డైలీ సీరియల్

అనంతం-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అందరూ అసుఁవంటోళ్ళే ఉండరుగదా’’ రాగ్యా అన్నాడు.
‘‘అయితేనేం! హిందువులు ముస్లింలు కిరస్తానీలు సిక్కులూ- అందర్నీ కలిపి భారతీయులన్నట్టు, మంచాళ్ళనీ చెడ్డాళ్ళనీ కలిపి పోలీసోళ్ళంటారు.. ఏంచేస్తాం’’అని యాదయ్య మళ్ళీ నొచ్చుకున్నాడు.
కొద్దిక్షణాలు వౌనంగా గడిచిపోయాయి.
ఇద్దరూ ఓ విశాలంగా వున్న రాతిపలక మీద కూర్చున్నారు.
‘‘అయితే నీకు పోలీసుజ్జోగఁవ్ ఇట్టంలేదా’’
‘‘తల్లితోడు’’ అన్నాడు యాదయ్య.
‘‘గుడారాల కాడ్నించే వత్తాన్నావా’’ రాగ్యా అడిగాడు.
‘‘అవును’’
‘‘పీనిగెలుండయ్యా’’
‘‘ఎందుకూ’’
‘‘మా అయ్యని సూడాలనిపిత్తుంది’’
‘‘అక్కడికి వెళ్ళొద్దు! అరెస్టుచేస్తారు’’
‘‘పీనిగెల్ని సూడాల్నంటే..?’’
‘‘గంటలో శవాల్ని ఇక్కడికే తెస్తారు.’’
రాగ్యా అతనివైపు ఆశగా చూశాడు.
‘‘అప్పుడు చూడొచ్చు’’ యాదయ్యే చెప్పాడు.
‘‘పీనిగెలెంట పోలీసులుంటే’’
‘‘వాళ్ళ కళ్ళుకప్పి చూపించే బాధ్యత నాది’’
‘‘పీనిగెల్నేఁవి శాత్తారూ’’
‘‘నువ్వెట్టాగంటే అట్లా జరుగుతుంది.’’
‘‘ఒప్పుకుంటారా.’’
‘‘ఒప్పిస్తాను’’
‘‘పీనిగెల్ని నాకిప్పిచ్చు’’ రాగ్యా దీనంగా అడిగాడు.
‘‘పూచీనాది.’’
‘‘జల్మలో నీ మేలు మర్సిపోను’’
‘‘శవాలు రావటానికి సమయం పడుతుంది.’’
‘‘పుట్టనియ్యి! రుూడ్నే కూకుందాఁవు’’
‘‘ఖాళీగానా’’
‘‘ఏటి శాద్దాఁవూ’’
‘‘మందు తాగుతూ కూర్చుందాం.’’
రాగ్యా పెదవులు చప్పరించాడు.
‘‘ఒకటి కాదు, నా సంచిలో రెండు విస్కీ సీసాలున్నాయి.. యింపోర్టెడ్ విస్కీ’’ అని యాదయ్య చెప్పాడు.
‘‘యాడియి’’ రాగ్యా అడిగాడు.
‘‘గరుడాచలం చావకముందే ఇచ్చాడు.’’
‘‘రొండు సీసాలిచ్చిండా’’ రాగ్యా కళ్ళు మెరిసాయి.
‘‘నువ్వే చూడు’’ అన్నాడు యాదయ్య- సంచిలోనుంచి రెండు పెద్ద సీసాలు తీసి, రాగ్యాముందు పెడుతూ.
‘‘గళాసులో’’
‘‘డిస్పోజల్ గ్లాసులున్నాయి’’ అని, వాటిని బైటికి తీశాడు.
‘‘పచ్చిమందే తాగుదాఁవా’’
‘‘నీ ఇష్టం! ఒక సోడా బాటిల్ కూడా వుంది’’
‘‘నేను పచ్చిదే తాగుతాను’’
‘‘ఏం నంజుకుందాం’’ అని యాదయ్య అడిగాడు.
‘‘ఏఁవుండయ్యి’’
‘‘ఏమీ లేవు’’
‘‘మరేటి శాద్దాఁవూ’’
‘‘ఐడియా’’
‘‘ఏంటిదా అవుడియా’’
‘‘్ఫరిన్ విస్కీ, యిండియన్ వెలగపండ్లు! కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.’’
‘‘యలగ పొండ్లు తిందాఁవా’’
‘‘అదే మరి’’
రాగ్యా తల తిప్పి చుట్టూచూశాడు!
వెలగ చెట్టు కనిపించింది..
అక్కడికి వెళ్ళి వెలగపండ్లు కోసుకొచ్చాడు.
ఇద్దరూ తాగుతూ, తింటూ కూర్చున్నారు.
‘‘శవాలనిస్తే ఏంచేస్తావూ’’ రెండో రౌండులో యాదయ్య అడిగాడు.
‘‘పీనిగెల కాల్లమీన బడి ఏడుత్తా’’ చెప్పాడు రాగ్యా.
‘‘కాలుస్తావా- పూడుస్తావా?’’
‘‘నా ఇట్టం’’ మూడో రౌండ్లో అన్నాడు రాగ్యా.
‘‘అంతే...అంతే! శవాలమీద నీదే అధికారం.’’
‘‘శబ్బాసు మాట’’ రాగ్యా అభినందించాడు.
‘‘గరుడాచలాన్ని దారుణంగా చంపావేం?’’
‘‘ఎంత అనే్నలఁవ్ జేసిండనీ...!’’
‘‘ఐతే చంపుతావా’’
‘‘సావనూకుతానంతే’’ రాగ్యా నాలుగో రౌండ్లో అన్నాడు.
‘‘చాంద్‌నీ గుర్తొస్తుందా.’’
‘‘గుండెలోనే వుంది’’ అని రాగ్యా పెద్దగా ఏడ్చాడు.
‘‘నువ్వలా ఏడుస్తుంటే చూళ్ళేను’’ అన్నాడు యాదయ్య.
‘‘సగవాసఁవ్ అంటే అట్టాగుండాలి.’’
‘‘గరుడాచలం నీ స్నేహితుడు కాదా’’
‘‘యదవ...యదవ’’ అన్నాడు రాగ్యా.
‘‘అప్పటికి రాగ్యా కనురెప్పలు వాలిపోతోన్నాయి.
‘‘పీనిగె లెయ్యి’’ అని తూల్తూ అడిగాడు.
‘‘వస్తాయి! సమయం పడుతుంది’’
‘‘నాకింకో సీసా గావాలి’’ రాగ్యా అడిగాడు.
‘‘తాగినంత తాగు... పీనిగెలొచ్చేదాకా తాగు’’
‘‘కాదు’’ అని రాగ్యా పెద్దగా అరిచాడు.
‘‘మరి?’’
‘‘శాందినీని మర్సిపొయ్యేదాకా..’’
‘‘అలాగే’’ అన్నాడు యాదయ్య.
రాగ్యా సీసా పైకెత్తాడు.. గట గటా కొంత తాగి, సీసాని భద్రంగా రెండు తొడల మధ్య దాచుకున్నాడు.
‘‘ఆపావేం’’ యాదయ్య అడిగాడు.
‘‘దొర్లిపోయిద్దనీ..!’’ తూల్తూనే అన్నాడు రాగ్యా.
‘‘మీ వాళ్ళు ఎక్కడున్నారూ’’ యాదయ్య అడిగాడు.
‘‘ఎవురూ.’’
‘‘తండా వాళ్ళు.’’
‘‘్ఛణం ఆగు- సెప్తా’’ అని, రాగ్యా సీసా మళ్ళీ పైకెత్తాడు.
‘‘చెప్పవేం.’’
‘‘ఏటన్నావూ..’’
‘‘తండా వాళ్ళెక్కడున్నారు.’’
‘‘డిల్లీలో... డిల్లీ... డి...డి’’ అంటూనే రాతి పలకమీద వాలిపోయాడు రాగ్యా.
సన్నగా గురక వినిపిస్తున్నది!
యాదయ్య విజిల్ బైటికి తీశాడు. బలంగా ఊదాడు.
సంకేతం అందుకొన్న సాయుధ పోలీసులు రాగ్యాని చుట్టుముట్టారు.
రాగ్యాలో చలనం లేదు.
‘‘ఏంచేద్దాం వీడ్ని’’ పోలీసు ఉద్యోగి యాదయ్యని అడిగాడు.
‘‘మీ ఇష్టం’’అన్నాడు యాదయ్య.
‘‘నిషా దిగేదాకా టార్చర్ చేద్దాం! తండావాళ్ళ ఆచూకీ తెలుసుకుందాం.’’
‘‘వాడు చెప్పడు’’అన్నాడు యాదయ్య.
‘‘నీకెలా తెలుసు.’’
‘‘అడిగాను! అంత నిషాలోకూడా చెప్పలేదు.’’
‘‘టార్చర్లకి చెప్పడా’’
‘‘నమ్మకం లేదు.’’
‘‘అదీ చూద్దాం.’’
ఎవ్వరో రాగ్యామీద బాటిల్‌తో నీళ్ళ పోశారు.
ఐనా కదలిక లేదు.
‘‘అడిగితే ఏంచెప్పాడేం?’’ అతనే అడిగాడు.
‘‘‘డిల్లీలో ఉన్నారన్నాడు’’ చెప్పాడు యాదయ్య.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు