరే..!’’ అని లేచాడు అనిరుధ్, ఆ వెంటనే కొండబాబు.
నారాయణ వచ్చే సమయం అవుతుందని వాళ్లు గబగబా వచ్చేశారు ఏభై గజాల దూరంలో పార్క్ చేసి వున్న బైక్ దగ్గరికి.
‘‘డబ్బు చాలా గొప్పదిరా అనిరుధ్.. చూశావా రాగిణి వ్యాపారం.. ఆఫ్ట్రాల్ సెల్ ఫోన్‌లో ఒక నెంబరు చూసి చెప్పడానికి ఎంతిస్తారు అని బేరం పెట్టింది?!..’’ కొండబాబు అన్నాడు బైక్ గేరు మారుస్తూ.
‘‘తప్పదురా. మనం చాలా అవసరంలో వున్నామని ఆమెకు అర్థమైంది. డిమాండ్ వున్నచోటనే ధర పలుకుతుంది కదా!.. ఎకనమిక్స్.. చదువుకున్నావుగా..’’ అన్నాడు అనిరుధ్.
‘‘అంతే! అంతే!.. వాళ్ళు ఊరికే రాయరుగా.. ఇలాంటివన్నీ పరిశోధించే రాస్తారు..’’
మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసింది కొండబాబుకి రాగిణి. ‘‘ఓసారి రాగలరా?’’ అని. అతడికి అర్థమయ్యింది ఆమె ఎందుకు రమ్మన్నదీను. థామస్ నెంబరు ఫోన్‌లో చెప్పొచ్చు. కానీ ఆమెకు అందుకుగాను ప్రతిఫలం కావాలి. అది చేతిలో పడందే ఆమె ఆ నెంబరు చెప్పరు. అనిరుధ్‌ని తీసుకుని అరగంటలో ఆమె ఇంటికి వెళ్లాడు కొండబాబు.
ఆమె అడక్కుండానే ఆమె చేతిలో ఐదు వేలు పెట్టాడు అనిరుధ్. ఆమె లెక్కపెట్టుకోలేదు. చటుక్కున బ్లౌజ్‌లో దోపుకుంది. థామస్ నెంబరు వున్న కాగితం అతడి చేతికి ఇచ్చింది. ఓసారి ఆ నెంబరులో పది నెంబర్లు ఉన్నదీ లేనిదీ సరిచూసుకుని ‘్థంక్స్’ అన్నాడు అనిరుధ్. ఆమె ప్రతిస్పందన కోసం చూడకుండా ఇద్దరూ లేచి వచ్చేశారు.
అక్కడనుంచి ఇద్దరూ ఓ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ షాపు దగ్గరకొచ్చారు. ఆ నెట్‌వర్క్‌లో కొండబాబుకు కాస్త ముఖపరిచయం వున్నఆమె దగ్గరకెళ్లి థామస్ నెంబర్ అంటూ రాగిణి ఇచ్చిన నెంబర్ ఏ ఏరియాదో అడిగాడు.
‘‘ఇది వైజాగ్ ఏరియాది సర్.. అయినా వెయిట్ కన్‌ఫర్మ్ చేస్తాను..’’ అని సిస్టమ్‌లో చూసి అవునన్నట్లు తలూపింది.
‘‘ఇపుడు వైజాగ్ ప్రయాణం కట్టాలన్నమాట.. ఇక మన పని అక్కడే..’’ అన్నాడు అనిరుధ్.
‘‘అంతేగా మరి!’’
‘‘ఒరేయ్ కొండలూ.. నువ్వూ వైజాగ్ రావాలిరా.. తప్పదు.. అక్కడ ఎన్నాళ్లుండాలో కూడా తెలీదు. అన్నాళ్లూ రైస్‌షాపు నీ వైఫ్‌ని చూసుకోమను..
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842