డైలీ సీరియల్

అనంతం-40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేవరకేంటి కొచ్చింది, ఆగ్గరవ్?’’ నగ్గూరాం అడిగాడు.
‘‘ఏంటికో తెలవదుగానీ, మొత్తానికి దేవరకి అగ్గరవొచ్చింది. మనమీద పగబట్టిండి.
పగబట్టినోడు పావుల్నే అంపిత్తాడో- పులుల్నే అంపిత్తాడో - సివాల్నే అంపిత్తాడో -సంపటవ్ మాత్తరవ్ ఖాయం’’ అన్నాడు రాగ్యా, భయంతో వొణికిపోతూ.
అడవి పుత్రుల ఆవేశం అంతా చప్పున చల్లారిపోయింది! దాని స్థానంలో ఆందోళన చోటుచేసుకుంది!
‘‘దేవర నీకు సెప్పిండా?’’ రాగ్యాని కాళీచరణ్ అడిగాడు.
‘‘డైరేట్టుగా సెప్పలేదు’’
‘‘మరి?’’
‘‘ఇన్‌డైరెట్టుగా సెప్పిండు’’
‘‘ఎట్టా..?’’
‘‘దేవర మయిమతో నల్లకొండ కాడ తెల్ల కాకులు వాల్నయ్యి’’
‘‘తెల్ల కాకులా’’ అడవి పుత్రులు ఆశ్చర్యపోయారు.
‘‘.. అయ్యి అర్సినాయంటే రగతవ్ గక్కి సత్తారంట’’
వాళ్ళ మొహాలు రక్తంతో తోడి వేసినట్టు పాలిపోయాయి!
‘‘.. అట్టా రగతవ్ గక్కి సత్తారని కాలగ్గేనవ్లో రాసిండంట- పోతులూరి రుూరబ్రెమ్మంగోరు!
‘‘నిజవేనంటావా?’’ కాళీచరణ్ అడిగాడు.
‘‘ఏది? రుూరబ్రెమ్మంగోరు సెప్పిందా? కాకులు వాలిందా?’’
‘‘తెల్ల కాకులు వాలింది’’
‘‘నిజ్జవే! కావాల్నంటే సూపిత్తాను’’
‘‘వాయమ్మో’’ అన్నాడు భయపడుతూ నగ్గూరాం.
‘‘అంతేగాదు’’ అన్నాడు రాగ్యా.
‘‘తండావాళ్ళు అతని వైపు చూసారు.
‘‘..నెమిలి గుట్టలో ఎర్ర నెమిళ్ళు కనిపిచ్చినయ్యి’’
‘‘ఎర్రనెమిళ్ళా..?’’’
అందరూ నిర్ఘాంతపోరు.
‘‘కావాల్నంటే సూపిత్తా- పదండి’’ అన్నాడు రాగ్యా.
వాడి మాటలు నమ్మాలా? వొద్దా? అని వాళ్ళు కొంతసేపు ఆలోచించారు. తర్జనభర్జనలు పడ్డారు.. చివరికి-
‘‘సూపియ్యకపోతే..?’’ అన్నాడు బాణావతు.
‘‘ఆడ్నే సావగొట్టండి’’ అన్నాడు రాగ్యా.
అక్కడే తేలిపోయింది! రాగ్యా చెప్పింది నిజమే అయ్యుండాలి.
నిజం కాకపోతే అలా ఎందుకు అంటాడు రాగ్యా?
తనవెంట వస్తే తెల్ల కాకుల్నీ, ఎర్ర నెమళ్లనీ చూపిస్తానని, అలా చూపించకపోతే చావగొట్టమనీ ఎందుకు అంటాడూ!
రాగ్యా చెప్పింది నిజమే అన్న నిర్థారణకి వచ్చారు చాలామంది.
గుండెలు అవిసిపోయాయి!
నవనాడులూ కృంగిపోయాయి!
అలా జరిగింది దేవర జాతరకే కావటం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.
అంత కోపం దేవరకెందుకు వచ్చినట్టు?
అడవి పుత్రులమీద ఎందుకలా ఆగ్రహించినట్టు?
తండావాళ్ళు మొహాలు చూసుకున్నారు! ఎవ్వరి మొహంలోనూ జీవకళ లేదు. భయం గూడు కట్టి పాలిపోయి కనిపిస్తున్నాయి!
ఏం చెయ్యలో? ఏం చేస్తే దేవర శాంతిస్తాడో- ఆలోచిస్తున్నారు!
కొడుకుమీద కాళీచరణ్‌కింకా నమ్మకం కుదరనట్టుంది!
‘‘దేవర మహత్తేనంటావా?’’ అని అడిగాడు సందేహిస్తూ.
‘‘అట్టా సెయ్యటవ్ మడుసుల వల్లగాదు! ఇంత మందిని ఒకేపాలి భయపెట్టాల్నాంటే అందరికీ శాతగాదు! పెడితే మడుసుల్లో పోలీసోళ్ళూ, దేవుళ్ళలో దేవరే బెట్టాల!’’
‘‘దేవర ఏంటి కట్టా శాత్తన్నాడంటవ్’’
‘‘దేవరే సెప్పాలి’’ అన్నాడు రాగ్యా.
బాణావతు, కాళీచరణ్, నగ్గూరాం మాట్లాడుకొని అప్పటికే ఒక నిర్ణయానికొచ్చారు!
‘‘అరే.. రాగ్యా! గొర్లని, మేకల్ని బలిచ్చి- ఆటి రగతవ్ వణ్ణంలో గలిపి ‘బలెన్నవ్’ నేవీజ్జంగా వెడితే, ఎసువంటి మాటైనా యినుకుంటాడా కొండ దేవర!
అట్టా దేవర కోపవ్ సల్లారుత్తావు గానీ, ముందుగాల మాకు తెల్లకాకుల్నీ, ఎర్ర నెమిళ్ళనీ సూపియ్యి’’ అన్నాడు కాళీచరణ్.
అందరూ రాగ్యా వెంట బయల్దేరారు.
ఇప్పుడు వాళ్లకి రాగ్యా విషయమే గుర్తులేదు. చేతుల్లో ఆయుధాలున్న ధ్యాసే లేదు. చాంద్‌నీ విషయం గుర్తులేదు. పంచాయితీ ఊసే లేదు!
యాంత్రికంగా రాగ్యా వెంట నడుస్తున్నారే కానీ, వాళ్ళ ఆలోచనలన్నీ తెల్లకాకుల మీద, ఎర్ర నెమళ్ళమీద, కోపగించిన దేవర మీద, దేవర శాంతించేందుకు సమర్పించుకోవాల్సిన మొక్కుల మీద వున్నాయి!
అడుగుముందుకు వేస్తున్నకొద్దీ మృత్యువు దాపులోకి వెళ్తున్నట్టు భయంతో కృంగిపోతోన్నారు వాళ్ళంతా!
చివరికి- నమ్ముకున్న దేవర కూడా అలా కోపగిస్తే ఏమైపోవాలి?
పోలీసుల భయం నాగరికుల భయం. క్రూరమృగాల భయం.
విష సర్పాల భయం. దళారీల భయం. బ్రతుకుతెరువు భయం..
బ్రతుకంతా భయం భయంగా ఎలా జీవించాలి?
అడవి పుత్రుల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి..
కొంతమంది రహస్యంగా ఏడుస్తున్నారు.
కొంతమంది నల్లకొండ వైపుకు దణ్ణాలు పెడుతున్నారు.
సాధారణ అడవి పుత్రులకు స్వేచ్ఛగా ఏడ్చే అవకాశమైనా వుంది!
తండా పెద్దల్లా గౌరవించబడుతూ, అందరికీ ఆపదలలో ధైర్యం చెప్పాల్సిన పెద్దలు ఏడిస్తే ఎలా? అడవి పుత్రులు మరింత బెంగ పెట్టుకుంటారు.
ఏడ్చే స్వేచ్ఛకూడా తమకు లేనందుకు బాణావతు, నగ్గూరాం, కాళీచరణ్ లోలోపలే కుమిలిపోతున్నారు..
నడుస్తున్నారు..నల్లకొండ మరోవైపు అడవిలోకి వెళ్తున్నారు.
రాగ్యా దారి చూపిస్తున్నాడు.
‘‘అయ్యిగో... తెల్లకాకులు’’అంటూ రాజ్యా పెద్దగా అరిచాడు.
విస్ఫోటనం జరిగినట్టే అందరూ అటువైపు చూసారు!
చెట్ల కొమ్మలమీద వాలి, తెల్లకాకులు కనిపించాయి!!
గుండెలు అవిసిపోయి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉద్ధృతమై పొంగివస్తోన్న దుఃఖాన్ని దిగమింగుకొంటూ, స్థాణువులై నిల్చుండిపోయారు.
సన్నగా రోదనలు వినిపిస్తున్నాయి.
వెక్కిళ్ళు పెడుతున్నారు.
వాతావరణం గంభీరంగా వుంది!
‘‘నెమిళ్ళని సూద్దాఁవు- పదండి’’అన్నాడు బాణావతు.

(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు