డైలీ సీరియల్

ఒయాసిస్.. 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించినవాడు, లంచాలు తీసుకోకుండా ఎలా ఉంటాడు? మంత్రుల దగ్గిరినుంచీ కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరుగుతుంటే, నేనెందుకు మడికట్టుకుని కూర్చోవాలని అనుకుంటాడు. అదే ఒక చిన్న బట్టల దుకాణంలోనో, సూపర్‌బజార్‌లోనో పనిచేసేవాడికి, లేదా ఒక పెద్ద కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కో లంచం ఇచ్చేవాడు లేడనుకుందాం. మరి వాడు లంచాలకు ఆశించకుండానే పనిచేస్తున్నాడు గదా..’’ అని చెప్పాడు రణధీర్.
‘‘జీవన ప్రమాణం పెరిగింది. అవసరాలు పెరిగాయి. ఒక పేదవాడు ప్రైవేటు హాస్పిటల్‌లో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉందా సార్..’’ అన్నాడు రాజు.
‘‘అన్నట్లు ఆ అశ్వినీ నర్సింగ్ హోం పక్కన పేదవాళ్ళ కాలనీ ఉందిట. వారం రోజుల కిందట ఒక గర్భిణీ స్ర్తిని రాత్రిపూట ఈ హాస్పిటల్‌కి తీసుకొస్తే వీళ్లు చేర్చుకోలేదు. ఆ అమ్మాయి గేటు బయట ప్రసవం అయి చనిపోయింది. ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు గొడవ చేస్తే, హాస్పిటల్‌వాళ్ళు కంప్లయింట్ ఇచ్చారు. కేసు కూడా రిజిస్టర్ అయింది. నిన్న రాత్రి నేను అహోబలరావు దగ్గరకు వెళ్తే మొదట్లో నేను ఆ కేసు విషయంలో ఆయన దగ్గరకు వచ్చానని అనుకున్నాడు.. ఒకవేళ డాక్టర్ శే్వత హత్యకూ, ఆ సంఘటనకూ ఏమన్నా సంబంధం ఉందా అన్న విషయమూ క్లియర్ చేసుకోవాలి. ఆ ఏరియా స్టేషన్లో వాళ్ళ వివరాలు కొన్ని దొరుకుతాయి. రేపు పదకొండు గంటలకు చనిపోయిన ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు ఇక్కడికొచ్చే ఏర్పాటు చెయ్యి..’’ అన్నాడు రణధీర్.
‘‘యస్సర్..’’ అన్నాడు రాజు.
అనుకున్నట్లుగానే డాక్టర్ శే్వత హత్య కేసు సెంట్రల్ క్రైం సెక్షన్‌లోని డిటెక్టివ్ డిపార్టుమెంటుకి బదిలీ కావటంతో, ఆ డిపార్టుమెంట్ హెడ్‌గా ఉన్న అడిషనల్ కమీషనర్ సమావేశం ఏర్పాటుచేశాడు క్రింది ఉద్యోగులతో- డిప్యూటీ కమీషనర్, ఇన్స్‌పెక్టర్ రణధీర్‌తోపాటు, ఏరియా పోలీసు స్టేషన్ ఇన్స్‌పెక్టర్ శంభూప్రసాద్ కూడా హాజరైనాడు.
నిన్న జరిగిన విషయాలన్నీ రణధీర్ వివరించాడు.
‘‘కనీసం ప్రత్యక్ష సాక్షిగానీ, హంతకుడు ఉపయోగించిన ఆయుధం కత్తిగానీ దొరకలేదు.. వేలు ముద్రలూ, ఇతర క్లూస్ కూడా లభ్యం కాలేదు. అంటే ఈ కేసులో హంతకుడ్ని పట్టుకోవడం చీకట్లో నల్లపిల్లిని వెతికి పట్టుకోవడం లాంటిదన్నమాట..’’ అన్నాడు అడిషనల్ కమీషనర్.
‘‘యస్సర్..’’ అన్నాడు రణధీర్.
‘‘ఇదంతా పక్కాగా పథకం ప్రకారం జరిగినట్లు అనిపిస్తోంది. ఈ పథకం అమలుకు నర్సింగ్ హోంలో పనిచేసేవాళ్ళుగానీ, ఇన్‌పేషెంట్స్ తాలూకు వాళ్ళు, అవుట్ పేషెంట్స్ తాలూకు వాళ్ళుగానీ ఎవరో ఒకరు హంతకుడికి కొంతమేరకు సమాచారం అందించి ఉండాలనిపిస్తోంది. ఎందుకంటే, డాక్టర్ శే్వతగారి నిన్నటి మూవ్‌మెంట్స్‌కీ, రొటీన్ మూవ్‌మెంట్స్‌కీ చాలా తేడా వుంది. ఆ తేడా ఉండటాన్ని హంతకుడు తనకు అనుకూలం చేసుకున్నాడు. డాక్టర్ శే్వత సాయంత్రం ఆరు గంటలకు నర్సింగ్ హోంకు వచ్చి, ఫస్ట్ఫో్లర్‌కి వెళ్లి ఇన్‌పేషెంట్స్‌ను చూసుకుని, క్రిందకొచ్చి తన కన్సల్టేషన్ రూంలో కూర్చుని అవుట్ పేషెంట్స్‌ని చూస్తుంది. ఆ సమయంలో ఇద్దరు నర్సులు ఆమెకు సాయపడుతూ కిందనే ఉంటారు. తొమ్మిది గంటల సమయంలో శే్వత కారులో ఇంటికి బయల్దేరేదాకా, నర్సులూ, ఆయాలు అక్కడే ఉంటారు గనుక, ఆ సమయంలో హత్య జరిగితే, వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అయ్యేవారు. వెంటనే చికిత్స జరిగితే, కొన్ని గంటలసేపు గానీ, కొన్ని నిమిషాల సేపుగానీ ఆమె స్పృహలో ఉండేది. ఆ సమయంలో శే్వత, ఎందుకు హత్యా ప్రయత్నం జరిగిందో నర్సులకో లేదా డ్యూటీ డాక్టర్‌గా వున్న మమతకో చెప్పి ఉండేది. కానీ నిన్నటి ఈవెంట్స్ అన్నీ రొటీన్‌కి భిన్నంగా ఉన్నాయి. నిన్న సాయంత్రం ఆమె ఒక డెలివరీ కేసు అటెండ్ అయింది. అందుచేత అవుట్ పేషెంట్స్‌ను తొందరగా పంపించివేసింది. ఫస్ట్ ఫ్లోర్‌లో లేబర్ రూంలో ఆమె ఉన్నందువల్ల, నర్సులూ, ఆయాలు కూడా ఆ ఫ్లోర్‌లోనే ఉన్నారు. తొమ్మిది గంటల ప్రాంతాల్లో డ్యూటీ డాక్టర్ మమత వచ్చి ఆమెతో జాయిన్ అయ్యింది. పేషెంట్‌కు ప్రసవం అయ్యాక, తల్లీ బిడ్డకు వెంటనే చేయవలసిన పనులు చేస్తూ అందరూ పైనే ఉన్నారు. మిగిలిన రొటీన్ పనులు వాళ్లు చేసుకుంటారు గనుక శే్వత కిందకు వచ్చింది. ఇంటికి బయల్దేరేముందు తన రూంలో ఉన్న బాత్‌రూంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమె హంతకుడ్ని చూసి ఉండదు. చూసి వుంటే, కేకలు అరుపులు లాంటివి వినిపించేది. పైనున్న వాళ్లు కిందకు పరుగెత్తుకుని వచ్చేవాళ్లు. ఆమె బాత్‌రూంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు హంతకుడు హఠాత్తుగా బలంగా, గొంతుమీద, ఛాతిమీద ఎక్కువసార్లు పొడిచినందువల్ల అరవలేకపోయిందని భావించాలి. హఠాత్తుగా జరిగిన దాడివల్ల భయంతో సడెన్ కార్డియాక్ అరెస్టు అయ్యే అవకాశమూ లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో అక్కడికక్కడ కుప్పకూలి పడిపోవటమూ కద్దు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చాక ఖచ్చితమైన నిర్ణయానికి రాగలుగుతాము.
‘‘సరిగ్గా ఆ సమయంలో వాచ్‌మెన్ టీ తాగటానికి వెళ్లాడని చెబుతున్నారు. హత్య జరిగిన సమయంలో వాచ్‌మెన్ గేటు దగ్గర లేకపోవటం యాదృచ్ఛికమా, హంతకుడి ప్లాన్‌లో ఒక భాగమా- అన్నది తేలాలి. హంతకుడు కొద్ది నిముషాల్లో తన పని ముగించుకొని వెళ్లాడంటే- శే్వత మూవ్‌మెంట్స్, ఒంటరిగా దొరికే ఛాన్స్- అలా పసిగట్టగలిగాడంటే- ఇది చాలా క్షుణ్ణంగా ప్లాన్ చేసిన హత్య అని అర్థమవుతోంది. హాస్పిటల్‌లో ఫస్ట్ఫో్లర్‌లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి హంతకుడికి ఏదన్నా సంకేతంగానీ, మెసేజ్ గానీ అంది ఉండొచ్చు.

- ఇంకా ఉంది

శ్రీధర