డైలీ సీరియల్

అనంతం-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగానే అతను చాంద్‌నీ పట్ల కోపంతో వుంటే, అతని ద్వారా చాంద్‌నీ మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. కావలసిన కార్యం గంధర్వులే తీర్చినట్టవుతుంది!
పైగా గరుడాచలానికి సహకరించిన కీర్తీ దక్కుతుంది!
చాంద్‌నీవల్ల తనకు జరిగిన అవమానాన్ని బైటికి చెప్పకుండా ‘చాంద్‌నీ అంటే ఎవ్వరు’ అని అడిగాడు ఎమ్మెల్యే.
‘‘రాగ్యా తెలుసు కదా, వాడు కోరుకున్న పిల్ల. అదే తండాలో వుంటుంది. తలబిరుసు ఎక్కువ. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు..’’
‘‘దానికీ నీకూ మధ్య ఏం జరిగింది’’ అని సూటిగా అడిగాడు గరుడాచలం.
‘‘సహకరిస్తానంటేనే చెప్తాను’’
‘‘తప్పకుండా’’ అన్నాడు ఎమ్మెల్యే.
మనసులో ఏదీ దాచుకోకుండా జరిగినదంతా వివరంగా ఎమ్మెల్యేతో చెప్పాడు.
‘‘దానె్నందుకూ కొరగాకుండా చెయ్యాలి. దాని జీవితం నాశనం చెయ్యాలి. గొప్పవాళ్ళని ధిక్కరించినందుకు తగిన శాస్తి చెయ్యాలి.’’
‘‘ఏం చేద్దామంటావు’’ మధ్యలోనే ఎమ్మెల్యే అడిగాడు.
‘‘అదే ఆలోచిస్తున్నాను’’
‘‘రాగ్యా ఏమంటాడో’’
‘‘మనం చెప్పింది వినటం తప్ప ‘అనటం’ రుూ జన్మలో వాడికి సాధ్యం కాదు’’
‘‘ఆడదాని విషయం! అంత తేలిక కాదు’’
‘‘అది నాకు వొదిలెయ్యి! వాడి విషయం నేను చూసుకుంటాను’’
‘‘ఐతే, చాంద్‌నీ వ్యవహారం నేను చూస్తాను’’ అన్నాడు ఎమ్మెల్యే.
గరుడాచలం స్థిమితంగా కూర్చున్నాడు.
‘‘చాంద్‌నీ వివరాలు పూర్తిగా చెప్పు’’ అన్మాడు ఎమ్మెల్యే.
‘‘రెడ్డియానాయక్ తండాలో పుట్టింది. నగ్గూరాం కూతురు. తల్లి లేదు. చాలాకాలం క్రితమే అడవిలో పులి మింగింది. అందంగా ఉంటుంది. మాటకారి పిల్ల. ధైర్యస్థురాలు. భయం తెలియదు. ఎదిరించే గుణం వుంది. తండ్రీ కూతుళ్ళు తప్ప దగ్గరి బంధువుల్లేరు. ఎక్కడో లోతట్టు అడవిలో వున్న భూక్యానాయక్ తండాలో కొద్దిమంది దూరపు బంధువులున్నారు. రాగ్యా దానిమీద మనసు పడ్డాడు. వాడంటే దానికి ఇష్టం లేదు. అదీ దాని కథ’’ అని చెప్పాడు గరుడాచలం.
‘‘నగ్గూరాం ఎలాంటివాడు? వాడి స్థాయి ఏమిటి? అడవిలో వున్న తండాల్లో వాడికి పలుకుబడి వుందా?’’
‘‘మంచివాడు. అమాయకుడు.. వాడి స్థానం అంతే! తండాల్లో గుర్తింపు పొందినవాడేమీ కాదు. సామాన్యుడు.’’
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి గరుడాచలంతో మాట్లాడుతూనే ముగ్గులోకి దించే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఎప్పుడేం మాట్లాడాలో, ఎప్పుడేం చెయ్యాలో రాజకీయానుభవం అతనికి నేర్పింది!
అసలు విషయం చెప్పే సమయం వచ్చిందని గ్రహించాడు!
‘‘నీకు జరిగిన అవమానం తల్చుకుంటేనే రగిలిపోతున్నది. చాంద్‌నీని విడిచిపెట్టను. ప్రతీకారం తీర్చుకుంటాను.. స్నేహితుడిగా నీకు నేను చేసే సహాయం అదే’’ అన్నాడు. గరుడాచలం వైపు సూది కళ్ళతో చూస్తూ.
గరుడాచలం మొహం విప్పారింది.
‘‘ఏం చేద్దాం’’ అని ఆసక్తిగా అడిగాడు.
‘‘జోగిన్ని చేద్దాం’’
బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు గరుడాచలం!
హఠాత్తుగా ఎమ్మెల్యే అలా చెప్పింది నమ్మలేక, జీర్ణించుకోలేక సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ, ‘నిజంగానే?’’ అన్నాడు గరుడాచలం.
‘‘నీకోసం’’
లోలోపల గరుడాచలానికి సంతోషంగా ఉంది!
నమ్ముకున్న రాగ్యా ఆశించిన అమ్మాయిని కోరుకోవటం తప్పంటారని బైటపళ్ళేదు కానీ, చాంద్‌నీ గరుడాచలం కళ్ళల్లో మెదుల్తూనే వుంది!
నీటికొలను దగ్గర తొలిసారి చూసిన క్షణమే అతను మనసు పారేసుకున్నాడు. చాంద్‌నీ అందానికి ముగ్ధుడై చూపులు మరల్చుకోలేకపోయాడు. అనుభవిస్తే దానే్న అనుభవించాలనుకున్నాడు మనసులో! రాగ్యాతో ఆ విషయం చెప్పలేకపోయాడు.
ఎమ్మెల్యే అన్నట్టు జరిగి, చాంద్‌నీ జోగినీ ఐతే సమస్య తీరిపోతుంది. అందరూ దాన్ని అనుభవించొచ్చు!
రాగ్యా కూడా ఏమీ అనుకోడు. ‘దైవకార్యం’ కనుక తప్పనడు!
‘‘అలా చేస్తే అందరి పంటా పండినట్టే’’ అన్నాడు సంతోషంతో తబ్బిబ్బవుతూ గరుడాచలం.
‘‘రాగ్యాని డీల్ చేసే బాధ్యత నీది. దాన్ని జోగిన్ని చేసే బాధ్యతనాది’’ అన్నాడు ఎమ్మెల్యే.
‘‘నీకు రుణపడి వుంటాను’’ అనటం తప్ప, గరుడాచలం గొంతులోనుంచి మాటలు వెలువడలేదు. ఆనందంతో గొంతు పూడుకొనిపోయింది. తబ్బిబ్బవుతూ కంగాళీగా మారాడు.
‘‘త్వరలో జరగబోయే కొండదేవర జాతరకి నీ కోర్కె నెరవేరుతుంది’’ అని నిజంగానే హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే.
***
గరుడాచలం గుడారానికి వెళ్లిన తర్వాత రాగ్యా ఇంటికి బయల్దేరాడు. తండా దగ్గర పడుతున్న కొద్దీ అతనికి భయంగా వుంది.. కోపంగానూ వుంది.
ఎంత పని చేసింది చాంద్‌నీ!
తనను రాయితో కొట్టటమే కాకుండా గరుడాచలాన్ని కూడా అవమానించింది. తీవ్రంగా పరాభవించింది.
అతను చాలా గొప్పవాడు. ఎంతకైనా సమర్థుడు.
చాంద్‌నీని విడిచిపెడతాడా? అతను ప్రతీకారం తీర్చుకుంటే ఏమైపోతుందో ఆమె!
అప్పటికే చాంద్‌నీ, వాల్యా ఇళ్ళకి చేరుంటారు.
నీటికొలను దగ్గర జరిగిందంతా తండావాళ్ళతో చెప్తే ఏవౌతుందో?
చాంద్‌నీ ఫిర్యాదు చేస్తే తండా పెద్దలు చింతచెట్టు క్రింద పంచాయితీ పెడతారు. ఏం జరిగిందో తెలుసుకుంటారు. తప్పు నిరూపించి దండన విధిస్తారు. చింత బరికలతో కొడతారు.
ఎంత అవమానం!
చాంద్‌నీ అలా చెప్పకపోతే ప్రమాదం లేదు. ఐనా పొదల్లో లాక్కొని వెళ్ళబోయిన విషయం చెప్పంది, ఇపుడు చెప్తుందా?
ప్రమాదమల్లా అది చెప్తేనే! పరువు ప్రతిష్ఠలకు భయపడి చెప్పకపోతే ఏమీ వుండదు.
ఏవౌతుందో చూడాలి.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు