డైలీ సీరియల్

అనంతం-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే నేను టోపీ తీసేసి, చొక్కా విప్పి ప్రక్కనపెట్టి, పూనకం వచ్చినట్టు చిందులేస్తూ, వేప మండలతో సీతాల్ని చావగొడుతూ-
‘ననే్న గురుతుపట్టలేదంటనే పోలేరా! రాజుని. పోతురాజుని! నీ పెనివిట్ని! గాచారవ్ గాలి నీకాడికి సందాకొచ్చిండుగానీ, కానిస్టేబుళ్ళు తల్సుకుంటే కొమ్ముల్దిరిగినోళ్ళే ఇత్తారు సందాలు! ఇడ్సిపెట్టు. ఆడ్నిస్సిపెట్టు’ అంటూ నేను వేపమండలతో సీతాల్ని ఇంకా బలంగా బాదాను.
పోలేరమ్మా లేదు పూనకం లేదు!
కానిస్టేబుల్ని విడిచిపెట్టి పరారరయ్యింది సీతాలు’’ అని, సీతాలు కథ చెప్పటం ముగించాడు మఫ్టీ కనకయ్య.
పగలబడి నవ్వారు!
‘‘బాగానే పనికొస్తావు. అలాగే అభినయించి ఎలాగో, రుూ పని గట్టెక్కించు.. ప్రమోషన్ విషయం వొదిలెయ్యి నాకు’’ అన్నాడు ఎమ్మెల్యే.
గురుడాచలానికి నమ్మకం పూర్తిగా కుదిరింది!
పూనకం వచ్చినట్టు నటించడంలో కానిస్టేబుల్ కనకయ్య పరమ భక్తులక్కూడా తీసిపోడు!
కొండదేవర పూనాడని అతను అభినయిస్తే, నిస్సందేహంగా అడవి పుత్రులు నమ్ముతారు. భయపడతారు. దేవరలా నటిస్తూ కనకయ్య ఏం చెప్పినా మూఢ విశ్వాసాలతో చేస్తారు.
చదువూ సంధ్య, నాగరికత వున్నవాళ్లే పూనకాలను నమ్మి భక్తి ప్రపత్తులు ప్రకటిస్తున్నపుడు అమాయకులైన అడవి పుత్రులు పూనకాలను నమ్మటంలో ఆశ్చర్యం ఏముంది?
‘‘పథకం పర్‌ఫెక్టుగా వుంది’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఇక నీదే ఆలస్యం’’ అన్నాడు ఎమ్మెల్యే.
అభినయించటం ఆపి కానిస్టేబుల్ కనకయ్య ఎమ్నెల్యే వైపు చూశారు.
‘‘సామానంతా ఒకసారి చెక్ చేసుకో’’ అన్నాడు ఎమ్మెల్యే.
కనకయ్య గోతాల దగ్గరికి వెళ్ళాడు. ఒక్కో గోతాన్ని తెరుస్తూ సామాన్లు క్రింద పెడుతున్నాడు!
పెయింట్ డబ్బాలు, బ్రష్‌లూ, కొన్ని పక్షుల్నిపట్టే వలలూ కనిపించాయి గరుడాచలానికి!
ఎమ్మెల్యేని మనసులోనే అభినందించాడు గరుడాచలం!
పగలు వేగంగా గడిచిపోయింది.
రాత్రయ్యింది.
అధికారులకూ, సిబ్బందికీ ఆ రాత్రంతా నిద్రలేదు.
ఎమ్మెల్యే వ్యూహాన్ని అమలు చేసే సన్నాహాల్లో వున్నారు!
రాగ్యాతో రహస్యంగా ఏదో మాట్లాడుతున్నాడు గరుడాచలం.
అంతా హడావుడిగా వుంది.
తెల్లవారితే కొండదేవర జాతర!
***
రాత్రికి రాత్రే దూరంనుంచి వచ్చిన వ్యాపారుల దండునల్లకొండ దగ్గర కుదురుకుంది. టెంట్లు వేశారు. తోరణాలు కట్టారు. ఫ్లెక్సీలు అలంకరించారు.
ఫలహాలశాలలూ, టీస్టాళ్ళూ, చెరకు దుకాణాలూ, ప్లాస్టిక్ సామాన్ల కొట్లు, చాలా రకాల వస్తువులమ్మే దుకాణాలు వెలిశాయక్కడ.
పేద వ్యాపారులు కొద్ది పెట్టుబడితో దువ్వెన్లు, గాజులు, పూసలూ తెచ్చిరోడ్ల పక్కన చాపల మీద పరచి వ్యాపారం కోసం ఎదురుచూస్తున్నారు.
శ్రమకోర్చి, ఎవ్వరో రంగులరాట్నం తెచ్చారు.
పిల్లల్ని వూరించే బయస్కోప్ వుంది.
ఆధునిక టెక్నాలతో బూతు సినిమాలు చూపించే హైటెక్ వ్యాపారి ఒకడు అమాయకులను ముగ్గులోకి దించేందుకు కాపు కాచి కూర్చున్నాడు.
ఎక్సయిజ్‌వాళ్ళతో మామూళ్ళు మాట్లాడుకొన్న మద్యం వ్యాపారి చీపు లిక్కరు సీసాలు దించి, రాబోయే లాభాలను ఊహించుకొని మురిసిపోతున్నాడు.
అడవిలో దొరకని చాలావస్తువులు అక్కడికే వొచ్చాయి.
ఏ వస్తువైనా అసలు ధరకు ఆరు రెట్లు!
సంత బేరం అంతే మరి!
అధిక ధరలకు అమ్ముతున్నారని అసూయపడితే ఎలా?
‘ప్రభుత్వమే ప్రజల వద్దకు’ అన్నట్టు ‘సరుకు అడవి పుత్రుల వద్దకు’ వస్తుంటే, ఆనందించాల్సింది పోయి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఎలా?
వ్యాపారులు కూడా శ్రమ చెయ్యాలి.
పట్నాలనుంచి సరుకు తెచ్చి అడవిలో అమ్మటం మాటలా?
ఎంత కష్టం! ఎంత శ్రమ!
అడవి జనానికి సరుకుల అందుబాట్లోకి తెచ్చి ‘సేవ’ చెయ్యబోతే దార్లో పాములు కరవొచ్చు. తేళ్లు కుట్టొచ్చు. పులులు, సింహాలూ నమిలి మింగొచ్చు. సరదా పడ్డ కూంబింగ్ పార్టీ తుపాకుల్తో కాల్చి చంపొచ్చు. వర్గ శత్రువులనుకొని అన్నలు మందుపాతరలు పెట్టొచ్చు.. అలా-
ప్రమాదాల్ని సైతం లెక్కచెయ్యకుండా ప్రజల ముంగిట సరుకులమ్మటం, శ్రమని లెక్క కట్టి, అసలు ధరకు జోడించి అధిక లాభాలకు అమ్మటం ఎందుకు తప్పు?
సరుకు ధర వ్యాపారులే నిర్ణయించటంలో ఏమిటి తప్పు?
ఫ్రెంచివాళ్ళు, డచ్చివాళ్లు, రుూస్టిండియా కంపెనీ వాళ్ళూ అన్నట్టు, రాజకీయాధికారంకూడా కావాలంటే కదా తప్పు?
ఆనాడు విదేశీయులకిచ్చిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలీనాడు స్వదేశీ వ్యాపారులకు ఇవ్వకపోతే ఎలా?
ఎక్సయిజ్ వాళ్ళూ, పోలీసు వాళ్ళూ కొంతలో కొంత నయం!
వ్యాపారుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను గుర్తించారు!
అక్రమ మద్యం అమ్మకాల్ని అనుమతించారు!
బూతు సినిమాలు వెయ్యనిస్తున్నారు!
గుట్కాలు అమ్మనిస్తున్నారు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు