డైలీ సీరియల్

అనంతం-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది ఏమైనా తనిప్పుడు ఇంటికి వెళ్లాలి. వెళ్లి తీరాలి. పెట్టె బేడ సర్దుకొని వెళ్లి ఇకపై తన ‘ఆల్మకాం’ గరుడాచలం దగ్గర పెట్టాలి. గరుడాచలమే రమ్మన్నాడు.
సుఖంగా బ్రతికే మార్గం అతను చూపిస్తున్నపుడు గూడెం గుడిసెలో హీనంగా వుండటం ఎందుకూ?
గరుడాచలంతోనే వుండాలన్న నిర్ణయానికి అప్పటికే వచ్చాడు రాగ్యా.
త్వరత్వరగా నడుస్తూ ఇంటికి చేరాడు.
కాళీచరణ్ ఇంట్లో లేడు.
తలమీది గాయం నెప్పి పుడుతున్నది. వొళ్ళు సలుపు తీస్తున్నది. జ్వరం వచ్చేట్టుంది. నీరసంగా వుంది.
కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని ఓపిక రాగానే గరుడాచలం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు.
క్రింద చాప పరచుకొని పడుకున్నాడు రాగ్యా.
తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురౌతూ, తల వంచుకొని ఇంట్లోకి వెళ్లాడు కానీ పరిసరాలను రాగ్యా గమనించలేదు.
జరిగిందంతా వాల్యా ఇంట్లో చెప్పాడు. అది తండా అంతా తెలిసిపోయింది.
రాగ్యాని ఇక ఉపేక్షించకూడదనుకున్నాడు నగ్గూరాం. మళ్లీ మళ్లీ తప్పు చేసే అవకాశం ఇచ్చినట్టవుతుందని, పంచాయితీకి పట్టుపట్టాడు.
అందుకు చేరారు వాళ్ళంతా!
పంచాయితీ మొదలు కావడమే ఆలస్యం ఇక! పెద్దలు, తండావాళ్ళు అక్కడే ఉన్నారు.
వాల్యాని, చాంద్‌నీని అడగటం, ఏం జరిగిందో తెలుసుకొని రాగ్యాని వివరణ కోరటం, అపుడు శిక్షించటం జరుగుతుంది.
తండా పెద్దలనుంచి కబురంది కాళీచరణ్ చెట్టుదగ్గరికి వెళ్లిన సమయానికి రాగ్యా ఇంట్లో లేడు. ఒక్కడే వెళ్ళాడు.
‘‘రాగ్యాగాడు రాలేదా’’ పెద్దలు అడిగారు.
‘‘యాడికిబోయిండో ఇంట్లో లేడు’’ అన్నాడు కాళీచరణ్, నేల మీద కూర్చుంటూ.
ఎవ్వరెవ్వరో మాట్లాడుతున్నారు.
కాళీచరణ్‌కి అన్నీ వినిపిస్తున్నాయి.
‘‘ఏంటిదంట మాయరోగవ్! అడవికి బోడు. అయ్యకి సేదోడుగుండడు. శాకిర్జెయ్యడు. సీపు మందు దాగి సిందులెయ్యటవ్ దప్ప మరేంటికీ పనికిరాడు. రాగ్యాగాడ్ని సావగొట్టాలంతే’’
‘‘కాలీశరన్ కడుపున సెడబుట్టిండు! ఆడార్నాయాలు శాందినీ సెయ్యట్టుకుంటాడా! మదవెక్కింది. దించాల..’
‘‘తొలీగా మంచోడే! పట్నంబోతా సెడిపోయిండు. కాళ్ళిరగనూకి పండుకోబెడితే, ఇంకబోడు పట్నానికి..’’
కాళీచరణ్ వాళ్ళ మాటలిక వినలేకపోయాడు!
చివాల్నలేచి నిలబడ్డాడు.
అందరికీ రెండు చేతులూఎత్తి దణ్ణం పెడుతూ-
‘‘శాందినీ యిసయంలో రాగ్యా శబ్బరపనే సేసింది. నే జేసిన గారాబవ్ అసువంటిది. సిన్నప్పట్నించి సావగొడతా శాకిరి జెయ్యటవ్ నేర్పిత్తే అట్టా తయారయ్యేవోడుగాడు. తల్లిలేని పిలగాడిని ఆలోచిస్తి ఇట్లా తయారయ్యిండు. నేనేం జెయ్యాలి?
నా సేతుల్తో కొడుక్కింత యిసవిచ్చి సంపలేను. వాడి కోసరవ్ బతగాలి గాన సావలేను.
మీరు గొట్టండి. సంపదండి! వాడు సచ్చినాకనే నేను సచ్చేది. ముందుగా సత్తే ఆడికి బువ్వెట్టే దిక్కుండదు.
ఇసువంటి ముదనట్టపు నాకొడుకు బుడతాడని ముందుగాల్నే తెలిస్తే కడుపు పోనూక్కుండేది, నా పెండ్లాం! అది తెలవక, కడుపున రుూడు బడంగానే సంతోసిచ్చింది. మొగపిల్లోడే బుడతాడని తాండాకి పేరుదెచ్చే గొప్పోడగుతాడనీ భ్రవపడ్డది.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు